Previous Page Next Page 
శంఖారావం పేజి 14

 

    అలౌకికానందస్వామి అనుచరులు కొందరక్కడే కొండ గుహల్లో స్థిరనివాసం ఏర్పరచుకుని ఉంటారు. వారి సంఖ్య యాభై దాకా ఉంటుంది. అనుచరులు కొందరు నగరంలోనికి వచ్చి వెడుతుండడం కద్దు.
    ఆ కొండ గుహల్లో సమాజ విద్రోహులు కొందరుంటున్నారని నేరస్తులు తల దాచుకుంటున్నారని పుకర్లున్నాయి . ఋజువులు లేవు.
    స్వామి తన మహిమతో కొందరు నేరస్తుల అచూకీలు చెప్పి పోలీసు దిపార్టు మెంటు కూడా సాయపడి ఉన్నారు. డిపార్టుమెంటులో అయన భక్తుల సంఖ్య చాలా ఎక్కువ. నేరస్తులశ్రమం వైపుగా వెళ్ళిన సమాచారం లభించినా పోలీసులటుగా నిషిద్ద వేళలలో వెళ్ళరు. స్వామిపై నమ్మాకం కంటే అయన శాపమంటే పోలీసులకు భయమెక్కువ.
    పోలీసులు నేరస్తులను వెంటాడ్డానికి కూడా వెళ్ళని సమయంలో ఆ దారిలో వేదాంతం ప్రవేశించాడు. రెండు కొండల మధ్య సన్నని ఇరుకైన దారి. చిమ్మ చీకటి. నిర్జన వాతావరణంలో ఏవో క్రిమి కీటకాలు చేస్తున్న విచిత్రమైన శబ్దాలు....
    వేదాంతం చేతిలో బ్యాటరీ లైటు లేదు. అతడికాదారి తెలుసు.
    ఒకసారి సీతమ్మతో కలిసి విశ్వనాద్, కులభూషణ్, ఆ దారిలో వెళ్ళారు. అకౌకికానందుడి దర్శనార్ధం!'    వాళ్ళామెకు తోడుగా వెళ్ళారు తప్ప స్వామిని దర్శించుకోలేదు. నమ్మకం లేని వ్యక్తిని దేవుడిగా చూడ్డం వారికిష్టం లేదు. దైవదర్శనానికి నోచుకునే అదృష్టం అందరికీ ఉండదండి సీతమ్మ. ఆ అదృష్టం కోసం ఇప్పుడు వెడుతున్నాడు వేదాంతం.
    అప్పుడతడి మనసులో ఆలోచనలు లేవు. అతడి లక్ష్యం ఒక్కటే. అది స్వామి దర్శనం! వేదాంతం క్రమంగా రెండు కొండల దారిని దాటాడు. ఇప్పుడాబాట మొదటి కొండను వదిలి రెండో కొండకు ప్రదక్షిణం చేస్తోంది.
    అప్పుడక్కడ ఒక పక్క కొండ రెండవ పక్క అగాధం. మలుపు తిరిగాడు. వేదాంతం. అంతవరకూ అతడి కెక్కడా నరసంచారం లేదు. కానీ ఒక బోర్డు 'అలౌకికాశ్రమానికి మార్గము" అని రాసి వుంది. బాణం గుర్తుతో మార్గం సూచిస్తూ ఉంది.
    ఆ అక్షరాలూ చీకట్లో కూడా ప్రకాశ వంతంగా మెరుస్తున్నాయి. వేదాంతం బోర్డును దాటాడు. బాణం గుర్తున్న లేకపోయినా వెళ్ళడానికొక్కటే దారి. దగ్గర్లో ఆశ్రమమున్నదని సూచించడానికే ఆ బోర్డు పనికొస్తుంది. వేదాంతం ముందుకు వెళ్ళాడు. కొంతదూరం వెళ్ళాక మరో బోర్డు కనిపించింది.
    ఈసారి బాణం గుర్తు ప్రయోజనం తెలిసింది. అది చిన్న కొండ గుహలోకి దారిని సూచిస్తుంది.
    గుహలో చీకటిగా వుంది. అప్పుడు వేదాంతంలో భయం లేదు. నిర్భయంగా అతడు గుహలో ప్రవేశించాడు. అందులో కూడా సన్నని పొడవైన మార్గం. అది దాటుకుని వెళ్ళేసరికి విశాలమైన మైదాన ప్రాంతం.
    అక్కడంత విశాలమైదాన ప్రాంతముంటుందని ఎవరూ ఊహించలేరు. స్వామి తన మహిమతో ఆ ప్రాంతాన్ని సృష్టించాడని కొందరంటారు. పగలక్కడ భక్తుల తోటి వారి కోసం వెలసిన దుకాణాల తోటి గొప్ప కోలాహలంగా వుంటుంది.
    దుకాణదారులు కూడా భక్తులతో పాటే వచ్చి తమ వ్యాపారం చూసుకుని వెళ్ళాలి. అమ్మదల్చు కున్న వస్తువులు కూడా తెచ్చుకోవాలి. వెళ్ళేటప్పుడు వాటినక్కడ వదిలి వెళ్ళవచ్చు. స్వామి ఆశ్రమంలో దొంగతనాలు జరగవు. మైదానంలో ఓ పెద్ద కుటీరముంది. అందులో ఆధునిక సదుపాయాలన్నీ ఉన్నాయి. అదే స్వామి ఆశ్రమం.
    అ కుటీరం చుట్టూ మరో యాభై చిన్న కుటీరాలు. అంతా నిశ్శబ్ద వాతావరణం. వేదాంతం పెద్ద కుటీరం వైపుగా నడుస్తున్నాడు. నాలుగడుగులు ముందుకు వేసేసరికతడి కిద్దరు వ్యక్తు లేదురయ్యారు.
    వారతడ్ని పట్టించుకోలేదు. బహుశా అతడ్ని కూడా ఆశ్రమ వాసి అనుకున్నారేమో!
    వారలా ముందుకు వెళ్ళారతడ్ని దాటుకుంటూ ఇద్దరూ జీన్స్ లో ఉన్నారు. నడుముకు పటకా బెల్టులున్నాయి. వేదాంతం ఆగి వెనక్కు తిరిగాడు. వాళ్ళిద్దరూ అతడు వచ్చిన ప్రవేశ మార్గంలో దూరారు. తర్వాత కనబడలేదు.
    వేదాంతం మళ్ళీ ముందడుగు వేశాడు. మరో నలుగురు వ్యక్తులతడ్ని దాటుకుంటూ వెళ్ళారు. అతడు మళ్ళీ వెనక్కు తిరిగి చూశాడు. వాళ్ళు ప్రవేశ మార్గానికి బాగా ఇవతలగా అర్ధ చంద్ర కారంలో ఆగిపోయారు. ఒక్కొక్కరికి పది గజాల ఎడం వుంది. వాళ్ళు నలుగురూ వేదాంతం వైపే తిరిగి వున్నారు. నలుగురూ కరాటే డ్రస్సులో ఉన్నారు.
    వేదాంతం వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించలేదు. అంతవరకూ మైదానంలో అట్టే వేలుగులేదు. అప్పుడే ఉన్నట్లుండి మైదానం ప్రకాశవంతం కాసాగింది.
    సూర్యోదయం కావడం లేదు కదా అని వేదాంతం టైము చూసుకున్నాడు.
    అప్పటికి టైమింకా రెండు గంటలైంది.
    వేదాంతం ముందడుగు వేశాడు. అప్పుడు....

                                        ***
    అలౌకికానందశ్రమం లోని ఒక చిన్న కుటీరంలో -- నల్లగా పొడవుగా కండలు తిరిగిన బలిష్టుడొకడు మంచం ముందు నిలబడి ఉన్నాడు. మంచం మీద పచ్చగా మిసమిస లాడిపోతున్న ఒక యువతి నిద్ర పోతుంది. ఆమె ముఖం అమాయకంగా వుంది.
    అతడామె వంకనే చూస్తూ టైమూ చూసుకుంటున్నాడు మధ్యమధ్య.
    టైము ఒంటిగంటన్నర కాగానే అతడు కుటీరం లోని పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ ఇద్దరు యువతులు మంచం మీద పడుకుని ఉన్నారు. అతడు వారిని తట్టి లేపాడు. ఇద్దరూ ఉలిక్కి పడి లేచి నిలబడి కళ్ళు నులుముకున్నారు.
    అతడు వారిని తేరిపార చూశాడు. ఇద్దరూ పల్చటి ఫ్రాక్స్ ధరించారు.
    "టైమంది ఆమెను నిద్ర లేపండి" అన్నాడతడు. ఇద్దరూ పక్క గదిలోకి నడిచారు! అతడు వారి ననుసరించాడు. ఆమె ఇంకా అమాయకంగా నిద్ర పోతుంది. ఆమె ముఖం లోని ప్రశాంతత చూస్తె ఆమెను నిద్ర లేపడమే పాపం అనిపిస్తుంది. కానీ ఆమె పక్క నిలబడ్డ యువతులను చూస్తుంటే అంతకంటే ఘోర పాపానికే తలబడినట్లు కనబడుతుంది.
    వారామెను తట్టి లేపారు. ఆమె ఉలిక్కిపడి లేచింది. ఆమె లేడి కనులు రెపరెప లాడాయి. ముందుగా ఆమెకు యువతులు కాక అతడే కనిపించాడు.
    "నేనెక్కడున్నాను?" అందామె.
    'అలౌకికానందస్వామి ఆశ్రమంలో !" అన్నాడతడు.
    ఆమె గుర్తుకు తెచ్చుకుంటోంది. తను ఓ కంపెనీలో స్తేనో ఉద్యోగానికి ఇంటర్వ్యూ కెళ్ళింది. అఫీసరామే ఫేర్మామేన్స్ మెచ్చుకుని "నేను అలౌకికానంద స్వామి భక్తుడ్ని. అయన దీవెనలు పొందితే నిన్ను తీసుకుంటాను' అన్నాడు ఆమె సరేనంది.
    "ఇప్పుడే బయల్దేరితే మరీ మంచిది. సాయంత్రాని కల్లా అర్దర్సు తీసుకోవచ్చు " అన్నాడతను. ఇంట్లో చెప్పాలందామె.
    అఫీసరంగీకరించలేదు. "నేను స్వామిని నమ్ముతున్నాను. ఆ విషయం రహస్యంగా ఉంచు.'
    అన్నాడతడు.
    ఆమె అంగీకరించింది. ఆఫీసరు తనూ తోడుగా వస్తానన్నాడు. స్వామి అంగీకరించినట్లు తనకూ తెలియాలి కదా!"
    అందుకూ  అంగీకరించిందామె.
    "మనం కలిసి బయల్దేరవద్దు. ముందు నువ్వు బస్సులో ఊరి చివరకు చేరుకో. అక్కడ నిన్ను నేను కలుసుకుంటాను "అన్నాడతను.
    సరేనని బయల్దేరిందామె. అతడామె బస్సును కార్లో అనుసరించి వచ్చి ఊరి చివర వచ్చి కలుసుకున్నాడు. అతడి సూచన మేరకు అపరిచితుల్లాగే ఇద్దరూ స్వామి భక్తుల్లో కలిశారు. ఆశ్రమంలో ఆమెకు స్వామి దీవెనెలు లభించాయి. అందుకామె ఎంతో సంతోషించింది. అఫీసరామెకు స్వామి ప్రసాదం కొనిపెట్టాడు. ప్రసాదం తినగానే ఆమెకు కళ్ళు తిరిగాయి. అతడామెను భయపడవద్దని ఓ కుటీరంలోని కి తీసుకుని వెళ్ళాడు. కుటీరం లోని వ్యక్తీ ఆమెకు మంచి నీళ్ళిచ్చాడు.
    తర్వాత ఆమెలో మత్తు ప్రవేశించింది. వళ్ళు తెలియని నిద్ర ముంచుకొచ్చింది. తర్వాతే మైందో ఆమెకు తెలియదు.
    ఇప్పుడు కళ్ళు తెరిచేసరికి ఎదురుగా ఆఫీసరుకు బదులు ఓ కొత్త వ్యక్తీ వున్నాడు.
    "ఎవర్నివ్వు ?" అందామె.
    "స్వామి భక్తుడ్ని " అన్నాడతడు. ఆమె మంచం మీద నుంచి లేచి నిలబడింది. ఇద్దరు యువతులూ ఆమెను చెరో పక్క ఎదురుగా నిలబడ్డారు. ఎదురుగా అతడు!
    "అడ్డులే. నేను వెళ్ళాలి " అందామె.
    "ఆమెను వెళ్ళ నివ్వండి" అంటూ అడ్డు తప్పుకున్నాడు.
    ఇద్దరు యువతులూ ఆమెను బలంగా పట్టుకున్నారు. ఆమె గింజుకుంటుండగానే ఆమె వంటి మీద దుస్తులు ఒకటొక్కటిగా తొలగించారు. అప్పుడామెను వదిలారు. సిగ్గుతో అవమానంతో ఆ యువతి ముడుచుకు పోయింది.
    "నువ్విక వెళ్ళవచ్చు" అన్నాడతడు. ఆమెకు నోట మాట రాలేదు.
    'ఊ వెళ్ళు...." అతడు గద్దించాడు. ఆమె సిగ్గు నుంచి బయటపడి మాట్లాడ్డానికి కాసేపు పట్టింది.
    "ఎలా వెళ్ళను ?' అందామె అప్పుడు.
    "నడిచి"
    "నా దుస్తులు నాకిప్పించు ...."
    "కృష్ణుడి ముందు గోపికలు దుస్తులు ధరించరు "
    "నువ్వు కృష్ణుడివి కాదు " అందామె.
    'అలౌకికానంద స్వామి! శ్రీ కృష్ణుడి అవతారం"
    'అంటే?"
    "అయన కుటీరం నీకు తెలుసు. ఇక్కడి నుంచి నువ్విప్పుదక్కడికే వెళ్ళాలి ' అన్నాడు గంబీరంగా.
    "నేను వెళ్ళను ' అందామె.
    "నేను నిన్నీ కుటీరంలోంచి బయటకు గెంటేస్తాను ...."
    'అప్పుడూ వెళ్ళక పొతే ?"
    "బయట మనుషులున్నారు. నువ్వు మర్యాదగా స్వామి కుటీరంలోనికి వెళ్ళకపోతే వాళ్ళు నిన్నా కుటీరంలోనికి కుక్కను తరిమినట్లు తరుముతారు "
    "నేను పారిపోతే?"
    "ఇలా నువ్వు పారిపోలేవు...."
    "గుహ దాటితే లోయ వుంది. అందులో దూకి ఆత్మహత్య చేసుకుంటే ?"
    "అంతవరకూ నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా గుహ బయటనే మా మనుషులిద్దరున్నారు. వాళ్ళు నీ ప్రయత్నం కొనసాగనివ్వరు...."
    ఆమె మాట్లాడలేదు.
    "నీకుద్యోగామిస్తానన్న ఆఫీసరు స్వామి భక్తుడు . అతడు నిన్ను స్వామికి కానుకగా సమర్పించుకున్నాడు. ఈ రాత్రి నువ్వు స్వామికి అంకితం కావాలి. ఆ తర్వాత ఆశ్రమం లోని స్వామి భక్తుల కంకితమై రెండు మాసాలిక్కడ గడపాలి. ఆ తర్వాత నువ్వు కోరిన చోట ఉద్యోగం ఇప్పించబడుతుంది. జీవితమంతా వైభవంగా జీవించవచ్చు ..."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS