పరుగులెత్తిన పోలవరం, పట్టిసీమ
(రికార్డు సమయంలో పట్టిసీమను నిర్మించడమే గాకుండా,
పోలవరం పనులను వేగవంతం చేసి, అతి తక్కువ సమయంలో
72 శాతం పనులను పూర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడిది.)
నవ్యాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులను సత్వర బాట పట్టించారు చంద్రబాబు నాయుడు. తోటపల్లి, పులిచింతల, పురుషోత్తపట్నం, లిఫ్ట్ ఇరిగేషన్, ముచ్చమర్రి, ఎత్తిపోతల, హంద్రీనీవా, వెలుగొండ, వంశధార మొదలైన ప్రాజెక్టుల పనులను పరుగేట్టించారు. ఆంధ్రప్రదేశ్ ను వరప్రదాయని అయిన పోలవరం ప్రాజెక్టు పనులను వేగిరపరచడం , నదుల అనుసందానంలో తోలి అడుగుగా పట్టిసీమ ప్రాజెక్టును పూర్తీ చేయడం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎంతో మేలు చేసింది. పట్టిసీమ ద్వారా దేశంలోనే తొలిసారిగా నదుల అనుసందాన ప్రక్రియను సుసాధ్యం చేసి చూపింది తెలుగుదేశం ప్రభుత్వం.
సముద్రంలో కలిసే నీటిని అదా చేసి, కరవు ప్రాంతాలను ఆడుకోడానికి పట్టిసీమ ఎత్తిపోతల పధకం ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసందానించడం పట్టిసీమ ప్రధాన ఉద్దేశం. భారీ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తయ్యేలోగా , డెల్టా రైతులు నష్టపోకుండా పట్టిసీమను చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపాదించింది. పోలవరం తొలి ప్రయోజనంగా పట్టిసీమను చెప్పుకోవచ్చు. సాంకేతికంగా కూడా విశిష్టమైన ఈ ప్రాజెక్టును చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకొని, రికార్డు సమయంలో పూర్తీ చేశారు. 2015 మార్చిలో శంకుస్థాపన చేసి 11 నెలల కాలంలో ప్రాజెక్టును సాకారం చేశారు. దాని ప్రయోజనాలను రైతులు ఇప్పటికే అనుభవిస్తున్నారు . ఇటీవల కాలంలో కృష్ణా డెల్టా అయాకట్టును పట్టిసీమ ద్వారా గోదావరి జలాలే అదుకున్నాయి.
నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 2016లో ప్రకటించిన ప్యాకేజీలో భాగంగా వందశాతం విధులు సమకూర్చడానికి అంగీకరించడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి, ప్రాజెక్టు పూర్తికి నడుం బిగించారు. పోలవరం ప్రాజెక్టు గోదావరి, కృష్ణా నదులను అనుసందానిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం సమీపంలో నిర్మిస్తున్న బహుళార్ద సాధక ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును పూర్తీ చేసేలా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో సోమవారం పోలవరం పేరుతొ తానే దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. క్రమం తప్పకుండా ప్రాజెక్టు సైటును సందర్శించి, పనులను వేగవంతం చేయడానికి సమీక్షలు నిర్వహించారు. అంతకు ముందు నత్తనడకన సాగుతున్న ప్రాజెక్టు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఊపందుకొని, 72 శాతం పనులను పూర్తి చేసుకుంది. ఆ తర్వాత రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టుల్లాగానే పోలవరం కూడా ప్రస్తుత
(దేశ చరిత్రలో మొదటిసారిగా అంచనా వ్యయం పెంపు లేకుండా
అనుకున్న సమయానికి పూర్తయి పట్టిసీమ ప్రాజెక్టు లిమ్కా బుక్ ఆఫ్
రికార్డు లో స్థానం పొందింది.)

ప్రభుత్వ అసమర్ధతకు, అస్తవ్యస్త నిర్వహణకు ప్రతీకగా నిలిచింది. జల సంరక్షణ పధకాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని గుర్తించిన తెలుగుదేశం ప్రభుత్వం నీటి వనరుల పట్ల, నీటి సంరక్షణ పట్ల ప్రజలకు అవగాహన కల్పించే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా జలసిరికి హారతి కార్యక్రమాన్ని నిర్వహించింది. పొలాల్లో వాన నీటిని ఒడిసి పట్టేలా పంట కుంటలు ఏర్పాటు చేయడంతో రాయలసీమలో భూగర్భ జల మట్టం భారీ స్థాయిలో పెరిగింది. అదేవిధంగా సేద్యానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఊపిరిలూది, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి చంద్రబాబు అనేక చర్యలు తీసుకున్నారు.
