Previous Page Next Page 
40 వసంతాల తెలుగుదేశం పేజి 14


                    

    (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి మొదలుకొని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడం వరకు 2014-19 నడుమ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ను ఉన్నత శిఖరాలను అధిరోహింపజేశారు.)
    
    విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రాధమికంగా వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోవడం చేత, ఆర్ధికాభివృద్ధి జరగాలంటే పారిశ్రామిక సేవారంగాలను ప్రోత్సహించాలని, తద్వారా యువతకు ఉపాధిని కల్పించాలని నిర్ణయించిన చంద్రబాబు నాయుడు ఇందుకోసం 2014-19 ,మధ్య కాలంలో నిరంతర కృషి చేశారు. అయన ప్రయత్నాలు సఫలమై, ఆంధ్రప్రదేశ్ పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించడమే గాకుండా, దేశీయంగా కూడా అనేక భారీ పరిశ్రమలను ఆకర్షించింది. దీనికి ప్రధాన కారణం వ్యాపార అనుకూల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ని తయారుచేయడం, ఇందుకోసం తొలుత ఏపి ఇండస్ట్రియల్ పాలసీ, ఏపి ఏరోస్పేస్, డిఫెన్స్ మాన్యుఫాక్చారింగ్ పాలసీ , ఏపి అటో మొబైల్ , అటో కంపోనెంట్స్ పాలసీ, ఏపి టెక్స్ టైల్ పాలసీ, ఏపి ఎలక్ట్రిక్ మొబిలిటి పాలసి మొదలైనవి తీసుకొచ్చి దిశానిర్దేశం చేశారు.

    (దేశంలో తయారయ్యే ప్రతి పది మొబైల్ ఫోన్లలో నాలుగు ఫోన్లు
    ఆంధ్రప్రదేశ్ లోనే తయారవుతున్నాయంటే దాని వెనుక తెలుగుదేశం
    ప్రభుత్వ కృషి ఎంతో ఉంది.)
    
    ప్రపంచ బ్యాంకు ఈజ్ ఆఫి డూయింగ్ బిజినెస్ ర్యాంకింగులను దేశంలో ప్రారంభించిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ రాష్ట్రంగా స్థానాన్ని సాధించింది. 2015 లో రెండో స్థానాన్ని పొందిన ఆంధ్రప్రదేశ్ , ఆ తర్వాత 2016,2017 2019 లలో వరుసగా ప్రధమ స్థానాన్ని సాధించి వ్యాపార అనుకూల రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. అనేక ఆటుపోట్ల మధ్య కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఇంత తక్కువ సమయంలో సులభతర వ్యాపారానికి అనుకూలంగా పాలనాయంత్రాంగాన్ని సిద్దం చేయడానికి చంద్రబాబు నాయుడు చేసిన కృషే కారణం.
    కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ (భారత పరిశ్రమల సమాఖ్య) ఒక్కో నగరంలో ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా భాగస్వామ్య సదస్సులను నిర్వహిస్తుంది. 2016-18 మధ్య వైజాగ్ లో మూడు సార్లు సిబిఐ భాగస్వామ్య సదస్సును నిర్వహించేలా చంద్రబాబు ఒప్పించగలిగారు. ఈ శిఖరాగ్ర సమావేశాలలో 19.6 లక్షల కోట్ల విలువైన 1,100 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. వీటిలో దాదాపు మూడో వంతు రాష్ట్రంలో రూపు తీసుకున్నాయి.
    చంద్రబాబు అధ్వర్యంలో రాష్ట్రమంతటా ప్రముఖ కంపెనీలు తమ ఫ్యాక్టరీలు నిర్మించాయి. అనంతపురం లో 12,900 కోట్ల రూపాయల పెట్టుబడితో కియా అటో మొబైల్ పరిశ్రమ ఏర్పాటు చేయడం వల్ల పెనుకొండ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయి. అటో పరిశ్రమకు కేంద్రమైన తమిళనాడును తట్టుకొని, కియా కార్ల యూనిట్ ను ఏపికి తరలించడంలో చంద్రబాబు చూపిన చొరవను దేశవ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు గుర్తించారు. దీంతో పాటు అనంతపురం లో బెర్జర్ పెయింట్స్, సుజ్లాన్ ఎనర్జీ, ఇండియా డిజైన్ ఎక్స్ పోర్ట్స్, టెక్స్ పోర్ట్, నిషా డిజైన్స్ చిత్తూరు జిల్లాలో ఫాక్స్ కాన్, ఇసుజు, అపోలో , కెల్లాగ్స్ కాంటినెంటల్ కాఫీ, విశాఖలో మెడ్ టెక్ జోన్, ఏషియన్ పెయింట్స్ కర్నూలు కడపలలో ఆసియా లోనే అతిపెద్ద సోలార్ పార్కులు తెలుగుదేశం హయాం లోనే రూపుదిద్దుకున్నాయి. నెల్లూరు లో అరబిందో ఫార్మా, గామెసా, భారత్ ఫోర్జ్, టాటా కెమికల్స్, సెంబ్ కార్ప్ లు , వైజాగ్ లో హిందుజా , ఏషియన్ పెయింట్స్, రాష్ట్రీయ ఇస్సత్ ఫైజర్ వంటి ప్రముఖ కంపెనీలు ఈ సమయంలోనే వచ్చాయి. 2016-2018 మధ్య జరిగిన అవగాహన ఒప్పందాల నుండి దాదాపు 1.75 లక్ష కోట్ల విలువైన 930 ప్రాజెక్టు లు మే 2019 నాటికి ఉత్పత్తిని ప్రారంభించాయి. వీటిలో సగానికి పైగా (59శాతం) రాయలాసీమలో, ఐదవ వంతు ఉత్తారాంధ్ర లో ఉన్నాయి. ప్రకాశం, నెల్లూరు, జిల్లాలలో పది శాతం ఉన్నాయి.
    దేశీయ , అంతర్జాతీయ కంపెనీలను ఆకర్షించడానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబే స్వయంగా పూనుకుని, చైనా, జపాన్ వంటి దేశ విదేశాలకు కాలికి బలపం కట్టుకొని తిరిగారు. దాహాస్ లో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక స్టాల్ ను ఏర్పాటు చేసి, ప్రపంచ వ్యాపార ప్రముఖుల దృష్టిని ఆకర్షించారు. దేశంలోను, ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్న సమయంలో ప్రభుత్వం మారడం వల్ల చేసిన కృషిలో చాలా భాగం బూడిద పాలైంది. అస్తవ్యస్త విధానాలతో పరిశ్రమలు పెట్టుబడులు రాష్ట్రానికి దూరమయ్యాయి.  

 


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS