Previous Page Next Page 
పగటికలలు పేజి 14


    "సరేపోనీ నిజమే పనుకుందాం.... మరి ఈ ఉద్యోగం- బేచలర్స్ కేగాని పెళ్ళిచేసుకున్న వాళ్ళకు యివ్వం మరి ఎలా?" అని తమాషాగా అడిగేడు దాసు?
    "అబ్బే.....నాకు....నాకు పెళ్ళి....కాలేదండీ!" అని తొందర్లో అనేసి నాలిక్కర్సుకున్నాడు.
    "ఏది నిజం?" అని గద్దించాడు గిరి-
    తప్పు తెలుసుకుని-"క్షమించండి" అంటూ నేలచూపులు చూడ్డం మొదలెట్టేడు, గిరి.
    "-పోనీ ఉద్యోగం మాట అటుంచు. ఇల్లు 'చాలా? మంచియిల్లు- బేచ్ లర్స్ కే యిస్తాం. సంసారులకి అసలివ్వం- నాకు ఒక డాటర్ వుంది! దానికి పెళ్ళిచేయలేక చస్తున్నాను? కట్నం యిచ్చుకోలేను?....ఏ మయినా (లవ్ మ్యారేజ్ ఏర్పాటు చేస్తావేమో అని-" అని మాటలతో శూలాల్లా గుచ్చుతున్నాడు.
    -ఆ మాటలు ఆనాడు గిరిజ చెంపమీద కొట్టినకన్నా చెళ్ళుమన్నాయి! గిరి పూర్తిగా సిగ్గుపడిపోయి వూరుకున్నాడు.
    "ఏం మాటాడవేం?" అని దాసు కోపంగా అన్నాడు.
    "అయిందేదో అయిపోయింది! మీ కన్నీతెలిశాక యింకా నన్ను ఎందుకు అడుగుతారు?"
    "ఎందుకలా మోసంచేశావు? నీ నాటకానికి మా ఇల్లు రంగస్థలమూ, మేము పాత్రలమూ అయినామా?"
    "నేనేం చెప్పలేను క్షమించండి అంతే!" అని వెనక్కి తిరిగి వెళ్ళిపోడానికి లేచాడు.
    "ఆగు" అని దాసుగారు అనగానే గిరి ఆగి పోయాడు,

                                            
    "తెలిస్తే ఇలాగ! తెలియకపోతే ఒకలాగ? నువ్వెంత ద్రోహం తలపెట్టేవో ఆలోచించావా? ఒక జీవితంతో ఆటలాడి. అమాయకురాలిని పాడుచేద్దామని చూశావే? మమ్మల్నందర్నీ ఒత్తి ఫూల్సు చేశావే! నిన్నేంచేస్తే నా కోపం తీరుతుంది?"
    "ఏమిటో అదంతా నాకే సిగ్గుగా వుంది!"
    "నువ్వేకాదు నీలాంటి ఎందరో సిగ్గుపడాల్సిన విషయం - ఈ రోజుల్లో ఇద్దరు మొగాళ్ళకి. ఒక స్త్రీ కనబడితే చాలు. ఆమె ఎంత మంచిదయినా, ఆమె మీద చెడుగా అనుకోడం అలవాటయింది - ఒక్కోప్పుడు ఆ ఎదురయిన స్త్రీ ఆ యిద్దరిలో ఏ ఒక్కరికి సంబంధించిందో అయి, రెండోవాడికి ఆ సంగతి తెలియక నోరుజారితే, వాడు ఏమీ అనలేక కిక్కురు మనకుండా నోరు మూసుకుంటాడు....అంతేగాని అక్కడితోనయినా ఆ బుద్ధి మానుకోడు, ఆ స్త్రీ తన చెల్లో, అక్కో, తల్లో, భార్యో అయితే ఎలా వుంటుంది. అని ఆలోచించుకోడు!"
    అలాంటి సమయంలోకూడా అతని ఉపన్యాస ధోరణి విని నవ్వలేక నవ్వుకున్నాడు.
    "నా గిరిజకి నీ కళ్ళముందే పెళ్ళి చేస్తాను? నువ్వు చూస్తూండగానే తెలుసా! అదె నీకు తగిన శాస్తి?" అన్నాడు.        ఈ శిక్ష మరీ బావుందనుకున్నాడు గిరి.
    "మీది క్రొత్తవలసేనా?" అని తిరిగి అడిగాడు దాసు.
    "అవునండీ!" అని ఆశ్చర్యపోతూ జవాబిచ్చేడు. ఎందుకో అర్ధంకాక.
    "శాంతమ్మగారి కొడుకువేనా నువ్వు!" అని ప్రశ్నించాడు.    
    "అవునండి!" అన్నాడేగాని తన వెనక ఇతను సి. ఐ. డి, పని చేయలేదు కదా అని అనుకున్నాడు.
    "ఇంకేం? .... నన్నొకడినే కాకుండా నీ తల్లినికూడా మోసం చేస్తున్నావన్నమాట!" అని అడిగేసరికి.
    "ఏమిటి! మీరంటున్నది!" అన్నాడు.
    "నువ్విక్కడే దో వెలగబెడుతున్నట్టు - ఆమెను నమ్మించి - నువ్వు చేస్తున్నపని ఏమిటి? పంపు తున్న డబ్బు ఖర్చుపెడుతూ ఒక్క ఉత్తర మయినా వ్రాసి ఎన్నాళ్ళయింది!"
    ఇలా అడుగుతూండేసరికి ఈ విషయాలన్నీ యితడికెలా తెలిశాయా? అని విస్తుపోయాడు గిరి,-
    "నా పేర ఉత్తరం వచ్చింది - మీ అమ్మగారు వ్రాయించారు నీ సంగతి కనుక్కోమని...ఎంతోమంచివాడివని, బుద్దిమంతుడవని, అనుకున్నా ఇన్నాళ్ళూ! ఎవర్ని ఉద్ధరించడానికిలా చేస్తున్నావు? అని కారణంకూడా చెప్పేశాడు.
    "నేనేమీ మోసం చేయలేదండి! నిజంగానే ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. ఎక్కడా దొరకలేదు! ఏం చెయ్యమంటారు?' అని విచారంగా అన్నాడు.
    "సరే.... నీ ఎడ్రసు అప్లికేషన్ లో వుందిగా .... ఆ ఎడ్రసుకి నేను రమ్మన్నపుడు రావాలి తెలుసా?" అని అన్నాడు.
    తప్పించుకుందికి ప్రయత్నించకు అని కూడా అన్నాడు.
    బ్రతుకు జీవుడా అని గిరి బయటపడ్డాడు.
    ఇంటికి రాగానే శాంతమ్మ దాసుని అడిగింది ఆతృతగా.
    "అబ్బాయి ఎక్కడున్నాడో తెలిసిందా?" అని
    "తెలియకేం అవుతుంది ఉద్యోగం కోసం ఇక్కడున్నాడని ఎప్పుడన్నావో అప్పుడే తెలుసుకున్నాను వాడిని పట్టుకొనే సుళువు- అందుకనే నాకు తెలిసిన ఒక కంపెనీ తరపు నుండి ఉద్యోగాలిస్తామని ఎడ్వర్ టైజు చేయించాను పేపర్లో! సరి! అనుకున్నట్లే గిరి అప్లికేషను వచ్చింది! పిలిచాము, వచ్చాడు, మాటాడాడు కూడా!"
    "ఇంతకీ వాడేనా మన గిరి!"
    "బావుందే చెల్లాయ్! నీ కింకా అనుమానం: అయినా ఆ సంగతి కూడా అడిగేశాను, వాడు నీ కొడుకే మరేం బెంగ పడకు!"
    "అయితే తీసుకురాలేకపోయావా? ఎన్నాళ్ళయిందో చూసి!"
    "నిక్షేపంలా వున్నాడు. వాడి సంగతి నీకేం బెంగలేదు, నాకు వదులు- కాని కొన్నాళ్ళపాటు ఓపిక పట్టాలి! వాడు చేసిన పనికి తగినట్టు బుద్ది చెప్పాలి!"
    "ఏమిటో నన్నయ్యా! అయిందేదో అయింది! మళ్ళీ వాడికేం కోసం వచ్చినా ఒకదాని కొకటి! ఎందుకు లేస్తూ!"
    "అదేంకాదు, నే చూసుకుంటాలే! మాఘమాసం కదా - నే వెళ్ళి దగ్గర్లో ఏదయినా ముహూర్తం పెట్టించుకు వచ్చేస్తాను ఆ పెళ్ళి వేళకే నువ్వు వాడిని చూసేది! అంతవరకూ ఏమీ అనకు!"
    "బాగానే వుంది! ఆ వేళకి లుడుంగున తీసుకువస్తే ముద్దూ ముచ్చట్లూ, లాంఛనాలూ జరగొద్దట్రా అయినా వాడి జాతకం అక్కడ వుండిపోయిందాయె!"
    "అన్నీ జరుగుతాయి మరేం బెంగపడకు - ఇంక ఆడపిల్లను కన్నాను కాబట్టి ఆ జాగ్రత్త ముందే పడ్డాను, వాడి జాతకం నా దగ్గిరవుంది!"
    "సరే నీ యిష్టం!" అని అనేసింది శాంతమ్మ.
    దాసుగారు ఆ మట్టున వెళ్ళి పది రోజుల లోపునే ఒక ముహూర్తం పెట్టించుకుని వచ్చే సేడు.
    కొడుకుని చూద్దామని ఎంత ఆత్రుతతో వున్నా పైకి ఏమీ అనలేక ఊరుకుంది శాంతమ్మ.

                            *    *    *

                                 10

    టెలిఫోను మ్రోగగానే దాసుగారు రిసీవరు తీశాం. తీయగానే ఎవరో స్త్రీ గొంతుక "హలో" అనగానే-
    "అమ్మాయ్! గిరిజా! ఎవరో నీ స్నేహితురాలులా వుంది చూడు!" అని యిచ్చేశాడు-
    ఉత్సాహంగా ఫోను తీసింది - గిరిజ
    "గిరిగాని మీ యింటికొచ్చాడా?" అని అడిగిందా కంఠం.
    ఆశ్చర్యపోతూ "ఎవరు!" అని అడిగింది.
    "నేమండీ మణిని! గిరి మీ యింటికి గాని వచ్చాడా! అని మళ్ళీ అడిగాడు.
    "ఓ మీరా!.... అని మాట వినబడకుండా చెయ్యి అడ్డంపెట్టి.
    "నాన్నగారూ అగొంతు నా స్నేహితురాలిది కాదు. ఆడదానిలా మాటాడుతాడన్నానే, గిరి ఫ్రెండు మణిది!..... మీరే మాటాడండి!" అని తిరిగి ఫోను దాసుగారి కిచ్చేసింది.
    ఏదో ఆలోచన చప్పునతట్టి ఫోను తీసుకొని-
    "హలో మిస్టర్ మణీ! నేను దాసుని - ఎవరు గిరి కావాలా! కబురు చేశాను గాని యింకా రాలేదు! చూడండీ!మీకూ ఇంకా ఫోను చేద్దామని అనుకుంటున్నాను, యివాళ సాయంత్రం మా యింట్లో చిన్న పార్టీ. మీరు తప్పకుండా రావాలి!
గిరి కూడా వస్తాడు ... యిక్కడే కలుసుకోవచ్చు ...."
    ".... ... .... .... .... ...."
    "నో - నో - వచ్చి తీరాలి!..... ఇది నా రిక్వెస్టు!"
    ".........................."
    "ఓ.కె......మీ కోసం ఎదురు చూస్తూ వుంటాను!" అని ఫోను పెట్టేసేడు. ఆ సంభాషణ విని గిరిజ ఆశ్చర్యపోయింది.
    "ఏమిటి నాన్నా ఆయనని ఎందుకు పిలిచావ్! మనింటో టీపార్టీయా? ఏదీ? ఎప్పుడు? ఎందుకు?" అని అడిగింది.
    "పిచ్చిపిల్లా అదేం కాదు! యిన్నాళ్ళూ మనని వెర్రి వెంగళాయిలుగా చేసి, గిరి నాటకం ఆడి నందుకు, మనం కూడా దెబ్బతీయాలి. అందుకు ఒక నాటకం మనమూ ఆడాలి. అందులోనూ, గిరి మణిని ఉపయోగించుకున్నట్లే మనమూ ఉపయోగించుకున్నట్లే మనమూ ఉపయోగించుకోవాలి" అది.
    "ఎలా సాధ్యం నాన్నా!"
    "ఇలాగ!" అంటూ కూతురి చెవిలో తన పథకం చెప్పేడు దాసు. అది విని- "ఇద్దరూ ప్రాణ స్నేహితులు కాదా! ఒప్పుకుంటాడా?" అని అడిగింది.
    "మరేం ఫర్వాలేదు నేను ఒప్పిస్తాను చూస్తూండు...."
    "ఏమో మీ యిష్టం!" అనేసింది గిరిజ.
    
                              *    *    *

    శుభలేఖలు అందరికీ వెళ్ళేయి, దాసుగారింట్లో పెళ్ళియత్నాలు పెద్దపెట్టున జరుగుతున్నాయి పందిళ్ళూ, పాకలూ, అలంకరణలూ, ఇలా వేడుకగా, సందడిగా వున్నది.
    శుభలేఖ ఒకటి- గిరికి కూడా వెళ్ళింది...గిరి చూశాడు మూర్చపోయినంత పని అయింది. చేతిలో శుభలేఖతో కొన్ని క్షణాలు అట్లానే వుండిపోయాడు. విశ్వేష్టుడయి దానిలో వున్న విషయం తాను నమ్మలేకపోవడమే దానికి కారణం.
    గిరిజ పేరూ, తన పేరూ, అందులో సువర్ణా క్షారాలతో ప్రక్క ప్రక్కని వుండడం-చూశాడు! తనకీ గిరిజకీ వివాహమహోత్సవంట! ఎంత నిజంగా వుంది!
    అక్షరాలా దాసుగారు వ్రాసుకున్న  శుభలేఖా ర్ధములే!
    నమ్మడమా? నమ్మకపోవడమా?
    కళ్ళు గిర్రున తిరిగాయి.
    కలకాదు కదా-లేక తనని ఈ విధంగా అవమానం చేయడానికి వేసిన ప్లానా? ఆ రోజునే ఇంటర్వ్యూలో అంత పదునుగా మాటాడిన దాసుగారు ఈ విధంగా మారడమా? .... కాక పోతే. యిది గిరిజ ప్రోద్భలమా? లెంపకాయకొట్టి ఇంట్లోంచి వెళ్ళగొట్టినది ఈ విధంగా ప్రేమిస్తుందా? యిదంతా ఏమీ అర్ధంగాక, ఎటూ తేల్చుకోలేక సతమతమయిపోయాడు గిరి. అయినా ఒక మూలనుండి సంతోష తరంగాలు, ఆనందోత్సాహాలు శరీరంలోనూ- మనసులోనూ పరుగెడుతూ పులక లెత్తిస్తున్నాయి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS