Previous Page Next Page 
ఇందుమతి పేజి 15


    వచ్చిన స్నేహితులందరి కీ ఇంటి వద్దనే మాణిక్యమ్మ గారు ఫలహారాలు తయారు చేసి కాఫీలు పెట్టింది. పెద్ద గదిలో విశాలమైన ఒక జంబుఖానా పరిచి అందరినీ అక్కడే కూర్చో పెట్టారు. ఇందుమతి ఒక తెల్లని సిలకు చీర కట్టుకుని మెడలో తన రెండు పేటల గొలుసూ, జడలో కనకాంబరాల దండా ధరించి, రేవతీ సహితంగా వచ్చి అందరికీ నమస్కరించి సరస్వతి పక్కన కూర్చున్నది. సరస్వతి మంచు వంటి తెల్లని శరీర చ్చాయ కలది. ఆమె కన్నులు విశాలమయినవి. నిడుపైన నల్లని కురులతో వదులుగా జడ వేసి చివరలు వదిలి వేసింది. ఆ వేణి యమునా ప్రవాహం లాగ నిమ్నోన్నతాలు అధిగమించి ఓంపుగా మ్ సోంపు గా పిక్కలకు తగులుతున్నది. మెడలో సన్నని ఒంటి పేట గొలుసు ఆమె సౌందర్యానికి వన్నె తెస్తున్నది. నుదుట దాల్చిన ఎర్రని తిలకం వాణీ దేవి పద్మాసనం లా గున్నది. 'అసమానం ఆ సౌందర్యం!' అని తోచింది ఇందుమతి కి.
    ఇందుమతి ని ప్రీతితో పలకరించి, ఆమెను తనివితీరా చూసింది సరస్వతి. ఆమెలో ఏదో అసాధారణ మైన ఆకర్షణ కనిపించింది సరస్వతి కి. శరన్మేఘాల లావణ్యము, వెన్నెలల మాధుర్యము అంతా పిండి ఈ బాలికా శరీరం లో నింపినాడు కాబోలు విధాత అనుకున్నది.
    మిత్రులు ఇందుమతి ని ఒక పాట పాడమన్నారు. తాను సంగీతం నేర్చుకోలేనన్నది ఇందుమతి.
    సహజ గాన పారీణలకు నేర్చుకోవలసిన అవసరం లే" దన్నది సరస్వతి.
    "నే నటువంటి పారీణను కా" నన్నది ఇందుమతి.
    "క్షమించాలి. మీరు బాగా పాడతారని రాజశేఖర మూర్తే మాకు చెప్పడు .' బొంకాడు హనుమంత రావు.
    "ఎప్పుడురా నేను నీకు చెప్పింది?" అని అతని వీపు పై ఒక్కటి చరిచాడు రాజశేఖర మూర్తి. ఇందుమతి భర్త వైపు చురచురా చూసింది.
    "నేనే పాపం ఎరగను" అన్నట్లు చూశాడు రాజశేఖర మూర్హి.
    "పోనీ, రవీ పెళ్ళికి వెళ్ళావు గదా? నువ్వు నిజంగా చెప్పరా, మీ చెల్లెమ్మ కు సంగీతం వచ్చో రాదో?' అన్నాడు మనోహర రావు.
    "నాకు తెలియదు బాబూ, నేను మాత్రం వినలే" అన్నాడు రవి.
    "ఒరేయ్ , రాజూ, మీ ఆవిడ పాడక పొతే నువ్వు పాడవలసి వస్తుంది." అని బెదిరించాడు హనుమంత రావు.
    "సరే, నేను పాడితే మీరందరూ చాలక మరొక పది గాడిదలు పరిగెత్తుకు వస్తాయి" అని నాలిక కొరుక్కుని, "క్షమించాలి, సరస్వతీ దేవి, మిమ్మల్ని గురించి కాదు నేనంట." అన్నాడు రాజశేఖర మూర్తి. సరస్వతి నవ్వి ఊరుకున్నది.
    "అలా ఏం జరగదు. మా బావ మాత్రం చక్కగా పాడగలడని నాకు తెలుసు. మారేవి రావు సరి కదా , ఇక్కడ కూర్చున్నవి లేచిపోవని నేను హామీ ఇస్తున్నా" నన్నాడు రవి.
    "నాకు తెలుసురా నువ్వు పాదతావనీ . కానియ్ " అన్నాడు మనోహరరావు.
    "మూర్తి గారూ, ఇక మీకు తప్పదు" అన్నది సరస్వతి.
    రాజశేఖర మూర్తి గొంతు సవరించుకుని,
    'ప్రియే చారుశీలే, ప్రియే చారుశీలే,
    ముంచ మయి మానమని దానమ్,
    సపది మదవాని లో దహతి మమ మానసమ్,
    దేహి ముఖ కనుల మధుసానమ్"
    అని మధుర స్వరంతో పాడాడు.
    ఎంత చక్కగా పాడాడు భర్త! ఇందుమతి కీ ఇంత వరకు తెలియదు భర్త పాడగలడని. అ పదం పాడినంత సేపు అతని అరమోడ్పు కన్నులు తన వైపే చూస్తున్నవి. సరస్వతీ దేవి ఏమనుకున్నదో?
    "చాలా బాగా పాదావురా. స్త్రీల కన్న పురుషులే నయమని పించావు" అన్నాడు హనుమంతరావు.
    "ఏమమ్మా, ఇందుమతీ, స్త్రీ జాతి మీదే దెబ్బ తీస్తున్నారు వీళ్ళు. ఈ సవాలు ఇలా వదిలి వెయ్యట మేనా?" అన్నది సరస్వతి.
    "మీరు పాడండి" అన్నది ఇందుమతి.
    "సరే, నేను ఎస్త్రానామీయే నేర్చుకోనా, సంగీతమే నేర్చుకోనా?' అన్నది సరస్వతి.
    "సరస్వతీ దేవికి సంగీతం రాకపోవట మేమిటి?" అన్నది ఇందుమతి.
    'అమ్మాయీ, పెళ్లి కూతురివి నువ్వు కనక నువ్వే పాడాలి" అని తప్పుకుంది సరస్వతి.
    "పాడక్కా" అన్నది అంతవరకూ మాట్లాడకుండా కూర్చున్న రేవతి.
    "ఆహా! అయితే పాదగలదన్న మాట. ఇక తప్పదు" అన్నాడు హనుమంతరావు.
    ఇందుమతి రాజశేఖర మూర్తి వైపు చూసింది. అతను చిరునవ్వు నవ్వాడు. ఇందుమతి తల వంచుకుని మంద స్వరంతో పాడింది.
    "ఒంటిగా ఉయ్యాల లూగితివా
        నా చిన్ని కృష్ణా
    జంటగా నేను బిల్వ తగదోయీ!"
    రాజశేఖర మూర్తి తన భార్య ఇంత చక్కగా పాడగలదని ఎరగడు. పెళ్లి చూపులప్పుదైనా పాడించలేదు. ఆమె పాడినంత సేపు అతని మనస్సు ఉయ్యాలలే ఊగింది.
    సరస్వతి ఆమెను తన కౌగిలి తో అభినందించింది. మిత్రులందరూ సంతృప్తులై రాజశేఖర మూర్తి కి, ఇందుమతి కి తమ శుభాకాంక్షలు తెలిపి వెళ్ళిపోయారు. తరవాత రాజశేఖర మూర్తి "ఇందూ ఇంత చక్కగా పాదగలవని నేనెరుగను సుమా!" అన్నాడు.
    "మీ కంటేనా? మీరు కవులనే అనుకున్నాను కాని, గాయకులని ఎరగను."
    "నిన్ను చూసిన నాటి నించీ కవిత్వమే కాదు, గానం కూడా వచ్చినట్టుంది. నీ ప్రభావమే."
    "నేనేమీ సరస్వతీ దేవినా?"
    "సరస్వతి నా సహాధ్యాయిని."
    "ఈ ఆరాధ్య దేవత ఈమేనా?"
    "స్త్రీ స్వభావం పోనిచ్చుకున్నావు కాదు. నా ఆరాధ్య దేవత ఎవరో నీకు తెలియదా?"
    "మీకు కోపం వచ్చినట్లున్నది . పోనియ్యండి. నవ్వుల కన్నాను."
    "కోపం లేదు, ఇందూ. విద్యాది దేవత అయిన సరస్వతీ దేవి నాకెప్పుడూ ఆరాధ్య దేవతే. సహద్యాయిని సరస్వతి అంటే నాకెంతో గౌరవం. గణిత శాస్త్రం లో సరస్వతి కీ నాకూ ఎప్పుడూ ప్రధమ స్థానం కోసం పోటీ. ఆమె చాలా తెలివి గలది. స్త్రీలలో గణిత శాస్త్రం అభ్యసించే వారు  తక్కువ. అబ్యాసించినా అంత చక్కగా అవగాహన చేసుకోగల వారు మరీ తక్కువ. ఆమె సరస్వతీ దేవి అపరావతారం. ఆమెను గురించి వేరుగా భావించ డానికి కూడా నా మనసొప్పదు."
    "మీ మనస్సు నాకు తెలియనిది కాదు."
    దీపావళి వచ్చింది. ఆ ఇంటిలో ఈ ఏడు దీపావళి ఎన్నడూ ఎరగని శోభతో జరిగింది. మతాబుల వెలుగు లో ఇందుమతి పాశ్చాత్యుల డయానా దేవతలా శోభించింది. దీపికా పంకుల నడుమ ఇందుమతి తారా మండలం లో చంద్రికలా భాసించింది. ఆ రెండు రోజులూ మళ్ళీ రాజశేఖర మూర్తి ఇందుమతి కొంగు పట్టుకు తిరిగాడు. ఇంక నారాయణరావు గారు వచ్చి ఇందుమతి ని తీసుకు వెడతారు. నెల రోజులు ఇందుమతి తో చనువుగా తిరిగాడు. ఆమె వెళ్ళిపోతే ఆ వియోగం ఎలా భరించటం? ఆ తలపు తో గుండెలో ఏదో అడ్డు పడ్డట్ల యింది.
    దీపావళి అయిన మరునాడు నారాయణరావు గారు వచ్చి విదియ నాడు ఇందుమతి నీ, రేవటినీ తీసుకు వెళ్ళారు.
    
    
                                  17
    సెప్టెంబరు పరీక్షల ఫలితాలు తెలిశాయి. మాధవరావు మళ్ళీ తప్పాడట. గుంటూరు వచ్చిన తరవాత రాజశేఖర మూర్తి శారదను గూర్చి మాధవరావు కు ఒక ఉత్తరం వ్రాశాడు. ఆ ఉత్తరానికి జవాబు లేదు. ఇంతలో ఈ అశుభం. అతడసలె సున్నితమైన హృదయం కలవాడు . ఏ అఘాయిత్యం తలపెడతాడో అని బాధపడ్డాడు రాజశేఖర మూర్తి. ఆనతి కాలానికే మళ్ళీ వార్త వచ్చింది. అనుకున్నట్టే అయింది. మాధవరావు ఇల్లు విడిచి ఎవరితోనూ చెప్పకుండా వెళ్ళిపోయాడట. ఎక్కడికి పోయింది తెలియదు.
    అవి రెండో ప్రపంచ మహా సంగ్రామం ప్రారంభించిన రోజులు. బ్రిటీష్ ప్రభుత్వం వారు తమ సైన్యాలతో యువకుల ననేకులను చేర్చు కుంటున్నారు. జాతీయవాదులు తమకీ యుద్దంతో ఎట్టి సంబంధం లేదన్నారు. అయితే నేం, తిండికి లేని వారు, జీవితం లోపించిన వారు, నా అన్న వారు ఎవ్వరూ లేని వారు వేలాదిగా పోయి సైన్యంలో చేరుతున్నారు. వీరిని తీసుకుని పోయి బ్రిటీష్ వారు ఏ ఆఫ్రికా దేశాలలో నో, మధ్య ప్రాచ్యం లోనో, దూర ప్రాచర్యం లోనో శత్రు శతఘ్నులకు ఎరా చేస్తున్నారు. మాధవరావు కూడా సైన్యం లో చేరాడేమో అనుకొన్నాడు రాజశేఖర మూర్తి.
    సంక్రాంతి కి రాజశేఖర మూర్తిని అనంత వరం రమ్మని ఆహ్వానం పంపించారు అనంత కృష్ణ శర్మ గారు. క్రిస్ మష్ సెలవులు సంక్రాంతి కి ముందే అయిపోతాయి. సంక్రాంతి కి రెండు మూడు రోజులు మాత్రమే సెలవులు. కనక ఇప్పుడు రా వీలులేదని జవాబు వ్రాశాడు రాజశేఖర మూర్తి. పెళ్లి అయిన ఏడాది లోపల అత్తవారు అల్లుణ్ణి ఒకమారు తమ ఇంటికి ఆహ్వానించడం ఒక ఆచారం. ఉగాది సంవత్సరంతానికి జరిగే పరీక్షల ముందు వస్తుంది. కనక అప్పుడూ అత్తవారింటికి వెళ్ళటానికి వీలు ఉండదు. వేసవి సెలవు లిచ్చిన వెంటనే బయలుదేరి వెళ్ళవచ్చును లెమ్మను కున్నాడు రాజశేఖర మూర్తి. అతని కెప్పుడూ ఇందుమతీ సాన్నిధ్యం లో ఉండాలనే అనిపిస్తుంది. కాని, చదువులకు భంగం వాటిల్లరాదు.
    మాధవరావు ఇల్లు వదిలిన రెండు నెలలకు తండ్రి గారికి ఒక జాబు వ్రాశాడు. అది పెషానారు నించి వచ్చింది. సైన్యం లో చేరి పెషానరు లో తర్ఫీదు పొందుతున్నాడట! తనకోసం బాధపడవద్దని వ్రాశాడు.
    వేసవి సెలవు లలో వచ్చి నాలుగు రోజులు తమ ఇంటిలో ఉండి పొమ్మని దివాకర రావు గారు, కేశవరావు గారు, నారాయణ రావు గారు రాజశేఖర మూర్తి కి ఆహ్వానాలు పంపారు. అనంత కృష్ణ శర్మ గారి ఆహ్వానం ఉండనే ఉన్నది వైశాఖ మాసం లోపల ముందు అనంతవరం వెళ్ళాలి. అక్కడ ఒక వారం రోజులు ఉండి తరవాత మిగిలిన చోట్ల కు పోవచ్చును. ఇందుమతి ని కూడా తనతో తీసుకుని పోవాలను కున్నాడు రాకశేఖర మూర్తి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS