Previous Page Next Page 
మొగలి పొదలు పేజి 18


    సుభద్ర యేడుస్తూ అంది : 'డబ్బుని యిలా విలువ కడతారా? మాధవరావు గారూ! మీరు చదువుకుని వుండాలి. నేనేవీ చదువు కోలేదు. అందుకే కల్లబొల్లి కబుర్లకి లొంగి పోయాను. నాదస్వరానికి నాగుపాములా. నన్ను మీరు రక్షించకపోతే కొండ మీచి పడిపోతాను అంతూ దరీ లేని అగాదాల్లో కి. మీకూ తెలుసు మంచీ -- చెడూ.
    'నన్ను నమ్మండి. నాకు జగదీశ్ తప్ప యెవరూ తెలీదు. మాది అసలు యిటువంటి కులవృత్తే కాదు. నన్ను కాపాడండి. మీ ఋణాన పడి వుంటాను . మీరు ఉపయోగించుకుని మరికింత మంది చేతులు మారి నా బ్రతుకు నలుగురు తొక్కినా విస్తరి లా యెండకు ఎండి వానకు తడిసి గాలికి కొట్టుకుపోతూ ఆ నడి వీధిలో కుక్కలు చింపేసినట్లు చేయకండి.'
    'శ్రీనివాస్ యెక్కడ వుంటాడు .' మాధవరావు అడిగాడు.
    'నన్ను అతని దగ్గరికి తీసుకు వెడతారా?' ఆశగా అడిగింది.
    'ఔను నిన్ను అతనికి అమ్మేస్తాను. ఎవరికో అమ్మే బదులు నీకోరిక ప్రకారమే చేస్తాను. కానీ వొక్క షరతు.'
    'యేమిటది,' సుభద్ర భయంగానే అడిగింది.'    
    'నిన్ను నేను అంతవరకూ తాకను' శ్రీనివాస్ నిన్ను కొనుక్కోలేని స్థితిలో నాపని నేను చేసుకుంటాను.'
    'శ్రీనివాసా!' సుభద్ర మనసులో రెండు చేతులూ జోడించింది భగవంతుడి కి. 'నా కొడుకు శ్రీనివాస్ రాజమండ్రి లోనే వుండాలి. నువ్వు ఆపద మొక్కుల వాడవి అంటారు. నన్ను రక్షించు స్వామీ' తెలియక చేసిన నేను యిలా అన్యాయం అయిపోతుంటే .....'
    'మాట్లాడవేం సుభద్ర.'
    సుభద్ర అనుక్షణం దేవుడిని ధ్యానిస్తూనే వుంది.
    రైలు చక్రాల రొదలో, గుండెల్లో గుబులుతో, కొండంత బరువుతో , తలకు మించిన ఆలోచనలతో అడుగు తీసి అడుగు వేయలేని స్థితిలో సుభద్ర కదిలింది. హైదరాబాదు కి, సుభద్ర కి ఆక్షణం లోనే ఋణం తీరిందని పదేపదే కేకలు వేస్తోంది రైలు. మాధవరావు, రాజకీయాల గురించీ, సినిమాల గురించి వోక్కొక్కటే చెబుతుంటే ఆసక్తిగా వింటోంది.
    సన్నగా పొడుగ్గా ఆకర్షణీయంగా వున్న మాధవరావు ని ఒకసారి చూస్తె తిరిగి చూడకుండా వుండరు. అతని గొంతులో గులక రాళ్ళ ధ్వని, కీకారణ్యం లో పక్షులు చేసే వొకానొక అందమైన రోద, సెలయేళ్ల గలగల యిలా మార్చి మార్చి వినిపిస్తున్నాయి . గ్లాస్కో లాల్చీ వేసుకుని పైజమా లో ఏదో ఠీవి వుట్టిపడుతూ కనిపిస్తున్నాడు. సుభద్ర కనురెప్పలు మూతలు వేయడం మానేశాయి. 'ఇటువంటి అన్నయ్య ఒక్కడు వుంటే. నేను యే స్థితిలో వుండేదాన్ని? భగవంతుడు దయామయుడు. అందుకే యితని లో ప్రవేశించి నన్ను అదుకుందుకు సహాయపడుతున్నాడు.'
    రాజమండ్రి రావడానికి పది పన్నెండు గంటలు సరిపోయింది. రోడ్లన్నీ, మనుష్యుల్నీ, కాలేజీ లనీ తిప్ప తిరగేసినా యెవరూ చెప్పలేకపోయారు శ్రీనివాస్ ఆచూకీ.
