"దీనికి కారణం లేకపోలేదు. భాషకు హృదయంతో యేమీ సంబంధం లేదు. అది మస్తిష్కాన్ని ఛేదించుకుని అనంత ప్రదేశంలో ప్రవేశిస్తుంది. అదైతే సౌభాగ్యం మినహా మరేం కాదు. హృదయంలో ప్రవేశించడానికి దానికి అధికారం లేదు. నిండు దర్బారులో నివేదించుకొనడానికి వెళుతుంది. ఇది మినహా దానికి గత్యంతరం లేదు. అర్దం చేసుకోవడంలో ఆలస్యం అవుతుంది. కాని సంగీతం ఒక్కసారే ముందుగానే సూక్ష్మంగా హృదయాన్ని ఆలింగనం చేసుకుని గట్టిగా హత్తుకుంటుంది.
"కవుల భాషతోపాటు సంగీత నియమం కూడా జోడిస్తారు. అది తన మాయతో హృదయ ద్వారాన్ని తెరుస్తుంది. ఛందస్సు ధ్వనులతో హృదయం తనకు తాను విచలితమయినపుడు భాష పని సరళమవుతుంది. దూరాన వేణునాదం మోగుతున్నప్పుడు, కళ్లయెదుట పూవు విచ్చికుంటున్నప్పుడు, ప్రేమయొక్క అర్దం తెలుసుకోవడం సులభం.
సంగీతంలో రెండు అంశాలున్నాయి. స్వరతాళాలు ఛందస్సు ధ్వనులు. యునానీలో 'జ్యోతిషమండలి సంగీతం' అనే పేరుతో విషయ వర్ణన వుంది. షేక్స్పియర్ గ్రంధాలలో దీనికి కారణం వర్ణితమయింది. ఒక గతికి, యింకొక గతికి గట్టి సంబంధం వుంది. ఆకాశమంతటా సూర్య చంద్రులు, గ్రహ ఉపగ్రహ ఒక తాళానికి నృత్యం చేస్తుంటాయి. వాటి విశ్వవ్యాప్తమై సంగీతం కంటికి కనిపించదు. చెవికి వినిపించదు. చందో సంగీతం కూడా అలాంటి రూపమే. కవితలో ఛందోధ్వని మిళితమై భావానికి జీవం ప్రసాదిస్తుంది. వస్తువు కృత్రిమమయితే బాషకూడా కృత్రిమంగా వుంటుంది. సౌందర్యం కృత్రిమం కాదు. భాష మానవుని సృష్టి. కాని సౌందర్యాన్ని సృజించినది సమస్త ప్రపంచమును సృష్టించిన సృష్టికర్త."
నా మాటలు విని నిర్ఘరిణి గద్గదపడి చిరునవ్వుతో, "నాటకాభినయంలో నా హృదయంలో అశాంతి రేకెత్తించినవారి మాటలు స్పష్టమవుతాయి. సంగీతం, రకరకాల రంగులు, పదాలు మొదలగునవి నా మనసును చంచలింపజేస్తాయి. అయినప్పటికీ అవి శ్రమభావ వాహిని. రకరకాల రూపాలు ధరించి వివిధ కార్యాలలో ప్రవహిస్తుంది. మన మనసు నాటక ప్రవాహంలో అపాయమేమీ కాకనే వేగంగా గమిస్తుంది. అభినయించే స్థలంలో విభిన్న కలల మధ్య సహయోగత కనిపిస్తుంది. అక్కడ సాహిత్యం, చిత్రలేఖనం, సంగీతం, నాట్యకళ ఒకే ఒక ఆశయసిద్దికోసం కలిసి పని చేస్తాయి. నాకు తెలిసినంతలో ఇటువంటి కలయిక వేరే కనిపించదు" అని అన్నది.
కార్యతాత్పర్యం
నిర్ఘరిణి 'కచ - దేవయాని కథను గురించి మీరు కవిత వ్రాశారు గదా, దానిని మీ నోట వినాలని వుంది వినిపించండి' అని నన్ను అడిగింది.
ఈ కథవిని నేను పులకించిపోలేదు. కాని ధర్మహరి మధుసూదన్ ఆ సమయంలో మేల్కొనే వున్నాడు. అందుకని శీఘ్రంగా ప్రకాశవతి అధీరయై, "చెడును మన్నించవద్దు. యింతవరకు ఆ కవిత తాత్పర్యం నాకు బోధపడలేదు, ఆ వ్యాసం బాగుండలేదు" అని అన్నది.
