Previous Page Next Page 
మళ్ళీ వచ్చిన వసంతం పేజి 15

 

    ఒక పదేళ్ళనాడు రామన్ అనే మనిషి పెద్ద చిట్ ఫండ్ కంపెనీ పెట్టాడు. పెట్టిన కొద్ది నెలలకే ఊహించరానంతగా వృద్దిపొందింది. ఆ కంపెనీలో ఎందరెందరో సభ్యులుగా చేరారు. మూడేళ్ళు ఎవరినోటంట విన్నా రామన్ చిట్ ఫండ్ కంపెనీపేరే.
   
    లలిత పెద్దనాన్నకొడుకు రిటైరయ్యాక వచ్చిన డబ్బు పెద్ద మొత్తంలో ఆ కంపెనీలోనే పెట్టాడు. ఆ కంపెనీ ప్రొప్రయిటర్ రామనే అతనడిగాడనే ఆడబ్బు ఇచ్చాడు - రెండునెలలు బాగా వడ్డీ  వచ్చింది.....అనుకున్న తారీఖుకి వడ్డీ డబ్బు వచ్చేసేది - ఇలా ఎందరో ఆ కంపెనీలో నెలనెలా డబ్బు కట్టడం, పాటపాడుకోటం జరిగింది - ఎన్నినేలలూ -ఐదునెలలు -అంతే, ఓ అర్దరాత్రి మొత్తం అందరి డబ్బుతోనూ పరారీ అయ్యాడు రామన్. లలిత పెద్దనాన్న కొడుకు అందరిలోకి బాగా నష్టపోయినవాడు. ఆ షాక్ తో అతనికి పక్షవాతం వచ్చింది. పెద్దనాన్న కొడుకుతో తనూ వెళ్ళింది నాలుగైదు సార్లు ఆకంపెనీకి - ఆ రామమే ఈ దినేష్ -కాదా! లలిత దినేష్ వంకే చూస్తోంది - అతు ఇతను కజిన్స్ అయివుండచ్చు - ఏమో -అతనూ కావచ్చు - లలిత రూంలోంచి బయటపడలేకపోయింది.
   
    'శారదా' నెమ్మదిగా పిలిచింది పక్కకి.
   
    'ఇతని పేరేమిటి'
   
    'దినేష్' -
   
    'రామన్ దినేషా -
   
    'అంటే' -
   
    దినేష్ చేతిలో కప్పుకి కిందపడింది - అరెరే - కాఫీ వలికిపోయింది శారద లోపాలకి పరిగెత్తింది - గుడ్డ తెచ్చి నేల వత్తింది - దినేష్ అటుతిరిగినుంచున్నాడు.
   
    'నీకు నేను రాత్రి ఫోను చేస్తాను - సరేనా - చాలా ముఖ్యమయిన విషయం మాట్లాడాలి' - లలిత శారదతో నెమ్మదిగా చెప్పి ఇంటికెళ్ళిపోయింది.
   
    'వెళ్ళిపోయిందా మీ స్నేహితులు' - దినేష్ కిటికీలోంచి చూడటం మానేసి వచ్చి సోఫాలో కూచున్నాడు.
   
    'హమ్మయ్య మంచికాఫీ పట్టుకురా' - శారద లోపలకెళ్ళింది దినేష్ కి గుర్తొచ్చింది ఈ అమ్మాయి.... చాలా ఏళ్ళనాటివిషయం.
   
    దినేష్ కి ఒక్క నిముషం భయమేసింది.....ఈ అమ్మాయి తనని గుర్తుపట్టింది - తన గురించి ఇంకేమీ చెప్తుందో శారదకి.....తనే ముందుగా ఆ అమ్మాయి గురించి కొన్ని కథలు కల్పించేస్తే, హాయిగా వుంటుంది - ఇలాటివాటిలో తను సిద్దహస్తుడు - అలాకాకపోతే తను ఇలా ఎలా బతుకుతున్నాడూ!
   
    శారద కాఫీ కప్పు తెచ్చింది. దినేష్ చాలా హుషారుగా వున్నాడు.
   
    'ఏమంటుందా అమ్మాయి' - శారద చేతిలో కాఫీ కప్పు పెట్టాడు "ఏమో, నాకేమీ అర్ధంకావటంలేదు - దినేష్ కాదు రామన్ అంటుంది ఏమిటో"-
   
    'ఎవర్ని చూసి ఎవరనుకుంటోందో - రామన్, రామన్ - ఓ మైగుడ్ నెస్ - రామన్ - దీర్ఘంతీస్తూ పాటలాపాడుతూ లేచి గంతులేసాడు దినేష్.
   
    "ఆ అమ్మాయిని తల్చుకుంటుంటే అంత హుషారా" నవ్వింది శారద.
   
    "ఆ అమ్మాయి గురించి నాకు చాలా తెల్సు. నీ స్నేహితురాలు కదా చెప్పటం ఎందుకని ఊరుకున్నా"-
   
    'ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసోచెప్పు' శారద దినేష్ వైపు తిరిగింది.
   
    'నువ్వు చెప్పుముందు' -
   
    'ఆ. ఆ అమ్మాయి నా ఫ్రెండు - చాలామంచిది - ఆ  అమ్మాయి ఇంట్లోనే రామం అద్దెకుండేవాడు - ఆ అమ్మాయి స్నేహం ద్వారానే నాకు రామనికి పరిచయమయ్యింది - మా పెళ్ళికి సాక్షి సంతకం ఆమే చేసింది. అయితే, ఇప్పుడా అమ్మాయి నేను విడాకులు తీసుకుంటున్నందుకు చాలా బాధపడుతోంది ఎలాగైనా మా కాపురం నిలబెట్టాలని.' శారద అంటుండగానే దినేష్ గొల్లున నవ్వాడు.
   
    'నువ్వు అదంతా నమ్ముతున్నావా. నీ కాపురం నిలబెట్టాలని చూస్తోందా. నాన్ సెన్సు. ఆ అమ్మాయి గురించి నేను ఏం చెప్పినా నువ్వు నమ్మవు' - దినేష్ అన్నాడు.
   
    'చెప్పు - ఏమిటో చెప్పు' చాలా తొందరచేసింది శారద.
   
    'ఇప్పుడు కాదులే - మళ్ళీ వస్తా - రేపొస్తా. అయినా ఇవాళే కదా నువ్వు ఊరినుంచి వచ్చావు. కొంచం రెస్టు తీసుకో. బై' దినేష్ వెళ్ళిపోయాడు. ఎంతమంచివాడో దినేష్, ఇప్పటి వరకు లలిత విషయం తనకు చెప్పకుండా దాచి, తనని రామం బారినుంచి రక్షిస్తున్నాడు! లలిత తన స్నేహితురాలని తెలిసి ఆమె గురించి తక్కువగా మాట్లాడకూడదనుకున్న సంస్కారి! లలిత గురించి ఏం చెప్తే ఏమీ బాధపడతానో అని తన మనసు నొప్పించకుండా  వుండాలనుకున్న సహృదయుడు ! శారద మనసులో దినేష్ పై గౌరవం అభిమానం వందరెట్లు పెరిగిపోయాయి.
   
    శారద అలానే కూచుంది. ఏడుగంటలయింది. చిన్నప్పుడు విజయ అక్క చెప్పింది. ఏదైనా చిరాగ్గ వుంటే, పీడకల వస్తే, భయమేస్తే, ప్రసన్నాంజనేయం, ప్రభాదివ్యకాయం' ఇలా చదువుకోమంది - కానీ శారద కొత్త సిద్దాంతాళ వెల్లువలో ఇవన్నీ పిచ్చగా, మూఢ నమ్మకాలలాగ కొట్టుకుపోతున్నాయి -
   
    ఆంజనేయుడొచ్చి రామన్ ఎవరో, లలిత ఎలాటిదో వివరించి తన మనసులో ఆవేదన పోగొడుతాడా - నాన్సెన్స్ - శారద లేచి లైటు వేసింది.
   
    'ఆంటీ - ఫోను' - మేడమీద నుంచి కేక పెట్టాడు ఇంటివాళ్ళబ్బాయి. శారద చిరాగ్గా లేచింది. మళ్ళీ ఎవరిఫోనూ ?
   
    'నేను లలితని' -
   
    'ఆ - చెప్పు'
   
    'అతను వెళ్ళిపోయాడా'
   
    'ఆ'
   
    'నేను మీయింటికిరానా, చాలా విషయాలు నీకు చెప్పాలి, శారద ఒక్కనిముషం ఆగింది. 'వెంటనే వచ్చేయి' - ఫోనుపెట్టేసింది శారద మెట్టుదిగుతోంది. అంతలోనే మళ్ళీఫోను.
   
    'ఊ చెప్పు'
   
    'ఆ అమ్మాయి వెళ్ళిపోయిందికదా, మళ్ళీ ఎప్పుడొస్తానందీ
   
    'ఎప్పుడో'
   
    'నేను వస్తున్నా'
   
    'ఇప్పుడా'
   
    'ఇప్పుడే'-
   
    'హలో, హలో' - ఫోను పెట్టేశాడు దినేష్.....శారదకి చాలా చిరాగ్గా వుంది. లలిత వస్తానంది - దినేష్ వస్తున్నాడు- ఎలాగ. ముఖాముఖి ఎవరేం చెప్తారో అయినా ఆ ఇద్దరూ ఒకరిపై ఒకరికి సదభిప్రాయం లేనపుడు తను ఇద్దరినీ ఒకచోట చేర్చకూడదు. తప్పు - శారద మనసు ఆ నిముషం తమాషాగా ప్రశాంతత పొంధింది - ఉపాయం ఉండాలి అంతే, అనుకుంటూ, అద్దంలో ముఖం చూసుకుంది బొట్టు సరిచేసుకుంది. ఇంటివాళ్ళ కూతురు ఆస్పత్రిలో పురుడు పోసుకుని ఇవాల్టికి మూడోరోజు. పిల్లాడినితను వెళ్ళి చూడలేదు. 'పిన్నిగారూ. ఈ రోజు ఆస్పత్రికి వెళ్ళి అమ్మాయిని చూసివస్తాను' 'వెళతావా. బుట్టతీసుకెడతావా. అందులో బ్రెడ్, పాలు వున్నాయి. ఒక బిస్కట్టు పాకెట్ వుంది' -


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS