Previous Page Next Page 
ప్రజ్ఞా ప్రభాకరము పేజి 18

    దైవముపేర సంఘమున అలజడి పుట్టించుట సుకరమనీ, అది దిద్దు టంత సుకరము గాదనీ. సంఘము విద్యా విజ్ఞానవంతమై మొత్తముమిఁద వర్దిల్లిననే గాని యిట్టి చేట్టలు దోలగింప సాధ్యముకాదనీ విన్నవించుటకే ఈ విషయముల నిక్కడ వ్రాసితిని. మతము, వైద్యము, జోస్యము, ధర్మము, ఆచారము ఇత్యాది సంప్రదాయ సంకేతములతో చెడుగు లేన్నెన్నో సంఘమున దిద్దఁ గుడురనివై మొద్దువారి కదల కున్నవి. వ్యాపించుచున్నవి. మూఢవిశ్వాసముతో వాని ననువర్తించులోక ముండ ట చేఁదత్ప్రు చారకులు వానిని స్వయము విశ్వసింపకపోయినాను వాని వలని లాభముచే లోకముచే పలుకుబడి సాగించుకొను చున్నారు.కొందఱు సగ మెఱుకతో నన్నింటిని బాటించు చున్నారు.

    ఇటీవల జరగినవిషయ మొకటి.          
               
    నామిత్రున కొకనికి ముక్కులో పెద్దకురుపు లేచినది. ఆతని కాయుర్వేద వైద్యమునఁ గొంత నమ్మకము. మిత్రుఁ డొక ఆంగ్లవైద్యుడు దానికి ఆపరేషన్ చేసి సులువుగా దొలగింతు ననుంచెడెను. వ్యాధితుఁ డు పిరికి వాఁ డు. కూరగాయ దేశీయవైద్య మెఱిగినమిత్రుఁ డొకఁ డు  నఖమును అనగా చేతిగోటిని నువ్వుల నూనెతో గాచి గోర్వెచ్చగా ముక్కలో రెండు బొట్లు వేసిన నది మాను ననెను. తోడనే ఆతని తల దన్నినమిత్రుడు ఇతరులగోటికంటే తనగోరు కత్తిరించి వేసికోనిననే మాఱీ మంచిదనెను. నాకు వెఱులు వేకులు నేత్తసాగినవి. ఇట్లంటిని.' అతఁ డాపన్నుఁ దు గానున్నాడు. ఆ శాస్త్రీయముగా నెఱుక లేని మొఱకు వైద్యములఁ జెప్పకుఁడు'.' నే నెందఱకో ఈ వైద్యముచే ముక్కులో కురుపులు మాన్పితిని. ఎఱుక  లేని వైద్యము కాదిది' యని తొలియాతఁ డనెను. రెండవ యాతఁ ' డిది య శాస్త్రీయము గాదు. కొన్ని వ్యాధులకు తన శరీరములోని రక్తమునే ఒక చోటనుండి మఱొక చోట ఇంజెక్షన్ చేసి వ్యాధుల కుదుర్చుటను ఆంగ్లేయులు గుర్తించి కాదా! ఇది ఎంతో పూర్వమే మన వారు కనిపెట్టి సాగించిన విధానము. నేను నాకే కురుపు లేవగా నా చేతిగోరే వేసి కాచిన నూనెతో కురుపు మాన్పికొంటిని' అని నన్ను మాటాడకుండఁ జేసెను. నాలో ఇంతంతనరాని యశాంతి. ఇది చేసిన రోగి చెడిపోక పోయినను గుణము కల్గక పోవచ్చునని యారాట పడ సాగితిని. మద్రాసులో ఉన్న నాళ్ళవి. ఓరియంటల్ లైబ్రరీకి వెళ్ళి 'నఖము'గునములకై వెదకితిని. అక్కడ ఆయు ర్వేద వైద్యశాలలో పని చేయుచున్న మిత్రున కిదిల్పితిని. 'నఖ' మనఁ గా చేతి గోరు కాదనీ, అది సుగంధద్రవ్యమనీ, నత్తగులల్ల వంటి జలజంతువుల గుల్లల మూతచిప్పయనీ  యాధార్ధ్యమును గుర్తించితిని.వెంటనే రోగిని దాని నేఱిఁగించి మంచి వైద్యము అయించుకోగోరితిని. తర్వాత ఆపరేషన్ జరగెను. ఆతఁడు స్వాస్ధ్యము చెందెను.

    అంతంరంగంమున విస్పష్టపరిజ్ఞానపుతీరు గోచరింపని వారు చేయు సాహసకార్యము లిట్టివి! ఎఱుక కందనియౌషధమును జాలినంత యెఱుక లేనివారు ప్రయోగించుట, ఏదో జరుగు చుండుటయుఁ గా వైద్య విధాన మున్నది. అంతరంగమునువ్రిల్చుకొని యంత రాత్మాభిముఖముగా బయనించుచు సత్యజ్ఞానానందముల నంతలతల ననుభవింప నలవడిణ వారి ప్రజ్ఞలే ప్రపంచోప కారకము లగుచుండును.

    ఇంచుమించు నాపదియేండ్ల ప్రాయముననే నాకడ గొట్టు సోదరికిఁ జాల జబ్బు చేసినది. జీవితము నిలువ దేమోయని యందఱు సందేహించు స్థితి కలిగెను. తర్వాత స్థితి యెట్లుండునో యని మాకు చల్దియన్నము వడివడిగాఁ బెట్టిరి. మాతో వావిడిచి చెప్పకున్నను ఇంటిలోని యలజడిని గుర్తించి నేను బెంగతో నెవ్వరికిని గాన రాకుండ గుడిలోని కరిగి యక్కడ నొకలలో రక్షించు మని యాబిడ్డను గూర్చి భగవంతుని గూర్చి యేమేమో ద్యానింపఁ జొచ్చితిని. ఇంటికి మధ్యాహ్నపుఁ దిండికి రాలేదు. ఇంటిలో అలజడి కొంత తగ్గినది. రెండు మూఁడు విరేచనములయి బిడ్డ తేటగా నున్నది. అపాయభాయము తొలఁ గినది. అందఱును భోజనము చేసి నేను గానరాక పోవుట గుర్తించి వెదక సాగిరి. మిత్రులిండ్లలో నేక్కడను నేను గానరాలేదు. ప్రొద్దు గ్రుంకు వేళ కావచ్చినది. మా నాయన గారికి వెఱపు కల్గినది. వెదకఁ గా వెదకఁ గా తుదికి గుడిలో నక్కియున్ననన్ను గనుగొని బిడ్డ క్షేమ మెఱిఁగించి చాల దుఃఖించినన్నింటికిఁ గొని వచ్చిరి. పసితనము నాఁ టినుండియు వ్యాధికి మృతికి నేను తార్మారయి పోయెడి వాఁడను ఏమియు తోచక చేయఁ గల్గినది లేక ఇంత నిలువలేక ఎవ్వరును గుర్తింపఁ జాల రని గుడిలో నొక మూల నక్కి నాఁ డు నేను దైవప్రార్ధనము చేసితినే కాని దానికి ఫలితముండు అని యానాఁ డు నే నేఱుఁగను.

    మా నాయనగారు వైద్యవృత్తిలో రోగులకడ కటువుగా సొమ్ము పుచ్చుకొనుచుండిరి. ఒక సందర్బమున వ్యాధితిని యార్తికిఁజకితుఁ డ నయిన నేను మా నయనగారిని సొమ్ముకి నిర్బందింపక మం దీయఁ గోరితిని.' ముందు వ్యాధి కుదుర్చుఁడు. వాని చేత సోమ్మిపుడు లేదు. నెమ్మదిగా ఇయ్యఁ గలఁ డు. ఇయ్యాక పోయినఁ బోనిండు. మికు పుణ్యము దక్కు' నంటిని. రెండు నిమిషము లాలోచిం చి ' నాయనా! ఈ కాఠిన్యము మిమిఁ ది ప్రేమ చేతనే నేను పూనావలసెను. నే నిట్టి కాఠిన్యము పూనకున్న సొమ్ము రాదు. అది యార్జించినఁ గాని మిషోషణము సాగదు. మిమిఁ దిప్రేమ నన్నితరుల మిఁద నింత కఠినునిఁ గావించినది' అనిరి. అనుల నీరు గ్రుక్కుకొని యూర కుంటిని. ఆ సంభాషణము నాలో మఱుపురాక కుదుర్కొని నాఁ టినుండి నన్ను వేధింపజోచ్చినది. దానినిర్వాహము ముందు తెలియఁ గలదు.                      


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS