ఆ అందాల ప్రతిమను చూడగానే అతని కనులలో కాంతి రేఖలు మెరుపులై మెరిశాయి. ఆప్యాయంగా చేతిలో తీసికొని ఆ విగ్రహం వంకే చూస్తుండి పోయాడెంతో సేపు. అనూరాధ అతనిలో కడులుతూన్న ప్రతి భావాన్నీ జాగ్రత్తగా పరిశీలించుతోంది.
ఏవో స్మృతులు లీలగా అతని కంఠనా పైకీ క్రిందికి దిగుతున్నాయి.
'ఇది...ఇది...ఆహా..లేదు...రాధా! ఎంత బావుందీ! ఎక్కడిది నీకు?' అతనికి గతం గుర్తుకురానేలేదెంత ప్రయత్నించినా.
'హరికృష్ణ గారే ! అంటే మీరే యిచ్చారు!'
'ఏమిటీ! నేనా? భలే! నీకు, నేనెందు కిస్తాను?!' నవ్వసాగాడతడు.
'రాధగా ఎంతో చక్కగా నాట్యమయూరి లా వున్నానని పొగడుతూ -- యిచ్చారు. అయినా నేను మీకేమీ గానా?'
"ఎమౌతావు?'
'ఏమీ గాను!' కావాలనే అన్నది అనూరాధ.
'అమ్మదొంగా! అబద్దం జేబుతున్నావా? నాకీ లోకాన వున్న సర్వమూ నువ్వే! రాధా! వో మాట! మరి నీ పెళ్లి అయిన తరువాత నన్ను కూడా మీ అత్తగారింటికి తీసుకు వెళ్తావా? నన్నెవరు చూస్తారు మరి నువ్వు వెళ్లిపోతే?'
ఆమె కనుల నిండుగా గిర్రున నీరు తిరిగింది. అశ్రుసిక్తనయానాలను వత్తుకుంటూ అన్నది.
'మిమ్మల్ని వదిలి నేనలా వెళ్లగలను?'
'గుడ్! ఒరేయ్! జోగులూ! ఓహో ప్రజల్లారా! వినండహో! నా రాధ నన్ను వదిలి వెళ్ళదట రాధా లాంటి మంచి పిల్ల లేదోయ్! లేదోయ్!'
చప్పట్లు కోడుతూ పెద్దగా పాటపాట సాగాడతడు.
అనూరాధ లజ్జభిమానాలతో మాట్లాడలేక పోయిందో క్షణం. ప్రక్కనున్న వాళ్ళూ, పని మనుషులూ విని నవ్వుతారన్న భావన రాగానే నిలువెల్లా సిగ్గుతో కుంచించుకు పోయింది.
'హుష్! అలా అరవకూడదు! రాత్రి పూట! అందరూ నిద్రబోతున్నారు.' వారించింది మృదువుగా.
అతడు బుద్ది మంతుడిలా కేకలు చలించి పడుకున్నాడు.
* * * *
రాజును యింటరు లో జాయిన్ చేసింది అనూరాధ. నెలలో నాలుగైదు సార్లు నృత్య ప్రదర్శన లివ్వసాగింది. నృత్యాన ఆ అనురాగమయి తారలా ప్రఖ్యాతి తో మెరిసిపోతోంది -- ఎంతోమంది ఎన్నోమార్లు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు.
హరికృష్ణ పరిస్థితి ఏమీ మెరుగు పడనే లేదు. ఆ ధోరణి లో విసింగించుతూన్న అతనిని ఎలా భరించుతుందో ఆ భగవంతునికే తెలియాలి అనుకుంటుంది శారద.
పసిబిడ్డలా లాలించుతుంది ఒక్కొక్కసారి. తల్లిలా శాసించుతుంది మరో మారు. అనురాగమయి లా ఆదరించు తుంది కొన్ని సార్లు. ఆ త్యాగమయి ఏ సుఖాన్నాశించి ఆ శాపగ్రస్తునితో తన నిండు జీవితాన్ని ముడి వేసుకుందో ఎవరికి తెలియదు. ఆస్తి కోసం కాదని ఆమె ప్రతి పైసా లెక్క వ్రాస్తున్న పుస్తకాలే చెబుతున్నాయి. హోదా కోసం అసలే గాదు. నృత్యం లో ఆమె వయారాలమయూరి ఒక్కొక్క ప్రదర్శనకు వేలు లభించుతున్నాయి.
పవిత్ర అనురాగబంధం ఒక్కటే అనూరాధ హరికృష్ణ ల జీవనవీణియ పై మధుర గీతాలను ఆలపించుతోంది.
డాక్టర్లందరో పరీక్ష చేశారు. ఒక్కరూ తమవల్ల అవుతుందని అనలేకపోయారు. అతని పిచ్చి ధోరణి నానాటికీ శ్రుతి మించి రాగాన పడుతోంది. అనూరాధ వోర్పు కూడా అనంతంగా పెరిగి వూడలు వేస్తోంది. దానితో పోటీ పడుతున్నట్లు. ఈరకం మనుష్యులను మార్చగల వో ప్రసిద్ద వైద్యుడు 'అతనికి సహజంగా మళ్లీ అలాంటి ప్రమాదం జరిగితేనే మతి వస్తుందని' చెప్పాడు.
'అనూరాధ హృదయం ;లోని ఆశా దీపిక చిన్నవోయింది. నీరజ మళ్లీ కబురంపింది రమ్మంటూ. ఆమెకీ సంగతి తెలియక అన్నయ్య ను కూడా తప్పకుండా తీసుకు రమ్మని చెప్పి పంపించింది. శారద కేం చేయాలో అర్ధం గాకుండా పోయింది.
అనూరాధ చెప్పవద్దనే అన్నది. అదృష్టాన్ని మరికొన్నాళ్ళు ఆరాధించుదామన్న ఆశతో.
ఆ రాత్రి ప్రొద్దు బోయినా హరికృష్ణ నిదురబోనేలేదు. అనురాధను పాట పాడమని వేధించాడు కొంతసేపు. రాధలా అభినయించమని ఆజ్ఞాపించాడు మరి కొంతసేపు. ఆ మధురాను రాగమయి గొంతు విప్పక తప్పలేదు.
విరిసిన మల్లియలు పరిమళాలని వెదజల్లుతున్నాయి తోటలో. మాలతీ లత వెన్నెల వెలుగులో చల్లని గాలితో సయ్యాట లాడుతోంది. అ చల్లని గాలికి హరికృష్ణ ఆనందంతో తనను తానె మరిచి అనూరాధ ప్రక్కనే కూర్చున్నాడు సిమెంటు బల్ల మీద.
'రాధా! వెన్నేలేందుకు చల్లగా వుంటుంది?' పసిపాపలా ప్రశ్నించాడు. యేమని సమాధానం చెపుతుంది? అది జవాబు లేని ప్రశ్న.
'నాకు తెలుసులే! నువ్వు నవ్వుతావు! నేనెపుడు మాట్లాడినా! అవునులే! పిచ్చి వాళ్ళ మాటలకి నవ్వు రాక ఏడుపు వస్తుందా?'
ఆ అనురాగమయి కదిలిపోయింది ఆవేదనతో.
'నవ్వడం లేదు హరీ! నవ్వడం లేదు. అంత అదృష్టాని కింకా నోచుకోలేదీ అనూరాధ.' లోలోన ఆక్రోశించింది ఆమె హృదయం.
'రాధా! చూడు! ఎలా నవ్వుతున్నాయో నీ తలలోని మల్లెలు నన్ను చూచే కాబోలు!, ఆవేదన పెల్లుబికిందా కంఠనా.
అనూరాధ వెంటనే మల్లెల్ని తీసి వేయాలని చేతులు ఎత్తింది. ఆ చేతుల్ని పట్టుకున్నాడు హరికృష్ణ మృదువుగా.
'వద్దు! రాధా! తీసివేయకు! నవ్వనీ! ఎంతమంది నవ్వినా నాకేం భయం లేదులే! నువ్వున్నావుగా! నాకోసం!' అంటూ చేతుల్ని ముద్దు పెట్టుకున్నాడు మృదువుగా.
అనురాధ నిర్ధాంత పోయింది అతని ఆవేశానికి. అతని వంక చూసింది పరీక్షగా. ఏ భావమూ లేదా కనులలో, పువ్వులా విరిసిన అనురాగం మాత్రం దివ్వెలా మెరిసిపోతోంది.
చేయి తీసుకో బోయిందామె. అతడు నవ్వాడు విరక్తిగా.
'భయం వేస్తోందా? రాధా! పిచ్చి వాణ్ణి గాదుగా! ఇదిగో ! రాధా! నిన్న వో పెద్ద మనిషి ఏమన్నాడో చెప్పనా! మరి నువ్వు కోప్పడగూడ దమ్మాయ్! మరి...ఆ....'అనూరాధ మీ భార్యా!' అన్నాడు. అదిగో ! నీకు కోపం వచ్చేస్తోంది...అయితే చెప్పనులే --'
'ఆహా! కోపం లేదులెండి ! చెప్పండి !'
'అపుడు నేనేమన్నానో తెలుసా? 'ఏడీశావ్! భార్యేమిటి ? అసలు భార్య ఎలా అవుతుందోయ్? రాధ నాకు దేవతోయ్! దేవత! ఏం నీ కళ్ళు గుడుతున్నాయా బాబూ! అలాంటి దేవత నీకు లేదని! పోవోయ్!' అన్నాను . బాగా అన్నాను గదూ!'
అనూరాధ హృదయాన అనురాగం, ఆవేదన అవధులే లేని అనంత సంద్రాలై మోతలు పెట్టసాగాయి. కనుల నుంచి అవిరామంగా కారిపోతున్నాయి అశ్రు ధారలు.
'ఇదేమిటి!! రాదా! నువ్వు.... నువ్వు! ! ఏడుస్తున్నావా? ఎందుకూ? నా మాటలు బావుండలేదా?! చెప్పు! మరీ భయం వేస్తోందా? నేనున్నానుగా!' అతడామే ముఖాన్ని తన ఒడిలోకి తీసికొని కన్నీళ్లు తుడిచాడు.
'ఏడవకు ! రాధా! ఆ పెద్ద మనిషిని ఈసారి ఏం చేస్తానో చూడు! ఎలా అన్నాడు?!!'
ఆమె దుఃఖం అరనే లేదు. ఆవేదన ఉపశమించనే లేదు. అతని ఒడిలో నుంచి లేవలేక పోయింది. పసిబిడ్డ ని తల్లి లాలించినట్లు బ్రతిమాలుతూన్నాడా డాక్టరు. ఎంతో సేపటికి తనను తాను నిగ్రహించుకున్నదామె . లేచి అశ్రుసిక్త నయనాల్ని వత్తుకుంటూ అన్నది---------
'ఈసారి మిమ్మల్ని ఎవరైనా అడిగినపుడు 'నిజమే! అనూరాధ! నా భార్యే నని చెప్పండి!' అ మధుర కంఠనా నిశ్చయం ఖంగున మ్రోగింది.
'చెప్పనా?!! సరే!-- ' అతడు తల వూగించాడు అమాయకంగా.
'అలా అంటే తప్పు గాదా? రాధా!' రహస్యంలా నెమ్మదిగా ప్రశ్నించాడు . కనులతోనే కాదని సూచించిందా అనురాగమయి.
ఆ తరువాత హరికృష్ణ నిదుర వస్తోందంటూ లేచాడు. నడుం వాల్చగానే కనులు మూతలు పడ్డాయి. అనూరాధ దుప్పటి కప్పి, తలగడ సరిగా అమర్చి వెళ్ళిపోయింది.
ఎంతరాత్రి గడిచినా ఆత్యాగ మయికి నిదురే రాలేదు. అలాగే కూర్చుండి పోయింది. ఎన్నో వూహలు ఆమె అంతరంగాన మల్లెల్ని పరుస్తున్నాయి. మాలతుల్ని జల్లుతున్నాయి. పరిమళాల్ని పంచుతున్నాయి --
'ఏమిటీ అనురాధ జీవితం యిలా అయిపొయింది?! నెన్నెల వెలుగుతూనే వుంది. కానీ అంధకారం చుట్టుతా వల అల్లుతూనే వుంది అంత కాంతిలోనూ. మనసు వుంది. మమాతల మల్లెలున్నాయి. అందుకనే దేవుడున్నాడు. కానీ ..ఆ దేవుడు శిలా విగ్రహం!!
జీవితాన్నే కానుకగా అందించానే! అనురాగ మాధుర్యాన్ని హారతిగా మలచు కున్నానే! ఇంకా ఎన్ని యుగాలకీ శాపానికి విముక్తి లభించుతుంది?! వో తీరం అంటూ లేదేమో? ఈ జీవన కుసుమం అర్చనకు తగదేమో/ అడవిని గాచిన వెన్నెల కాదు గదా నా బ్రతుకంతా?!....
కృష్ణా! మీకెలా చెప్పను? యేమని చెప్పను? ఎంతని విన్నవించుకోగలను? ఈ మూగవేదనని ఎలా భరించను??
మీరు ...మీరే ఈ అనూరాధ హృదయ మందిరాన వెలుగుతున్న అనూరగ మూర్తు లని ఎవరికి చెప్పను?! మీకా? నవ్వుతారు విని? తప్పు గాదూ! అంటారు. దేవతనంటారు. నేనున్నాను నీకు! అంటారు. కానీ ... ఆ అక్షరాలలో మీ మనస్సు లేదు. ఆ కనులలో అనురాగం నన్ను నవ్వనీయదు. ఆవేదన రగిలించుతుంది. మీ గుండెలలో నా తలపుల గూడులున్నాయి ! నిజమే! కానీ అని మీకు తెలియదు! తెలియజెప్పినా విన్పించుకోలేరు!!
ఆ భగవానుడు మనల్ని నిర్దాక్షిణ్యంగా శపించాడు! కృష్ణా! అవును. నిజమే! ఘోరంగా శిక్షించుతున్నాడు! అది ఆయనకు అట! మనకు వేదన. భగవంతుడు అందరి కన్నా వుత్తమోత్తమ న్యాయమూర్తి! ! ఎలా అవుతాడు కృష్ణా!! నువ్వేం అపరాధం చేశావని నిన్ను శిక్షించాడు?!
మల్లెలు విరిసిన నీ బ్రతుకున్న నిప్పులు కురిపించాడే!!! ఎందు కంత శిక్ష!!! నవ్వులు నిండిన నీ మనస్సున రాళ్ళను రువ్వాడే!౧ ఏ అపరాధాని కంత ఆగ్రహం?! వెన్నెల నిండిన నీ గుండెలలో చీకటి గదుల్ని అల్లాడే! ఎంత కరుణా మయుడో! చూడు!!!
నిన్నే నమ్ముకున్న నాకు ఏం యివ్వాలని వ్రాసి వుంచాడో!? ఎవరు చెప్పగలరు?! తీర్పు కూడా లేకుండా కాల గర్బం లో లీనమౌతాయి కొన్ని బ్రతుకులు. అలా కాదు గదా మన అదృష్టం కూడా?' భావనల బరువుతో ఎప్పటికో కలత నిదురలోకి జారిపోయిందా అనురాగమయి.
