Previous Page Next Page 
ధర్మ చక్రం పేజి 14


    "సంతోషం . మీరు నన్నర్ధం చేసుకుంటున్నారు. నా మాటలు గాలి కేగిరి పోవడం లేదు.' ధర్మారావు సంతోషం వెలిబుచ్చారు. "అందువల్ల మిమ్మల్ని మీరు దిద్దుకోగలరని గట్టిగా నమ్ముతున్నాను.
    "మంచీ చెడూ, న్యాయం అన్యాయం , నేరమూ శిక్షా ఎప్పుడూ ఉన్ననే. ఇవ్వాళే కొత్తగా రాలేదు. ఎప్పటికప్పుడు అణిచి వెయ బడుతున్నాయి. మళ్ళీ తలలేత్తు తున్నాయి. అందుచేత మీరు చేసినదానికి చింతించ వద్దు. గడిచిన దానికి వగిన వద్దు, వర్తమానాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు నేను అన్ని అవకాశాలూ కల్పిస్తాను. మీ జీవితాలలో కోల్పోయిన మానవత్వాన్ని తిరిగి పొంది, భవిష్యత్తు ను సుఖమయంగా తీర్చి దిద్దుకోండి.'
    "ఎలాగ, బాబూ?' ఒక ఖైదీ ప్రశ్న.
    "ఎలాగా? చూడండి. ఒక్క ఉదాహరణ చెబుతాను. వెనక ఒక కిరతాకుడు ఉండేవాడట. అందరినీ బాధించి, దారులు కొట్టి, బతకడమే వాడి పని. అంతటి హీనుడూ నారద మంత్రోపదేశం వల్ల మారిపోయి మహా ముని వాల్మీకి అయ్యాడు. రామాయణం రచించాడు. లోక మాత జానకీదేవికి ఆశ్రయ మిచ్చి , పావన చరితులు లవకుశలకు గురుఅవయ్యాడు! 'నువ్వు కిరాతుడ'వని వారు అసహ్యించు కున్నారా? కిరాతుడు వ్రాసినదని రామాయణాన్ని మనం నిరసిస్తున్నామా? తల దాల్చి పూజిస్తున్నాము."
    "నిజం , బాబూ'' ఆనంద బాష్పాలు ఒత్తుకుంటూ అన్నాడు గౌతమ్.
    ధర్మారావు తన మాటలు పొడిగించాడు. "అందువల్ల మనిషిలో నిజమైన మార్పు వచ్చిన నాడు లోకం కూడా అతడి మచ్చను మరిచిపోయి , మంచిని గౌరవిస్తుంది.
    "మనది ప్రజాస్వామ్య ప్రభుత్వం. అల్పత్వం, ఆధిక్యం లేకుండా ప్రజలందరి గోడూ విని అందరికీ వీలైనన్ని సౌకర్యాలు చేయడమే నేటి మన ప్రభుత్వ ధ్యేయం. విడుదలైన ఖైదీల గౌరవ జీవనానికి మార్గ మేర్పరచు కుని మీరు ప్రభుత్వానికి మహజరు పంపుకుంటే, ప్రభుత్వం పరిశీలించక పోదు. మీకు తగు జీవిక నేర్పరచడానికి ప్రయత్నించక పోదు."
    "అబ్బో! ఎంత కాలానికో!" ఒక ఖైదీ అసంతృప్తి.
    మందహాసం చేశాడు ధర్మారావు. "ఏ పనైనా కొంత కాలానికే అవుతుంది వెంటనే జరగదు. భోజనం పావుగంట లో చేసేస్తాము. కాని, డాన్ని తయారు చేయడానికి ఎంత శ్రమ , ఎంతకాలం అవసరం? ఓర్పు అవసరం. మొక్క నాటిన నాడే పళ్ళు అందిస్తుందా?"
    "నిజమే నండి."
    "మీకు మంచి పుస్తకాలు ఇస్తాను. చదువు కొండి. రాని వారు చదువు వచ్చిన వారి చేత చదివించు కొండి. అధికారుల అనుజ్ఞ తీసుకొని మీకు ఏవైనా మంచి సినిమాలు, అవీ ఇక్కడే చూసే ఏర్పాట్లు చేస్తాను. అవన్నీ చూచి మీరు అందులోని మంచి అంతా గ్రహించాలి. అర్ధం చేసుకోవాలి."
    "సినిమాలే? భలే, భలే.' కొందరు సంతోషంతో చిన్న పిల్లల్లా గెంతారు.
    'అవును. మీకు ఎన్నో సౌకర్యాలు చేస్తాను. కానీ, ఒక్కటే మాట గుర్తుంచుకోండి . ఈ మంచితనంతో పాటు , నాలో మరొకటి కూడా ఉంది. రాతి గుండె! ధర్మ నిర్వహణ! మీలో ఎవరూ నన్ను ఏమార్చి పారిపోవడానికి ప్రయత్నించ కూడదు. తిరుగుబాటు చేయడానికి చూడకూడదు. జాగ్రత్త!"
    ఆ మేఘ గర్జనకు ఉలిక్కిపడ్డ ఖైదీలు, హుందాగా నడిచిపోతున్న ధర్మారావు కు భక్తీ పురస్పరంగా చేతులు జోడించి మొక్కారు.

                                   16


    "ఊ. అయితే సాక్షాత్తూ గౌతమ బుద్దులే అయ్యారన్న మాట?" కొంటెగా ప్రశ్నించింది.
    సత్య, పూల కొమ్మను విలాసంగా తిప్పుతూ.
    "అబ్బే, లేదండీ!" అమాయకంగా పెట్టాడు ముఖం ధర్మారావు . "గౌతముడు సర్వసంగ పరిత్యాగం చేసి పోయి, బోది వృక్షం కింద కూర్చున్నాడు. మరి నేను సంఘం లోనే ఉండి సర్వం అనుభవిస్తున్నానే!"
    "ఆహాహా! ఏం చతురులు?" నవ్వేసింది సత్య. "ఏమండీ , ఒక్క టడుగుతాను. నిజం చెప్పాలి."
    "అయ్యో, సత్యాదేవి సమక్షం లో అసత్యం పలకటమా?"
    "అవును, సార్ధక నాములు, ధర్మమూర్తులు!" కొంటెగా అన్నది సత్య.
    ధర్మారావు నవ్వేశాడు.
    "అయితే ధర్మ మూర్తీ, ఒక్క ధర్మ సందేహం . సత్యం, ధర్మం -- ఈ రెండూ ఎన్నడూ విడిపోవు కదూ? విడరాని బంధంగా ఒక చోటే ఉంటాయా?"
    వింటూనే ఉలిక్కి పడ్డాడు ధర్మారావు. వదనం లో హాసం మాయమయింది.
    'చెప్పండి. సత్యం, ధర్మం ప్రేయసీ ప్రియుల వంటివి కదూ? ధర్మదేవత నాలుగు పాదాలలో ఇవి రెండు ప్రధాన పాదాలు" చిలిపిగా నవ్వుతూ అన్నది సత్య, ధర్మారావు వదనం చూస్తూ.
    "సత్యాదేవీ!" గంబీరంగా ఉన్న ఆ పిలుపు లో ఏమూలనో, విషాదం, భయం ద్వ్హనించాయి . "మనం హద్దులు దాటి పోతున్నామేమో?"
    "మరి, మన గమ్యం ఆ హద్దులు కావల ఉంటె, దాటద్దు?"
    "వద్దు. నా మాట వినండి. అవి దాటలేని, బెదింప లేని బలమైన గోడలు."
    "ప్చ్! ఇది రాకెట్ యుగం. గదులూ, గోడలూ ఏమీ చేయలేవు."
    ధర్మారావు నీరసంగా నవ్వాడు. 'లాయర్ గారితో నేనేం మాట్లాడ గలను?"
    "నిజం! మాట్లాడక పోవడం మంచిది. మాట్లాడకండి. నేను మాట్లాడిన దానికి ఊ కొట్టుతుందండి. చాలు."
    "అన్నట్టు నాకు పని ఉందండీ" హటాత్తుగా లేచి నిల్చున్నాడు.
    "ఓ! అయితే నాకూ ఉన్నట్టేగా? ధర్మం వెనుకనే సత్యం !' అంటూనే అతడి చేయి ఆసరాగా తీసుకుని ఆమె కూడా లేచింది.
    సత్యాదేవి!" దుగ్భ్రాంత్రుడైన ధర్మారావు కు మాటలు కరువై నాయి.
    "ఉష్. ఇకమీదట 'సత్య ', అంతే ." మృదువుగా అతడి పెదవులను చేతితో మూసింది.
    "సత్యా!' ఆమె చేతిని గుండెలపై ఉంచుకొన్నాడు ధర్మారావు. "సత్యా! నేనెంత అదృష్ట వంతుడిని!"
    "అమృత ఫలం అంబలి లో పడితే ఆస్వాదించడానికి ఇంత ఆలోచనా?" కినుక ప్రదర్శించింది సత్య.
    'ఆలోచన కాదు, సత్యా. కోపగించు కోకు.' మృదువుగా ఆమె చుబుకాన్ని పట్టి ఎత్తుతూ అన్నాడు: "ఆస్వాదించడానికి ఇంకా అనువైన పరిస్థితులు రాలేదు. అంతవరకూ ఆరాధన మాత్రమే. అంజలి లో పడిన ఈ అమృత ఫలాన్ని కనుల కద్దుకొంటున్నాను."
    "ఓ! ధర్మారావు గారు అధర్మాలు చేయ్యరుగా!" మనస్పూర్తిగా , నిండుగా నవ్వింది సత్య , చుట్టూ ఉన్న పూబాలల అందాలను ధిక్కరిస్తూ.        


                                    17


    సత్యాదేవి , ధర్మారావు ఒకరి వెనుక ఒకరు లోనికి వస్తుండడం చూచిన మిత్రా దరహాస వదనంతో ఆహ్వానించాడు. "రావయ్యా, రా. చక్కగా చలాకీ గా గడిచి పోతుంది నీతో."
    "మీకు నా మీద అంత బిమానం " అని నవ్వుతూ కూర్చున్నాడు ధర్మారావు.
    "ఇదుగో , చూడు, సుమిత్రా. నీ సూర్య కిరణం వచ్చాడు.' నవ్వుతూ లోపల ఉన్న భార్యను పిలిచాడు మిత్రా.
    "కులాసానా, నాయనా?' ప్రేమ ఒలికిస్తూ కలుపుగోలుగా మాట్లాడుతూ వచ్చింది సుమిత్రా.
    "మీ దయ వల్లనమ్మా" అని నమ్రతగా నమస్కరించాడు ధర్మారావు.
    కొంత సంభాషణ తరవాత ధర్మారావు నిష్క్రమించాడు. అతడిని వీధి వరకూ సాగనంపి వచ్చి, మేడ మీద తన గదిలోకి వెళ్ళిపోతున్న సత్య, "అమ్మాయ్, ఇలారా' అన్న సుమిత్ర తీవ్ర స్వరానికి కలవర పడుతూ దగ్గరకు వచ్చింది -- "ఏమిటి, పిన్నీ?' అంటూ.
    "అంతేనమ్మా . పిన్నీ, పిన్నీ! ఎంత పెంచి పెద్ద చేసినా 'అమ్మా' అని నోరారా పిలవవు కదా?"
    సత్య మాట్లాడలేదు.
    న్యాయమిత్ర అన్నాడు : "అబ్బ! అది నీకు రోజూ ఉండే గోడవేగా? ఇప్పుడే కొత్తగా వచ్చినట్టు డాన్ని పని గట్టుకుని పిలిచి సాధిస్తా వెందుకు?"
    "ఆ చాల్లెండి, మహా కోర్టులో తీర్పు చెప్పినట్లు చెప్పవచ్చారు కాని" అంటూ సుమిత్ర మళ్ళీ సత్య వైపు తిరిగింది. "అయితే, అమ్మాయ్, ఏమిటే నీ వేషాలు, నాటకాలూనూ? ఇలా తిరమనేనా మీ నాన్న నిన్నిక్కడ , మా దగ్గరుంచింది?"
    "ఏమిటి, పిన్నీ? అదేదో స్పష్టంగా చెప్పరాదూ?"
    "అయ్యో . చేబుతానమ్మా. చేసే పనులు నీవినీ, చెప్పేదానను నేనూను."  
    పినతండ్రి వైపు తిరిగి నవ్వుతూ ప్రశ్నించింది సత్య: "పిన్ని, నువ్వూ ఏమైనా దెబ్బ లాడుకున్నారా , బాబాయ్?"
    "అక్కర్లేదమ్మా. మీ పిన్నికి అలవాటేగా రోజూ?"
    "వయసువచ్చిన పిల్లవు. ఇరవై ఏళ్ళు పై బడ్డదానివి. "ఎందుకలా పరాయివాడి తో తిరుగుతా' నని అడక్క పోగా , ఏమిటి, మీ ఉద్దేశం? నన్ను అడిపోసుకుంటారు పైగా?"
    "బాగుందేవ్! భేషుగ్గా ఉంది. సూర్యకిరణం , అమృత భాండం అంటూ అతడితో చక్కగా మాట్లాడి, నామీద విరుచుకు పడతావెం మధ్యన?"
    "చాల్లెండి, సమర్ధన. పిల్లకి బుద్ది చెప్పెదట్టే పోయి! సూర్యకిరణం అంటాను. చంద్ర బాణం అంటాను. అది వేరే సంగతి. అంత మాత్రాన, మీ అమ్మాయిని అతడితో తిరగమన్నానా? అవ్వ! పరాయి వాడితో సమయా సమయాలు లేకుండా షికార్లా?"
    సత్య చలించలేదు. "స్నేహితుడు పరాయి వాడేలా అవుతాడు , పిన్నీ?' గంబీరంగా స్థిరంగా అడిగింది తిరిగి.
    "స్నేహితుడా? బాగుందమ్మా. ఇవ్వాళ స్నేహితుడంటావు రేపు ప్రేమికుడంటావు! ఈ కాలపు చదువుకున్న పిల్లల పోకిళ్ళు నాకు తెలియవా?"
    పూర్వపు బింకం తోనే సమాధానం ఇచ్చింది సత్య : "రేపటి వరకూ అక్కర్లేదు పిన్నీ. ఇవ్వాళే అంటున్నాను."
    "ఏమిటీ?' విపరీతాశ్చర్యంలో మునిగి పోయిన సుమిత్ర కనురెప్పలు కదలడం మానేశాయి.
    "అవును, పిన్నీ!" సరళంగా చెప్పింది సత్య. "ఇవ్వాళో , రేపో నేనే మీకు చెప్పి మీ ద్వారానే నాన్నగారికి తెలియచేద్దామను కొంటున్నాను, పిన్నీ. ఇదుగో, సందర్భం వచ్చింది చెప్పాను. నువ్వు కూడా ఆలోచించు, అయన ఎంత మంచివారో.'
    "అయ్యో , కాదమ్మా మరి!' సుమిత్ర స్వరం లో హేళన. "కంటికి నచ్చినవాడు ఎలాటి వాడైనా మంచివాడే! కాస్త పెద్ద వాళ్ళం ఉన్నామనీ , మాకు చెప్పాలనీ ఏమైనా అనిపించిందా , నీకు? నీకు నువ్వేనా నిర్ణయించే సుకోడం ? అయన!' అప్పుడే ' 'అయన' అనేవరకూ వెళ్ళింది సంగతి?"
    చిన్నగా నవ్వింది సత్య. "మేము పిల్లల మైతే కదా, పిన్నీ, పెద్ద వాళ్ళ ప్రమేయం? అయినా ఇప్పుడు నేను చేసిన తప్పేముంది? మీకు చెబుతున్నానుగా? మీరే నిర్ణయించండి.
    'అయ్యో, రాత! ఎన్ని మాటలు నేర్చావు?  ఏమండీ , అలా గుడ్లప్పగించి చూస్తారు? మాట్లాడరేం?' భర్త మీదకు తిరిగింది సుడిగాలి.
    తల గోక్కున్నాడు న్యాయమిత్ర. "నీ వాదనా న్యాయమే. అమ్మాయి వాదనా న్యాయమే. వేరే సాక్ష్యాలు లేవు కదా? అందుచేత నేను చెప్పే దేమిటంటే , అబ్బాయి ఎలాగా సూర్యకిరణం గనుక........"
    "చాలు, ఆపండి.' గదమాయించింది సుమిత్ర. "ఇదేమైనా కొర్టనుకున్నారా? పిల్లకి బుద్ది చెప్పమంటే న్యాయమూ, వాదనా తీర్పూ నట! విన్నవాళ్ళు నవ్వి పోగలరు. కోర్టు లో ఇంత అందంగానే చెబుతున్నారా, తీర్పులు, జడ్జి గారు? అయినా, నా కేందుకమ్మా? మీరూ, మీరూ ఒకటే నేను ఎంత ఎలా పెంచినా, పరాయి దాన్నేగా?" విసవిసా వెళ్ళిపోయింది.
    నివ్వెరపోయి నిలబడ్డ సత్య, మిత్రా సంబోధనకు చలనం కలిగి వెళ్లి పక్కన కూర్చుంది.
    "అయితే బాగా అలోచించి నిర్ణయించుకున్నావాఅమ్మా?' తల నిమురుతూ అడిగాడు మిత్రా.
    'ఆలోచించాను, బాబయ్య గారూ" అంది మందస్వరాన, తల వాల్చి.
    'సరే, అయితే నీవంతు అలోచిన అయింది. ఇక మావంతు మిగిలి ఉన్నదన్నమాట? కుర్రాడు మంచివాడే. కాని చూడమ్మా , వివాహమంటే ఇంకా చాలా చూడాలి. ఆలోచించాలి. సరే, అవన్నీ నేను చూచు కుంటానుగా? నవ్వూ తొందర పడకు."
    "అలాగే, బాబాయ్! కాని, కాదని మాత్రం అనకండి.'
    "పిచ్చి తల్లీ! నీ సంతోషాన్ని మేము మాత్రం కాదంటామా? కాని, అతడు నిజంగా నీ జీవితాన్ని సంతోష ప్రదం చేయగలవాడు మాత్రం అయి వుండాలి."
    "..........."
    "వెళ్ళు, నీ గదిలోకి. మీ పిన్ని మాటలు లెక్క చేయకు. దాని కది మామూలేగా?"


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS