Previous Page Next Page 
హేల్త్ సైన్స్ పేజి 14

    మెదడువాపు జబ్బు పెద్దవాళ్ళలో రావడం చాలా అరుదు. ముఖ్యంగా పన్నెండుసంవత్సరాలలోపు పిల్లల్లో జరుగుతుంది. అందులోనూ రెండునుండి అయిదు సంవత్సరాల వయస్సు పిల్లల్లో ఎక్కువ.

    మెదడువాపులు జబ్బు క్రిములున్న దోమ మనిషిని కుట్టిన నాలుగు నుంచి పద్నాలుగు రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపాడడం జరుగుతుంది.

    పందినుంచి దోమలోకిప్రవేశించిన వ్యాధిక్రిములుచాలకొద్ది సంఖ్యలోనే ఉన్నా, 10రోజుల్లో దోమ శరీరంలో అవి కొన్నివందల రెట్లుపెరిగిపోతాయి. దానివల్ల ఇటువంటి దోమ మనిషిని కాటువేసి నప్పుదా క్రిములు అత్యధిక సంఖ్యలో శరీరంలోకి ప్రవేశించి వ్యాధి తీవ్రరూపంలోబయటపడుతుంది. అయితే కొందరిలో ఈ వ్యాధికి రాగా నిరోధకశక్తి వుంది ఇటువంటి దోమ కుట్టినా మెదడువాపు జబ్బురావడం జరగదు. ఇంకొందరికిఈ వ్యాధి తీవ్రరూపం దాల్చకుండానూ తగ్గిపోవడంకూడా జరుగుతుంది. వైద్యనిపుణుల పరిశీలన ప్రకారం చాలామందికి ఈ వ్యాధి సోకినా అది సోకినట్టే తెలియకుండా తగ్గిపోయుందని తేలింది.

    మెదడువాపు జబ్బు లక్షణాలు సాధారణంగా చాలా త్వరత్వరగా బయటపడతాయి. ఎక్కువ కేసుల్లో తీవ్రమైనా జ్వరం మెదట రావడం జరుగుతుంది. తలనొప్పి, ఒళ్ళునొప్పులు ఎక్కువుగా ఉంటాయి. గొంతు నొప్పి అనిపిస్తూ వుంటుంది. సంధి వచ్చినవానిలాఅర్ధం_ పర్ధంలేకుండా మట్లాడటంజరుగుటుంది. కాళ్ళు, చేతులు కంట్రోలు లేకుండా ఎగరేయడం, కొన్ని సందర్భాలలో ఫిత్సు వచ్చినట్లు బిగదీసుకునిపోవడం జరుగుటుంది. ఎక్కువ మందిలో మెడ కండరాలు బిగదీసుకునిపావుఇయి మేదస్ ఎంత వంచినా, పూర్తిగా వంగాకుండా వుటుంది. మెడదువాపు జబ్బు తీవ్రఅవుతున్నకొద్దీ స్పృహా పూర్తిగా కోల్పోవడం జరుగుతుంది. ఈ వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనబడిన పిల్లలలో నూటికి 40 నుంచి 60మందిమరణించడం జరుగుతుంది. ఇలా వ్యాధి లక్షణాలు త్వరత్వరగా రెండు_ మూడురోజుల్లో తీవ్రరూపం దాల్చడం జరుగుతుంది.జపనీస్ ఎన్ ఫలైటిస్వైరస్ వల్ల వచ్చే ఈ మెదడువాపు జబ్బులో మెదడుకి సంభందించిన కణాలు, మెదడుపైన వుందే పోర, వెన్నుపూసలో వుందే నాదీమండలం దెబ్బతినడం జరుగుతుంది. ఇలా జరగడంవల్ల వ్యాధి కోలుకున్న ఆ పిల్లవాడు కాలు_ చేయూ పడిపోయే, చూపులేకుండా అయిపోయే, బుద్ధి వికాసం లేకుండా అయిపోయే జీవితాతం బాధపడటం జరుగుతుంది.

    మెదడువాపు జబ్బు రాకుండా వ్యాధి నిరోధక ఇంజక్షన్లువున్నా ఇంకా కొందరికి అందుబాటలో లేకుండా వుంది. ఈ ఇంజక్షన్ల వ్యాధి సోకినవాళ్ళకి ఇవ్వడంవల్ల ఫలితం లేకపోగా నష్టం ఎక్కువ. అందుకుని వ్యాధి రకముందే ఈ వ్యాధి నిరోధక ఇంజక్షన్ల ఇవ్వాలి. ఈ ఇంజక్షన్ల మెదటి ఒకటి ఇచ్చి తిరిగి వారం_ పడిరోజుల్లో మరొకటి ఇవ్వాలి. ఈ ఇంజక్షన్ల వల్ల కొద్ది దినాల్లోనే శరీరంలో వ్యాధి రాకుండా నిరోధకశక్తి తయరవుతుంది.

    వ్యాధిని అరికట్టడంతో ముఖ్యంగా జననివాడలో పందుల సంచారం లేకుండా చేసి వాటిని ఊరికి రేండుమైళ్ళ దూరాలో అట్టే పెట్టాలి దోమలని నిర్మూలించడానికి ఇళ్ళలోను, పశువులషాలల్లోనూ, గంస్ క్సన్ స్ప్రే చేయడం చాలా మచిమ్ది. డి. డి.టి వల్ల అంతగా ఫలితం లేదు. పరిసరాల పరిశుభ్రత, పందులు లేకుండా చేసుకోవడం, దోమలు నిర్మూలన జరినట్లు యితే మెదడువాపుకి గురికాకుండా పండంతిపసిపిల్లలని కాపాడుకోవచ్చు. ఈ విషయంలో వైధ్యాశాధిధికారులు, ప్రజలు సహకరీంచని కృషిచేయడం అవసరం.

                                      ***


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS