"బుద్ది కంటె ప్రతిభ గొప్పదని యెందుకు భావిస్తాం?బుద్ది ప్రతి రోజూ, ప్రతిక్షణమూ వేయి పనులలో అన్యాయం చేస్తుంది. అది లేకుండా మనం జీవించటం కష్టం. ప్రతిభ అపుడపుడూ కొన్ని పనులకు అవసరం అవుతుంది. అనేక సమయాలలో దానివల్ల మనకు లాభం వుందు. కానిబుద్ది మనసుకు సంబంధించినదే ప్రతిభ మనో నియమానుసారం సంబంధించకుండా గాలిలాగా వస్తూ పోతూంటుంది. ఎవరి పిలుపును ఆశించదు.
ప్రకృతికి మనస్సు లేదు. అందుకనే అది మనకు ఎంతో మనోహరంగా వుంటుంది ప్రకృతిలో ఒకదానిలో మరొకటి కలిసి వుండదు. ఏనుగుమీద కూర్చున్న మావటి వానిలాగా తన యిచ్చవచ్చినట్లు నడిపే వారెవరూ లేరు. మట్టి నుంచి ఆకాశం వరకూ విశాలమైన కుటుంబంలో విదేశీయ దుష్టులెవరూ ప్రవేశించి దుష్టకార్యాలు చేయడం వుండదు.
ప్రకృతి ఏకాకి, అఖండమయినది. చింతలేనిది. దాని సమీప నీలలలాటం మీద బుద్దిరేఖలేదు. కేవలం ప్రతిభాజ్యోతి ఎల్లప్పుడూ ప్రకాశిస్తూంటుంది. అనాయాసంగా యువతి యవ్వనం వికసించినట్లే ఒక భయంకరమైన తుపాను దానిని అవహేళన చేయడానికి, మోసగించి సుఖ స్వప్నాలలాగా దానిని తుత్తునియలు చేస్తుంది. అదంతా దాని యిచ్చతో జరిగినట్లే వుంటుంది. దానిలో శ్రమకు స్థానమే లేదు. ఆ యిచ్చ ఒకప్పుడు ఆదరిస్తుంది. ఒకపుడు గాయపరుస్తుంది. ఒకపుడు అప్సరసలాగా పాడుతుంది. ఒకపుడు ఆకలిగొన్న రాక్షసిలాగా గర్జిస్తుంది.
"చింతాకులత మానవునిలో సంశయరహిత యిచ్చాశక్తి బహుఆకర్షణీయంగా వుంటుంది. రాజభక్తి, ప్రభుభక్తి దీనికి ఉదాహరణలుగా తీసుకోవచ్చు. ప్రజల ప్రాణాలను యిచ్చాపూర్వకంగా ప్రజలెవరూ ముందుకు రావడము లేదు.
మానవజాతికి నాయకత్వము వహించడానికి ముందుకు వచ్చే వారికి మనసు వున్నట్లు కనిపించదు. వారు ఏ విధముగా ఏ పనిచేస్తారో సూటిగా వారి పనులలో గోచరించదు. ఐనా జనులు తమ సంశయరూప గాఢాంధకార గుహలోనుంచి బయలుదేరి గాలిపటం లాగా వారి మహత్వశిఖమీదకు దుమికి ప్రాణాలర్పిస్తారు. ఇంకోవిధంగా చెప్పాలంటే మహాత్ముల కండ్లు మూసి తనకు అనుకూలముగా చింతాశక్తిని కాలరాస్తారు. అటువంటి దశలో వారిపట్ల 'పాము - చుంచు' సామెత పూర్తిగా సార్దకమవుతుంది.
"స్త్రీ కూడా ప్రకృతితో సమానమైనదే. మనసులో ప్రవేశించి ఆమె దానిని రెండు ఖండాలుగా చేయలేదు. పువ్వులులాగా ఆది నుంచి చివరి వరకు ఒకే రూపములో వుంటుంది. ఇందువల్ల దాని సంచలము, ఆచార వ్యవహారాలు అలాగే సంపూర్ణతను పొందాయి. సందేహాస్పదుడైన పురుషుని విషయములో స్త్రీ 'మరణం ధృవం'.
ప్రకృతికి లాగానే స్త్రీకి కూడా యిచ్చాశక్తి వుంది. కాని ఆమెలో ఆలోచనా, విచారం, యుక్తి, తర్కంలేవు. ఒకపుడామె రెండు చేతులతో దానం చేస్తుంది; ఒకపుడు సంహారం చేయడానికి ప్ళయమూర్తిగా అవతరిస్తుంది. భక్తులు చేతులు జోడించి ఆమెను 'ప్రకృతిమయీ, ఇచ్చా' మొదలయిన సుందర విశేషణాలతో సంబోదిస్తారు."
పవన్ దేవ్ గట్టిగా శ్వాసపీల్చుకోవడానికి ఆగాడు. ప్రకాశవతి గంభీరంగా మాట్లాడడం ఇలా ప్రారంభించింది; "వహ్వా!వహ్వా! బలేగా వుంది! బహు చమత్కారంగా వుంది. కాని ఒట్టు వేసుకుని చెప్పుతున్నాను, నాకు ఒక్క మాటయినా అర్దం కాలేదు! మీరు చెప్పిన మనసు, బుద్ది ప్రకృతిలో లాగా నాలోనూ లోపించాయి. నన్నెవరూ ప్రశంసించడంలేదు. మీలో ప్రతిభ తగినంతగా వుంది. నాలో ఆకర్షణ శక్తి వుంది. యిది కూడా నాలో వుందని గట్టిగా చెప్పలేను. మీరు ముస్లిమ్ లాగా మాట్లాడుతున్నారు. స్త్రీలకు ఆత్మలేదని వారి ఖురాన్ లో రాసివుంది" అని అన్నది.
నిర్ఘరిణి చింతాన్విత భావంతో, "మీరు మనసు, బుద్ది అనే మాటలు ఒకే అర్దములో వాడండి, మాట్లాడండి. లేకుంటే మన అభిప్రాయాలు ఏకీభవించవు" అని అన్నది.
దానిమీద పవన్ దేవ్, "నేనిపుడు చెప్పినమాట యుక్తి యుక్తమైనదని అనుకోవద్దు. మొదటి సంవత్సరములో గంగానదీ వరదవల్ల ఏర్పడే యిసకమేట నాగలితో దున్నడానికి సాధ్యపడదు. కానీ ఆ తరువాత ఏదో విధముగా వర్షము కురిసి దానిమీద వొండ్రుపడితే మేటను నాగలితో దున్నటం సాధ్యపడుతుంది. ఆ విధముగానే నేనుకూడా నా సంభాషణా ప్రవాహములో ఇటువంటి మాటే ఒకటి చెప్పాను. రెండో సారి వరద వెనకకు తగ్గినప్పుడు, నిరంతరం వొండ్రునట్టి వచ్చిపడి సారవంతమవడం కూడా సంభవిస్తుంది. మీ మాటలన్నీ విన్నాను. ఇంకా ఆలోచించాలి."
"మానవుని అంతఃకరణ రెండు భాగాలు. ఒకటి అచేతనమైంది. అతి విశాలమైంది, రహస్యమైంది. రెండోది సచేతనము. క్రియయుక్త మయినది, చపలమయినది, పరివర్తన శీలమయినది.ఉదాహరణలు: మహాదేశము, మహాసముద్రము. సముద్రములో చపల భావంతో పుట్టిన నిశ్చలరూపము ధరిస్తుంది. ఈ విధంగానే నా చేతను ప్రతిరోజూ సంపాదించినదంతా పారవేస్తుంది. అదే సంస్కారస్మృతి అభ్యాసరూపాలలో గూఢబార సహాయముతో అచేతన రూపముతో రాశీభూతమవుతుంది. అది మన జీవితానికి, చరిత్కు గట్టి గోడ ఆధారము. మడత మడతా విప్పి యెవరూ చూడలేరు. బయటకు కనిపించేది, భూకంపం వల్ల ఏ గుప్తాంగాలు బయటపడతాయో దానిని మనము చూడగలుగుతాము.
"ఈ మహాదేశములో, పచ్చపచ్చని ఫలాలు, పుష్పాలు, సౌందర్యము, జీవనము సహజంగానే శోభిల్లుతున్నాయి. నిష్క్రియ స్థిరత్వం ప్రసిద్ది చెందుతున్నట్లు కనిపిస్తాయి. కాని దానిలోపల ఒకానొక రహస్య జీవనశక్తి, సహజ నిపుణత నిగూఢంగా పనిచేస్తుంటాయి. సముద్రము ఇంకా ఎక్కువగా పొంగిపోతుంది. దానిలో ఉత్తరోత్తలా యెన్ని రాగాలు మేళవించినా ఆ పొంగు సంపూర్ణత దానిని ఆవరిస్తాయి. మధ్య మధ్య యెక్కడో ఏ కేంద్రాన్నో ఆధారము చేసుకొని ఆ వృత్తము తన పరిధిని విస్తరించుకుంటూ పోతుంది. ఇందువల్ల సమీప వస్తువుల నన్నింటినీ బహు నైపుణ్యంతో తనలోకి లాగు కుంటుంది.
"ఇపుడు నేను చర్చించిన యీ కేంద్రము బుద్దికాదు. సహజ ఆకర్షణశక్తి, ఐక్యూబిందువు. మనో పదార్దము. ఇందులోనికి ప్రవేశించి తొంగిచూస్తే ఆ సుందర ఐక్యత ఛిన్నాభిన్నమయి అనేక భాగాలుగా విభాగమవుతుంది."
గగన్ దేవ్ ఈ మాటలు విని అధిక వ్యాకులం చెంది ఒక్కసారిగా, మీరు ఐక్యత అనే దానినే నేను ఆత్మ అంటాను. అయిదు పదార్దాలను తన వేపునకు లాగుకుని తన మూసలో పడవేసుకోవడమే దాని ధర్మము. మీరు దేనిని మనసు అంటారో అది తనంతట తానే పంచపదార్దాల వేపుకు వెళ్లి వాటిని తునాతునియలు చేస్తుంది. ఇందువల్ల ఆత్మయోగానికి ప్రధమ సోపానం మనోసంయమనమని నీతిజ్ఞులు అంటారు.
పవన్ దేవ్ మనసును ఆంగ్లేయులతో సరిపోల్చాడు. ఆ ఉపమానము .యిక్కడా సరిపోతుంది. ఆంగ్లేయులు ముందడుగువేసి సకల వస్తువులనూ గట్టిగా పట్టుకుంటారు. ఇంతవరకు వారి అంత యెవరికీ దొరకలేదు. సూర్యుడికి కూడా చిక్కలేదు. ఆ సూర్యుడు కూడా వారి రాజ్యములో ఉదయిస్తాడుగాని అస్తమించడు. మనం కూడా ఆత్మలాగానే కేంద్రీకృతమయినాము. మనం బల ప్రయోగముతో లాగుకోవాలని వాంఛించము నాలుగు వేపుల నుంచి వస్తువులను మన వేపుకు ఆకర్షించుకొని సంఘటనపడాలనే వాంఛిస్తాము. ఇందువల్ల మన సమాజములో మన గృహాలలో మన వ్యక్తిగత జీవనములో నిర్మాణ నిబిడిత కానవస్తుంది. ఆత్మపని సృజించడం, మనస్సు పని ఆహరించడము.
"యోగ విషయము నాకు పూర్తిగా తెలియదు. యోగులు తమ ఆత్మబలం సృష్టించగలరని విన్నాను.ప్రతిభా రచన కూడా అటువంటిదే. కవులు తమ సహజ శక్తితో మనసును అరికట్టి ఆర్భ అచేతన స్థితిలో ఆత్మను ఆకర్షించి భావరసవర్ణ దృశ్య ధ్వని మొదలయిన కవితా సామాగ్రులను పోగుచేసుకుని వాటిని సృష్టి రచనలలో వినియోగిస్తారు" అని అన్నాడు.
మహాపురుషులు మహా కార్యాలు చేస్తారు. అవి కూడా వారి ప్రతిభాఫల స్వరూపాలే. ఈశ్వరీయ శక్తి ఆకర్షణ చేత సకల పదార్దాలూ తమ తమ స్థానాలలో సంబద్దమై వుంటాయటి. తమ తమ స్థానాలలో సంబంధమై వుంటాయి. కొద్ది దూరంలోనైనా వుండవు. వాటి ఫలితం సంపూర్ణ కార్యరూపంలో ప్రకటితమవుతుంది. ప్రకృతి యొక్క మనస్సనే ధూర్తబాలుడు తోసిరాజనిపించుకుని బయటపడదు. పైగా అతను కూడా వుంటూ తనకంటె అమోఘ ప్రతిభా మాయామంత్రం వల్ల సమ్మోహితుడయి కార్యసాధనకు దిగుతాడు. ఇదంతా చమత్కారం జరిగిపోతుంది ప్రతీతి. గరిబాల్డీ కూడా యీ విధంగానే నష్ట భ్రష్ట ఇటలీ దేశాన్ని నూతన విధానాలతో సంఘటిత పరిచాడు వాషింగ్టన్ కూడా యిలానే యెడారి లాంటి అమెరికాను ఆకర్షించి ఐక్యత నెలకొల్పి సామ్రాజ్య రూపం ప్రసాదించాడు. ఈ కార్యకలాపం ఒక్కొక్కటీ ప్రత్యేక యోగసాధన.
