ఆ రోజంతా కులభూషణ్ పిచ్చివాడిలా ఊరంతా తిరిగాడు. అతడు థియేటర్ కు వెళ్ళాడు. వీడియో గేమ్స్ ఆడాడు. హోటల్లో భోం చేశాడు. కానీ ఏం చేస్తున్నాడో అతడికి తెలియదు.
రాత్రి ఎనిమిది గంటలకు క్లబ్బుకు వేళ్ళాడతను. క్లబ్బులో మనోహరి కనిపించింది.
అతడామెను చూడలేదు. ఆమె అతడ్ని చూసి పలాకరించి "నిన్ను చూసి చాలా కాలమైంది' అంది.
"అవును' అన్నాడతడు ముక్తసరిగా.
'కారణం తెలుసుకునేందుకు ఇన్నాళ్ళూ ఎందుకు ప్రయత్నించలేదు ?"
మనోహరి నవ్వి "నేనూ బిజీగా ఉన్నాను. 'ఇంటర్నేషనల్ కాంపిటేషన్ కి పెయింటింగ్ వేస్తున్నాను. ఈరోజే అది పూర్తయింది. రిలాక్సేషన్ కి ఇక్కడికి వచ్చాను. నువ్వు కనబడ్డావు. రియల్ రిలాక్షేషన్ " అంది.
కులభూషణ్ అదోలా నవ్వాడు.
"ఏమైంది నీకు?" అంది మనోహరి ఆశ్చర్యంగా.
"నా మనసు బాగోలేదు."
"నీ మనసు బాగు చేస్తాను. నాతొ రా" అందామె.
"అతడు మాట్లాడలేదు.
"ఎన్నోసార్లు నన్ను సంతోష పెట్టావు. ఆ కృతజ్ఞత నాకుంది. నిజానికి రోజు నాకు తీరుబడి లేదు. క్లబ్బు నుంచి ఓ ఫ్రెండింటికీ వెళ్ళాలి. ఆ ప్రోగ్రాం వాయిదా వేసుకుంటాను" అందామె.
"నీ ప్రోగ్రాం వాయిదా వేసుకోకు" అన్నాడతడు.
'అలాగాన్నానని కోపం వచ్చిందా ? నీకంటే ఏ ప్రోగ్రామూ ఎక్కువ కాదు నాకు"
"అయినా నేను నీతో రాలేను"
"ఎందుకు?"
కులభూషణ్ కళ్ళముందు జవాబుగా ఉదయ మెదిలింది. ఉదయ తన భార్య . తను మనోహరితో వెడితే ఆమె కన్యాయం జరుగుతుంది.
అతడు లేచి నిలబడి "చెప్పినా నీ కర్ధం కాదులే. నాకూ వేరే ప్రోగ్రాముంది. వస్తాను" అంటూ అక్కడ్నుంచి కదిలాడు. తనకోసం తన చుట్టూ తిరిగే కులభూషణ్ తను ఆహ్వానించినా రాననడం మనోహరి కాశ్చర్యాన్ని కలిగించింది.
ఆమె ఓ భాగ్యవంతుడి బిడ్డ తల్లి లేదు. ఇంట్లో ఆమె మాటకు ఎదురులేదు.
ఆమె కళకు తన జీవితాన్నంకితం చేశానంది. పెయింటింగ్స్ బాగానే వేస్తుంది. డబ్బుండడం వల్ల ఆమె పెయింటింగ్స్ కి అర్హతకు మించిన గౌరవం లభిస్తోంది.
తను వివాహం చేసుకోనని ఆమె తండ్రికి చెప్పింది. తండ్రి వ్యాపార వ్యవహారాల్లో మునిగి తెల్తున్నాడు. ఆమె గురించి పట్టించుకోవడం లేదు.
ఆమె వయసు ఇరవై. ఆమెకు బాయ్ ఫ్రెండ్స్ న్నారు. వారినామే ఇంటి కాహ్వానిస్తుంది. ఆమె గదిలో ఏం జరుగుతుందో తండ్రి పట్టించుకోడు. ఇంట్లో అమెకా స్వేచ్చ ఉంది.
తానెప్పుడు తలచుకుంటే అప్పుడు కూతురికి పెళ్ళి చేయగలనని మనోహరి తండ్రి నమ్మకం.
కులభూషణ్ మనోహరి గురించి తెలిసి ఆమె వెంట పడ్డాడు. ఆ తర్వాత ఆమె అతడి వెంటబడడం ప్రారంభించింది.
వారు కలుసుకుని ఇలా విడిపోవడం ఇదే ప్రధమం. కులభూషణ్ మనోహరి దగ్గర్నుంచి తిన్నగా గులాబీ నర్సింగ్ హోం కి వెళ్ళాడు. దారిలో అతడు సీతమ్మతో ఏం మాట్లాడాలో రిహార్సల్స్ వేసుకున్నాడు.
ఆమె ఆలోచనలు విశ్వనాద్ కి దూరంగా ఉంచాలని, అతడి గురించిన మరి ఆశలేమీ ఆమెలో రేగకూడదని అతడను కున్నాడు.
వేదాంతం తిరిగి రాదు. విశ్వనాద్ తిరిగి రాలేదు. అమ్మ సీతమ్మకు తానోక్కడు మిగిలేడు.
కొడుకుగా తానేమే కోసం జీవించాలి. తన్ను తాను సంస్కరించు కోవాలి. ఆమె విశ్వనాద్ చావును పూర్తిగా మరిచిపోవాలి.
ప్రస్తుతం విశ్వనాద్ గురించిన ఆశలను క్రమంగా ఒక పద్దతిలో ఆమె మరిచి తుడిచి పెట్టాలి.
సీతమ్మ....ఉదయ....
ఉదయను ఇల్లాలుగా చేసుకుని జీవించిన కొద్ది నెలలు ఒక ఆదర్శ భర్తగా ఆమెను సంతోష పెట్టాలి.
ఈ ఆలోచనలతో కులభూషణ్ నర్సింగ్ హోం చేరుకున్నాడు.
జలజ, మనోహరి లు తన్ను బాధించకూడదు. వేదించ కూడదు. ప్రలోభ పెట్టకూడదు.
ఈ దృడ నిశ్చయంతో అతడు నర్సింగ్ హోం కు చేరుకున్నాడు. ముందతడు తిన్నగా సీతమ్మ గదికి వెళ్ళాడు.
అక్కడ ఆమె పడుకుని ఉంది కాని ఎవరి కోసమో ఎదురు చూస్తున్న దానిలా కనబడుతోంది.
కులభూషణ్ ని చూడగానే ఆమె ముఖం విప్పారింది.
ఆమె ముఖంలోని సంతోషం చూసి "ఇకమీదట నన్ను మాత్రమే కొడుకుగా భావించాలి అమ్మ' అనుకున్నాడు. కానీ అతడి కడుపు తరుక్కు పోతోంది.
"రా రా రా...నీకో శుభవార్త చెప్పాలి" అంటూ లేచి కూర్చోబోయిందామె. కులభూషణ్ రెండంగల్లో ఆమెను సమీపించి వారించాడు.
"నువ్వబద్దం చెప్పవను కున్నాను. అయినా నిజమని నమ్మడానికి ప్రయత్నించాను ఆశతో. కానీ మన విస్సీగాడు నిజంగానే బ్రతికున్నాడు ....' అందామె సంతోషంగా.
తానె ప్రసక్తి కామెను దూరంగా ఉంచాలను కుంటున్నాడో అదే ఆమె చెప్పడం కులభూషణ్ కి నచ్చలేదు.
"నీ వంట్లో ఎలా వుంది?" అన్నాడతడు మాట మార్చాలని.
"నా వంట్లో ఎలా వుందో నన్ను చూస్తె తెలియడం లేదూ?" అందామె.
అప్పుడతడు తల్లిలా కాక ఒక దురదృష్ట వంతురాలిలా భావించి ఆమె వంక చూశాడు.
కట్టుకున్న బనారసీ చీరలో హుందాగా వుందామే. నెరుస్తున్న జుట్టు ఆమె హుందాను పెంచింది. మంచితనం ఆమె ముఖానికి అందాన్నించ్చింది. తెచ్చి పెట్టుకున్న కొత్త ఉత్సాహం ఆమెను జబ్బు మనిషిగా కనబడ నివ్వడం లేదు.
ఆమె కళ్ళలో ఏదో తేజస్సు.....
అతడు చటుక్కున ఆమెకు ప్రణామం చేసి 'అమ్మా! నువ్వు దేవతవు" అన్నాడు.
"నేను దేవతను కాదురా నువ్వే దేవుడివి. మన వేదాంతం దేవుడు. నువ్వు నన్ను కాపాడితే వేదాంతం విస్సీగాడిని కాపాడాడు. ఇప్పుడు మనమంతా కలిసి మళ్ళీ సుఖంగా ఉండొచ్చు " అంది సీతమ్మ.
మాటెలా మార్చాలా అని ఆలోచిస్తున్నాడు కులభూషణ్.
"ఒరేయ్ - మన విస్సీగాడిప్పుదెంత బాగున్నడ్రా - చలి దేశంలో ఉండి వచ్చాడేమో -- ఎండ చూసి చాలా కాలమయిందేమో -- పచ్చగా దబ్బ పండులా మెరిసిపోతున్నాడు. వాడే కాదు -- వేదాంతమూ అంతే!' అంది సీతమ్మ.
ఉలిక్కిపడ్డాడు కులభూషణ్. "వాళ్ళను నువ్వెప్పుడు చూశావు?' అన్నాడతదాశ్చర్యంగా.
"నవ్వి ఓ గంటయింది " అందామె.
'అమ్మా నువ్వు భ్రమ పడ్డావు ' అన్నాడతడు.
వేదాంతం వచ్చేడంటే ఆశ్చర్యం లేదు. విశ్వనాద్ కూడా వచ్చాడంటుందేంటి?"
"ఇప్పుడు నాకే భ్రమలూ లేవు ' అని నవ్వింది సీతమ్మ.
"వాళ్ళిప్పుడెక్కడున్నారు?"
"ఉదయ దగ్గరకు వెళ్ళారు "
"నిజంగానా ?"
సీతమ్మ చిత్రంగా అతడి వంక చూసి 'విస్సీగాడోచ్చెడంటే సంతోషించడానికి బదులు అలా తెల్లబోతావెంటిరా -- నువ్వు నా భూషణ్ వేనా ?' అంది.
కులభూషణ్ ఆమెకు బదులివ్వలేదు. అక్కడ్నుంచి వెనక్కు తిరిగి ఇంచుమించు పరుగు లంకించుకున్నాడు.
"విస్సీగాడ్ని చూడాలన్న ఉత్సాహం --- పెద్దదాన్ని నన్నే నిలబడనివ్వడం లేదు. కుర్రాళ్ళాగుతారా ?" అనుకుంటూ తనలో తనే నవ్వుకుంది సీతమ్మ.
కులభూషణ్ ఒక్క ఉదుటున ఉదయ గదికి వెళ్ళాడు.
గదిలో ఉదయ మాత్రం ఉంది.
ఆమె లేచి అక్కడే అటు ఇటూ పచార్లు చేస్తోంది.
ఆమె కదలికలో కొత్త ఉత్సాహముంది.
"ఉదయా!" అన్నాడు కులభూషణ్.
అప్పుడామె అతడ్ని గమనించి "భూషణ్! విస్సీబావ వచ్చేశాడు" అంది.
కులభూషణ్ తెల్లబోతూ "ఎప్పుడూ ?" అన్నాడు.
"ఇక్కడ్నుంచి వెళ్ళి ఓ పావుగంట అవుతుందేమో!" నిన్ను చూడాలని హడావుడిగా ఇంటికి వెళ్ళారు..." అంది ఉదయ.
"ఉదయా! వాళ్ళు నిజంగా వచ్చారా ?" అన్నాడు కులభూషణ్ ఇంకా నమ్మకం కుదరని వాడిలా.
"రావడమే కాదు వేదాంతం నాచేత ఏవో ఆకులు తినిపించాడు. ఏమిటంటే అమృతమన్నాడు. ఎక్కడిదంటే, స్వర్గం నుంచి తెచ్చానన్నాడు. అవి తిన్నప్పట్నించి నాలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. నాకిప్పుడు పునర్జన్మ ఎత్తినట్లుంది" అంది ఉదయ. ఆమె మాటల్లో ఉత్సాహం తెలిపి పోతోంది.
