మా యింటి దగ్గఱ నే సాలెవీధిలో సాలెవారు వారి గురువగు భావనఋషికి ఉత్సవము జరుపుచుండరి. నా వయస్సప్పటికి ఎనిమిదో తొమ్మిదో ఉండును. సంజ వేళ 7,8 గంటలప్పుడు భోజనము చేసి అక్కడ రుగుచు యు న్నత్సవమును జూచుట కేగి యట్టట్టే నేను మైమఱచి నెల వ్రాలి పోయితిని. అక్కడి వారు మైమరు పాటు కలుగుచుండుట నా వల్ల విని ణ న్నిం టికి గొని వచ్చిరి కాబోలును! ఎంత సేపయినదో! మా తండ్రిగారు దగ్గఱ శివకవచము పారాయణ చేయుచుండగా మెలకువ వచ్చెను. నా కేమియు బాధ గోచరింప లేదు. అంతే అటుపై సాధారనముగా జాతర్లకు, దేవోత్సవములకు నే నంతగా వెళ్ళ నుత్సహింప కుండు టే జరుగుచు వచ్చినది. పై సందర్భమున నాకు మైమఱుపాటేల కలిగెనో అప్పు డెవ్వరికిని నెఱుక కందలేదు. పెక్కేండ్లకుఁ దర్వాత నాకే అది తెలియ వచ్చినది. అర్హ సందర్భమున దాని చెప్పుదును.
పదేండ్లవయసు రాక ముందే యిట్టిది మఱొక సంఘటన! మా యూర కలరా తీవ్రముగా వ్యాపించినది. ఊరిలో నీ దుర్వ్యాధి వ్యాప్తికి చింతించుచు గుమిగూడి సంభాషించు పలువురలో నేఁడుమాటాడిన వారే రేపు దాని వాతఁ బడుట, మరణించుట జరుగసాగెను. గ్రామస్థు లేన్నెన్నో తంటాలుపడిరి. గ్రామ దేవతలకు ఇతర దేవతలకు మ్రొక్కు కొనిరి. వ్యాధి కొన్నాళ్ళుకు తగ్గిపోయినది. తగ్గిన వెంటనే పెద్ద యెత్తున నాయా దేవతలకు జాతరలు సాగించిరి. ఆ దేవతల యాకృతులు, వారిని గూర్చిన పంబ వారికధలు, జంతుబలులు నాకు చాల రోతను భీతిని గోల్పసాగినవి. దేవత లిట్టివారా? ఈ అర్చన లేనిటి? అని నేను పలుక సాగగా చుట్టుప్రక్కల వారు దేవతలు నాపై కోపగింతు రని ఊరికి చెఱువు చేయుదు రని మాటాడకు మని నాపై కోపగింపసాగిరి. ఆ జాతర తుదినాడు కొర్లంక యను పేరి దేవత కొక బండి గట్టి దాని మిఁద గసిగాలలో పందిపిల్లల నైదింటిని గ్రుచ్చి అవి గిజగిజ కొట్టు కొనుచు మరణయాతన మనుభవించు చుండగా నూరేగించి యూరి బయట ఆయా దేవతల కంపకములు చేసిరి.
నాఁ టి దుర్దర్శనము నేఁటికి కనుల గట్టినట్లు గాన వచ్చుచున్నది. ఊరివారు జాతర సరిగా సాగె నని సంత సింపసాగిరి. గొప్ప సంక్షోభంముతో నేను దుఃఖింపసాగితిని. మరణమును గూర్చి, మరణానంతర స్టితినిగూర్చి, పుట్టుకను గూర్చి పుట్టుకకు పూర్వ స్థితిని గూర్చి, దేవతలను గూర్చి నిరంతరం చింత నాకు రేగెను. పెద్దల నడుగాజాల నైతిని. తోడి వయసువారికి నా గోడు తెలుపుట వ్యర్ధమయ్యెను. వీని యాధార్ధ్యము తెలియవలె నని రాత్రులందు భగవంతునికి మ్రొక్కి కనులు మూసికొని చుడసాగగా చిమచిమ చిమ్మ చీకటి నన్ను చుట్టుముట్టి మహాసముద్రమువలె గోచరింప సాగాను.దాని మధ్య భాగమున నే నున్నట్టు తెలియును. అనంతముగా నన్ను చుట్టుముట్టి యున్నట్టి యా యంద కారము పొడుగుగా నున్నదా, చతురస్రముగా నున్నదా అని కూడ జూడ దొడగితిని. అది యేదో గోళాకారముగా నున్నట్టు తోచును. దాని నడుమ నేను ఉన్నాను, ఉన్నా నన్న ప్రజ్ఞ మాత్రము మినుకు మినుకు మనుచు హజిబిజి పటుతో దోచుచుండెను. ఎన్ని రాత్రులో యిట్లు నిద్రపట్టు నంతదాక చూచుచునే యుంటిని. ఒకటే యంధకారము నే నున్నానన్న యేఱుక, మెలకువ మాత్రము ధైర్య చ్చాయను గొల్పసాగినది. అట్లు కనులు మూసికొని బైటను జుచుచున్నట్లు చూచుటే కాని యప్పుడు నా దేహములోనికి జుచుకోనుటకు యన్నది నే నెఱుగను? అట్లు చూడ లేదు.బైటి యంధకారగోళమున నుండి నా ప్రశ్నలకు సమాధానములు దొరకలేదు. నేను చచ్చిపోయితిని. తర్వాత! అనుకొనెడి వాడను. అప్పుడీ చీకటిలో నేను లేను అని తోచెడిది. బ్రతికి ఉన్నాను అను కొనెడివాడను. ధైర్యము తోచి మినుకు మినుకు మనుచు అనుమాత్రుడను ఉన్నాను- అని తోచెడిది. ఎంత తంటాలు పడినను ఇంతే ఒకనాడు నాలో చర్చ. ఎందుకు పుట్టితిని? చచ్చితిని గనుక ఎందుకు చచ్చితిని? పుట్టితిని గనుక చచ్చితిని సరే- మరల పుట్టుకుండరాదా? పుట్టితిని సరే-చావా కుండ రాదా? తోచదు ఇట్టు మనోమాధ నము జరగగా చివరికి తేల్చు కొన్నాను నా పుట్టుక నే నేఱుగును. అంతా చీకటే ఇప్పు డేదో నేను ఇట్టు మినుకు మినుకు మనుచున్నాను. ఇది ఆరిపోతే ఏ మవుతుందో తెలియలేదు. వెల్తు రెక్కడు న్నది? నే నున్నా నని మినుకు మినుకు మను అణుమా త్రపు వెల్తూ రే యున్నది, ఇది ప్రజ్వరిల్ల రాదా? ఈ చింత హెచ్చయినది.జాతరల మిఁద రోత మఱీ హెచ్చినది.
