దంపతులు గాఢనుర క్తులగుచో, సత్సంకల్పులగుచో, రసభావానందమయు లగుచో తత్సంతానము చిరంజీవి త్వాది గుణగణ్యమై వెలయఁగల దని ఇటీవలి నా గట్టి యెఱుక. ఇందు కెన్నో తార్కాణ లెఱుగుదును.
మా తల్లిదండ్రుల ప్రగాఢనురాగము తత్సంతాన మగు మా కింత దాఁక క్షేమారోగ్యదికము ప్రసాదించిన దని నా విశ్వాసము. మా తండ్రిగా రెనుబదిమూఁడెండ్లు నిరామయ దీర్ఘ జీవితము గడిపిరి. వారి తండ్రిగారును నెనుబదిమూఁ డెండ్లు జివించిరి. మా తాతగా రవసాన కాలమున కుమారుని బిలిచి "నాయమా! నీవును నావలె నెనుబదిమూఁడెండ్లు జీవించగల" వాణి మా తండ్రిగారి నాశిర్వదమును రట! పలుమారులు మా నాయనగా రీ యాశీర్వదమును జెప్పుకొను చుండెడి వారు. వారి యాశీర్వదము మా తండ్రి గారి యెడ ఫలించి నది! మా తలిదండ్రు సంపన్నులు కారు గాని సంపన్నుల కంటె సుఖముగా జీవిక గడపిన వారు. పుత్రుపౌత్రాదులతో మా యూర మాయిల్లు దోసతోటవలె నుండెడిది. మా యింట మా నాయనగారు నూఱింటి దాక జన్మోత్సవములు వారి కాలమున జరపినట్లు లెక్కించుచుండెడి వారు.
3
బాల్య స్మృతులు
ఒకనాఁడు తోడిబాలురుతో గోచికూడ లేక వీధిలో చింపిరి కాగితముల నేఱి యేదో పిచ్చి చదువు చదువుకొను చుండఁగా నన్నుఁ జూచి పుణ్యముర్తి కొట్టరువు సుందర రామయ్య పంతులుగారు (వారు మా యూర నేఁ బది యేండ్లకుఁ బైపడిన కాలము బడి పంతులుగా నెలకొని యూరి వారి కందఱకు ప్రాధమికఉదయ నేర్పిన సచ్చరిత్రులు.) నా చేయి పట్టుకొని ఇంటికి గొనివచ్చి మా మాతృ శ్రీ నడిగి గోచి గొని తానే మొలత్రాటికి దాని దగిలించి బడికి గొని పోయి రెండు మూడు నాళ్ళలోనే అక్షరజ్ఞాన మలవరిచిరి. తర్వాత వారిచేతనే మా తండ్రిగారు నా కక్షరాభ్యాసము జరపించిరి. నన్ను నే నెఱుగుటకు ఇది నా తొలిగుర్తు.
బడిలో నేదో చదువు సాగినది. అన్నింట నేనే మొన గాఁడను.లెక్కకు మాత్రము నిండుసున్న. తెలుఁ గన్న వెఱి తీపు. బడిలోని యుపాధ్యాయులు నాచే పద్యముల జదివించుచు సంతోషించుచుండెడివారు. సంగీతముతోడి చదువు నాఁటికి నేఁ టికిని గూడ నాకుఁ గొఱుకఁ బడని మెఱిక బియ్యమే! సంగీతము లేకున్నను సందర్భస్పూర్తి గలుగునట్లు పసినాట లెక్క కేక్కుడుగ పద్యములు నేను చదువఁ గల్గుట యుపాధ్యాయులకు ముచ్చట గొల్పెడిది. మా చుట్టుపట్టు గ్రామము లన్నింటి కంటె మా యూరనే మా యింటనే సంస్కృతాంధ్ర నిఘంటువులు ధర్మశాస్త్రాది గ్రంధ సంచయము నధికముగా నుండెను. గ్రంధములకై యనేకులు మా యింటికి వచ్చెడివారు. అర్ధ మయినంత వఱకు మా యింటఁ గల గ్రంధముల నెడ తెగక నేను చదువు చుండెడివాఁ డను. మా తండ్రిగారు తెలుఁగు మఱుఁగులు కొన్ని తెలియఁ జెప్పు చుండెడివారు. ఈ ముచ్చటలఁ బడి నేని ఇంగ్లీషుకు చదువు నిరాకరించితిని. సంస్కృతాంధ్రములగుచో స్వగ్రామముననే కొన్ని గంటలే చదువఁ డగుట, ఇంగ్లీషుకు తల్లిదండ్రులను, సుఖ భోజనమును విడిచి పెద్దయూరు బందరు పోవలయుట, పదొకొండు గంటలనుండి అయిదు గంటల దాఁక స్కూలుకు పోయి చదువవలయుట, ఊరిలోని మిత్రగోష్టిని విడువవలయుట దుఃఖకరములుగా నా కపుడు తోఁచినవి. నిర్బంధించి మా తల్లిదండ్రులు నన్ను గ్రామాంతరమునకుఁ బంపఁ జాలరైరి.పుత్రువాత్సల్యమును,భోజనాది సౌకర్యములు గ్రామంతరమున కల్గింపఁ హల ధనసంపత్తి లేమియు దానికిఁ గారణములు.
స్వగ్రామముననే బ్రహ్మణ్యులయిన మద్దూరి రామావ దానులుగారి దగ్గఱ సంస్కృత ము, నింత తెలుఁ గు చదువ సాగితిని. పుణ్యమూర్తులు, ప్రాతస్స్మరాణీయులు మద్దూరి రామావధానులుగారు మా తండ్రిగారు నా బాల్య మిత్రులు. సమవయస్కులు. బ్రహ్మముహుర్తమున నిద్రలేచి సరిగా వేళకు సంధ్యా వంద నాగ్నిహోత్రాది ప్రాత రాహ్నికములు నిర్విర్తించుకొని ఒక గంట సేపు ఉంఛవృత్తి నెఱిపి, తొమ్మిది గంటలగుసరి కింటికి వచ్చి, మాధ్యాహ్నికము నిర్వర్తించు కొని పడి కొట్టక పూర్వమే సుఖముగా భోజనము చేసి, విశ్రాంతితో విద్యార్ధులకు పాఠములు చెప్పుటతో శ్రీ వారు సత్కాలక్షేపము జరుపుచుండిరి. పడి గంటలలోగా భోజనము కానిచో వారి కొంటికణత తలనొప్పి వచ్చును. వా రతి సుకుమాశారీరులు. వారిని గూర్చి మా తండ్రిగారిని గూర్చి నాఁడుమా యూరి వా రిట్లు వాకొనుచుండు వారు. రామావధానులు గారికి తన కనారోగ్యము కలుగుట ఊరి కంతకు అనారోగ్యము కలుగుట- సుందరశాస్త్రిగారికి తన కుటుంబమున కనారోగ్యము కలుగుట యూరి కంతకు ననారోగ్యము కలుగుత-అని. తమ, తమ కుటుంబపు టనారోగ్యాములకు వీరు గజిబిజి పడునంతగా ఇతరుల యనారోగ్యముల గూర్చి వీరు గజిబిజి పడువారు కారనుట దీని తత్త్వము.
