Previous Page Next Page 
పంచభూతాలు పేజి 18

    "కవి కావ్యం రచించినట్టుగానే, తాన్ సేన్ అద్వితీయంగా తానస్వరగానాలను సృజించినట్లే స్త్రీ కూడా తన జీవనమును సృష్టించుకుంటుంది. సరిగ్గా అదేవిధంగా అచేతన దశలో మాయామంత్ర ప్రభావం వల్ల పితాపుత్రులను, సోదర సోదరీమణులను, అతిధిజనులను  సుందర బంధంతో బంధించి ఆమె తన నాలుగువేపులూ సంఘటిత పరిచి అలంకరించుకుంటుంది .ఆ జీవ ఉపకిరణాలతో తన నిపుణహస్తాలతో గృహాన్ని నిర్మించుకుంటుంది. ఒక్క గృహాన్నే  నిర్మించుకోదు.  ఎక్కడకు వెళితే అక్కడ తన చుట్టుపట్ల పదార్దాలను సౌందర్ నిర్మాణంతో బంధించివేస్తుంది. ఆమె సంబాషణతో, సంచాలనంతో, సహనంతో విలక్షణమైన మూసలోవేసి పోతపోస్తుంది. దానినే శ్రీ అంటారు.  ఈ కార్యకలాపం  బుద్దిబలంతో చేసేదికాదు. ప్రతిభా బలంతో చేసేది. మనోబలంతో చేసేది కాదు. ఆత్మ యొక్క నిగూఢశక్తితో చేసేది. గాయకుని స్వరం, కవిశబ్దం కార్యశీలి కార్యకలాపం, తమ తమ నిర్దిష్టస్థానాలలో యధాసమయాలలో రమణీయ విధానంలో ఆవిష్కృతమవుతాయి. నిగూఢశక్తి రహస్యంగా అందులో పనిచేయడమే దీనికి కారణం. ఈ ప్రతిభ సెలయేరు లాగా నిఖిలవిశ్వకేంద్రం నుంచి స్వయంగా బయలు వెడలుతుంది. దాని కేంద్రాన్ని అచేతమనడంకంటే అతిచేతనం అనడం న్యాయం.  ప్రకృతిలో దేనిని సౌందర్యం అంటామో అదే గుణవంతులలోని ప్రతిభ స్త్రీలలో అలాగే శ్రీ సతీత్వం. అది పాత్రభేధం వల్ల ఒకే ఒక శక్తి యొక్క ఖిన్న భిన్న రూపాలలో వికసిస్తుంది. "
     ఆ తరువాత గగన్, పవన్ కేసి చూచి "నీవు నీ రచనను వినిపించు" అని అన్నాడు.
     దానిమీద పవన్ దేవ్, "యిక అవసరం లేదు. నేను ప్రారంభించిన దానిని నువు ఒకవిధంగా ముగించావు" అని అన్నాడు.
     అంతట పృద్వీరాజ్ "కవిరాజమహాశయుడు ఆరంభించాడు, డాక్టరు మహాశయుడు ముగించాడు. ఇప్పుడు మనం మంగళంపాడి సెలవు తీసుకుందాం. మనసు,బుద్ది ప్రతిభ, సౌందర్యం అంటే యేమిటో యింతవరకు నాకు తెలియలేదు. వీటిభేదం తెలుసుకోవాలనే ఆశమాత్రం వుంది. కాని నేడు ఆ ఆశ కూడా నిరాశ అయింది" అని అన్నాడు.
     చిక్కుపడ్డ దారాన్ని అతి జాగ్రత్తగా విడదీసినట్లుగా నిర్ఘరిణి కూడా మౌనం వహించి ఈ విషయమంతా మనసులో మననం చేసుకుంటూ అర్దం చేసుకోవడానికి యత్నిస్తోంది.
     ప్రకాశవతి కూడా మౌనంగానే కూర్చున్నది. పవన్ దేవ్ ఆమెను, "ఏమిటి ఆలోచిస్తున్నావు" అని అడిగాడు.
     దానిమీద నిర్ఘరిణి "భారతీయ స్త్రీల ప్రతిభాబలంవల్ల భారతీయ సంతతి నాకు యిటువంటి విచిత్ర సృష్టిని యెందుకు చేస్తున్నారని ఆలోచనా సాగరంలో మునకలు వేస్తున్నాను. మంచి మట్టితో యెల్లవేళలా శివుని మూర్తినీ తయారు చేయగలమని చెప్పలేం" అని అన్నది.

                                గద్యం - పద్యం

       నేను అన్నాను, "కవులు కావ్యానుసారం వేణునాదం విని పూర్ణిమా వెన్నెలను గాంచేసరికి పూర్వస్మృతులు కొంగ్రొత్తతను వహిస్తాయి. అయితే ఎవరి స్మృతులు అనేదే ప్రశ్న. దీనికి ప్రమాణం లేదు. ఈ ప్రపంచంలో లెక్కకుమించిన పేర్లున్నా నేను నిరాకారవస్తువును  ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి? నేను దాని ఎందుకు విస్మృతి చెందిందనరాదు?  కాని "విస్మృతి మేల్కొంటుంది" అలా అంటే అది బహు అసంగతంగా తోస్తుంది. "విస్మృతి మేల్కొంటుంది. ఈ వాక్యం కూడా అర్దరహితం కాదు. పూర్వ జీవితంలోని వేయి స్మృతులు తమ తమ స్వాతంత్ర్యాన్ని తమ తమ విలక్షణతను పరిత్యజించి ఒకదానిలో ఒకటి కలిసి సూదీ దారణంలాగా రూపొందుతాయి. వాటి విలక్షణత లను గుర్తుపట్టడం కష్టం. నా హృదయ చేతనరూప మహాదేశ నల్దిశల చుట్టిముట్టి విస్మృతీ మహాసముద్రం సంపూర్ణ రూపం ధరించి నిద్రిస్తుంటుంది. కాని అపుడపుడు ఈ విస్మృతి రూప సాగరం చంద్రుడు. దక్షిణవాయువు మూలంగా చంచలించి కలత చెందుతుంది. అంతేకాదు, చింతనా కెరటాలలో అల్లలలాడిపోనారంభిస్తుంది. అప్పుడు నా చేతన హృదయం ఈ విస్మృతుల తాడనను అనుభవిస్తుంది. విస్మృతారాజ్యం నుంచి సంపూర్ణ అగాధ అస్థిత్వం లభిస్తుంది. ఈ విశాల విపుల అస్థిత్వ ఆరావం వినిపిస్తుంది."
     ప్రకాశవతి  ఈ నా ఉద్ఘాటనను వినికిల కిలా నవ్వి అన్నది; "సోదరా! ఎందుకలా గోలచేస్తావు? ఇక ఊరుకో. కవిత వింటూంటే బాగానే వుంటుంది. కాని అన్ని వేళలా బాగుండదు. సరళగద్యం వచ్చినపుడు మీ రయిదుగురు కలిసి దానికి కవితను కలిపితే గద్యం నిత్య వ్యవహారానికి యోగ్యం కాకుండా పోతుంది. పాలలో నీళ్లుకలిపినా తాగడానికి పనికివస్తాయి. కాని నీళ్లలో పాలు కలిపితే అవి స్నానానికీ  పనికిరావు;తాగడానికీ పనికిరావు. కవితలో కొద్దిగా గద్యం కలిపితే నాకు గద్యజీవాన్ని జీర్ణం చేసుకోవడం, అర్దం చేసుకోవడం సులభమవుతుంది. కాని గద్యానికి పద్యాన్ని కలిపేసరికి  నా బుద్ది పనిచేయదు.
     చాలు, మనసు విషయం వదిలివేయి. శరత్ ప్రభానవ భావరూప అంకురాన్ని ఈ ప్రియస్నేహితుడు పృద్వీరాజ్ పదునైన తవ్వుగోలతో మూర్ఖంగా తవ్వి బయటకు తీశాడు. యుక్తికి విరుద్దంగా ఎవరైనా ఏం చేసినా చూసి మానవులు అంత అసహాయులుగా వుండిపోరు. భావంలో  యెంతో బాధపడిన మీదట దుర్బలులయిపోతారు. భావ విషయంలో వినేవారి సానుభూతియే ఏకమాత్ర సహాయాన్ని చేస్తుంది. వినేవారు మాట్లాడానికి  లేస్తే పిచ్చిపని చేస్తున్నాడని భావుకులు నిరుత్తరులవుతారు. వారి యుక్తివాదం కూడా సంతోషప్రదంగా వుంటుంది.
     పూర్వకాలంలో భావుకులు భావ విషయాలను గురించి మాట్లాడే ముందు శ్రోతల కాళ్లూ, చేతులూ పట్టుకుని తమ ప్రసంగమును ప్రారంభించేవారు. "కుశాగ్రబుద్దులారా! హంసలాగా మంచినీటిని విసర్జించి పాలనుగ్రహించండి"అని అనేవారు. యోగ్యతను స్వీకరించి సభాపతుల గుణం గ్రహణం మీద తమ విశ్వాసమును వదిలివేసేవారు. అపుడపుడు  భవభూతిలాగా అత్యంతాహంకారంతో ప్రారంబించి సకల జనులమీది తమ యోగ్యతా  ప్రభావమును ప్రసరించే చేష్టలు చేసేవారు. వారేమిచేసినా చివరకు తమ ప్రసంగము ముగించేటపుడు తమను తాము తిరస్కరించుకుంటూ మాట్లాడతారు.  ఏ దేశంలో రాజుపెంకును ముత్యాన్ని ఒకే భావంతో చూస్తారో ఆ దేశానికి రాముడే మేలు చేకూరుస్తాడు. అటువంటి దేశంలో ఆశ విడనాడిపోదు, "హే భగవాన్! పాపఫలమును అనుభవించవలసివుంటే అనుభవించడానికి సిద్దంగా వున్నాను. కాని అరసికులకు రతవత్తరకావ్యాన్ని వినిపించవలసిందని నా నొసట ఎంతమాత్రం వ్రాయవద్దు" అని ప్రార్దించాడు భవభూతి.  నిజానికి అంతకంటె శిక్ష మరేమీలేదు. ఈ భూమిమీద అరసికులను నివశించనీయ వద్దని ఇంతగా భగవంతుని ప్రార్దించకపోతే ప్రపంచ జనసంఖ్య అమితంగా పెరిగి పోతుంది. అరసికులే ప్రపంచంలో ఎక్కువగా పని పాటలు చేస్తారు అటువంటివారు జన సమాజానికి చాలా అవసరం. వారు లేకపోతే వేడుకే వుండదు. కూలిపని చేసేవారు వుండరు. పత్రికలు మౌనం వహిస్తాయి. సమాలోచకుల నోటి ముందు కూడు పోతుంది. ఇందువల్ల వారిని విశేషంగా ఆదరించాలి. కాని గానుగలో ఆవాలు వేస్తే నూనె వస్తోంది. అందువల్ల అందులో పూలువేసి దానినుంచి తేనెను తీయాలని యత్నించితే ఎప్పటికీ తీయలేము. భగవాన్! గానుగను సదా  సురక్షితంగా వుంచు కాని దానియందెపుడూ పూలు వేయవద్దు. గుణవంతుల హృదయరూపసంబంధం పెంచవద్దు.
     శ్రీమతి నిర్ఘరిమిలో ఒకానొక విశేష గుణం వుంది. ఆమె సదా దుర్బులులను సమర్దిస్తూంటుంది.  ఆమె ఈ దుర్దశకు చలించి "ఏమిటీ? గద్యానికీ, పద్యానికీ యింత భేదం వుందా?" అని అడిగింది.
     "గద్యం, పద్యం రెంటికీ స్థానం వేరు వేరుగా వుంది. గద్యం అంతఃకరణంలో పద్యం బాహ్యజగత్తులో నెలకొని వున్నాయి, 'అబల బయటకు వెళ్లి అటుఇటూ తిరిగితే విపత్తులో చిక్కుకుంటుంది, అనే మాటే లేదు. కాని రాతితో సమానమయిన హృదయంగల మనుష్యులు  అలా కఠినంగా మాట్లాడి నిరాదరిస్తే వారు వివశతతో దుఃఖిస్తారు. అందువల్ల అంతఃపుర స్త్రీలకు రక్షణ లభిస్తుంది. పద్యకవితకు అంతఃపురం వుంది. ఛందోరూప చతురోక్తిలో హఠాత్తుగా దానిమీద ఎవరు దాడి చేయలేరు. వ్యక్తిగత భాషతో స్వతంత్రత దానియందు కష్టం వెనువెంట సౌందర్య సీమ జనిస్తుంది. తన మనోభావాలను ఆ లోపలనే వుంచితే పృద్వీరాజ్ కే కాదు; మరెవరికీ తాహతు వుండదు. ఒక్కొక్కరూ మా ముందు వచ్చితే పరిహాసీ యెగిరిపోతుంది" అని అన్నది. గగన్ దేవ్ గుడగుడా చుట్టతాగుతున్నాడు. ఇది విని సంతోషంతో బయటకు వచ్చి, "నేను యేకేశ్వర వాదిని. ఒక్క గద్యంతోనే నా అవసరమంతా తీరిపోతుంది. మధ్యలో పద్యంవచ్చి మానవ హృదయ రాజ్యంలో అనావశ్యక విభేదాన్ని జనింపజేస్తుంది. అది కవితపేరిట స్వతంత్ర జాతి రచన సంప్రదాయ హస్తంతో సామాన్య జనుల సంపత్తి చెలామణి అవుతూంటుంది.  అప్పుడు ఆ సంప్రదాయం సకలవేళలా  అటువంటి  చేష్టలే చేస్తుంది. ఆ సంపత్తి ఇంకెవరి చేతిలోనూ చెలామణి కాదు. అలా కాకపోతే వారి స్వార్దానికే దెబ్బ తగులుతుంది. కవి గుణం కూడా భావం చుట్టూ అడ్డంకిని నెలకొల్పడానికి కవితపేరిట ఒక నూతన పదార్దాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని చూచి సామాన్య జనులకు మహదాశ్చర్యం కలుగుతుంది. పద్యం, అంత్యానుప్రాసల ద్వారా గొప్పదనానికి దెబ్బతగలనంతవరకు దానికి చైతన్యం కలగదు. అందువల్ల కవితా బ్యాసం వికృతి చెందుతుంది. స్వభావిక సరళ భాషను పరిత్యజించి భావానికి  పంచవర్ణ రూపం తయారు చేస్తారు. భావానికి యింతకంటే గౌరవ ప్రదమైన విషయం వేరులేదు. పద్యం కొత్తగా నేటి ప్రపంచంలో పుట్టిందని వింటున్నాం.  అందువల్ల అది మయూరంలాగా పింఛం విప్పుకుని నృత్యం చేస్తుంది. నేను దాన్ని చూడాలని అభిలషించను" అని అన్నాడు. ఇలా చెప్పి గగన్ తిరిగి చుట్ట తాగసాగాడు.
     శ్రీమతి ప్రకాశవతి, గగన్ తిరస్కారపూర్వకంగా చూచి, మనస్సులో ప్రాకృతిక ఎన్నిక నామంతో ఒకానొక తత్వం ఆవిర్బవించింది. ఈ ప్రాకృతిక ఎన్నిక నియమం  కేవలం జంతువులకే కాదు. ప్రకృతికి కూడా వర్తిస్తుంది. ఆడ నెమలికి నృత్యం చేసే అవకాశం లేదు. మొగ నెమలి పింఛంతో మరుగుపడిపోతుంది. అందువల్ల ప్రాకృతిక ఎన్నిక ప్రబావం వుంటుంది. కవిత లెక్కలు కూడా ఆ ప్రాకృతిక ఎన్నిక ఫలితమే. అవి కవులకు వేడుకకోసం కాదు. సభ్య దేశాలు మొదలుకొని అసభ్య దేశాలవరకు గల జగత్తులో కవిత స్వాభావిక రూపంతో చంధస్సులో వికసించలేదా?" అని అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS