Previous Page Next Page 
ఆరాధన పేజి 17

                                        

    "హల్లో" అంటూ ఖాన్ వచ్చాడు. తలత్రిప్పి చూచాడు, ఖాన్ తో మరొక స్త్రీ వుంది సాయంత్రపు సమయం-సంధ్య చీకట్లలో ఆమె స్పష్టంగా వ్యక్తం కాలేదు.
    లేచి నుంచుని రండి-రండి" అంటూ ఆహ్వానించాడు.
    లోపలికివెళ్ళి వరండాలో లైటు వేశాడు.
    "మా అమ్మ.... కుమార్ ను చూడకపోయినా నీకు తెలుసుకదా-మంజుల ఏది?"
    ఆమె కుమార్ నమస్కారాన్ని అందుకుంటూ "సలాం" అన్నది.
    దాదాపు యాభై సంవత్సరాలుంటా యామెకు. మంచి పొడగరి -బంగారు చ్చాయతో. తిన్నని పొడవైన ముక్కుతో, తీర్చిదిద్దిన కనుబొమ్మలతో, నిండైన కళగల ఆ ముఖం సర్వలక్షణ లక్షియై భాసిస్తోందామె. కుమార్ పూజ్య భావంలో అమ్మ" అని గొణుక్కున్నాడు.
    ఖాన్ కంఠస్వరం విన్న మంజు ఇవతలి కొచ్చింది. ఆమెనుచూచి క్షణం స్తబ్ధయై నుంచుండి పోయింది. ఎర్రటి సరి గంచు నేత చీర కట్టుకుంది. రెండుపేటల నల్లపూసలు మెడకు బిగువుగా కట్టబడి ఉన్నాయి చేతులకు బంగారు గాజులు, ఎరుపుగాజులు ఎక్కువగా నే ఉన్నాయి. విశాలమైన ఫాలభాగం ఖాళీగా వుంది. మంజు ఊహించింది.
    "మా అమ్మ.....చూసుంటే కిరీటం లేని రాణీలా లేడూ?....మీకు తెలీదు. అర్కాట్ నవాబు చుట్టం మా అమ్మ. ప్రతినెల ఇరవై రూపాయలు ప్రీవీవర్స్ నాకుగాని ఓ చెల్లి వుంటే సగం-అంటే పది రూపాయిలొస్తాయి."
    ఆమె నవ్వింది. మావాడు ఒట్టి మాటకారి."
    అందరూ లోపలికెల్లి కూచున్నారు.
    "మీరొచ్చినట్లు మాట మాత్రం చెప్పలేదు"
    ఆమె అచ్చమైన తెలుగులో స్పష్టంగా మాట్లాడింది. "నాకె తెలీదు ఏదో చూడాలనుకుని వచ్చేశాను. ఎప్పుడూ మిమ్మల్ని గూర్చి చెబుతుంటాడు అమ్మాయి ఎవరు?"
    "మా చెల్లెలు"
    'అదృష్టవంతులు. ఒకే ఊళ్ళో వుంటారు."
    "అన్నట్లు మా అన్నయ్యకు బాగా బుద్ధి జెప్పారట లెండి. ఆ పిల్లను తీసుకెళ్ళి ఎవళ్ళకో కట్టబెట్టేశారుట. సమస్య పరిష్కారమైంది మా అన్నయ్య బుద్దిగా పొలం పనులు చూచుకుంటున్నాడట. మా అమ్మ, నాన్నల్ని ఎంత బాధ పెట్టాడో! ఏమ్మా."
    "ఇంకా అడుగుతావా? ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళు కరువయ్యా యనుకోండి రోజూ వాళ్ళ నాన్న గారితో వాదనే-పాపం వారికి ఆ నెలరోజులు నిద్రలేకపోవడం మూలాన చాలా సుస్తీ చేసింది. అనారోగ్యంగా ఉన్నట్లు రాయలేదనుకోండి. అల్లా మమ్మల్ని-కోడల్ని కరుణించాడు."
    "కానీ ఇక్కడ చాలా బాధపడ్డాడు" కుమార్ సానుభూతితో అన్నాడు. మంజు మాట మారే సింది. "ఖాన్ గారి పెళ్ళెప్పుడు? నెలలు గడుస్తున్నాయి గానీ మాకే వార్త అందటం లేదమ్మా."
    "మా బావగారు పట్టినపట్లు విడువరు, ఆ అమ్మాయి మాకెంతో నచ్చింది. ఏడికీ ఇష్టమే - అదే ఇల్లరికంలా అక్కడ వుండటం ఇష్టం లేదు. వీడు సంపాదించినా అతని ఆసుపత్రిలో తను పనిచేయాలని బొత్తిగా ఇష్టంలేదు. ఆ అమ్మాయి రఫీకాకు, మా అక్కయ్యకు ఎంతో ఆశగా వుంది. ముందు పెళ్ళి జసెసిస్త ఆ  తర్వాత...."
    "అదే - ఆ తర్వాత నెమ్మదిగా నాకు గాలం నేసి లాక్కెళ్తారు ముందే కచ్చితంగా చెప్పేసెయ్యాలి వాళ్ళకంత ఇష్టంగా వుంటే మీ బావ మనసు మార్చమను-లేదా"
    "లేదా ఇంకొకర్ని పెళ్ళి చేసికొంటావు-అంతేగా. ఆ పిల్ల నీకోసం ఇంతకాలం వేచి వుంటే..." ఆమె మౌనం దాల్చింది. ఖాన్ ఓరగా కుమారీ వైపుచూసి సైగచేశాడు ఇద్దరూ లేచివెళ్ళి పోయారు. వెళ్తూ. వెళ్తూ మంజుకు సైగ చేసి వెళ్ళారు.
    "ఎండాకాలం వుంటారు మీరు"
    "వారం అనుకున్నాను గాని - ఇంకొన్నాళ్ళ ఉండమంటున్నాడు- అబ్బాయి.... .....ఎన్నో నెలమ్మా"
    మంజు సిగ్గుపద్తూ తలదించుకుని అంది. "ఈ వారం పోయా! పురుడు రావచ్చు"
    "మొదటి కాన్పు కదూ భయంగా ఉండొచ్చు. ఐనా రోజూచేసే కాన్పులే- చూచి చూచి అలవాటై వుంటుంది మీకు.... కానీ...."ఆమె పూర్తి చేయకుండా అర్ధవంతంగా చూస్తూ ఆపుజేసింది....ఔను.....ఎంతచూచినా-ఎన్ని కాన్పులు చేసినా తనుదాకావస్తేగాని ఏ బాధగాని అర్ధం కాదు. ఆమె లేచింది" వస్తానమ్మా. అలా రోజూ వస్తుందండీ. ఈ వారంరోజులు నాకేం తోచదు కూడాను. నా దగ్గరకొస్తే పెళ్ళి మాటెత్తుతానని తప్పుకు తిరుగుతున్నాడు....వెళ్తానని గట్టిగా అంటే దిగులుపడ్తాడు. ఏం చెయ్యాలో తోచటం లేదు.
    అందరూ బైటికొచ్చారు ఆడవాళ్ళు రావటం చూచి మగవాళ్ళిద్దరూ తోటలోంచి ఇవతలి కొచ్చారు.
    "ఆమె వెళ్తూ వెళ్తూ కుమార్ ను ఉద్దేశించి అంది" మీరైనా చెప్పండి బాబూ ఈ పెళ్ళి జరిగితే పెద్దలందరికీ చాలా సంతోషం'.    
    "అంటే నీకు సంతోషం ఉండదన్న మాటేగా!    
    ఆమె నిండుగా నవ్వింది "ఓహో - రఫీకా అంటే ప్రాణాలు విడుస్తావు-అందుకేగా మొన్న వెళ్ళి చూచివచ్చావు నీకు సంతోషంగా ఉంటుందో లేదో!-నాకు మాత్రం తెలీదు మా అందరికి మాత్రం ఇదెంతో నచ్చిన సంబంధం...అనకూడదుగానీ -పెళ్ళయ్యాక నా యిష్టం ఎదురు తిరిగితే మా బావమాత్రం ఏం చేస్తారు?
    ఖాన్ దిగ్భ్రమతో తల్లివేపు తేరిచూచారు. ఆమె ఏదీ జరుగనట్లే మామూలుగా ఏదో మాట్లాడుతూ నడుస్తోంది.
    స్నేహితుడివైపుతిరిగి రహస్యంగా అన్నాడు. "విన్నావా-మీ అమ్మ సలహా....కానీ నాకుమాత్రం ఏముంది తేల్చుకోవాలనుంది"    
    "నీ సంగతేనా ఎప్పుడు- అటు ఆ అమ్మాయి విషయమే ఆలోచించను మర్చిపోవటమా 'ఖాన్ ఉద్రేకంతో నెమ్మదిగా అన్నాడు ఆమాటలు ఆమెను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నదీ తెల్పాయి.
    "ఐతే ఇక ఆలస్యందేనికి ఖాన్?...
    "చెబుతా విను....ఇలా జాగుచేస్తేనే ఒకరి కొకరం సన్నిహితుల మౌతాము. దగ్గరకు రావాలని ప్రయత్నిస్తాము ప్రేమ అధికమౌతుంది. ఎడబాటు సహింపరాని దౌతుంది. ఇలాంటి సందర్భంలో మా పెదనాన్న లొంగిపోవచ్చు అతను పాతకాలం మనిషి. అతనికి మనఃక్లేశం కల్గించటం నాకు బొత్తిగా ఇష్టంలేదు అందుకే అంతా ధఫీకాకు వదలివేశాను."
    గేటు వరకు సాగనంపి ఇంట్లోకి రాగానే భాస్కర్ రిక్షాలో వచ్చాడు ఎంతో అవసరంగా లోపలికొస్తూ అన్నాడు కళ్యాణీ చప్పున బయలుదేరాలి మా అమ్మమ్మ గారు పోయినట్లు వైర్ వచ్చింది. అమ్మ రాత్రిబండి కెళ్తోంది'
    అయ్యో- అనుకున్నారు. కళ్యాణిని రిక్షా ఎక్కించి మంజు ఇంట్లోకి వస్తోంది ఎందుకో ఆమె కెక్కడలేని భయం పుట్టుకొచ్చింది. ఇంత కాలం కల్యాణి తన దగ్గర ఉంటుందని ఆశపడింది గానీ ఆమెవచ్చి తనను కనిపెట్టుకుని ఉందే పరిస్థితిలో లేదు- మూర్తి తల్లిగారు ఎన్నోమార్లు చెప్పారు పురిటి సమయంలో తప్పక పిలవమని ఆమెను నమ్ముకుని ధైర్యంతో ఉంది. కానీ.... ఆమె వెళ్తోంది తను ఒంటరిదైంది. ఆ క్షణంలో ఆమెకు బాహ్య ప్రపంచం గోచరంకాలేదు. ఏదో ఒంటరి తనం నిర్లిప్తత ఆవరించినై.
    అడుగులో అడుగు లేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్న మంజు నడుం చుట్టూ చేయివేసి- మృదువుగా-లాలనగా అన్నాడు కుమార్ ఆమె వెళ్తున్నారని విచారంగా వుందికదూ - నేను నీదగ్గర ఉంటాను మంజూ-ధైర్యంగా పుండు నువ్విలా బీరువు అయితే నాకుకూడా అధైర్యం కల్గుతుంది సుమా."
    మంజు మాట్లాడలేదు. భర్త పక్షంలో తల దాచుకుని శాంతించింది.
    వారంరోజులు ఇట్టే గడిచిపోయాయి.
    తెల్లవారుఝాము రెండు దాటింది. మంజు లకు గభాలున మెలకువ వచ్చింది. నడుము నొప్పి - ఏదో అశాంతి - ఉండి - ఉండి సన్నని బాధ. కుమార్ ను లేపి చెప్పింది.
    కుమార్ కు నిద్రమత్తు ఒదిలిపోయింది. చటుక్కున లేచి కూర్చున్నాడు. "డాక్టర్ అన్నపూర్ణకు ఫోన్ చేస్తాను మంజూ హెడ్ నర్సుకు- డ్యూటీ నర్స్ కు కబురు చేయాలి.....గది-అంతా తయారు జేస్తారు. నువ్వు అలా పడుకుని ఉండు.
    ఫోన్ అందుకుని డాక్టర్ అన్నపూర్ణకు ఫోన్ చేశాడు".... ఇప్పుడే లేపింది డాక్టర్. ఉండి - ఉండి సన్నటి నొప్పి అట.... ఇంకో గంటతాళి హాస్పిటల్ కు చేర్చమంటారా? నడవలేకపోతే కష్టం కదా! ఇప్పుడే తీసికొని వెళ్తాను, మీ తీరికగా రావచ్చు.... నేను ఫోన్ చేస్తూనే ఉంటాను.....ఫోన్ పెట్టి మంజు దగ్గర కొచ్చాడు మంజు కళ్ళు తెరుచుకునే వుంది. మృదువుగా ఆమె రెప్పల్ని చుంబించాడు ఆమె అనిర్వచనీయమైన ఆనందంతో క్షణం కళ్ళు మూసుకుంది. పెదిమలు చిరునవ్వుతో వంపు తిరిగినై.
    "మంజూ- ఎలా వుంది"
    "ఇంకా ఏమీ తెలియటంలేదు. నొప్పి ఎక్కువగా లేదు"
    స్టెతస్కోప్ తెచ్చి చీరమీదగా బిడ్డ గుండెను పరీక్షగా విన్నాడు. టకటక మంచూ గబగబ కొట్టుకుంటోంది. ఆ శబ్దాన్ని విని కుమార్ హృదయం ఆనందంతో పరవళ్ళు త్రొక్కింది. "నువ్వు విను" మంజు చెవుల్లా పెట్టాడు. ఆమె కళ్ళు మూసుకునే విన్నది ఆ శబ్దం ఆమె చెక్కిళ్ళలో కెంపులను పొదివింది.
    "వేడినీళ్ళు పెడ్తాము. కాఫీ త్రాగుతావా?"
    మంజు అన్నింటికి ఊ కొట్టింది.
    స్నానం చేసింది. కాఫీ త్రాగారిద్దరూ నొప్పుల ఎడం తగ్గుతోంది. వాచ్ మెన్ ను కేకేసి డ్యూటీ నర్సుకు కబురు చేశాడు.
    మంజు కావలసిన వన్నీ సూట్ కేసులో సర్దింది, మధ్యమధ్యలో ఆగి "ష్" అంటూ నిట్టూరుస్తోంది. అంతా సిద్ధంగా ఉంది, భర్త ముఖంలోకి చూడకుండానే వెళ్దామా?" అంది.
    కుమార్ ఆమెకు దగ్గరగా వెళ్ళాడు క్షణం ఇద్దరు తటపటాయించారు గానీ మరుక్షణంలో ఆమె అతని బాహుబంధంలో ఇమిడిపోయింది.
    మంజుకు కన్నీ రాగలేదు.
    "మంజూ ఏడుస్తున్నావా? ఎందుకూ..."
    "నాకెందుకో భయంగా వుంది. స్త్రీలకు ఇది సాధారణ విషయమైనా ప్రతివారికీ ఈ భయం ఉండనే వుంటుంది....ఏమౌతుంది మందలింపుగా అన్నాడు ఏమీ కాదు. తెల్లారే లోపల చిన్నారి తల్లిని చూస్తూ నన్ను మర్చిపోకపోతే-ఎంత పందెం!'
    ఆమె గులాబి మొగ్గలా ముడుచుకుపోయి - "తల్లి కాదు-బాబు కావాలి వాడిని చూస్తూ నన్ను మర్చిపోకపోతే....ఎంత పందెం!
    ఎదురు ప్రశ్న వేసిందామె.
    జవాబుగా ఆమె పంవర్తికల్లాంటి కపోలా లను మృదువుగా నిమిరి లీలగా కంపిస్తున్న పెదిమలపై గాఢంగా చుంబించాడు. గేటు చప్పుడైంది.
    మంజు హాస్పిటల్ చేరిన అరగంట కంతా నొప్పులు ప్రారంభమయ్యాయి. కాన్పులగది బయట పచార్లు చేస్తున్న కుమార్ ను - అప్పుడే వస్తున్న డాక్టర్ అన్నపూర్ణ చూచింది ఆమెకు ఎందుకో నవ్వు వచ్చింది. కుమార్ దగ్గరకు రాగానే అంది ఐతే డాక్టర్ - మీ వంతు వచ్చిందన్న మాట. ఇలా ఎంతమంది పచార్లు చేశారోగాని నేలంతా పాలిష్ కొట్టినట్లు నున్నగా మెరుస్తోంది..." ఆమె మందహాసం చేసింది.
    కుమార్ కూడా నవ్వేశాడుగాని, అతని ముఖం లోని ఆందోళనను మాత్రం దాచుకోలేక పోయాడు. డాక్టర్ అన్నపూర్ణ వదనం గంభీరమైంది.
    ధైర్యం చెబుతున్నట్లుగా అంది "మరేం ఫరవాలేదు నిన్ననే పరీక్ష చేశాను బిడ్డ పరిగానే వుంది."
    "అప్పుడే ఎందుకొచ్చారు? ఇంకా దారి పెద్దది కాలేదుట."
    డాక్టర్ అన్నపూర్ణ ఆశ్చర్యంతో చూచింది. "డాక్టర్ - మంజుల నాకు పరాయిదా? అది మొదలు అంతం వరకు నేనే అంతా జరిగించి సమీపంలో వుంటేగాని నాకు తృప్తి వుండదు నాకూ ఆందోళనగానే వుంది..."
    ఆమె లోపలికి వెళ్ళింది. మంజు పడే బాధ అతనికి స్పష్టంగా వినవస్తోంది. ఒక నర్సు బైటికొచ్చింది. మంజు చిన్నగా అరచింది.
    కుమార్ ఇక తాళలేక పోయాడు. ఒక్క దూరున తలుపు తోసుకుని లోపలికెళ్ళాడు. డాక్టర్ అన్నపూర్ణ మంజు కాళ్ళమీద గుడ్డ సర్ధింది. కుమారి మంజు చేతిని గట్టిగా పట్టు కున్నాడు. ఆమె ముఖంలో నూత్న తేజస్సు క్షణంపాటు సర్దింది. కుమార్ మంజు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ముఖంలో నూత్న తేజస్సు క్షణంపాటు మెరసింది. వెంటనే బాధగా కనుబొమలు ముడివడినై. పాలిపోయి కంపిస్తున్న పెదాలు ఎడమై సన్నని సుదీర్ఘమైన మూల్గు వినవచ్చింది. కుమార్ డాక్టర్ వైపు చూచాడు. ఆమె చేతి తొడుగులు గ్లౌస్ ను సరిచేసుకుంటూ క్రిమి సంహార లోషన్ ను రాసుకుంటూ "అంతా సరిగా ఉంది" అన్నలా తల ఆడించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS