Previous Page Next Page 
చిత్రం భళారే విచిత్రం పేజి 18

    "మరి దీనిమీద మీ కన్ను ఏనాడోపడితే దీన్నిలా వదిలిపెట్టెసారేంటి బాబుగారూ ఇన్నాళ్ళూ....."
    "హోరి సన్నాసీ - వదిలిపెట్టానని ఎవరు చెప్పార్రా - మన రౌడీలను దీన్ని తీస్కురమ్మని పంపించాడు - కానీ వాళ్ళు పరమ సన్నాసి వెధవలు కావడంచేత గోపిగాడు అడ్డుపడి చావుదెబ్బలు తన్ని వాళ్ళని వెనక్కి పంపించాడు-" అన్నాడు రాయుడు పళ్ళుకొరుకుతూ.
    "అడ్డెడ్డే - ఎంతపని జరిగింది - పోనీ ఇప్పుడు మీరే డైరెక్టుగా దాని చెయ్యి పట్టుకోరాదూ? - అది ఒంటరిగా కూడా ఉంది - గోపీ, పాపీ ఎవరూ చుట్టుప్రక్కల ఉన్నట్టుకూడా లేరు" అన్నాడు సంతానం.
    "ఆహా! లక్షణమైన మాట శలవిచ్చావ్ - సరేగానీ నువ్వటు తిరిగి కళ్ళుమూస్కో-" అన్నాడు రాయుడు గంభీరంగా.
    "అలాగే - హిహిహి - అలాగలాగే..."
    సంతానం ఆ ప్రక్కకి  తిరిగి కళ్ళు మూసుక
    "ఆ? రాయుడా?" అంది కళ్ళు పెద్దవిచేసి చూస్తూ.
    "ఆ.... ... నేనేనే... ఇందాక పాట పాడేవుగా నన్ను మనువాడే మొనగాడు ఎవరో అంటూ.
    ఆడెవడోగానీ నిన్నేలే మగాడ్ని నేనేనే..." అంటూ రాయుడు సీతాలు చేతిని చటుక్కున పట్టుకున్నాడు.
    సీతాలు అరక్షణంలో ఆ చేతిని విడిపించుకుని పావుక్షణంలో రాయుడి చెంప ఛెళ్ళుమనిపించి గబగబా ముందుకు నడిచింది.
    రాయుడు దిమ్మెరపోయాడు.
    సంతానం ఇకిలించుకుంటూ దగ్గరికొచ్చాడు.
    "అబ్బో... అబ్బో... చాలా పెద్దగా శబ్దంచేస్తూ ముద్దు పెట్టుకున్నారే...." మెలికలు తిరిగాడు సంతానం.
    "సంతానం!"... పళ్లునూర్తూ అన్నాడు రాయుడు.
    "ఏం? వేళాకోళాలాడుతున్నావా
    "పెద్దగా శబ్దంవచ్చేలా ముద్దుపెట్టుకున్నారనీ .... మీరు పెద్దశృంగార పరుషులనీ నేనంటుంటే అలా కోపంగా అరుస్తారేంటి బాబూ?.... అయ్యబాబోయ్! అదేంటి ఆ చెంపమీద అయిదువేళ్ళు ముద్ర పడ్డాయ్?" కంగారుగా అన్నాడు సంతానం.
    "అది ముద్దు శబ్దంకాదురా సన్నాసీ... సీతాలు నా గూబ అదరగొట్టి పోతోంది....."
    "ఆ? అంతపని చేసిందా?... ఏంటండీ బాబూ! మీరు అందరికీ ఇలా లోకువ అయిపోతున్నారుమొన్న గోపిగాడి పెళ్ళాం కూడా మీ చెంప ఛెడీల్ మనిపించింది.ఇలాగయితే రేప్పొద్దున మీరు ఒకవేళ రోడ్లూడిచే దానిచెయ్యి పట్టుకుంటే అది కూడా మీ చెంప పేలగొడ్తుందేమో!!"
    "అంటే నేన్నీకు రోడ్లూడిచే దాని చెయ్యి, పాతకాగితాలు ఏరుకునేదాని చెయ్యి పట్టుకునేవాడిలా కనిపిస్తున్నానా?" గుడ్లురిమి చూస్తూ అన్నాడు రాయుడు.
    "నా ఉద్దేశం అదికాదండీ.... మీరు ఇలా ఊర్కుంటే ఎవరైనా చెంప పేలగొడ్తారని ఉదాహరణకి చెప్పాను..."
    "అలాగైతే నన్నిప్పుడేం చెయ్యమంటావ్"
    "వెళ్ళిపోతున్నదాన్ని పట్టుకుని రెక్కపుచ్చుకుని ఏ పొదలచాటుకో లాక్కెళ్ళి.....హి.... హిహి.... మహాప్రభో! తర్వాతేం చెయ్యాలో నేను చెప్పాలా?...." మెలికలు తిరిగాడు సంతానం.
    "కానీ దానిది జొన్నరొట్టెలు తినే శరీరంరా.... దాన్ని ఆపడం నా వల్లకాదు....."
    "ఏంటండీ మీరు మరీనూ... నేను సాయంపడ్తానుగా.... మీరు ముందు పదండి....నేను మీ వెనుకే ఉంటాను. బోత్తిగా ఆడపిల్లలా చేస్తారేం?"
    "సరే పద..." రాయుడికి పౌరుషం వచ్చింది.
    రాయుడు అడుగులు గబగబా ముందుకు వేసాడు. అతన్ని సంతానం అంత వేగంగానూ అనుసరించాడు.
    రాయుడు సీతాలుని సమీపించాడు.
    "ఆగవే....ఆగు" సీతాలు పైటకొంగు పట్టుకున్నారు రాయుడు.
    ఇందాక ధైర్యంగా రాయుడి గూబ పగలగొట్టిన సీతాలు ఇప్పుడు ఎందుకనో బెంబేలు పడిపోయింది.
    "బాబుగారూ... నన్నిడిసిపెట్టండి బాబుగారూ" దీనంగా రాయుడి మొహంలోకి చూస్తూ అంది సీతాలు.
    "హ్హ... హ్హ... హ్హ ఇందాక చెంపదెబ్బ కొట్టినప్పుడున్న పొగరు ఇప్పుడేమైందే...."
    సీతాలు గింజుకోసాగింది.
    రాయుడూ, సంతానం సీతాలు చేరోప్రక్క పుచ్చుకుని పొదలవైపు లాక్కెళ్ళసాగారు.
    "గంగా!" ఉన్నట్టుండి పొలికేక పెట్టింది సీతాలు.
    రాయుడు ఉలిక్కిపడ్డాడు.
    "గంగనా? అదెవరు?.... కొంపదీసి గోపిగాడి చెల్లెలు కాదుకదా? దీని కేకకి లగెత్తుకువచ్చి అదికూడా నా చెంప చెళ్లుమనిపించదు కదా." సంతానంతో అన్నాడు రాయుడు.
    "అది దేవుడ్ని తల్చుకుంటున్నట్లుందండి.... మీరు మీ పని కానివ్వండి...." ప్రోత్సాహించాడు సంతానం.
    రాయుడు సీతాలు పైటని పూర్తిగా లాగేసాడు.
    "గంగా! గంగా"
    మళ్ళీ గావుకేక పెట్టింది సీతాలు. ఎక్కడో మారుమూలవున్న గంగ అనబడే సీతాలు పెంచుకుంటున్న ఆవు సీతాలు చేస్తున్న ఆర్తనాదాన్ని వింది.
    అంతే.... అది బుసలుకొట్టుకుంటూ అక్కడికివచ్చి రాయుడినీ,సంతానాన్ని కొమ్ములతో కుమ్మింది.
    దెబ్బకి వాళ్ళిద్దరూ సీతాలుని వదిలి పరుగు లంకించుకున్నారు.
    "గంగా.... నా గంగా...." ఆనందభాష్పాలు రాలుస్తూ సీతాలు గంగ మెడని కౌగిలించుకుంది.
    గంగ కూడా ఆనందభాష్పాలు రాలుస్తూ తలకాయ్ ఊపింది.
                                                          *  *  *
    "హమ్మా.... హబ్బా...." ఉయ్యాల మంచంమీద పడుకుని మూలగసాగాడు రాయుడు.
    చిత్రాంగి అతని వీపుమీద వేడినీళ్ళ కాపడం పెడుతూ వుంది.
    సంతానం ఓ ప్రక్కగా నిల్చున్నాడు.
    "అయినా ఇంత అందగత్తెని నేనుండగా మీరు వేరే ఆడదానివైపు చూడ్డం ఏంటి? ఆ ఆవు నడ్డిమీద మెల్లగా కుమ్మింది కాబట్టి సరిపోయింది. లేకపోతే నా బతుకేమైపోయి ఉండేది?" అంది చిత్రాంగి వేడి వేడి నీళ్ళలో ముంచిన బట్టని అలాగే వీపుమీద పెట్టేస్తూ.
    "హమ్మో. నీ కాపడం మంటెట్టా. నా తొక్కరేగ్గొట్టేలా ఉన్నావే. నడ్డిమీద మెల్లగా కుమ్మితేనేం? ఒళ్ళంతా కుళ్ళబొడిచేసిందిగా. హమ్మో. హబ్బో!" బాధపడ్తూ అన్నాడు రాయుడు.
    "అదికాదండి అమ్మా. అప్పటికీ నేను అన్నాను బాబుగారు! నేను పుల్ ఇన్ ఫర్మేషన్ తెల్సుకొని మీకు రేపు చెప్తాను అని. నాకంతా తెల్సులేవోయ్ అన్నారు పెద్దగొప్పగా. ఏదీ? సీతాలు దగ్గర పిలవంగానే వచ్చి కుమ్మేసే ఆవుందని ఈయనకు తెలీనే తెలీదు. హి....హిహి" మెలికలు తిరుగుతూ నవ్వాడు సంతానం.
    రాయుడికి ఇరిటేషన్ పుట్టింది.
    "ఒరేయ్ సంతానం! ఈ బ్రాంచాఫీసుకాడ నీకేం పని? పోయి హెడ్డాఫీసుకాడ తగలడు. నేను కాపడం పెట్టించుకుని వస్తాను" అన్నాడు అరుస్తూ.
    "అయితే కాపడం పెట్టించుకోడానికి వచ్చారన్నమాట! ఇంకేం లేదా?" కొంటెగా చూస్తూ అడిగింది చిత్రాంగి.
    "అసలే ఒళ్ళు పులిసిపోయి నేను చస్తావుంటే నీ వేళాకోళాలేంటి చిత్రంగీ........ హమ్మా... హబ్బా"
    చిత్రాంగి పకపకా నవ్వింది.
                                                                  16
    అన్నపూర్ణ గదిలోకి వచ్చింది.
    "మామయ్యగారూ. టిఫిన్ పెట్టేశాను రండి." అంది.
    "నా కొద్దమ్మా.... మీరు తినండి" అన్నాడు పరంధామయ్య నీర్సంగా.
    "అత్తయ్యగారిమీద ఊర్కే అలా బెంగపెట్టుకుని మీరిలా తిండీతిప్పలు మానేస్తే ఆరోగ్యం పాడవుతుంది మామయ్యా. కాస్తతినండి"
    "సరస్వతి మీద నేనెందుకు బెంగపెట్టుకుంటాను తల్లీ. సరస్వతి గోపికి సొంత తల్లిగానీ నాకు సొంతభార్య కాదుకదా?" బాధగా అన్నాడు పరంధామయ్య.
    అన్నపూర్ణ నాలుక కొరుక్కుంది. ఛీ అవునుకదా!
    "అయితే మీరు గోపిమీద బెంగపెట్టుకున్నారు అంతేకదూ?" అంది.  


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS