ఆ కాలముననే అప్పటికి నాకు పదేండ్ల వయ సుండ నో, ఉండదో మాయుర శివరాత్ర్యుత్సవము గొప్పగా వాగును, మా చుట్టుపట్టుల యుళ్ళు కెల్ల మాయూర గోప్పశివ క్షేత్రము. అక్కడ నాగేశ్వరస్వామి యని శివలింగ మున్నది. అమరావతివలె నదియు బ్రాచీన శివ క్షేత్రము ఎంత ప్రాచీన మయినను నది బౌద్ధమత వినాశ చిహ్నముగా వెలసినదే యని నా నమ్మకము అక్కడ శివలింగ మొక బౌద్దస్తూపశిలయే యని యిటీవాలి నా నిశ్చయము. అక్కడి దేవాలయము అర్ధ ధర్మచక్రము గల బౌద్ద స్తూప శిలలున్నవి. కంటక సెల (గంటసాల) స్తూప విధ్వంస నానంతర మక్కడి స్తూప శిలలు చుట్టుపట్టుల దేవాలయ నిర్మాణముల గంటసాల స్తుపపు సూచిశిల యొకటి మంగి యువరాజు శాసనశిలగా మారినది. క్రీ. శ. 6,7 శ తాబ్దములకే బివ్ద్ధ స్తూపములు గొన్ని యైనను విద్వంసము చెందిన వనదగును. మా యూరి శివలింగంము జనమేజయ సర్పయాగస్దానమందు అనంత, వాసుకి, తక్షక కర్కోటక, మహానాగ కుమారుల చేత సుప్రతిష్ఠిత దివ్యలింగ మని పదు మూఁడువ శతాబ్ది నాఁ టి శాసన మున్నది.
ఒక శివరాత్రి నాఁ డు జగజ్జ్యోతి వెలిగించు వేళకుఁ జాల ముందుగానే నే నక్కడకు జీవితములో కొన్ని మణుగుల నేతి కుండులో గొప్ప జ్యోతి వెలిగించిరి. నేను తిరిగి వచ్చుటలో గోపుర ద్వారమున జనసమ్మర్దములో నలిగి పోయి క్రింది పడితిని. మా మిద నుండి యే జనము నన్ను చింపరిగుడ్డను దొర్లించుకొనుచు నడచినట్లు నడవజొచ్చిరి. చచ్చితి నను కొంటిని. ఊపిరాడదు ఎట్లో నన్ను కాళ్ళతోనే దొర్లించుచు గోపుర ద్వారము వెలికిపో పడదన్నిరి. బయటకు వచ్చిన తర్వాత నెమ్మదిగా ఒంటరిపట్టుకు దొరలి చాలాసేపు విశ్రాంతి గోన్నపై చక్క బడతిని. నాటినుండి గుళ్ళు గోపురములు జాతరలు నాకు దూరమయినవి.
మఱొకప్పుడు మా చుట్టుపట్టుల యూళ్ళు నెల్ల ఒకానొక యలజడి రేగినది.అది యిట్టిది- ఒక నాఁ డుదయమున నుండి సాయంకాలము దాఁక ఊరివా రెల్లరు ఊరి వెలుపల వసించి అక్కడ వంటలు చేసికొని దేవతలకు నై వేద్యము చేసి భుజింపవలయును. ఇంటి వాకిటితలుపుల మిద శ్రీ వైష్ణవ నామ మంటించవలెను. మెడలో సొరకాయ పెంచిక కట్టుకో వలెను. అట్లు చేయకున్నచో మహానర్దము వచ్చును. ప్రతి యింటి వాకిటి తలుపులమిద నామములు వెలయించిరి. ఎక్కడివో యెండు సొరకాయ బిళ్లలు (అమ్మిరిగాబోలును) వచ్చినవి. జందెములకు, మెడహరములకు.మొలత్రాళ్ళకు నందఱు వానిని కట్టుకొనిరి. ఊరి వెలుపల వంటలకు పాయన మగుచుండిరి. మా నాయనగా రిందుకు ప్రతికూలురు- ఊరి వెలుపల కందఱును వెళ్ళిన పిదప దొంగ లూరు దోచుకోగల రని. మునసబు కారణాలు దైవభీతితో నే జాగ్రత్త వహింతు మని మాట యిచ్చిరి. కొంద ఱెవ్వరైన నూరు విడువకున్నచో తర్వాత నేదేని యాదృచ్చిక ముగానే ఆయెను- గ్రామమున కీడు దాపరిల్లినచో దాని తాకిడి ఊరు వుడువని వారి మిఁ ద పడగలదు. కాన మాఱుమాటాక యూరు విడిచి వెళ్ళవలసి నదే యని యందఱు తీర్మానించూకొనిరి. మేము మాత్రము యింట పులిహొర చేసికొని యది మూట గట్టుకొని ఊరి వెలుపలకు వెళ్ళి అక్కడ దేవతకు దాని నివేదించి భుజించి యింత మజ్జిగ త్రాగి యింటికి రాదగు ననుకొంటిమి. నన్నందుకై కరివేపాకు తెచ్చి పెట్టు మనిరి. ఊరిలోని వారందఱు నాహరసామగ్రులతో నూరి వెలుపలకు దొడ్డిలో కరివేప చెట్టు గల బ్రాహ్మణుల యింటికి వెళ్ళి కరివేపాకు నడిగితిని. వారు నూరి వెలిపలికి పయనమగుచుండిరి.' కరివేపా కీయ వీలు లేదు. మేమువెళ్లుచింటి' మనిరి. నేను దొడ్డిలోనికి వెళ్ళి గోసికొని నంటిని.' తలుపులు తాళములు వేసినాము.వల్లగా'దనిరి-దొడ్డివైపున వెళ్ళి కోసి కొండు వల్ల గాదు పొమ్మని వారు వెళ్ళిపోయిరి. నేను దొడ్డివైపునకు వెళ్ళి చెట్టు కేసి చూచుచుంటిని. కొందఱు నన్ను జేర వచ్చిరి. కరివేపాకు కావలె నంటిని. ఎందుకు కనిరి? ఈ దేవతకు ద్వారమున కరివేపమండ కట్టవలె నట! అందుకు గావలెనంటిని. అంతే నాకొక మండ గోసి యిచ్చ్గిరి. తర్వాత ఒకరొక రే ఒక్కొక్క మండ చొప్పున విఱుచుకొనిపోయి ద్వారతోరణముల కెక్కించిరి. చెట్టున ఒక ఆ కేని మిగుల లేదు. మరునాఁడింటి వారు వచ్చి ఆ దుండగము నేను చేసిన దని గుర్తించి నన్ను దండించినంత నిందించిరి. నే నబద్ధ మాదినందుకు ఫల మనుభవించితిని.
