Previous Page Next Page 
శతదినోత్సవం పేజి 15

 

    "సరేలే , నువ్వేక్కడా ఈ విషయం ప్రస్తావించకు!" స్వాతిశయాన్ని ప్రదర్శిస్తూ ఆ ప్రసక్తిని అంతటితో ఆపింది. "మిగతాది నేను చూసుకుంటాను."


    నిజానికి ఆ 'మిగతా' దాంట్లోనే తన ప్రమేయం ఎక్కువ ఉంటుందని భావించిన మంగ చాలా నిరాశ పడిపోయింది.


    మంగ బయటకు వెళ్ళాక తలుపు గడియ పెట్టింది కిన్నెర.


    అప్పుడు మొదలైంది కిన్నేరలో అలజడి.


    ఎదురుగా ఫోన్ కనిపిస్తున్నా బ్యాంక్ కు ఫోన్ చేసి ఏం మాట్లాడాలి అసలు ఈ ప్రసక్తి ఎలా తేవాలో అర్ధం కాలేదు.


    నిన్న మొన్నటి దాకా ఎలాంటి మగవాడ్నైనా అహంతో ఎదిరించగలిగే ధైర్యం చేవ ఉన్న ఆడపిల్ల కిన్నెర. ఇంతవరకూ అలా ఎదుర్కొనే అవకాశం రాకపోయినా కనీసం అలా బతికింది.


    మరిప్పుడేమిటి ? చేతులలా వణుకుతునాయేం? రాఘవ గురించి మంగ చెప్పిన మాటల్లో ఖచ్చితంగా ఏ పదాలు కిన్నెరపై బలంగా చేశాయో కాని, ఆమె స్వేదంతో తడిసిపోతోంది.


    "నాన్సెన్స్!" తిట్టుకుంది తనను తానే.


    అవక్ర విక్రమ పరాక్రమమూ , అప్రతిహతము , ఏమిటి ఆలోచనల్లో భాష ఇలా అడదిడ్డంగా దొర్లిపొతుందేం!


    ఎంత ఘనత వహించిన గతం తనది!


    అసలు ఎలాంటి తాత ముత్తాతలున్న వంశంలో పుట్టింది తను!


    రిసీవరు అందుకుంది ఉద్వేగంగా.


    అసలు నేను రాయలెదూ అంటే? ఆ తర్వాత తనేం చేయాలి?

    
    "నీ హేండ్ రైటింగ్ నా దగ్గరుంది " అనాలి.


    "అది నాదే అని మీకెలా తెలుసు" నని అతడడిగితే! ఆధారాలు సేకరించకుండా మాట్లాడటానికి నేనేం ఆషామాషీ ఆడపిల్లను కానని ఎదిరిస్తే సరి!


    అయినా అంత మంచి కవితలు రాసిన వాడిని పాపం తిట్టిపోస్తే ఏం బాగుంటుంది?


    తిట్టకపోతే అది తన వ్యక్తిత్వానికే కళంకం అనిపించగానే అర్జెంటుగా బ్యాంక్ కు ఫోన్ చేసింది ఆలోచించకుండా.


    రాంగ్ నంబరు.


    డయల్ చేసేటప్పుడు అంకెలు అలికినట్లు కనబడటం కంగారు మూలంగానో, లేక జీవితంలో తనంతట తానుగా ఓ మగాడికి ఫోను చేస్తున్నానన్న భావమో, తన దగ్గరకు పెళ్ళి చూపులకు వచ్చే అబ్బాయిల్లా ఇప్పుడు ఆమె అందోళనకు గురైపోతోంది.


    "హల్లో!"


    "రాఘవ......ఐ మీన్ మిస్టర్ రాఘవ కావాలి" అనేసింది టక్కున.


    "ఏ రాఘవ?' ప్రశ్న వినిపించింది మళ్ళీ. "ఇద్దరు రాఘవలున్నారు ఒకరు పెళ్ళయిన రాఘవ, మరొకరు బ్రహ్మచారి రాఘవ."


    "అవునూ, మంగ ఇందాకా ఏం చెప్పింది? అసలు రాఘవ పెళ్ళి ప్రస్తావన రాలేనట్టుంది కదూ!


    "కవితలు రాస్తుంటాడే...."


    "ఓహ్! అతనా.....జస్టే మినిట్!"


    ఎగ్జయిట్ మెంట్ నింపిన విరామం. అసలు కవితలు రాసేది పెళ్ళయిన రాఘవా? పెళ్ళి కాని రాఘవా?


    "హల్లో!" ఓ మగ కంఠం వినిపించింది. "నేను రాఘవను మాట్లుతున్నాను."


    "ఏ రాఘవ?" కంగారులో నోరు జారింది.


    "అదే....ఉబుసుపోక కవితలు రాసే రాఘవను."

    
    గొంతు సవరించుకుంది కిన్నెర.


    ఇందాక ఏమనుకుంది? తిట్టాలనుకుందా, లేకపోతే కవిత బాగుందని చెప్పాలనుకుందా?


    "ఏమిటి?' రాఘవ అన్నాడు మళ్ళీ "గుర్తుచేసుకుంటున్నారా?"

    
    "అంటే?" తొట్రుపడింది కిన్నెర.


    "ఉతుకుడు కార్యక్రమం ఏ కవితతో ప్రారంభించాలా అని!"


    "అబ్బే , అది కాదు ఈరోజు చూశాను కాదు, లైబ్రరీలో చదివాను......ఆహా! లైబ్రరీలో వారపత్రిక తిరగేశాను. బాగుంది."


    "తిరగేసి చూసిన వారపత్రిక?"


    "కాదు, మీ కవిత!"


    "థాంక్స్! తిదతారనుకున్నాను."

    అప్పటికి కాస్త ధైర్యాన్ని పుంజుకుందేమో....."తిట్టడానికి పనికట్టుకుని ఫోన్ చేయాలా? నిజంగా మీ కవిత బాగుంది."


    "గుర్తుకొస్తొంది నాకు."


    "ఏమిటి?" ఉలికిపాటుగా అడిగింది.


    "రాల్ఫ్ వాల్డ్ ఎమర్సన్ కొటేషన్"


    "........."


    "ఏమిటి నిశ్శబ్దంగా వుండిపోయారు?"


    "ఆ కొటేషన్ గురించి ఆలోచిస్తున్నాను" అంది నెమ్మదిగా.


    "అదేం తప్పుడు కూత కాదులేండి!"


    "అదేదో చెప్పొచ్చుగా?"


    "ఎ బ్యూటిఫుల్ ఉమన్ ఈజ్ ప్రాక్టికల్ పాయింట్ అన్నాడు.


    ఆ క్షణంలో మంగ కిన్నెర ఎదురుగా ఉంటే అరుణరాగ రంజితరాలైన కిన్నెర చెంపలు చూసి ఈమె కూడా ఇలా స్పందించగలదా అని కంగారుపడి వుండేది.


    "కోప మొచ్చిందా?" అన్నాడు.


    "దేనికి?"


    "మీరు అందంగా ఉంటారని నేనన్నందుకు.


    "కోపం రావటానికి నేను అందగత్తెను కాకపోతేగా?" నోరు జారింది.


    "మీరు కాదన్నా మీరు చాలా అందంగా ఉంటారు."


    "తెలిసినట్టు మాట్లాడతారేం?"


    "మీ గొంతులో ధ్వనిస్తున్న ఆత్మ విశ్వాసాన్ని బట్టి."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS