Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 16


                   
    
    ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం ఆవిర్భావమే సంక్షేమానికి నాంది. ఆ తర్వాత ఆర్ధికంగా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న ఉమ్మడి అంధ్ర రాష్ట్రానికి సంస్కరణల ద్వారా సంపదను సృష్టించిన చంద్రబాబు నాయుడు నవ్యాంధ్రప్రదేశ్ లో అభివృద్దిని సంక్షేమంతో జత చేశారు. కేవలం అభివృద్ధి పనులు చేస్తే లాభం లేదు. సంక్షేమ కార్యక్రమాలు సమర్ధంగా అమలు చేస్తేనే ప్రజలు సంతోషిస్తారు. సంతృప్తి చెందుతారు. ప్రజల సంతృప్తే పాలనకు అసలైన సూచీ." అనే భావనతో విస్తృతంగా ప్రజోపయోగ పధకాలు చేపట్టారు.
    తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది రైతులకు రుణ ఉపశమనం . గతంలో ఎన్నడూ లేని విధంగా 2014 లో ప్రతి రైతు కుటుంబానికి లక్షన్నర వరకు రుణ ఉపశమనం కలిపిస్తూ మొత్తం 55 లక్షల మందికి చంద్రబాబు లభ్ది చేకూర్చారు. దేశంలోనే అతిపెద్ద సామాజిక భద్రత పధకంగా 'ఎన్టీఆర్ భరోసా' ను ప్రవేశపెట్టారు. అంతకుముందు 200 రూపాయలుగా ఉన్న ఫించను ను మొదట వెయ్యి, తర్వాత రెండు వేల రూపాయలకు పెంచారు. దీని కింద నెలనెలా 50 లక్షల మంది వృద్దులకు రెండు వేల రూపాయల ఫించను చెల్లించి వారిని ఆదుకున్నారు. అలాగే నాలుగున్నర కోట్ల మందికి 'రూపాయకే కిలో బియ్యం' పధకం కింద నెలకు 35 కిలోలను ప్రతి కుటుంబానికి  

    (2014-2019 మధ్య ఒకవైపు సంపద సృష్టి కోసం పెట్టుబడులను,
    పరిశ్రమలను ఆకర్షిస్తూ మరోవైపు అన్ని వర్గాలను చేయూత నిచ్చేందుకు
    పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం .)

అందించారు. ప్రజాపంపిణి వ్యవస్థలో సాంకేతికతను ప్రవేశపెట్టడమే గాకుండా, ఇంటికే రేషన్ అందేలా ఏర్పాటు చేశారు. 1999 లోనే ప్రారంభించిన 'దీపం' పధకాన్ని విస్తరించి, గ్రామీణ నిరుపేద, బలహీన వర్గాల మహిళలకు గ్యాస్ పొయ్యి కనెక్షన్లు అందజేశారు. 'చంద్రన్న కానుక' 'రంజాన్ తోఫా' 'క్రిస్మస్ కానుక' పేరుతొ అన్ని మతాల పండుగలను నిత్యావసర సరుకులను పేదలకు అందించారు.
    దళితులకు, ఆదివాసీలను , బీసీలకు సరికొత్త పధకాలను తెలుగుదేశం ప్రభుత్వం అందించింది. వెలవెలా ఉపకార వేతనాలను సకాలంలో అందజేయడమే కాకుండా, 'చంద్రన్న చేయూత' పేరుతొ వేలాది మంది ఎస్సీ యువతకు నైపున్యాభివృద్ది లో శిక్షణ అందించింది. దళితవాడలో చంద్రన్న దళిత బాట పేరుతొ సిసి రోడ్లు, డ్రైనేజి వ్యవస్థ తదితర మౌలిక  వసతుల కోసం నిధులు ఖర్చు పెట్టింది. దళితులు, గిరిజనులు, తమ పిల్లల్ని విదేశాల్లో ఉన్నత చదువులు చదివించేలా చూడాలన్న సంకల్పంతో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పధకాన్ని ప్రవేశపెట్టి ఆర్ధిక సాయం అందించింది. దళిత యువత స్వయం ఉపాధి పొందేందుకు భారీ ఎత్తున ఎస్సీ కుటుంబాలకు ఆర్ధిక ప్రయోజనం చేకూర్చింది. రాష్ట్రం నుంచి పెద్ద సంఖ్యలో గిరిజన అభ్యర్ధులను ఆలిండియా సర్వీసులకు ఎంపికయ్యేలా ఎన్టీఆర్ విద్యోన్నతి పధకం కింద శిక్షణ ఇప్పించింది. జనాభా నిష్పత్తి ప్రకారం బిసిలకు నిధుల అందాలనే ఉద్దేశంతో బిసి సబ్ ప్లాన్ కింద 25 శాతం నిధులు కేటాయించేందుకు చర్యలు తీసుకోంది. చంద్రన్న స్వయం ఉపాధి కింద మెగా బిసి రుణ మేళాలు నిర్వహించి ఆర్ధికంగా తెలుగుదేశం ప్రభుత్వం అండగా నిలిచింది. ఆదరణ ప్రధకం కింద బిసిలకు పనిముట్లు కొనుగోలుకు ఆర్ధిక సాయం అందించింది. కాపుల కోసం కాపు కార్పోరేషన్ ను, బ్రాహ్మణుల కోసం బ్రహ్మాణ కార్పోరేషన్ ను ఏర్పాటు చేసి ఆయా వర్గాల బాగు కోసం వివిధ పధకాలు ప్రవేశ పెట్టారు. కాపు విద్యార్ధులకు పోత్సాహక స్కాలర్ షిప్పులు , విదేశీ విద్యకు ఆర్ధిక సహాయం మొదలైన సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. మైనారిటీల సంక్షేమానికి నైపుణ్యాబివృద్ది శిక్షణతో పాటు, కర్నూలు జిల్లాలో అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటుకు టిడిపి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ముస్లిం యువతుల వివాహం కోసం దుల్హన్ పధకం, వ్యాపారాల నిర్వహణ కోసం దుకాణ్ - మకాన్ పధకం , విజయవాడ , కడపల్లో హజ్ హౌస్ నిర్మాణం మొదలైన కార్యక్రమాలు చేపట్టింది. క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా వివిధ పధకాలతో పాటు, జెరూసలేం యాత్రకు సాయం, గుంటూరు లో క్రిస్టియన్ భవనం నిర్మాణం మొదలైన కార్యక్రమాలు చేపట్టింది.
    నరిగా (గ్రామీణ ఉపాధి హామీ పధకం ) నిధులను సమర్ధవంతంగా వినియోగించుకొని, పల్లెల్లో వేల కిలోమీటర్ల సిసి రోడ్లను నిర్మించింది. చంద్రబాబు ప్రభుత్వం చంద్రన్న బీమా పేరుతో రాష్ట్రంలోని కోటిన్నర మంది అసంఘటిత కార్మికులకు ప్రమాద బీమా భద్రత కల్పించింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS