Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 14


    'నేనా, చాల్లే . చెపితే వాళ్ళ చదువునీ చురుకుతనాన్నీ గురించి చెప్పుంటానెమో గాని ఈ అందాన్ని గురించి నేనెప్పుడూ ప్రశంసించుండను. నేనెప్పుడూ ఎవ్వర్లో నూ హృదయ సౌందర్యం చూస్తానే గాని బాహ్య సౌందర్యాన్ని గురించి తలవనన్నా తలవను తెలిసిందా?' పేపర్లోంచీ మొహం ఇవతలికి పెట్టి నొక్కి చెప్పాడు రఘు. రఘు స్పష్టంగా అన్న ఈ మాటల్తో జానకీ పార్వతమ్మ గారి మనసుల్లో ఒకవిధమైన స్తిమితం ఏర్పడింది.
    పార్వతమ్మ గారూ జానకీ పని మీద లేచి లోపలి కెళ్ళేక తనూ లేచి స్నానానికి వెళ్లాడు రఘు.
    స్నానం చేసి బట్టలు మార్చుకుని రఘు మళ్ళీ హల్లో కొచ్చేసరికి ఒక పాత వీణ ని ముందుంచుకుని తంతులు కూరుస్తుంది సుధ.
    'అబ్బబ్బ! మళ్ళీ తెచ్చావ్! ఈ పాత డొక్కు, హాయిగా నిక్షేపం వంటి తంజావూరు వీణుండగా. నీకేం పన్లె పొతే సరీ' అన్నాడు చిరాకు పడుతూ రఘు.
    'ఉండు బావా, మట్టుకునేసరికేనాదం లేస్తున్న ఆ వీణని ఎవరు పడితే వారే వాయించగలరు. అందులో ఆశ్చర్య మేం వుందనీ పాపం తీగెలూడి మేళం కదిలి శిధిలమై ఎవ్వరికీ అక్కర్లేని ఈ వీణని, మూగవోయి నిరాశ తో వున్న ఈ వీణ ని సరిజేసి, శృతి చేసి, అందు నుండే మంచి జీవనాదాన్ని  పల్కించగల్గితే అది కదా గొప్పదనం?' అంది తీగెల బిరడాల్ని బిగిస్తూనే నవ్వుతూ రఘు వైపు చూసి సుధ. సుధ యధాలాపం గానే ఈ మాటల్నందో లేక అంతరార్ధం తెల్సి అందో తెలియదు గాని రఘుకి మాత్రం తన హృదయం లోని లక్ష్యాన్ని శాస్త్ర యుక్తమైన శృతి చేసి సుధ మీటించినట్టే అనిపించింది.
    ఆ పాత వీణ లోంచి చక్కని నాదాన్ని పలికిస్తూ, మలయమారుతాన్ని అలాపిస్తుంది సుధ.
    వీణ మీద అటూ ఇటూ పరుగులేత్తుతూన్న సుధ వేళ్ళు తనలోని లక్ష్యాల్ని మీటిస్తున్నట్టు గానూ, ఆ నాదం తన హృదయం లో సుళ్లు తిరుగుతూ అలాగే మారు మోగుతున్నట్లు గా అనిపిస్తుంది రఘుకి.

                               *    *    *    *
    దత్తు గారి పెద్ద కొడుకు తిలక్ ని విశాఖ మార్చడం లో మిగతా అందరి సంగతీ ఎలా వున్నా, రాధకి మాత్రం పరమ సంతోషంగా వుంది. ఇక రాజమ్మ గారు పైకి మామూలుగా కూర్చున్నా లోలోపల బెంగగానే వుండావిడకి. తను ఇంట్లో కర్ర పెత్తనం చెలాయిస్తూ బాధ్యతలన్నీ నిర్మల మీద పెట్టేసి నిశ్చింతగా ఊరి మీద తిరుగుండడానికి బాగా అలవాటు పడిపోయిన ఆవిడకి ఇక మీద ఏం చెయ్యడమా అన్న బెంగ పట్టుకుంది పాపం.
    అయితే ఆ విషయాన్ని బయట పెట్టకుండా 'ఏదో వాడికీ ఎప్పుడూ కేంపూ లుంటాయాయె. నీకూ చేతులో పసిపిల్లాడాయే. ఇప్పుడా కొత్త ఊరు వెళ్ళి ఏం ఇబ్బంది పడతావ్ లెద్దూ. ఇక్కడే వుండు. ఈవేపోచ్చినప్పుడల్లా వాడే చూసి వెళ్తాడు తీరిపోతుంది.' అంటూ దారాల్తీయసాగారావిడ. అయితే ఆ యింట్లో నిర్మలకున్న ఇబ్బందులన్నీ బాగా ఎరిగున్న తిలక్. ఆవిడ సలహా కేంతమాత్రం ఒప్పుకోలేదు. 'ఏదో, భార్య నోటికి వేరిచి పైకేమీ అన్లేక పోయినా, దత్తు గారికి కూడా కోడలు నిర్మల మీద మంచి గౌరవ భావం వుంది. అందువల్ల కోడలూ, కొడుకూ విడిగా వెళ్లి హాయిగా వుండాలన్నదే అయన కోరిక కూడా.
    'నాలుగేళ్లయి వుండి , ఆ వెధవ గుంటూరంటేనే నాకు విసుగేస్తుందమ్మా. రోహిణి మేనమామ కి విశాఖ కె.జి,హెచ్ లో మంచి పలుకుబడి ఉంది గనక, నేను హౌస్ సర్జెన్ విశాఖ లోనే చేద్దామనుకుంటున్నా' అంటూ ప్రారంభించింది రాధ. 'మొగుడోదిల్నా , మోహం ఒదల్లెద'న్న సామెత ని సార్ధకం చేస్తూ 'ఏమో ఈ విధంగా నన్నా అతని మనసు మారుతుందేమో . ఏదైనా మన మంచికే అన్నట్లు ఈ నిమిత్తం కార్యనుకూలం కావచ్చు గా, అనుకుని వెంటనే భర్త చేత ఒప్పించి తనూ ఇష్టపడ్డారావిడ.
    దత్తు గారికి అనేక వీదాలైన వ్యాపకాలు వ్యాపారాలూ ఉన్నందున ఎప్పుడూ వచ్చేవాళ్ళూ, పోయే వాళ్ళూ గానే వుంటుంది వారిల్లు. కొన్నాళ్ళ బట్టి ఎన్నెన్ని అవాంతరాలోచ్చినా ఎలాగో సర్ది పుచ్చుకుంటూ వారిల్లు కనిపెట్టుకునున్న అయ్యరు వంటింటి పనులన్నీ చూసుకు పోతూనే వున్నా పై అందింపులూ, సర్దుబాట్లు పోద్దుట్నుంచీ రాత్రి దాకా సరీపోతూ వుంటుంది నిర్మల కి.
    ఎంతెంత ఘర్షనలు జరిగినా దులిపేసుకు తిరుగుతుండే అయ్యరు ఆరోజు ఉదయం జరిగిన సంఘటనకి అప్పట్నుంచీ మొహం వేలేసుకునే వున్నాడు. సాయంత్రం, రాత్రీ మళ్ళీ అందరూ మామూలుగానే మసులకున్నందుకు ఏదో అప్పటికప్పుడు కాస్త సర్దుకున్నా, మనసు మాత్రం కుదుట పడక పోవడం వల్ల అలవాటు ప్రకారం రాత్రి పనులన్నీ అయ్యాక మెల్లిగా మేడెక్కి నిర్మల గది వద్దకి వెళ్ళాడు. అతని మనసుకి ఏ విధమైన బాధ కల్గినా నిర్మల తో చెప్పుకుని స్థిమిత పడడం అతనికి అలవాటు.
    'ఏం కావాలి సాంబూ మామా?' అంది పాపని ఉయ్యాలలో వేసి ఊపుతున్న నిర్మల.
    'ఏమీ వద్దమ్మా . నేడెమో మనసేబాగలే. అద్దా నిన్ను వెతుక్కుని వస్తిని' అన్నాడు. ఎప్పుడూ, ఏ ఈడు వారితో ఆ ఈడు వాడిలాగ సరదాగా మాట్లాడుతుండే అయ్యరు చిన్నబుచ్చుకున్న మొహంతో వచ్చి పై మీది తువ్వాల్తో నేల దులుపు కుని గుమ్మం వద్ద చతికిలబడ్డాడు.
    'ఏదో పిల్లలన్న దానికి నువ్వంత పట్టించు కోకూడదు అయ్యరూ! నన్ను చూడు. అలాగే నువ్వూ విదిలించుకు తిరగాలి అంతే' అంది నిర్మల.
    'అట్ల కాదు నిర్మలమ్మా. ఎట్లా ఉంటేనూ నువ్వు ఇంటి కోడలివి. ఇంతో అంతో పడిదా కావలె. నీ సమాచారం వేరు నా సమాచారం వేరు. ఏమి నే చెప్పేది!' అన్నాడు మెల్లగా.
    'అసలేం జరిగిందీ?' అంది అయ్యరిక్కాస్తేడంగా కుర్చీలో కూర్చుంటూ నిర్మల.
    'అదే దమ్మా నువ్వుదా అంతా -- వో? ఆ సమయానికి సరిగా నువ్వూ లేని కొదవ దానే! అంత రగడ అయిపోయేందుక్కరణం గా పోయిందీ.'
    'ఉంటేనూ రాధమ్మ కు నిండా కోపం జాస్తబ్బా. మురళి కిన్నీ కోపం జస్తిదా', అని పెట్టుకో? ఉంటేనూ! అనుకునేది  మళ్లీ అంతలో విడిచి పెట్టేసేది. మా ఇద్దరికీ వాడికనే ---'
    'అయితే నే కోప్పడ్డవె నీ రోషానికంతా కారణవన్న మాట అంతేనా!' అన్నాడు మంచం మీద పడుకునున్న పళాన్నే తిలక్.
    'అయ్యో , మీ యజమాన్లూ ఇక్కడ్నే వున్నాడా ఏమి చెప్పేద్దానే నిర్మలమ్మా' అని అతి మెల్లిగా తువ్వాల్నోటి కడ్డు చేసుకుంటూ అన్నాడు అయ్యరు.
    'మాట్లాడ్డెం అయ్యరూ' హెచ్చరించాడు తిలక్.
    'అది కాదండీ ఎప్పుడూ అనే వాళ్ళుంటే 'పొతేపోయింది లే పో' అని గమ్ము నుండేయ్య వచ్చును. ఎప్పుడూ అనని వాళ్ళు అంటేదా కష్టం తోచేదంతా.'
    'ఆ ఇప్పుడు చెప్తావ్ కబుర్లు. రోజూ అందరూ నిన్ను ఉరక లేత్తిస్తుంటే హడలు కుంటూ అన్నీ అందిస్తావ్ కదా/'
    'ఒక్కరోజు నేనడిగితే నీకంత ఇదేం అంట.' అన్నాడు లేచి కూర్చుని నవ్వుతూ తిలక్.
    'అట్ల కాదు నాయనా ఏమో దినం నీ భార్యదా నీ కెత్తిచ్చేది, ఆశగా నీవు తాగేది , వాడికయిందే' అని ఆ పరాకులో వుండేస్తిని! మరి వాళ్ళంతా అంటే నన్ను నిలవనిచ్చేది లేదే. నేనేం చేస్తును! అదిన్నీ కాకుండా అట్లాంటి వేళల్లో నిర్మలమ్మ నూ నాకు కొంచెం సగాయంగా వుడ్ను. ఎట్లనో సమాళించుకుంటును. నెడనంగా ఆ సమయానికి సరిగ్గా పెద్దామే కోడలికి పని ఎట్టును? అనేసి నేనేమన్నా కనవా కంటిని?' అన్నాడు ఒళ్లోని తమలపాకుల్ని మడిచి నోట్లో వేసుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS