
(1980 వ దశకంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపగా, 1996-98 మధ్య కాలంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్ గా వ్యవహరించి, చంద్రబాబు దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఒక దశలో ఆయనకు కింగ్ మేకర్ గా జాతీయ మీడియా అభివర్ణించింది.)
ఎన్టీఆర్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాలను ప్రభావితం చేయగా, తర్వాత చంద్రబాబు నాయుడి అధ్వర్యంలో డిల్లీలో చక్రం తిప్పింది. 1980 వ దశకంలో నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా ప్రభావం చూపగా, 1996-98 మధ్య కాలంలో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన యునైటెడ్ ఫ్రంట్ కు కన్వీనర్ గా వ్యవహరించి, చంద్రబాబు దేశ రాజధానిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. ఒక దశలో ఆయనను కింగ్ మేకర్ గా జాతీయ మీడియా అభివర్ణించింది.
(కేంద్రంలో అత్యున్నత పదవులు చేపట్టడానికి గతంలో పలుమార్లు అవకాశం
వచ్చినా, తెలుగు ప్రజలకు దూరంగా వెళ్ళడానికి చంద్రబాబు ఇష్టపడలేదు.)
ఆనాడు దేవగౌడ , ఐకె గుజ్రాల్ లు ప్రధానులుగా ఎంపికవడంలో చంద్రబాబుది కీలక పాత్ర. తెలుగుదేశానికి జాతీయ స్థాయిలో ఉన్న పలుకుబడి దృష్ట్యా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించి, ప్రధాని పదవిని చేపట్టే అవకాశం వచ్చినా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తన ప్రాధాన్యమని చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఎన్ డిఏ ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం అభ్యర్ధిత్వానికి మద్దతు తీసుకురావడానికి చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగి కృషి చేశారు. ఎన్ డిఏ ప్రభుత్వంలో భాగస్వామిగా అనేక కీలక విధాన నిర్ణయాల్లో అయన పాలు పంచుకున్నారు. ఎన్ డిఏ తో తన సంబంధాలను ఉపయోగించుకొని ఏబి వాజపేయి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు అనేక రకాలుగా లబ్ది చేకూర్చారు.
ఆనాడు కేంద్రంలో మంత్రివర్గంలో చేరడానికి అవకాశం ఉన్నా అంశాల వారీగా మద్దతు నిస్తున్నందువల్ల తెలుగుదేశం పదవులకు దూరంగా ఉంది. లోక్ సభ స్పీకర్ స్థానానికి ఎంపిక చేసుకునే అవకాశం వచ్చినపుడు దళితుడైన జిఎంసి బాలయోగి కి అవకాశం ఇచ్చి, తెలుగుదేశం పార్టీ ఒక చారిత్రాక మార్పునకు దోహదపడింది.
మళ్ళీ 2014 లో ఎన్ డిఏ భాగస్వామిగా కేంద్ర మంత్రి వర్గంలో తెలుగుదేశం రెండు స్థానాలను పొందింది. కేంద్రంలోఉన్న అవకాశాలను ఉపయోగించుకుని , విభజిత ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో సంస్థలను నిధులను తీసుకురావడంలో తెలుగుదేశం మంత్రులు నిర్మాణాత్మక పాత్ర పోషించారు. ఆవిధంగా కేంద్రంలో ఎప్పుడు కీలక పాత్ర పోషించే అవకాశం వచ్చినా, తెలుగుదేశం పార్టీ ఆ అవకాశాన్ని రాష్ట్ర ప్రయోజనాలకే వెచ్చించింది. ఈనాడు ఎంపీలు పెద్ద సంఖ్యలో ఉన్నా, సొంత రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఎగబడుతున్న పార్టీల వ్యవహారాల శైలిని చూసినపుడు తెలుగుదేశం పార్టీ ఈ 40 ఏళ్ళలో తెలుగువారి గౌరవాన్ని, ప్రయోజనాలను కాపాడటానికే తనకు ప్రజలు ఇచ్చిన మద్దతును వినియోగించిందని స్పష్టమవుతుంది.

సేవా తత్పరతకు ప్రతీక ఎన్టీఆర్ ట్రస్ట్
ఆంధ్రుల ఆరాధ్య దైవం. తెలుగుదేశం పార్టీ స్థాపకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఆపదల్లో ఉన్న ఆపన్నులను ఆదుకునేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టును పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 1997 లో ప్రారంభించారు. హైదరాబాద్ ముఖ్య కేంద్రంగా కార్యకలాపాల నిర్వహణ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో ఈ సంస్థ సేవా కార్యక్రమాలు విస్తృతంగా కొనసాగుతున్నాయి.
పేదలకు విద్యావైద్య సేవలను ఉచితంగా అందించడం సంస్థ ప్రధాన ధ్యేయం. వీటితో పాటు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రంగంలోకి దిగి బాధితులకు తక్షణ సహాయం అందజేయడం సంస్థ ప్రధాన కార్యకలాపాల్లో ఒకటి. వైద్యసేవల్లో భాగంగా మెడికల్ క్యాంపులను, నిర్వహించడం, బ్లడ్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు, తలసేమియా పేషెంట్ల కోసం కేంద్రాన్ని నిర్వహిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం , తిరుపతి నగరాల్లో ఉన్న బ్లడ్ సెంటర్ల ద్వారా అయిదన్నర లక్షల మందిని సంస్థ ఆదుకుంది. ట్రస్టు నిర్వహించిన మెడికల్ క్యాంపుల ద్వారా దాదాపు 13 లక్షల మంది సహాయాన్ని పొందారు. విద్యారంగంలో స్కూళ్ళ జూనియర్, డిగ్రీ కాలేజీల ద్వారా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు పేద విద్యార్ధినీ విద్యార్ధులకు సేవలు అందిస్తోంది. హైదరాబాద్, కృష్ణాజిల్లా చల్లపల్లి లో ఉన్న పాఠశాలల్లో నర్సరీ నుంచి పదోతరగతి వరకు అతి తక్కువ ఫీజులతో పేద విద్యార్ధులకు చదువు చెబుతున్నారు. హైదరాబాద్ గండి పేటలో ఆడపిల్లల కోసం జూనియర్ డిగ్రీ కాలేజీలను ట్రస్టు నిర్వహిస్తోంది. పదేకరాల్లో అన్ని వసతులతో నిర్మించిన ఈ కాలేజీలో సకల సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్ధులకు సివిల్స్ పరీక్షల్లో శిక్షణ ఇచ్చేందుకు ఇటీవలే ఎక్సెల్ సివిల్స్ అకాడేమిని ట్రస్టు అధ్వర్యంలో స్థాపించారు.
అభాగ్యులు , ఆశక్తుల నిరంతర సేవలో 2022 నాటికి 25 ఏళ్లు పూర్తీ చేసుకున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ద్విగుణీకృత ఉత్సాహంతో తన సహాయ కార్యక్రమాలను మరింత విస్తరించడానికి ఉద్యుక్తమవుతోంది.
తెలుగువారికి ఏ కష్టమొచ్చినా .....

తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీగా మాత్రమే మిగిలిపోకుండా , తెలుగువారి కష్టసుఖాల్లో ఎప్పుడూ పాలుపంచుకుంది. హుద్ హుద్ పెను తుపాను కావచ్చు. చార్ ధామ్ వరద విపత్తు కావచ్చు. నేపాల్ భూకంప విలయం కావచ్చు. తాజాగా ఉక్రెయిన్ లో యుద్ద పరిస్థితులు కావచ్చు - తెలుగువారికి ఎక్కడ ఇబ్బంది వచ్చిన తెలుగుదేశం పార్టీ సర్వశక్తులను ఒడ్డి ఆదుకుంటుందని రాష్ట్ర ప్రజలు గుండె నిండా విశ్వాసంతో ఉండగలుగుతున్నారు. రాష్ట్రానికి గాని, రాష్ట్ర ప్రజలకు గాని ఎపుడు ఏ విపత్తు వచ్చినా, ఏ ఆపద సంభవించినా, ఏ కష్టం ఎదురైనా, రాత్రి పగలూ అని లేకుండా స్వయంగా రంగంలోకి దూకి ఆదుకోవడంలో చంద్రబాబుని మించిన నాయకుడు మరొకరు లేరు.