    సుభద్ర సత్రంలో వో మూల కూర్చుని యేడుస్తుండి పోయింది. ఎక్కడో ఆశని యిలా నీరు పోసి పెంచి డాన్ని వ్రేళ్ళ ల్లోంచి హృదయం లోకి పాకించేసి పటిష్టం చేసింది.అ ఆశలు కూకటి వ్రేళ్ళ తో సహా పైకి వచ్చేసి నేలమట్టం అయిపోయాయి. నిస్సహాయు రాలై పోయింది యిప్పుడు.
    "వూరంతా వెతికాను. అతని గురించి యెవరూ యేవీ చెప్పలేదు. మనం హోటల్ కి వెళ్ళిపోదాం. ఈ చలిలో, ఈ నిశిరాత్రి లో నాకు అసలు యిటువంటి స్థలాల్లో నిద్ర పట్టదు.'
    సుభద్ర వూపిరి బిగపట్టింది . హోటల్ లో వొంటరిగా వొక పురుషుడి సమక్షం లో తనను తాను రక్షించుకోవడం అనేది కలలో మాట. భగవంతుడు యెందుకు యిలా చేశాడు. స్త్రీ తప్పటడుగు వేస్తె ఫలితం అడుగడుగునా యిలా అనుభవించ వలసినదేనా? భగవంతుడా ఎక్కడున్నావు నువ్వు?'
    సుభద్ర కెవ్వుమంది. మాధవరావు వులిక్కి పడ్డాడు. 'యేమైంది ? ఏం జరిగింది సుభద్రా! మానవత్వం వున్న మాధవరావు ఆప్యాయంగా అడుగుతుంటే సుభద్ర సర్వం మరచిపోయి అతన్ని కౌగలించుకుని బావురుమంది. అతను అయోమయంగా చూస్తుండి పోయాడు.
    'అన్నయ్యా, సుభద్ర నిస్సంకోచంగా అంది : 'నన్ను హాస్పిటల్ లో చేర్పించాలన్నయ్యా,' మాధవరావు హృదయ గత స్థితి వర్తించని రకంగా మారిపోతోంది. 'అన్నయ్యా! అతని చెవుల్లో ఆ పదాలు జపమాలకు మల్లె చుట్టూ తిరుగుతున్నాయి గుండ్రంగా. అంతకంత కు సుభద్ర కి నొప్పులు అధికం అవుతున్నాయి. 'అన్నయ్యా! యెంత మంచివాడివి నువ్వు. నేను నీకు యేమౌతానో భగవంతుడి లా చెప్పాడేమో ' బాధలో సుభద్ర నువ్వు నువ్వు అంటూ అతన్ని తోడబుట్టిన వాడే అనుకుంటోంది. మాధవరావు కంటి కనుగోలుకుల్లో నీటి బొట్టు మిలమిలా మెరుస్తూ చటుక్కున బుగ్గ మీద పడింది. అదృష్టమో, దురదృష్టమో సుభద్ర కి యిప్పుడు ఏడవ నెల.
    'నన్ను క్షమించు సుభద్రా!' అతను మనసులోనే అనుకున్నాడు. దగ్గర లో వున్న గవర్నమెంటు హాస్పిటల్లో చేరుస్తుంటే అంది సుభద్ర : మళ్ళీ రావా అన్నయ్యా.'
    మాధవరావు మాట్లాడలేదు.'
    'కష్టం లో తోడ బుట్టిన వాడిలా యింత దూరం వచ్చావు. నాకు పురుడు రానీ అన్నయ్య. నీకు ఎలా తెలుపుకొను కృతజ్ఞత' మాధవరావు అచేతనంగా వుండి పోయాడు. ఏవిటో యీ ఋణానుబంధాలు. 'సాయంత్రం వస్తాను. ఆ తరువాత యిక నీకు కనిపించను. నీకు తెలీదు నా సంగతి . వస్తాను మరి' అతను గిరుక్కున తిరిగి వెళ్లిపోతుంటే ఆ పొడుగాటి విగ్రహానికి నమస్కారం చేసింది వెనుక నుంచి సుభద్ర.
    మర్నాడు నీరెండ మొహం మీద పడుతుంటే చెదిరిపోయిన క్రాపుతో రైలు ప్రయాణానికి మాసిన గుడ్డలతో హాస్పిటల్లో జనరల్ వార్డు లో అడుగుపెట్టి తనకోసం కళ్ళల్లో వొత్తులు వేసుకుని చూస్తున్న సుభద్ర కి దగ్గిరగా వచ్చి మాధవరావు తల మీద చేయి వేశాడు. 'వచ్చాను సుభద్రా. ఈ రాత్రి వెళ్ళిపోతున్నాను నేను'
    'మరి నేను?'
    'నేనేం చేయగలను. నాకు తల్లితండ్రులు వున్నారు. పెళ్లీడు చెల్లెళ్ళు వున్నారు. నా జీతం జీవితం అంతే అయితే నా వెంట నా చెల్లెళ్ళ లో నువ్వూ వోకదానివి అని తీసుకు వెళ్ళే వాడిని. కానీ గొర్రె తోక లాంటి ఆ డబ్బుతో నేను పోషించలేను. రోగిష్టి భార్య....చుట్టూ అప్పులూ మనశ్శాంతి కోసం అప్పుడప్పుడు తాగడం శరీరానికి కావలసిన సుఖం కోసం బజారులో గడపలు తొక్కడం, డబ్బు కోసం , పెకాడటం యిలా చుట్టూ కైవారం లాంటి వ్యసనాలతో కావలసినన్ని రోగాలతో బ్రతుకుతున్నాడమ్మా నీ అన్నయ్య. నేను నిన్ను తీసుకుని ఎక్కడికి వెళ్ళగలను? ఎలా పోషించగలను?
    'నా సలహా ఒకటే ఆడపిల్ల ఆశ్రయం చూసుకుని అడుగు వేయాలి. నా ఆశ్రయం అంత బాగుండదు. ఆ కటిక దరిద్రాన్ని ఆ శిధిల గృహాన్ని జీర్ణించిన ప్రేగుల్తో వున్న ఆ మనుషుల మధ్య నువ్వు బ్రతకలేవు నన్ను క్షమించు.'
    'పాప ముద్దుగా వుంది.'
    సుభద్ర వెక్కి వెక్కి యేడుస్తోంది 'ఏం చేయను? దౌర్భాగ్యుడిని నేను. తెల్లవారితే నేను బాకీ చెల్లించక పొతే పహిల్వాన్ నా మెడ మీద తల వుంచడు. నేను వెళ్లి పోవాలి. యిది కోడలికి వుంచు' రెండు పదులు పసిపిల్ల చేతుల్లో పెడుతుంటే సుభద్ర భోరున ఏడుస్తూ 'వొద్దు మాధవీ. మామయ్యా కి యిచ్చేయి.' అంది.
    మాధవరావు తెప్పరిల్లక ముందే  ఫకీరు గేటు దగ్గర నిల్చుని 'అదేనా' అంటున్నాడు. మాధవరావు మనసులోనే క్షమార్పణ లు కోరుకుంటున్నాడు అసమర్ధుడై పోయి . పాప కేవు మంటోంది. సుభద్ర జీవితంలో మాధవరావు దైవం లా ఆదుకుని అంతలోనే అదృశ్యం అయిపోయాడు. హాస్పిటల్ ఆవరణ లో విద్యావంతుల మధ్య తనెందుకు బ్రతకలేదు. పోనీ యీ హాస్పిటల్లోనే యేదైనా కూలి పని చేసి....' ఈ ఆలోచన సుభద్ర కి గర్వంగానే అనిపించింది.
    'సిస్టర్ '
    'ఏం కావాలి' చాలా కఠినంగా అంది. తెల్లబట్టల్లో కాఠిన్యాన్ని మరుగు పరుస్తూ యెంత చక్కగా నటిస్తారు పరిపూర్ణ శాంత మూర్తుల్లా.
    'యిక్కడ.'
    'యేవిటిక్కడ?'
    సుభద్ర బెదిరిపోయింది ఆ ఆదలింపుకి. 'యేవీ లేదు' అనేసింది.
    ఒంటరిగా ప్రయాణం చేస్తున్న బాటసారి కి దారి కనిపించక పొతే యీలోగా కటిక చీకట్లు అవరించినట్లుగా గజగజ లాడిపోయింది సుభద్ర. తలమునకలయ్యే ఆలోచనలకి స్థబ్దురాలై పోయింది . పొత్తిళ్ళ ల్లో పాప నవ్వుతుంటే సుభద్ర యేడుస్తోంది. పాపకేం తెలుసు తన తల్లి యేడుపు కి కారణం తనే అని. అందరిలా తనూ పుట్టిందనీ, అందరి లాగే బ్రతుకుతా ననీ అనుకుంటోందేమో మరి?
    పాప పక్కనే పడుకుంటే జగదీశ్ గుర్తుకు వచ్చాడు.
    'మీరు నన్నెందుకిలా చేశారు? పాప చూడండి మీ అందచందాలు పుణికి పుచ్చుకు పుట్టింది.' సుభద్ర అంతర్వాహిని కొట్లాడు తోంది.

                                   9
    సాయంత్రం స్కూలు నుంచీ రాగానే శ్రీనివాస్ కి రోజులా ఎదురు రాలేదు రాజేశ్వరి. యిల్లంతా బావురు మన్నట్లని పించింది. 'రాజేశ్వరి! కేకవేస్తూ గడప యేక్కాడు. ముందు గదిలో నీటుగా ముస్తాబై శ్రీనివాస్ కోసమే యెదురు చూస్తోంది! 'వీధిలోకి రాకపోతే చెప్పకుండా వెళ్ళిపో యారను కున్నాను బ్రతికించారు' శ్రీనివాస్ అన్నాడు.
    రాజేశ్వరి నవ్వింది. 'మహా నేను లేకపోతె యేమిటో అయోపోయినట్లు మాట్లాడకండి.'
    'పోన్లెండి మీకు మంచి కబురు తెచ్చాను. ఏం పెడతారు?'
    'యింకా యేవీ  పోలేదు మీమీద పెట్టిందుకు.'
    'నిజం రాజేశ్వరీ 'వెల్ఫేర్ సెంటర్ ' లో మీకు టీచర్ గా అపాయింట్ మెంట్ ఆర్డర్ తెచ్చాను.'
    రాజేశ్వరి చటుక్కున అందుకుంది కాగితాలు. 'యిప్పటికి రెండు మూడు నెలలుగా యింటి పట్టునే వున్నాను. సూర్యుడు ఎటువైపు వుదయిస్తున్నాడో ఎటు వైపు అస్తమిస్తున్నాడో తెలిసి చావదు. అలా ఎటైనా వెడదాం . మీరు రావాలి.' పంతంగా అంది.
    నిట్టూర్చాడు శ్రీనివాస్: 'మీరు మరేవీ అనుకోవద్దు రాజేశ్వరీ. లోకం అంత మంచిది కాదు. దున్నపోతు యీనిందంటే దూడను కట్టేయ మంటుంది. అరె! దున్నపోతు యేవిటి? ఈనడం యేవిటి అనైనా ప్రశ్నించదు. మనం నలుగురి కళ్ళల్లో పడడం అంత మంచిది కాదు.'
    'శ్రీనివాస్.'
    'ఆశ్చర్యానికి యేవీ లేదు యిందులో. మరోలా అనుకోవద్దు. మీకు ఈ ఏర్పాట్లు కావాలనే చేశాను. వెల్ఫేర్ సెంటర్ లో వుద్యోగం. హాస్టల్లో వుండేందుకు వసతి యేర్పాట్లు!'
    రాజేశ్వరి గుమ్మం లోనే కూలబడి పోయింది.
    అన్నట్లు వదిలించు కోవాలను కుంటున్నారా ' రాజేశ్వరి నోట్లోంచి మాటలు రావడం లేదు.
    'స్త్రీ' పురుషులు ఒకే గదిలో ఎంత పవిత్రంగా వున్నా ప్రపంచం హర్షించదు. నేను బస్సులో వెడుతుంటే రకరకాల వ్యాఖ్యానాలు, వినిపిస్తూనే వున్నాయి. నేను పట్టించు కోలేదు. ఒకమాట అడుగుతాను యేవీ అనుకోరు కద'
    'ఉహూ'
    'ఆ రోజు అంటే...నీళ్ళ కోసం మాట్వాడ రోడ్డు మీదకు వెళ్ళారు చూడండి అప్పుడు నీళ్ళు తీసుకు రానని పేచీ పెట్టి ఏడ్చారు దేనికి?'
    'అవును ఆరోజు అందరూ నన్ను నా ఎదుటే దుమ్మెత్తి పోశారు. ,మీకూ, నాకూ ఏదో సంబంధం వుందట. అదేవిటో నాకే అంతు తెలీనిది వాళ్ళు ఎన్ని మాటలు అన్నారనీ, యే ఆశా లేనిదే నన్ను యింట్లో అట్టి పెట్టుకుని మేపరనీ' రాజేశ్వరి దుఃఖం ముంచుకు వచ్చింది.
    'మీతో యిన్నాళ్ళూ చెప్పలేదు. యింక చెప్పక పోవడం కూడా అంత సబబు కాదు. అవధాని బాబాయి పినతల్లి మనుమరాలు యిక్కడే పని చేస్తోందిట. యిష్టం అయితే చూసుకో మన్నారు. వాళ్ళకా పట్టింపు లేదుట -- మొన్న ఆదివారం మాట్నీ కి వెళ్ళలేదు. ఆ పిల్లని చూశాను. సంసార పక్షంగా బాగానే ఉంది. అలోచించి చెబుతానన్నాను. మీరు వున్నారు కనుక యిన్నాళ్ళూ నాకు తిండి విషయం చూసి పెట్టారు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS