3


"ఆ వైభవం నాకు వద్దు. నన్ను విడిచిపెట్టు...."
"నేను స్వామి భక్తుడ్ని. నిన్ను విడిచి పెట్టను...."
"ఒక ఆడదాన్ని అమానుషంగా హింసించడమా నీ స్వామి భక్తీ ?"
"నా స్వామి భక్తీ నీ కర్ధం కాదు. స్వామికి అంకితమై వచ్చేవరకూ నేను నిన్ను తాకనైనా తాకను అందుకే ఈ యువతులందుకు వినియోగించబడ్డారు. ఈ ఆశ్రమ జీవితమెంత బాగుంటుందంటే వీళ్ళ నిప్పుడు ఇక్కడ్నుంచి పొమ్మన్నా పోవడం లేదు...."
'అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వలాంటి వాళ్ళ నేన్ను కోవాల్సింది. నన్ను విడిచిపెట్టు ....' అందా యువతి.
"నువ్వూ అలాంటి దానివే! నీకు తల్లిదండ్రులు లేరు. అన్నదమ్ములు లేరు. బంధువుల దగ్గర అష్టకష్టాలు పడి ఈ దశకు చేరుకున్నావు. నాలుగు రోజులు కనపడకపోతే నీమీద నింద వేసే వారే తప్ప బాధ పడేవారు లేరు ' అన్నాడతను.
"నా గురించి చాలా తెలుసుకున్నావే" అందామె.
'అలౌకికానందండుకి నీ గురించి తెలియనిది లేదు. లేచి వెంటనే వెళ్ళు. స్వామి కుటీరంలో ప్రవేశించి ఆయనకు అంకితంకా. నీ జన్మ ధన్యమవుతుంది ."
ఆమె లేవాలేదు. సరికదా మరింతగా ముడుచుకుపోయి "నా దుస్తులు నాకిప్పించు " నేను స్వామి కుటీరానికే వెడతాను...." అంది.
నల్లటి వ్యక్తీ ఆమె వైపు చూడకుండా పక్కనున్న యువతుల వైపు చూసి "ఊ" అన్నాడు. అంతే! వారామెను లేవదీసి అక్కడ్నుంచి బలవంతంగా నడిపించుకుంటూ కుటీరం బయటకు తీసుకుని వెళ్ళరు. మైదాన ప్రాంతంలో కొంతమేర ముందుకు వెళ్ళి ఆమెను ముందుకొక్క తోపు తోశారు.
ఆ యువతి పడిపోబోయి నిలదొక్కుకుని వెనక్కు తిరిగేసరికి ఆ యువతులు లేరు. బలిష్టమైన ఇద్దరు యువకులున్నారు. వారి చేతిలో కర్రలున్నాయి. ఆమెకు నల్లటి వ్యక్తీ మాటలు గుర్తుకు వచ్చాయి. "నీకై నువ్వు స్వామి కుటీరం లోకి వెళ్ళకపోతే నా మనుషులు నిన్ను కుక్కను తరిమినట్లు తరుముతారు ...."
తాను నమ్మిన దైవంలో ఎంత మోసం! దైవత్వంలో అమానుషం ఆమె ఊహించలేదు. ఈ మోసాని కామె తలవంచదల్చుకోలేదు. ఆమె వెంటనే ముందుకు పరుగు లంకించుకుంది.
"నా ప్రాణం పోయినా ఫర్వాలేదు. స్వామికి మాత్రం నేనంకితం కాను" అనుకుందామే.
తన శక్తి నంతా క్రోడీకరించి పరుగెడుతున్న ఆమెకో వ్యక్తీ అడ్డం వచ్చాడు. అతడి గెడ్డం మాసివుంది. కళ్ళలో దిగులుంది. ఆమె అవేమీ గమనించలేదు. అతడి చేతిలో కర్ర లేదు. అదొక్కటే ఆమె ధైర్యం. ఆమె తన పరిస్థితిని కూడా మరిచి "నన్ను రక్షించగలరా?" అంది. అతడామెను చూశాడు. మరుక్షణం అతడికి స్పురించిన దొక్కటే.....ముందతడు తన కోటు విప్పి అమెకిచ్చాడు. వెంటనే ఆమె అది ధరించింది.
"ఎవర్నువ్వు ?" అన్నాడతడు. ఆమె క్లుప్తంగా కధ చెప్పింది.
"నిన్ను నేను రక్షిస్తాను ' అన్నాడతను.
"నువ్వెవరు ?" అందామె.
"నా పేరు వేదాంతం. అలౌకికానంద స్వామి ద్వారా ఏదో సాధించాలని వచ్చాను. ఆ స్వామి అసలు రూపం తెలుసుకున్నాక ఇంక ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను స్వామి బారి నుంచి రక్షించి ఆ తర్వాత అసంఖ్యాకులైన భక్తుల్ని కూడా రక్షిస్తాను " అన్నాడతను.
ఆమె వెంటనే అతడ్ని లతలా చుట్టుకుపోయి "నన్ను రక్షించు . ఇక్కడ్నుంచి బయటపడేయి. నీవు కోరిన విధంగా నీ ఋణం తీర్చుకుంటాను. నన్ను జంతువులా వేటాడాలనుకున్న ఈ స్వామికి ఇచ్చుకోలేనిది కూడా నేనిచ్చు కుంటాను. నిన్నే దేవుడిలా భావించి అంకితమై పోతాను" అందామె.
ఆమె ఆ మాటలు ముగించేసరికి వారి చుట్టూ నలుగురు మనుషులున్నారు. నలుగురి చేతుల్లోనూ కర్రలున్నాయి.
"స్వామికి అంకితమైన ఈమెను తాకి ఘోరాపచారం చేశావు" అన్నాడు వారిలో ఒకడు.
'అపచారం స్వామిది. నాది కాదు " అన్నాడువేదాంతం .
వాళ్ళలో ఒకడు తన చేతిలోని కర్ర నిద్దరి మధ్య జొనిపాడు. అప్రయత్నంగా ఆమె వేదాంతం విడిపోయారు. అప్పుడిద్దరు మనుషులు వేదాంతం చేతులు గట్టిగా పట్టుకున్నారు. ఇద్దరామెను అతడి దరి చేరకుండా అదిలిస్తున్నారు.
"ఏమిటిది?" అన్నాడు వేదాంతం విదిపించుకుందుకు ప్రయత్నిస్తూ . కానీ వారిది ఉడుంపట్టు లాగుంది.
ఆమె ఏడుస్తోంది. కానీ క్రమంగా అతడికి దూరమవుతోంది.
"నన్ను వదలండి" అన్నాడు వేదాంతం.
"నువ్వు స్వామికి ఘోరాపచారం చేశావు. నిన్ను వదలడం కుదరదు" అంటూ వాళ్ళతడ్నీ గుహ వైపుగా ఈడ్చుకుని వెళ్ళారు.
వేదాంతం వాళ్ళ నుంచి విదిలించుకుందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కాని అతడి ప్రయత్నాలు ఫలించలేదు. వేదాంతం ఆ ఇద్దరు మనుషులు గుహ బైటకు వచ్చారు. అది ఆశ్రమానికి ప్రవేశమార్గం. బయట సన్నటి కాలిబాట. బాటకు అటువైపు లోతు కనబడని అగాధం.
"నన్ను వదలండి " అన్నాడు వేదాంతం.
'ఒక్క నిమిషం అగు ...." అన్నాడు ఇద్దరిలో ఒకడు.
"ఎందుకు ?"
'అక్కడ ఆ అగాధంలో ఏముందో తెలుసా నీకు ?"
"తెలియదు " అన్నాడు వేదాంతం.
"తెలుసుకోవాలనుందా?"
"లేదు ..."
"తప్పదు తెలుసుకోవాలి " అన్నాడా ఇద్దరిలో ఒకడు ఈలోగా గుహ లోంచి మరోవ్యక్తి వచ్చాడు. అతడికి ఒక చేతిలో కర్ర ఉంది. రెండో చేతిలో కొటుంది.
అది వేదాంతం ఒక యువతి మాన సంరక్షణ కిచ్చిన కోటు అంటే....
వేదాంతం పళ్ళు పటపటలడాయి. అతడిలో రగిలిన ఆవేశపు బలం ఆ యువకుల పట్టు నుంచి సదలించు కోవాలని మరో విఫలయత్నం చేసింది.
మూడో వ్యక్తీ తన చేతిలోని కోటును అగాధంలోకి విసిరేశాడు.
"వెళ్ళు నీ కోటు తెచ్చుకో" అంటూ ఆ ఇద్దరు వ్యక్తులూ వేదాంతాన్ని అగాధంలోకి ఒక్క తోపు తోశాడు. వేదాంతానికి కోటు కనబడలేదు. అతడికి కళ్ళు చీకట్లు కమ్మాయి. ఆ ప్రయత్నంగా అతడు విశ్వనాద్ ..... నేను నీ దగ్గరకు వస్తున్నా ' అంటూ అరిచాడు. ఆ తర్వాత ఇంకేదో అనబోయాడు కానీ అది ఆర్తనాదంగా మారిపోయింది.
** ** **
చాలాసేపు నిద్రపోలేదు కులభూషణ్ . ఒకసారి నిద్రపట్టేక అతడికి వళ్ళు తెలియలేదు.
ఇల్లు శుభ్రం చేయడానికి వచ్చిన పనివాడు సుమారు ఏడు గంటల ప్రాంతంలో వచ్చి తన పని అయ్యాక కులభూషణ్ తలుపు తట్టాడు. దబదబ బాదేవరకు కులభూషణ్ కీ మెలకువ రాలేదు.
అతడు తలుపు తీయగానే "తలుపేసుకుని పడుకున్నారేం బాబూ ?' అన్నాడు పనివాడు.
అప్పుడతడికి జలజ గుర్తొచ్చింది.
"నువ్వోచ్చేసరికి ఇంట్లో ఎవరైనా ఉన్నారా ?' అన్నాడతడు.
'అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు. ఇంకేవరుంటారు బాబూ?" అన్నాడు పనివాడు ఆశ్చర్యంగా.
అంటే జలజ వెళ్ళి పోయిందన్న మాట. అతడు భారంగా నిట్టూర్చి అక్కడ్నించి కదిలాడు. కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లోంచి బయటపడ్డాడు.
ముందుగా టిఫిన్ తీసుకునేందుకు హోటల్ కు వెళ్ళాడు.
అతడికాకలిగా లేదు. బలవంతంగా ఇంత తిని కాఫీ తాగి అక్కడ్నించి బయటపడ్డాడు. తనిప్పుడెం చేయాలి ?
అమ్మ సీతమ్మ ఈ అఘాతానికి తట్టుకోలేడు. కొడుకు పోయాడని తెలియగానే ఆమెకు గుండె జబ్బు వచ్చింది. అతడు బ్రతికున్నాడన్న వార్త ఆమెకు సంతోషం కలిగించింది కానీ అది పూర్తిగా నమ్మలేదు. తన గుండె జబ్బు తగ్గించడానికి డాక్టర్లాడుతున్న అబద్దమని ఆమె అనుమానిస్తున్నా ఆశ మాత్రం ఉందామెలో.
విశ్వనాద్ నిజంగానే బ్రతికున్నాడని ఆ తర్వాత మరో యాక్సిడెంట్ లో మరణించాడని తెలిస్తే సీతమ్మ గుండె బ్రద్దలై పోతుంది. అమ్మ సీతమ్మను తానెలా రక్షించుకో'గలడు ? ఎంతకాలం రక్షించుకోగలడు?
