Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 15

                                                         13.  కళ్ళకలక_ నివారణ

   
    అనిల్ కి కళ్ళు కాస్త గరగర అనిపించాయి. వెలుతురూ చూడబోతే కళ్ళవెంట నీళ్ళు కారాయి. అద్దంలో కళ్ళు చూసుకుంటే ఎర్రబడ్డట్లు కనిపించాయి. రోజంతాతీరికలేకుండా పనిచేయబట్టివేడిచేసి ఉంటుందని భావించి అతను కాస్త మజ్జిగ ఎక్కువతాగి పడుకున్నాడు. ఉదయం లేచే సరికి కళ్ళు తెరవాలంటే వీలు లేకుండా రెండు రెప్పలు అంటుకుని పోయాయి. రెండు చేతులతో పట్టుకుని అంటుకుని పోయిన రెప్పలనివిడదీసుకున్నాడు. అద్దంలో కళ్ళు చూసుకుంటే కంటినిండా పూసలు ఉన్నాయి. కంటి రెప్పలని విడదీసుకున్నాడు. అద్దంలో కళ్ళు చూసుకుంటే కంటినిండా పుసులు ఉన్నాయి. కంటిరెప్పలకి వెంట్రుకులు అంటుకునిపోయాయి.

    అనిల్ కి వచ్చిన కంటి జబ్బు సాదారణంగా చాలామందికివస్తూనే వుంటుంది. దీనినే వ్యాపహారికలో "కళ్ళ కలక" అనీ వైధ్యాభాషలో  "కంజక్తివైటిస్" అంటారు. ఇది కంటికి బాక్టీరియా క్రిములు సోకడంవల్ల వస్తుంది. అతి తెలికిగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అందుకునే ఇంట్లో ఒకరికి కళ్ళ కలకవస్తే సరైన శుభ్రత, నియమాలు పాటించకపోతే రెండవవారికి కూడా అతిత్వరగా వస్తుంది. "కళ్ళకలక" వివిధ రకాలవ్యాధి క్రిములవల్ల వస్తుంది. సాధారణంగా వచ్చే కళ్ళ కలకకు స్తఫాలోకోకస బాక్టీరియా క్రిమే కారణం. కలక వచ్చినవారికీ ముందు కళ్ళు ఎర్రబాడటం, కళ్ళల్లో ఏదో పడ్డట్లు గరగరలాడటం, ఎండ, వెలుతురూ చూడడానికి ఇబ్బంది పడటం లాంటి లక్షణాలుంటాయి కొద్ది గంటల్లోనే కళ్ళల్లో పుసులు  కట్టడం ప్రారంభమవుతాయి. తరువాత పుసులు మరింత ఎక్కువ అవుతాయి. సాధారణంగా నిద్రలేచేసరికి రెండు కళ్ళు పూర్తిగా అంతుకుని పోయి కళ్ళనిండా పుసులు ఉంటాయి. ఈ కళ్ళ కలక ముందు ఒక కంటికి ప్రారంభమైనా, రెండవ పూటకి రెండవ కంటికి కూడా సంక్రమిస్తుంది. వ్యాధి వచ్చినప్పుడు కంటినుంచి కారే నీరుద్వారా, పుసులు ద్వారా రెండవవారికీ తేలికగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అందుకుని కళ్ళకలక వచ్చిన వ్యక్తి వాడిన తువ్వాళ్ళు, ఇతర దుస్తులు వాడకూడదు.

    కళ్ళకలక వచ్చినప్పుడు శుభ్రమైన నీళ్ళతో కళ్ళు శుభ్రంచేస్తూ ఉండాలి. కళ్ళలో టెర్రామైసిన్, సోఫ్రామైసిన్ లాంటి కంటి అయింటుమెంట్లు వాడాలి. అవసరాన్ని బట్టి యమ్తిబయాటిక్స్ వేరే వాడవలసి యుంటుంది. కళ్ళకలక వచ్చినప్పుడు మందువాడితే రెండు_ మూడు రోజుల్లో కొంతవరకూ తగ్గిపోతుంది. పూర్తిగా వ్యాధి తగ్గేవరకు మందువాడాలి. సాధారణంగా కంటికి వచ్చే ఈ వ్యాధివల్ల ఎటువంటి దుష్పలితాలు ఉండవు, సరైన చికిస్తా పొందకుండావ్యాధిని నిర్లక్ష్యం చేయడంవల్ల, నటువైద్యం చేయడంవల్లకంట్లో పుండు ఏర్పడే ప్రమాదం మాత్రం వుంది.

    గనేరియా వ్యాధి స్రీ ప్రసవించినపుడు అ వ్యాధి క్రిములు పుట్టే బిడ్డకి సంక్రమించి కళ్ళకలక రావచ్చు. అటువంటిప్పుడు బిడ్డ పుట్టిన రెండు_రోజుల్లోనేకళ్ళు అంటుకునిపోవడమే కాకుండా కళ్ళవెంట సుద్ద మాదిరిగా కనిపించే చీము వస్తుంది ఇటువంటి కేసుల్లో ఆ బిడ్డకి జ్కల్లు ద్ఫెబ్బతినే అవకాశం ఉంది. ఇలాగే పెద్దవాళ్ళుకూడా గనేరియా క్రిములు సోకి కళ్ళకలక రావచ్చు.

    వైరస్ క్రిముల వల్లకూడా సాధారణంగా కళ్ళకలక వస్తుంది. వైరస్ వల్లవచ్చే కళ్ళకలకలో మామూలుగా వచ్చే కళ్ళకలకలోలాగా పుసులుకట్టడం, రెండుకళ్ళుఅంటుకుని పోవడంజరగదు. వైరస్ వల్ల వచ్చే కళ్ళకలకముందు ఒక్క కంటితోనే ప్రారంభం అవుతుంది. కళ్ళు ఎర్రబడతాయి, బాగా మండుతాయి, కళ్ళవెంట నీళ్ళు బాగా కారతాయి. వెలుతురూ చూస్తె మరింత నీళ్ళు కరతాయి. ఈ కళ్ళకలక కూడా మూడు_ నాలుగు రోజుల్లో తగ్గుతుంది.
    కొందరికి ఎటువంటి వ్యాధి క్రిములు సోకకుండానేఅకస్మాత్తుగా కళ్ళు ఎర్రబడటం, కళ్ళల్లో ఏదో పడ్డట్టు బాధ అనిపించడం, కళ్ళవెంట నీళ్ళు కారడం వుంటాయి. ఇలా కొందరు వ్యక్తుల్లో చాలా తరుచుగా జరుగుతూ యుంటుంది. దానికి కారణం ఇటువంటి వారికీ పోగా, దుమ్ము, నిప్పువేడి, ఎండవేడి, కలుషతమైనా గాలి సరిపడకపోవడమే. కొందరికి ఆల్కహాలు సేవించిన వెంటనే కళ్ళు ఎర్రబడి చింతనిప్పుల్లా తయరవుతాయి. ఇంకొందరికి కళ్ళు ఎప్పుడూ ఎర్రగా వుంది కళ్ళకలక మెండికెత్తిపోయిండా అన్నట్లు ఉంటయి. డానికి కారణం వరు సరైన గాలి, వేలుతురు లేని ఇళ్ళల్లోనివసించడం, దుమ్ము_ దూళీ ఎప్పుడూ రేగుతూ ఉండటం, బాగా వేడి వుండటం ముఖ్యకారణాలు అలాగే అతిగా భిజించే వారిలో, అతిగా మాధ్యమ సేవించేవారిలో గౌటువంటి వ్యాధులు ఉండేవారిలో, ఎలర్జీ వ్యాధులు ఉన్నవారిలో నుద్ర, సరిగ్గా వుందని వారిలో కళ్ళు ఎర్రగా కనబడవచ్చు. అందుకుని డాక్టర్కి చూపించి కారాణాన్నిబట్టిచికిత్స పొందటం ఉత్తమం.

                                                                         ****


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS