14. కంటిలో చుక్లాలు ఎందుకు వస్తాయి ?
శుక్లంబరానికి పదిసంవత్సరాలైన ఉండవు. కాని ఏదైనా చూడాలంటే కళ్ళు మిటకరించి చూస్తాడు. కత్తయ్య తన కొడుకు అలా ఎందుకు చూస్తున్నాడో గ్రహించలేకపోయాడు. డాక్టరు దగ్గరికి తీసుకుని వెళ్ళి చూపిస్తే శుక్లాంబరానికి కంటిలో శుక్లం ఉందని, అందుకునే అతను సరిగ్గా చూడలేకపోతున్నాడని చెప్పాడు. చిన్నపిల్లవాడికికంటిలో శుక్లాలు అని డాక్టరు చెప్పేసరికి కత్తయ్యకి ఆశ్చర్యం కలిగింది. చిన్నపిల్లలకి శుక్లాలు వస్తాయని తానెప్పుడూ అనుకోలేదు. ఎందుకంటే సంవత్సరం క్రీందట కత్తయ్య తనకి చూపు సరిగ్గా కనబడటంలేదుని డాక్టరుకి చూపించితే కాటరక్టు వచ్చిందని, అది ముదిరితే ఆపరేషన్ చేయవలసి వుంటుందని చెప్పాడు. అలా తనకి కాటరాక్టు ఎందుకు వచ్చిందీ అడిగితె, వయస్సు మళ్ళినవారికీ కాటారాక్టు (శుక్లాలు) రావడం సహజమేనని డాక్టర్ చెప్పాడు. కాని పిన్న వయస్సులో ఉన్న తన కొడుకుకి కూడా కాటారాక్ట అంటే కత్తయ్యకి ఆశ్చర్యం కలిగింది.
కాటరాక్టు అన్నా, కంటిలో శుక్లాలు అన్నా ఒకటే. కొందరికి ఈ శుక్లాలు పుట్టుకుతనో ప్రారంభమై అతి చిన్న వయసులోనే కంటి చూపు త్వరత్వరగా మందగించి పోవచ్చు.అయితే యాభై సంవత్సరాలు దాటినా తరువాత కంటికి శుక్ల్లు రావడం సర్వసాధారణం. శుక్లాలు అంటే కంటిలో ప్రత్యేకంగా ఏర్పడడం ఏమీకాదు. కంటిపాపా వెనుక అందరికీ "లైన్స్" ఉంటుంది. కంటిమీద పడిన కాంతి కిరణాలు ఈ "లైన్స్"గుండా ప్రయాణించి కనుగుడ్డు లోపల ఉండే రెటీనామీద పడి మన కంటి ముందు ఉండే వస్తువులు చక్కగా కనబడతాయి. మామూలుగా ఈ "లైన్స్" కెమెరా లోపల ఉండే అద్దంలాగా కంటికి కనబడదు. కాని కొన్ని కిరణాల వల్ల ఈ "లైన్స్" తన సహజత్వాన్ని కోల్పోయి గట్టి పడటం ప్రారంభం అవుతుంది. అటువంటప్పుడు అంతవరకు కంటిపాపా వెనుక కణబడకుండా ఉన్న "లైన్స్" తెల్లగా మారడంతో కాంతికిరణాలు కంటి లోపలి సరిగ్గా పయనించడానికి వీలులేకపోతుంది. దానితో చూపు మందగిస్తుంది. మొదట్లో దూరం వస్తువులు కనబడటం కష్టం అయితే, తరువాత నిదానంగా చూపు మందగించి గజం దూరంలోనే ఉండే వస్తువులువ్యక్తులు కనబదకుమ్డా అవుతారు.
కాటరాక్టు ఎందుకు తాయారవుతుందనే విషయంలో ఇంకా స్పష్టమైన కారాణాలుతెలియవు. అయితే కొందరి విషయంలో ఫలానా కారణవల్ల కాటరాక్టు యేర్పడుతుందని చెప్పావచ్చు. యాభై సంవత్సరాలు దాటినావారిలో వచ్చే కాటరాక్టు విషయంలో స్పష్టమైనా కారణం తెలియకపోయినా, 'లైన్స్' లోపల వుందే ప్రోటీను పదార్ధం ముద్దగా అవడం ఒక కారణంగా భావించగా, వయస్సు ముళ్ళుతున్న కొద్దీ లైన్స్ పైన ఏర్పడే పావురాలు మందంగా ఏర్పడటం మరొక కారణంగా భావించబడుతోంది అయితే ఇవే కారణాల వల్ల యాభై సంవత్సరాల లోపు వారిలో కూడా కాటరాక్టు రావచ్చును. షుగర్ కప్లయింట్ (మధుమోహం) వుందే వారిలో కూడా త్వరగా కాటరక్టు రావడం సహజం. కాటరక్టు. ఒకే వ్యక్తిలో రెండు కళ్ళల్లో రావచ్చు. అయితే ఒక కంటిలో త్వరగా ముదిరి ఆ కంటిలో చూపు మందగించిపోతే, రెండవ కంటిలో తర్వాత మందగించడం జరుగుతుంది.