నేను మౌనం వహించాను. నాలోనేను, "కొంత నమ్రభావంతో దీనిని వెల్లడిస్తే ప్రపంచానికి నష్టమేమీ వాటిల్లదు. ఆ వ్యాసంలో దోషాలుండడం ఆశ్చర్యంలేదు. వాటిని పెద్దగా చెప్పనవసరమూలేదు. పాఠకులలో కవితను అర్దం చేసుకునే శక్తి పూర్తిగా వుంది. ఇందులో సందేహమేమీ లేదు. తన రచనను గురించే వ్యాసకర్తకు ఎక్కువ ఆశ, విశ్వాసం వుంటుంది. అయినప్పటికీ వ్యాసంలో కూడా దోషాలుండడం పూర్తిగా అసంభవం కాదు- అని చరిత్ర రుజువు చేసింది. ఇంకోవేపున సమాలోచకులను అభ్రాంత నిర్దోషులనడం సంభవం కూడా. చరిత్రలో దీనికి ప్రమాణం దొరకదు. అందువల్ల యిటువంటి స్థితిలో యింత జోరుగా మాట్లాడవలసి వస్తుంది. ఆ కవిత రుచించలేదు. ఇది నా దురదృష్టం కూడాను అవునా?"
ప్రకాశవతి గంభీరపూర్వకంగా "అవును" అని ఒక పుస్తకం తీసి చదవ నారంభించింది.
గగన్ దేవ్ బయటకు దృష్టిని నిగిడ్చి, "తాత్పర్య విషయం చెప్పమంటే చెప్పుతా, నాకు ఆ వ్యాస తాత్పర్యం లబించింది" అని అన్నాడు.
దానిమీద పృద్వీరాజ్ "ఆ విషయమేమిటో ముందుగా చెప్పడానికి యేమి యిబ్బంది వచ్చింది. కవితను యిపుడు చదవనేలేదు. కవి అంటే భయంతో ఊరుకున్నాను.ఇపుడు స్ఫష్టంగా చెప్పదలచాను" అని అన్నాడు.
గగన్, "శుక్రాచార్యులు దగ్గర నుంచి సంజీవని విద్ నేర్చుకోవడానికి కచుని దేవతలు దైత్యగురుని ఆశ్రమానికి పంపించారు. అక్కడ కచుడు వేయి సంవత్సరాలు నృత్య కావ్యగీతాలతో శుక్రాచార్యుని కుమార్తె దేవయాని మనసును రంజింపజేసి సంజీవనీ విద్యను నేర్చుకున్నాడు. విడిపోయే సమయం వచ్చేసరికి దేవయాని అతని ప్రేమను వెల్లడించడానికి అతనిని ఆపింది. దేవయాని ఆకర్షించినా కచుడు ఆమె ఆగ్రహాన్ని లెక్కచేయకుండా ఇంటికి వెళ్లిపోయాడు. ఇదీ కథ. కాని మహా భారతంలో కూడా కొద్దిగా మతాంతరం వుంది. దానిని లెక్క చేయనక్కర లేదు" అని అన్నాడు.
ప్రకాశవతి ఆర్ద్రస్వరంతో, "కథ చిన్నదే. కాని దీని ఆశయం దీనివల్ల కూడా గొప్పది కాలేదే అని సందేహం" అని అన్నది.
గగన్ ప్రకాశవతి మటాలు వినీవిననట్టు, "ఇది దేహం - ఆత్మలను గురించేనా?" అని ప్రశ్నించాడు.
ఇది విని అందరూ భయపడిపోయారు.
ప్రకాశవతి, "నేనీ సమయంలో నా దేహం ఆత్మలను తీసుకుని ప్రతిష్టతో సెలవు పుచ్చుకుంటున్నాను" అని అన్నది.
పవన్ దేవ్ చేతిలో ఆమె వస్త్రం పట్టుకుని కూర్చోబెట్టి, "వ్యాకులతతో మమ్మల్ని వదలి ఎక్కడకు వెళతావు?" అని అడిగాడు.
అపుడు గగన్, "జీవుడు స్వర్గంనుంచి ఈ ప్రపంచంలోనికి వచ్చాడు. అతను ఇక్కడ సుఖదుఃఖాలతో గుణపాఠం నేర్చుకుంటాడు. విద్యార్దిగా ఉన్నంతకాలం ఆశ్రమ కన్య దేహంతో తృప్తిపడతాడు. మనసును రంజింపజేసే అపూర్వ కన్య దేహంతో తృప్తిపడతాడు. మనసును రంజింపచేసే అపూర్వ విద్య అతనికి తెలుసు. అది దేహానికి ఇంద్రియరూప వీణతో అటువంటి మధుర సంగీతం ఆలపిస్తుంది. భూమి మీద సౌందర్య నందన మరీచిక వుంటుంది. శబ్ద గంధస్పర్శ మొదలై సకల జడ శక్తులు వాద్యనియమానికి విడిచిపెట్టి ఒక అపూర్వ దేవతా నృత్యావేశంతో సంచరించ నారంభిస్తాయి" అని అన్నాడు.
ఇలా మాట్లాడుతూ, మాట్లాడుతూ, శూన్యదృష్టి విరియిస్తూ నల్లదారు పీటమీద కూర్చుని, "ఈ దృష్టితో చూస్తే ప్రతి ఒక్క మనిషిలో అనంత కాలీన ప్రేమాభినయం గోచరిస్తుంది. జీవి తన మూఢ భార్యకు పిచ్చెత్తిస్తాడు. దేహ ధర్మం ద్వారా ఆకాంక్ష జనిస్తుంది. దాని కళ్లల్లో సౌందర్య హస్త మార్పును తీసుకు వస్తుంది. కళ్లు మెరిసిపోతాయి. దేనినీ చూడనివ్వదు. దాని చెవులలో అనంత సంగీతం మోగుతుంది. వ్యాకుల పడుతుంది. అనవరత పరిశ్రమతో, అచ్చులాగా. వెంటనంటి వుండి నానారకాల ఉపచారాలతో సేవచేస్తుంది. వియోగం భరించలేదు. సేవాసత్కారాలలో ఏ మాత్రం లోటు రానియదు. ఈ విషయంలో సకల వేళలా తత్పరయై వుంటుంది. తత్పరంగా వున్నప్పటికీ ఏదో ఒక రోజున జీవి తన చిరకాల పత్నిద్దేహలతను ధూళిలో కలిపి వెళ్లిపోతాడు. "ప్రియా! నేను మనసారా నిన్ను ప్రేమిస్తున్నాను. అయినప్పటికీ నీ కోసం ఒక్క దీర్ఘ నిశ్వాసం వదలి వెళుతున్నాను" అని జాలిగా చెపుతాడు. దేహం అతనిపాదాలు పట్టుకుని "ప్రియతమా! ఆఖరికి నన్ను గడ్డిపోచలాగా వదలి వెళ్లిపోతున్నావు. ఐనా నువు ప్రేమతో నన్ను మహిమామయంగా ఎందుకు తయారుచేశావు? నన్నెందుకు దగ్గరకు తీశావు? నేను మీకు యోగ్యురాలనుకాను. కాని నువు నా యీ ప్రాణరూప మందిరంలో ఒకనాటి కటికచీకటి దీప్తిలో విశాల సముద్రం దాటి అగ్నిజ్వాలను దాచుకునివచ్చి నా మీద ప్రేమ ఎందుకు చూపావు?" అని అడుగుతుంది. ఈ కరుణ ప్రశ్నకు జవాబేమీ చెప్పకుండా విదేశాలకు వెళ్లిపోతాడు. ఎక్కడికి వెళ్లిందీ యెవరికీ తెలీదు. ఇది చిరకాల సమాగమబంధనానికి అవసానం. దీనితో సమాన మయిన ప్రపంచ విరహదృశ్యం. మరే కావ్యంలోనూ లభించదు"అని అన్నాడు.
పృద్వీరాజ్ ముఖంలో పరిహాస ప్రతిబింబం తారాడింది. ఇది చూచి గగన్, "మీరు యిటువంటి ప్రేమను అర్దం చేసుకోలేరు. దీనిని మీరు అర్దం చేసుకునివుంటే రూపకాలంకారం ఆధారం చేసుకొని మాట్లాడమెందుకు? అక్కరలేదు. ఈ ప్రపంచంలో ఇదే సర్వప్రధాన ప్రేమ. జీవిత సర్వ ప్రధాన ప్రేమ కూడా సరళం, కఠినం. ఈ దేహ ప్రేమ ప్రపంచంలో అన్నింటికంటే ముందుగా ద్యోతకమయింది. ఆ సమయంలో హాజరుగాలేడు. ఏ చరిత్రకారుడూ జన్మించయుండలేదు. కాని ఆ రోజున జలం నుంచి సరోవరాలు, పంకయుక్త అపరిణిత ధరాతలంమీద దాని విజయపతాక అన్నింటికంటే ముందు యెరిగింది. ఈ ప్రపంచం అస్త్రశాస్త్రాది యంత్రాల ప్రపంచం కాదని రుజువయింది. ప్రేమ అనే ఒక అపూర్వ వేదనాపూర్ణ యిచ్చాశక్తి, పంపకం నుంచి కమలవనాన్ని జనింపజేసింది. ఈ వనంమీద భక్తుల దృష్టిలో సౌందర్యరూపణి లక్ష్మి, భావరూపిణి సరస్వతి నివసిస్తుంటారు" అని అన్నాడు.
