అసలు విషయం ముందే చెప్పాను. దానిని యిపుడు తిరిగి చెప్పడం అనవసరం. తినడానికి, కట్టడానికి, స్వతంత్రంగా జీవించడానికి జీవనధారణ చేయడానికి అవసరమయినంతగా మనస్సు అధిక పరిమాణం పొందింది. ఇందువల్ల ప్రయోజనకరమైన సమస్త కార్యకలాపం పూర్తి చేయాలని చూచినా నా నలువేపులా అధికంగా మనసు మిగిలి పోతూనే వుంది. దీని ఫలితంగా సోమరిగా తయారై అదే పనిగా కూచుని డైరీ రాస్తుంది, తర్కిస్తుంది! పత్రికలకు లేఖలు పంపుతుంది. సులభతను కఠినం చేస్తుంది! సరళతను జటిలం చేస్తుంది ఒకదానినొకటిగా భావించి ఎన్నటికీ అర్దంకాని అసంబద్ద విషయాలను పట్టుకు కూర్చుంటుంది. చిక్కు ప్రశ్నల వెనకబడి ప్రాపంచిక కార్యకలాపాలన్నిటినీ విడిచిపెడుతుంది. హద్దు పద్దూ లేకుండా అనర్దక కార్యాలను చేయనారంభిస్తుంది.
కాని మా శ్యామనారాయణసింగు మనసు అతని శరీరంలాగానే గట్టిది. ప్రయోజనంతోపాటు అతని మనసు శరీరానికి పూర్తిగా సరిపోతుంది. అతని మనసు అతనిని చలీ మంచుల నుంచి, యెండ వేడిమిల నుంచి, రోగశోకాలనుంచి, అసుఖాలనుంచి రక్షిస్తుంది. కాని పెద్ద యెత్తున మహా వాయువు వీచి సర్వవేళలా యెగిరిపడదు. ఒకటీ అర గుండీలను ఛేదించుకుని చాటు చాటుగా ఆ మహావాయువు అతనిలో ప్రవేశించి అతని మనసును కలతపెట్టవద్దని చెప్పలేను. మనసుకు యింత స్పందన, ఇంత చపలత జీవితారోగ్యానికి అత్యంతావసరం.
అఖండత
ప్రకాశవతి, "నిజం చెప్పాలంటే నేడు మీరు ప్రకృతిని స్తుతిస్తూ అన్యాయం చేస్తున్నారు" అని అన్నది.
"దేవీ! ఇతరులను స్తుతించడం నీకు రుచించడం లేదా" అని అన్నాను నేను.
"స్తుతించడం తప్ప మరేమీ దొరకనపుడు దాన్ని దుర్వినియోగం చేయడం నేను చూడలేను" అని అన్నది ప్రకాశవతి.
పవన్ దేవ్ ఎగతాళిగా "భగవతీ! ప్రకృతిని స్తుతించడానికి, మిమ్మల్ని స్తుతించడానికి ఎక్కువ భేధంలేదు. ప్రకృతి స్తవగీతాలు రచించిన వారిలో యెక్కువమంది నీ ఉపాసకులే. బహుశా నీవు పొరబడి వుంటావు" అని అన్నాడు.
ప్రకాశవతి అహంకారంతో "అంటే జడోపాసకులు నా భక్తులా?" అని అడిగింది. దానిమీద పవన్ దేవ్, "నా మాటలను తలకిందులు అర్దం చేస్తున్నావు. ఇందువల్లనే నేను నిర్ణయం తీసుకోవలసి వుంది. మన భూతసభ ప్రస్తుతాధ్యక్షుడు శ్రీ భూతనాధబాబు తన డైరీలో మనసు అనే వుద్దండ స్వభావ జీవి విషయం రాశాడు. దానిని మీరు. చదివే వుంటారు. నేను దానికి సరిగ్గా కిందనే కొన్ని మాటలు రాశాను మీరు అనుమతిస్తే చదివి వినిపిస్తాను." అని అన్నాడు.
పృద్వీరాజ్ రెండు చేతులు జోడించి, "చూడు భాయీ పవన్! రచయితకూ, పాఠకులకూ మధ్య సంబంధమే మీ సహజమయిన సంబంధము. మీరు మనసు పెట్టి రాస్తే మేము మనసు పెట్టి చదువుతాం. మరేం గొడవా వుండదు. ఒరకు, కత్తికీ వున్న సంబంధమే మీకూ మాకూ వున్న, సంబంధం. ఇంకో మాటలో చెప్పాలంటే మనిద్దరికీ అట్టి అబిప్రాయం కలిసింది. కాని కత్తిని యింకొక వస్తువులో వుంచలేము. అలాగే గంభీర సంబంధం స్థాపించడానికి యత్నిస్తే ఆ సంబంధం స్వాబావికం కాదు. రచయిత శ్రోతల సంబంధం కూడా యిలాంటిదే. అస్వభావిక రచనను సృష్టించేవారికి నా ప్రార్దనలు నా పాపాలకు శిక్ష వేయదలిస్తే జన్మ జన్మాంతరాలలో కూడా నన్ను డాక్టరుకు గుర్రంగా, తాగుబోతుకు, భార్యగా ప్రబంధ రచయితకు బంధువుగా నన్ను పుట్టించవద్దు."
గగన్ దేవ్ నవ్వుతూ, "బంధా శబ్దానికి బంధం అనే అర్దం కూడా వుంది. దానిమీద ప్రబంధ బంధానానికి తాడు యిస్తే ఒకే సున్నిత పరిస్థితి ఏర్పడుతుంది" అని అన్నాడు.
ప్రకాశవతి, "ఎంత గంభీర పరిహాసం! దీనిని అర్దం చేసుకోవడానికి యోగ్యత కావాలి తమరు దయయుంచి యీ పరిహాసం అర్దం చేసుకోవడానికి రెండు సంవత్సరాలు వ్యవధి యివ్వండి.అలా యిస్తే దానిని అర్దం చేసుకునే యోగ్యత లభిస్తుంది" అని అన్నది.
ఈ మాటలు విని గగన్ దేవ్ కిల కిలా నవ్వి, "బలే గొప్పగా చెప్పావు! ఇప్పుడు నాకు ఒక కథ జ్ఞాపకం వస్తోంది" అని అన్నాడు.
"గగన్ దేవ్ రచన మీరు విననివ్వరా యేం? పవన్! నువ్వు చదువు. వీరి మాటలు పాటించవద్దు" అని అన్నది నిర్ఘరిణి.
నిర్ఘరిణి మాటలకు ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. అప్పటి వరకు పృద్వీరాజ్ గూటిలో నుండి డైరీ తీసుకువచ్చి ప్రశాంతంగా వినసాగాడు.
పవన్ దేవ్ యిలా చదవనారంభించాడు; "మనుష్యుడు వివశుడయి అడుగడుగుకూ మనసు సహాయం తీసుకుంటాడు. ఇందువల్ల హృదయంలో కేవలం దానినే చూడగలుగుతాడు. మనసు మనకు ఎంతో మేలు చేస్తుంది. కాని అది మనతో యెపుడూ బాగా కలసిమెలసి వుండలేదు. దాని స్వభావమే అంత. ఎల్లప్పుడూ విసిగిస్తూ వుంటుంది. మంచి సలహాలిస్తుంది. ఉపదేశిస్తుంది. అన్ని పనులలోనూ వ్రేలు పెడుతుంది. అది పరాయి మనిషి యిల్లు బంధించి ఇంటి మనిషిగా తయారయితే అతడిని పరిత్యజించడం, ప్రేమించడం కూడా కష్టమే. మనసు విషయం కూడా అంతే.
"భారతదేశంలో అంగ్లేయ ప్రభుత్వంలాగా వుంటుందని ప్రతీతి. మనది దేశీయ భావం. ఇంగ్లీషు వారిది జటిల విదేశీ శాసనం. వారు ఉపకారం చేస్తారు. కాని మనలను ఆత్మీయులుగా భావించరు. వారు మనలను అర్దం చేసుకోలేరు. మనం వారిని అర్దం చేసుకోలేం. మనలోని స్వభావిక శకులు కూడా వారి శిక్షణలో నాశనమయిపోయాయి. ఈ కాలంలో వారి సహాయం లేనిదే పనులు సాగవు. జీవితంలో అడుగడుగుకూ సహాయం కోసం వారి ముఖం కేసి చూస్తున్నాం."
"ఇంగ్లీషువారికి , మన మనసుకు కొన్ని విషయాలలో శృతి కలుస్తుంది. ఇన్ని రోజులుగా వారు మన మనసుమీద అధికారం చెలాయిస్తున్నారు. కాని వారు ఇక్కడి వారు కాలేదు ఎపుడూ అశాంతిని రేకెత్తిస్తూ వుంటారు. సమయం వస్తే సప్త సముద్రాలు దాటి పరుగెత్తుతారు. వారి ముందు జోహుకుం అంటున్న కొలదీ వారి ప్రతాపం ఎక్కువవుతూంటుంది. కాని కళ్లు ఉరిమి కఠినంగా వ్యవహరించడానికి తయారయి, కీస్తు బోధనలను తోసిపుచ్చి చెంపదెబ్బకు బదులు చెంపదెబ్బ ముట్టబ్రితే నీరుకారిపోతారు.
"మనసు మీద మన విద్వేషం యెంతంటే, ఏ విషయంలో అది తక్కువ జోక్యం చేసుకుంటుందో దానినే మనం యెక్కువ ఆదరిస్తాం. నీతిశాస్త్రాలు మొండిపట్టును నిందించాయి. కాని నిజానికి దానిమీద మనకు అనురాగం వుంది. బాగా ఆలోచించి తెలుసుకుని పనిచేసే మనుష్యుని మనం ప్రేమించం. అయితే నిశ్చింతగా వుండేవారిని, హద్దుపద్దూ లేకుండా మాట్లాడేవారిని, కళ్లుమూసుకుని, పాపకృత్యాలు చేసే వారిని అందరూ ప్రేమిస్తారు. భవితవ్యమును దృష్టిలో పెట్టుకుని సావధానంగా ధనం సేకరించే వారిని అవసరమయినపుడు వారి దగ్గరకు వెళ్లినా లోలోపల నిందిస్తూనే వుంటారు. తన పరివార భవిష్యత్తును ఆలోచించకుండా వారి మేలు ఆలోచించకుండా కళ్లు మూసుకుని ఖర్చుచేసే వారిని జనులు పిలిచి మరీ అప్పులిస్తుంటారు. చాలాకాలం గడిచిన తరువాత తిరిగి పొందే ఆశను వదులుకుంటారు. సామాన్యంగా విచార హీనతను ఉదారత అంటాం. ధృడ సంకల్పంతో పాటు యుక్తి దీపం పట్టుకుని వంకర టింకర మార్గం వదిలిపెట్టి నియమ మార్గాన నడిచేవానిని ప్రపంచం లోభి యిత్యాది పేర్లతో పిలుస్తుంది.
"ఏ వస్తువును చూచినంతనే మనం మన మనసును, అస్తిత్వాన్ని మరిచిపోతామో దానినే చిత్రాకర్షణ, మనోహరం అంటాం. మనోభావాన్ని ఏ స్థితిలో అనుభవిస్తామో దానిని ఆనందం అని పిలుస్తాం. నిషా తెచ్చుకుని పశువులాగా తయారయి మన కాళ్లూ, చేతులు మనమే గొడ్డలితో నరుక్కోవడం అంగీకరిస్తాం. ఆనందం పొందుతాం. ఒక్క క్షణం మనో ప్రభుత్వం నుంచి బయటపడి పారిపోవటానికి ఏ పనైనా చేయడానికి సిద్దమవుతాం. మనసు నిజానికి మన మనస్సే కాని అది ఆత్మీయ భావంలో వ్యవహరించే ఉపకారం చేసిన వారికి మనం ఎందుకు కృతఘ్నత చూపుతాం! దాని అస్థిత్వం నాశనం చేసుకోవడానికి నడుం యెందుకు బిగిస్తాం?'
