Previous Page Next Page 
మమత పేజి 17

లీల ఆనాడు తులసమ్మతో చెప్పింది- "ఇంక నేను ఏడవను, నవ్వుతూనే వుంటాను" అని! అదే పద్దతి జేవేఇతానికి అన్వయించుకుంది లీల. ఆమె అంతరంగానికి తెలుసు సుధాకర్ తనని తీసికెళ్ళడని, ఆ తల్లి యింటి నుంచి ఒక్క రూపాయి రాదని, చంద్రయ్య తనకేమీ సహాయం చేయడని! ఇవన్నీ మనసులో నాటుకుపోవడంతో భర్త, సేన- రెండే తన జీవిత లక్ష్యాలని లీల పూర్తిగా మనసును తిప్పుకుంది.
మనిషి బతికున్నంతకాలం తిండి తినాలి. ఆ తిండి తను సంపాదించుకోగలదు. ఆశ్రమ సేవాధర్మమే తనని బతికిస్తుంది. లీల మానసికంగా ఎదిగిపోయింది- ఇంక, ఇప్పుడు లీలని ఎవరూ ఏమీ చేయలేరు.
తులసమ్మ లీలవైపు చూస్తోంది. "ఏమిటీ.... ఆలోచిస్తున్నావ్?" అంది ప్రేమగా.
లీల నవ్వేసి- "ఏముంది పిన్నీ, ఈ భగవంతుని సృష్టి విచిత్రాన్ని తిలకిస్తున్నాను పిన్నీ! మనం అనుకునేదానికీ, జరిగేదానికీ ఏం సంబంధం లేదు. కనుక జరిగిందే మనం అనుకోవాలి... అంతేనా!" అంటూ ఎటో చూస్తూ- "పిన్నీ,  చూసావా... నీకు మందులు ఇవ్వటం మరచిపోయాను" అని లేచి మందు సీసా, గ్లాసుతో నీళ్ళు అందించింది లీల.
"పిన్నీ, ఐదు నిమిషాలు నీతో మాట్లాడతా!" అంది లీల.
తులసమ్మకి మనసులో ఆవేదన కలిగింది. మళ్ళీ పిల్ల గురించి, భర్త గురించి, సుధాకర్ అమ్మేసిన ఇంటి గురించీ మాట్లాడితే తనేం సమాధానం చెప్తుందీ! తనకున్న అసహాయస్థితి ఇది.
"చెప్పు పిన్నీ.... ఓపిగ్గా వుందా?" అంది లీల మళ్ళీ. తులసమ్మ తలూపింది.
"భగవద్గీతలో శ్రీకృష్ణుడు రెండు ముఖ్య వుషయాలు బోధించాడు కదా!"
లీల నోటంట ఆ మాటలు వినగానే లేచి కూచింది తులసమ్మ- ఏమిటీ...భగవద్గీతా, కృష్ణోపదేశమూ -
"లీలా- భగవద్గీతేమిటీ, నీకేం తెలుసూ?" అంది ఆశ్చర్యంగా.
"ఏమిటి పిన్నీ, రోజూ నేను- నువ్వు నిద్రపోతున్నంతసేపూ నేనూ నిద్రపోతున్నా ననుకుంటున్నావా? నీ గూట్లో వున్న పుస్తకాలు ఒకటొకటీ తీసి దుమ్ము దులిపి కొత్తగా అట్టలు వేసా... ఆధ్యాత్మిక రామాయణం, ఆశ్చర్య చూడామణి, భగవద్గీతా... అబ్బ... ఎన్ని పుస్తకాలో! రామకృష్ణ ప్రబోధాలు, వివేకానందుని జీవితం. పిన్నీ....ఒకటొకటీ నెమ్మదిగా చదివేస్తా. నిన్న భగవద్గీతలో నాలుగు శ్లోకాలు నేర్చుకున్నా నువ్వు నా మాటలు నమ్మలేకపోతున్నావు కదా!" అంది లీల.
తులసమ్మ కళ్ళలో నీళ్ళు తిరిగాయి. భవబంధాలు వాటంతట అవే తెగిపోతున్నాయా! పాపం, పిచ్చిపిల్ల!!
"లీలా, నీ మార్గమే సరైంది... ఎన్ని బంధాలు వదిలించుకుని భగవంతుని వైపు నడవగలిగితే అంత మనశ్శాంతి, అంతంలో ముక్తి! - ఇది అందరికీ సాధ్యమా తల్లీ - నా మనసు మీద పడ్డ దెబ్బలు నన్ను పూర్తిగా అటుగా వెళ్ళనీయలేకపోతున్నా- ఇంకా ఈ తాపత్రయాలలోనే కొట్టుమిట్టాడుతున్నా! వయసులో నాకన్నా ఎంతో చిన్నదానివి, అయితేనేం...ఆద్యాత్మికతలో పెరిగిపోయావు. లీలా... రోజూ ఓ అరగంట భక్తి గురించి, భక్తుల గురించి నాలుగు మాటలు చెప్పు" అంది నీళ్ళు నిండిన కళ్ళు తుడుచుకుంటూ.
లీల ఏమీ మాట్లాడకుండా చేతిలో వున్న భగవద్గీతలోకి చూస్తోంది.
లీల ఆశ్రమంలో తులసమ్మతో కలిసివుండిపోవటం అందరికీ మేలయింది. ఆశ్రమంలో వాళ్ళంతా లీలని కన్నబిడ్డల్లా ప్రేమిస్తున్నారు. తులసమ్మకి కొండంత బలం వచ్చింది. లీలకి కూడా గొప్ప ధైర్యం, మానసిక బలం, ఆత్మవిశ్వాసం వచ్చాయి. ఒక సమయంలో తనకి ఆత్మహత్యే శరణ్యమని నమ్మిన లీల- ఇప్పుడు 'ఆత్మహత్య  మహాపాపం' అంటుంది ధైర్యంగా. భర్త, పిల్లలూ ఆడదానికే అవసరమా? మగాడికి భార్య, పిల్లలూ అక్కర్లేదా? - మన పెద్దలంతా ఇలాటి అనవసరమైన విషయాలే ప్రచారం చేసారూ... అంటుంది చాలా స్పష్టంగా! ఆడవాళ్ళు ఏ పని చేయలేరు? ఇంకా చెప్పాలంటే మగాళ్ళే చేయలేరు... అంటూ నోటికి చెయ్యి అడ్డం పెట్టుకు నవ్వి, "పిల్లల్ని కనమను చూద్దాం!" అంటుంది గర్వంగా. "మన ఆచారాలు అన్నీ అర్ధంలేనివీ- ఎవరికీ తోచింది వాళ్ళు చెప్పటం, అది ఇష్టమైనవాళ్ళు దాన్ని ప్రచారం చేయడం-నాకు నచ్చవు"- ఇలాంటివి అంటుంది ఎంతో తీర్పరిలా భారతదేశంలోని కర్మ సిద్దాంతం బోధిస్తుంది- లీలని చూస్తుంటే ఉన్న జబ్బు పోయినట్టే... అనిపించింది తులసమ్మకి.   
                                  *    *    *
రాజీవ్ మమత కోసం రోజూ వస్తూనే వున్నాడు జానకి యింటికి.
వచ్చినప్పుడల్లా రెండుమూడు గంటలు పిల్లతో గడుపుతున్నాడు. ఒక్కోసారి జానకికి కూడా నచ్చటంలేదు.
మాధవరావు పది దాటితేగాని ఇంటికి రావడం లేదు.
రాజీవ్ స్కూటర్ కి కారు ఢీకొట్టింది.   
మాధవరావు ఇంట్లోకి రాగానే సగం తిన్న బిర్యానీ ప్లేట్లు, మంచినీళ్ళ గ్లాసులు హాల్లో కనిపించాయి. లోపలకొచ్చిన మాధవరావు మంచంమీద మమత నిద్రపోవటం చూసాడు.
"జానకీ..." ఉరుము ఉరిమినట్లయింది.
హాలు సర్దుతున్న జానకి పరిగెత్తుకుంటూ వచ్చింది.
"ఏమిటిది..?" అన్నాడు.
"మనందరికీ అని బిర్యానీ, స్వీట్లు తెచ్చారు రాజీవ్. మీరెంతకీ రాకపోతే, నేనే పెట్టాను, నాకూ ఆకలిగా వుండి తిన్నాను..."
"నేనడుగుతోంది- నువ్వూ, రాజీవ్ తిన్న బిర్యానీ గురించి కాదు!"
జానకి అటు చూసింది... నిద్రపోతోంది మమత. ఏముందక్కడ అనేది అర్ధంకాలేదు.
"ఏముందీ..." అంది అటూఇటూ చూస్తూ.
"తీసేయ్ ముందు" అన్నాడు బూట్లు విప్పుకుంటూ. జానకి ముఖం వివర్ణమైంది.
"మమతని మంచంమీద నుంచి తీసేయాలా..?" గబుక్కున ఎత్తుకుని పక్క గదిలో పడుకోబెట్టి వచ్చింది.
మాధవరావు కోపం క్షణంలో ఎందుకు తగ్గిందో తెలియలేదుగానీ, మమత పక్క తడుపుతుందని అనిపించి వుంటుంది. అంతే అనుకుంటూ భర్తతో మాట్లాడుతూ -
"చూసారా- ఇవాళ అమితాబచ్చన్ సూటెంత బావుందో! మీ దగ్గర అలాటిదే వుంది కదా!" అంది హాయిగా.
పకపకా నవ్వాడు భర్త. "అభిమానులుంటారు కొందరికి! కొందరికి రచయిత అంటే అభిమానముంటే అలాగే నడవటం, అలాగే మాట్లాడటం కూడా చేస్తుంటారు. అలాగే సినిమా యాక్టర్లకి చాలామంది అభిమానులుంటారు. ఆ అభిమానం ఎంతవరకు ఎదిగిపోతుందంటే- విమర్శిస్తే చాలు... ఆ అభిమానులు ఎదుటివాళ్ళని కాల్చి చంపడానికి కూడా వెనుకాడరు- ఇది పచ్చినిజం!"
చదువుకునే రోజుల్లో అమితాబచన్ సినిమాలు తప్ప మరేవీ చూసేది కాదు జానకి.
వెర్రి అభిమానం పెంచుకున్న జానకికి ఈనాటికీ ఆ భావం పోలేదు మనసులో నుంచి. ఇప్పుడు ఈ 'కరోడ్ పతి గేమ్' వారానికి నాలుగురోజులు కనిపిస్తుంటే టీవీ ముందునుంచి కదలటంలేదు జానకి.
తనకిష్టమైన విషయం చెప్పాలనిపిస్తే- ఏదో వంకని తన అభిమాని పేరు తెస్తుంది. ఇవాళ జానకి ఈ మాట అనటం కొత్తకహ్డు మాధవరావుకి. కానీ, జానకిని చూస్తే నవ్వొచ్చిందెందుకుంటే- మమత మీద దృష్టి పెరిగి ఇంటిని మరచిపోతుందనుకున్నాడు. కానీ, జానకిలో ఆ విషయంలో మార్పేమీ రాలేదు.
 మమత నిద్రలో ఏడ్చింది.
జానకి గదిలోంచి పరిగెత్తింది. మాధవరావు ముఖం ధుమధుమలాడించుకుంటూ సిగరెట్టు వెలిగించాడు. దగ్గు తెరతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
"ఆ పొగ పీల్చడం మానండి. ఇంక పిల్ల ఆరోగ్యానికి మంచిది కాదు!" అంది గదిలోంచి.
"ఎవరి ఆరోగ్యానికీ..?" అన్నాడు గదిలోకొచ్చి సిగరెట్ తాగుతూ.
"పసిపిల్ల ముందు సిగరెట్ తాగకూడదని అంతా చెప్తుంటే, తెలిసి కూడా మీరు..." జానకి ఏదో అనబోయింది.
మాధవరావు సిగరెట్ తాగకూడదని అంతా చెప్తుంటే, తెలిసి కూడా మీరు..." జానకి ఏదో అనబోయింది.
మాధవరావు సిగరెట్ పొగ పీల్చి మమతపైన, జానకిపైన వదిలాడు.
"ఏమిటీ..." అంది కోపంగా అరిచి.
"నోర్ముయ్యి- దాన్ని అలా వదిలి గదిలోకి రా!" గబగబా లోపల కెళ్ళిపోయాడు మాధవరావు.
జానకి మమతని నిద్రపుచ్చింది.
గడియారం పదకొండు గంటలు చూపించింది. పడగ్గదిలోకెళ్ళిన జానకి గాఢనిద్రలో ఉన్న భర్తని చూసి, కోపంగా ముసుగుతన్ని పడుకుంది.
పదిహేను రోజులు రాజీవ్- జానకి యింటికి రాలేదు. ఫోను కూడా ఎవరూ తియ్యలేదు. ఎక్కడికి వెళ్ళి వుంటారో ... అనుకుంటూ వచ్చింది జానకి- రాజీవ్ ఇంటికి.
ఇంటికి తాళం! పక్కింటివాళ్ళ నడిగింది.
"పదిహేనురోజులనాడు స్కూటర్ మీద వస్తుంటే కారు డాష్ కొట్టిందట. ఆ కారున్న ఇంటి ముందే- అప్పుడేదో కిందపడి లేచాడట. తర్వాత ఏమైందో... రెండోరోజుకి పాదం వాచి ఒకటే నెప్పిట! అందుకని గాంధీ ఆస్పత్రికెళ్ళారు..." ఇంకా ఏదో చెప్తోంది పక్కింటి పనిమనిషి.
జానకి కారు డ్రైవరు అంతా విన్నాడు.
"అవునమ్మా, ఆరోజు అయ్యగారితో నేను వున్నా, మనింటికొస్తారే... ఆ బాబుగారు-బయటకెళ్ళి స్కూటర్ ఎక్కారు... కారు డాష్ అయింది"
"అంటే- అదేనండీ... స్కూటర్ పైనుంచి కిందపడ్డారు- కానీ, మళ్ళీ లేచారు"
"అయ్యగారికి తెలియదా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS