Previous Page Next Page 
మమత పేజి 15

 

    ఆ ఊళ్ళో మొదటిసారి రేడియో పెట్టించింది  రాజయ్యగారే. కుర్రకారులో మొదటిసారి మూడు చక్రాల సైకిలెక్కి తిరిగింది రాజయ్యగారి కొడుకే. 'రాజయ్యకధ యింతగా మలుపు తిరుగుతుందని మంగపతి కల కనలేదు. ఆ జీపు కారు వల్ల, రాజయ్యగారికి , ఈ మూడు చక్రాల సైకిలు వలన స్వామికీ లోకంలో అంతులేని గౌరవం పెరిగిన మాట నిజం.
    ఈ సందర్భంలో మంగపతి భార్య గర్భవతి అయ్యింది. తాలూకా కచ్చేరీకి వెళ్ళి తిరిగి వస్తూ ఒకానొక శుభమూహుర్తాన మంగపతి స్వయంగా- జరిగిపోయిన వన్నీ మరిచిపోవడం ఉభయులకూ ధర్మం -- అనుకుంటూ రాజయ్య గారి యింట్లో- ఐదు సంవత్సరాల విరామం తర్వాత మళ్ళీ అడుగుపెట్టడం జరిగింది!
    "ఏం బావా! యిప్పటికి దయ కలిగిందా?' అంటూ ధాన్యం నలుపుతూనే బావమరిదిని పరమార్శించారు రాజయ్యగారు.
    పశ్చాత్తాపంతో క్రుంగి పోతున్నట్లు పాలిపోయిన మంగపతి తలవంచుకుని-- 'అన్నివిధాలా పెద్దవాడివి . మేం తప్పులుచేస్తే, క్షమించి నువ్వు కడుపులో పెట్టుకోక పొతే -- ' అంటూ అస్పష్టంగా చివరి మాటలు మ్రింగేసిన మంగపతి భుజం మీద బిగ్గరగా నవ్వుతూ చరిచి ' మొత్తానికి కర్ణానివనిపించావు. నేనెంత పెద్దవాడ్నో నీకు తెలియకనా? ' అంటూ వేళాకోళం పట్టించారు రాజయ్యగారు.
    కాంపౌండు లో ఆగిన పది,పన్నెండు లారీలనూ, రాసులుగా నిలిచినా ధాన్యాన్ని ప్రత్యక్షంగా చూసిన మంగపతికి, రాజయ్య గారి పెద్దరికం విషయంలో అనంత అనుమానం తాలేదు.
    బావా!అంతకుముందు బిజినెస్ ల రవ్వంత కూడా అనుభవం లేనివాడివి కదా? ఎలా నెట్టుకోస్తున్నావయ్యా బాబూ ఇంత వ్యాపారం?' అని అడిగి రాజయ్యగారి సమాధానం కోసం అలనాడు శ్రీకృష్ణపరమాత్మ ;ఉవాస'కు భక్తీ శ్రద్దలతో నిరీక్షిస్తున్న అర్జనుడీ ఫక్కి లో నిలబడ్డాడు మంగపతి - ఇనప పెట్టెలోని నోట్ల కట్టలను  తేరపార చూస్తూ వినమ్రుడై.
    అదొక సృష్టి రహస్యంలా దాచి సమాధానంగానిండైన చిరునవ్వు చిందించి - ధాన్యం తాలూకు డబ్బు - 'వేల కట్టలు' రైతులకు పంచి పెట్టడం మొదలుపెట్టారు. ఆ మాత్రం చిరునవ్వు కే సంతృప్తి పడిన మంగపతి 'ఇదంతా నా అల్లుడి అదృష్టం'అంటూ సంబరపడి పోయి, అపేక్ష ముంచు కొచ్చి పదిగజాల దూరంలో మూడు చక్రాల సైకిలు తొక్కుతున్న అల్లున్ని - స్వామిని--అమాంతం పక్రుగున పోయికౌగలించుకుని ముద్దాడుకుంటూ ఎత్తుకుని మళ్ళీ రాజయ్యగారి సమక్షానికి వచ్చాడు.
    'ఈ సీజన్లో ఎంత తిరిగిందేమిటి వ్యాపారం?' అంటూ లాలనగా భోజనాల దగ్గర ప్రశ్నించాడు మంగపతి.
    'పదిలక్షలు.'
    'అయితే - పది లక్షలే - అయితే మా అల్లుడికి రెండు లకారాలన్నా వెనక వేశావన్న మాట. ఇంక మా సంబంధాలు చేసుకుంటారూ?'
    'ముందు కూతుర్ని కను అన్నయ్యా! అల్లుడేక్కడికి పోతాడు కానీ -- అంది 'రాక రాక వచ్చిన అన్నయ్య చేతిలో మరింత నెయ్యి గుమ్మరిస్తూ సీతమ్మగారు.
    'అయితే బిజినెస్ లో ఏడాదికి ఒక లకారమన్నా మిగులుతున్నదంటారా బావా!
    "మిగలడం తగలడం ఆలోచించే ఏ మనిషీ వ్యాపారం చేయలేదు బావా.ఈ బిజినెస్ పెట్టిన రోజున చేతిలో పట్టుమని పదివేలు లేకపోయాయి. ఇప్పుడంటావా? వేలకూ లక్షలనూ అంతుచిక్కడం లేదు. ఈ రోజుల్లో వ్యాపారానికి కావలసింది చొరవ బావా. మొండి తెగింపు ఉండాలి. రూపాయి వచ్చిందని పొంగి, అర్ధ - పోయిందని కృంగె మనిషి -- గుండె పోటోచ్చి మంచాన పడ్తాడు. చొరవగా నడిస్తే - గిట్టుబడి వుంటుందనుకో"
    "నిజమే బావా! నాలుగు డబ్బులు కళ్ళ జూడాలంటే బిజినెస్సే సుమా! ఉద్యోగాలలో ఏముంది బావా? ఏదో సామెత చెప్పినట్లు- గొర్రెకు బెత్తెడు తోకనీ. మా తాసీల్దారు సన్నాసున్నాడు -- ఇత్తడి చెంబనుకో -- అసలు పూర్వజన్మలో మహా పాపం చేసిన వాళ్ళకే ఈ కొలువులు ఈ చివాట్లునూ. దులిపెశాడనుకో. మా వెట్టి' వెంకన్న ముందు పట్టుకుని ఆ పీనుగు! పాపం కాదంటావా బావా చెప్పు ?'
    'నిజమే అనుకో. పదిమంది మన చేతి క్రింద పని చేయడం జరిగినప్పుడు అదొక తృప్తి.ఒక మనిషి కారణంగా మనం పదిరూపాయలు తిన్నప్పుడు -- అతగాడు అందులో అయిదు రూపాయలు తిన్నా తప్పు లేదంటాను నేను.'    
    ఇలాగే చాలాసేపు చెప్పారు రాజయ్యగారు.
    వళ్ళంతా చెవులు మోలిచినట్లయింది మంగపతికి.
    రాజయ్యగారిని గురించి చిరకాలంగా తాను ఎంత పొరపాటు పడింది అర్ధం చేసుకున్నాడు మంగపతి. 'ప్రపంచంలో అరగానికి మారని అప్రయోజకుడి కిచ్చి దాని గొంతు కోశాడు మా నాన్న' అనుకున్నాడు. పదిమందితో అన్నాడు. ఈనాడు రాజయ్య ప్రయోజకత్వముందు తనకు తానె అల్పజీవిగా కనిపించాడు. ' బావ గారి తో జీపెక్కి తిరిగిన రెండురోజులూ ఎంత ఆలోచించినా ఆయన  ఆధిక్యత ఏమిటో అర్ధంకాలేదు మంగపతికి. తానూ ఏ విషయంలో తెలివి తక్కువ వాడో అంతుచిక్కలేదు.సవాలక్ష లిటిగేషన్ల లో తిమ్మిని బ్రహ్మి చేసిన తన బుర్రతో తెలివికి తక్కువ లేదనే నమ్మకంతో యింతకాలం బ్రతికిన మనిషి . నిజానికి 'రెండు రెళ్ళు మూడు' అని నిరూపించి కలెక్టర్ల మతులు పోగొట్టిన మేధావి మంగపతి.
    ఈసారి రాజయ్య గారిని చూడగానే జ్ఞానోదయం లాంటి సంచలనం కలిగినది మెదడులో.    
    'కరణీకం వెలగబెడుతూన్నాగాని బావా - ఏం చెప్పను? ఆడంగులుకు కాలాలెన్నో తెలియని ప్రతి గాడిదనూ యింటి అల్లుళ్ళ మాదిరి మేపుతూ -- అప్పులు చేసి- తాలూకా కచేరీ చుట్టూ కాళ్ళకు బలపాలు కట్టుకు పదిక్షణలు చేస్తే -- నెలకు సర్కారు వారు నెత్తిన గుమ్మరించేది ముష్టి పాతిక రూపాయలు. లోగడ దస్తావేజులూ గట్రా వ్రాస్తే - పది పాతికా చేతి కందేవి. ఈ పిదప కాలంలో నంటావా? బొడ్డూడని ప్రతి వెధవా సెకండు హాండు దస్తావేజుల మతలబు కనుక్కుని - రెండు రూపాయలు చేతిలో పెడితే చాలు- గీకి పారేస్తున్నాడయ్యా ఎంత లావుపాటి దస్తావేజయినా తర్వాత కొట్టుకు చావండంటూ . ఈమధ్య మరీ కటకట పడిపోతున్నానుకో.' అంటూ కరుణరస ప్రధానంగా తన పరిస్థితుల్ని చెప్పుకుంటూ 'నాకూ ఏదన్నా వ్యాపారం చేయాలనుంది బావా?' అంటూ తన జీవుడు పడుతున్న వేదనను దీనాదిదీనంగా వివరించి చెప్పాడు మంగపతి.
    రాజయ్యగారి భార్య సీతమ్మగారు కూడా 'అన్నయ్య' మాటలకూ నంతగా అంతకు ముందే వాగ్దానం చేసినట్లు ఒక మంఛి మాట వేయడం జరిగింది భర్త చెవుల్లో. తనను యింతకాలం అప్రయోజకునిగా భావించిన మంగపతి - అంతకు తగ్గి - అంత దీనంగా తన సహాయం అర్ధించడం- రాజయ్యగారికి కూడా తృప్తి కలిగించింది. మొత్తానికి మంగపతి కరణీకం అమోఘంగా పనిచేసింది.
    బావ- మరిదీ- ఇద్దరూ ఉమ్మడి వ్యాపారం ప్రారంభించారు.
    చిరకాలంగా నిలిచిపోయిన రాకపోకలు మళ్ళా ప్రారంభమయ్యాయి.
    కూతురు శ్రీదేవి పుట్టగానే పరుగు పరుగున వచ్చి 'ఒరెయ్! స్వాములు నీకు పెళ్ళాం పుట్టిందిరా' అంటూ ఆకాశానికేత్తాడు 'అల్లుణ్ణి' మంగపతి. దొడ్లో కాసిన అనస పిందేలూ, గుమ్మడి కాయలూ మోసుకొచ్చి రాజయ్యగారి వంటింట్లో గుమ్మరించి 'నీకివ్వమని నీ కోడలిచ్చింది సీతమ్మా' అంటూ ఆప్యాయంగా చెబుతున్న ' మంగపతి మామయ్యా' ను చూసి సిగ్గుపడి మెలికలు తిరిగేవాడు స్వామి.
    'ప్రపంచం - ఇద్దరినీ చూసి కృష్ణార్జునులను కుంటున్నదే సీతమ్మా మేం వ్యాపారం నడిపిస్తున్న తీరు చూసి....'
    లోకజ్ఞానం గల మనిషిగా పేరు తెచ్చుకున్న మంగపతి  -- పాములా అల్లుకు పోయాడు. బిజినెస్ లో కూడా. సంవత్సరానికి అగకాలం మంగపతి భార్యతోనూ -- పిల్లలతోనూ రాజయ్య ఇంట్లోనే ఉండేవాడు ( మైనారిటీ దాటుతున్నా పెద్ద బాలశిక్ష ను భక్తీ శ్రద్దలతో సహా) రాజయ్యగారి మతకుఎన్నడూ ఎదురు చెప్పలేదు మంగపతి. నువ్వు చెప్పినట్లు అలాచేశాను అనేవాడు.
    'లెక్కలు బావా' అని మంగపతి అన్నా ఎప్పుడన్నా -- "ఊరి మొత్తం లెక్కలు వ్రాసే వాడివి. నీ లెక్కల్లో తప్పేముంటుందిలే చూడటానికి?' అనేవాడు రాజయ్యగారు. క్రమ క్రమంగా ఆ విషయంలో గూడా రాజయ్య గారిని 'యిబ్బంది పెట్టటం' మానుకున్నాడు మంగపతి.
    తరచుగా తమ యింట్లోనే వుంటున్న అయిదారేళ్ళ కోడలు పిల్ల శ్రీదేవిని ఎత్తుకుని యినప్పెట్టే తెరిచి, మోయలేక పోయినా , 'ఎప్పటికైనా ఎవన్నీ నువ్వు పెట్టుకుని తిరగవలసిన దానివేనే మహాలక్ష్మీ లా" అంటూ తల్లి సీతమ్మ గారు ముచ్చట్లు చెప్పడం స్వామికి యింకా గుర్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS