Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 13


    'అయినా ఇతనూ కాస్త మొండి ఘటం లాగే వున్నాడు. లేకపోతె అన్నివిధాల తగినట్టువున్న నేనిక్కడుండగా అస్తమానం ఆ కుంటి దాన్తోటే ముచ్చట్లాడుతూ కూర్చుంటాడేవిటి? పోనీ ఏవీ ఎరగని వెర్రి బాగుల వాదేమోనంటే.... అతనంత రసికుడు మరోకడుండడన్నట్టు అంతిదిగా చెప్పింది రోహిణి. ఏమిటో మరి,' అనుకుంది రాధ నిరుత్సాహంగా.
    'ఏమైనా ఇక్కడ్నుంచి వెళ్ళేలోగా అతని అభిప్రాయం ఏమిటో ఎలాగన్నా తెల్సుకోవాలి.' ఇలా అనుకుంటూ పడుకుని డోల్లుతున్న రాధకి ఒక ఉపాయం తోచడంతో కాస్సేపటి కల్లా తీవ్రమైన తల నొప్పితో బాధపడ సాగింది. 'ఉన్నట్టుండి ఇదేవిటి' అనుకుంటూ మాత్రా మంచి నీళ్ళు తెచ్చిచ్చీ, కర్పూరం దిగదూర్చీ ఎన్నెన్నో తంతాలు పడ్డారు రాజమ్మ గారు. వేడి వేడి కాఫీ, వేపగంధం తెచ్చిచ్చారు పార్వతమ్మ గారు. 'పోనీ మన మురళి ని ఓ సార్రమ్మని ఫోన్ చేస్తే' అంటూ లేచారు దత్తుగారు.
    'ఎందుకు నాన్నా.... దాన్నే ఏదన్నా మెడిసిన్ రాసియ్యమని కొని తెస్తే , తీరిపోతుందిగా!' పళ్లతో పెదిమను కొరుక్కుని నవ్వుకుంటూ అంది లీల.
    'అబ్బ ఈ బాధతో నా బుర్ర కేవీ ఎక్కడం లేదు నాన్నా, ఓ దాని కొకటి రాశానంటే--'
    'నిజం నాన్నా, పాపం.'
    'ఏవిటే నీ ఇన్ జేక్షన్ లూ' విసుక్కుంది రాధ.
    'అన్నట్టు రఘు ఇంట్లోనే ఉన్నాడుగా అతన్ని వోసారోచ్చి చూడమంటే సరి' అక్కగారి పరిస్థితికి జాలిపడింది లీల.'
    'అ  చూశావా అతని మాట మార్చేపోయా,' అంటూ దబదబ కింది కెళ్లారాయన.
    'ఏమే? మరో మరో నొప్పీ మరో బాధ అయితే ఉందొ, లేదో డాక్టర్ కి తెల్సిపోతుంది గనక, ఈ తల్నొప్పి అంటే దీనికిక తిరుగంటూ లేదు. మంచి ఐడియా యే' నవ్వింది లీల.
    'బాగుందిలేవే ధోరణి' పై కుబుకుతున్న తృప్తి ని అణుచుకుంటూ బాధని నటిస్తుంది రాధ.
    'ఊ, మరీ బాగా బాధని తోపించే భావాల్ని మేకప్ చెయ్యి' టాయిలెట్ బాక్సు ని తెచ్చి రాధ పక్కని పెడుతూ అంది.
    'పోనీ అలాగే అనుకో' అంది మూతి తిప్పుకుంటున్న లీల మొహాన్ని అద్దంలో చూసి నవ్వుతూ, తేలిగ్గా పౌడరద్దుకుని ముంగురులు సవరించు కుంటూన్న రాధ.

                   
    'ఏవిటే, అలా చూడ్డం. అలా నవ్వు తావెం?' రాధ అంది.
    'అతన్నిక్కడికి రప్పించడం కోసరం నువ్వు పడుతున్న పాట్లు చూస్తె.'
    'అన్నీ ఇలాంటర్ధాలే తోస్తాయి నీకు'
    'అలా తోచేది నీక్కాని నాక్కాదు. నేనే అయితే నా మనసులో మాట స్పష్టంగా అడిగి సమాధానం రప్పించుకు నుండెదాన్ని. అది జరిగే పని కాదని తోస్తే పూర్తిగా అ ఆశే ఒడులుకు నేదాన్ని. చల్లకొచ్చి ముంత దాచడం దేనికీ.'
    'నేనేం అలా రానూ లేదు దాచాలేదు.'
    'ఆబద్దమాడకు. మొదట్లో అతడు నీ అందం చూసి మోహం లో పడిపోయి నీవెంట తిరుగుతాడని అనుకున్నావు. అలా జరగక పోవడంతో ఏదో నిమిత్తంగా నీవద్ద కతడ్ని రప్పించి మనసు రెచ్చగొట్టి పని సాధించు కుందావన్న ఉద్దేశంతో ఈ ప్లాను వేశావ్. నేనేరగనూ--'
    ఇంతలో మెట్ల మీద జోళ్ళ చప్పుడు వినిపించడం టప్ కూర్చుంది లీల.
    'ఏవిటండీ మీ ఒంట్లో బాధ' అంటూ ముందు రఘూ, అతని వెంట దత్తు దంపతులూ పైకొచ్చారు.
    'ఏం లేదండీ. తలనొప్పి విపరీతంగా వచ్చేసింది. ఆ గాభరాలో ఏ మాత్రాలేనా రాసిచ్చెందుక్కూడా తోచడం లేదు' అంది మొహమ్మీది జుట్టు వెనక్కి తోసుకుంటూ రాధ. ఎంతన్నా తనగుట్టు తేల్చుకున్న లీల ఎదుట వేషాలు వెయ్యడమంటే నిజంగానే సిగ్గుగానే ఉంది రాధకి.
    'అలాగా; అంటూ రాధ కాదు సరికదా రాధ చీరేలోని నూలు పోగు కూడా తనకి తగలకుండా అతి జాగ్రత్త గా 'స్టేతస్కోప్' తో పరిశీలించి చూసి ఒంట్లో అంతా బాగానే వుంది. వేడిగా కొంచెం కాఫీ వంటిది తాగి మనసుకి స్థిమితం కల్గేందుకు కొంచెం సేపు నిద్రపోండి చాలు'  అంటూ గబగబా మెట్లు దిగి వెళ్లిపోయాడు రఘు. ఆ వెంటనే అతను 'స్కూటర్ స్టార్టు చేసి వెళ్లిపోవడం స్పష్టంగా విన్న రాధ నెమ్మదిగా నిట్టురుస్తూ, గోడ వేపు తిరిగి పడుకుంది. ఏదో ఆలోచిస్తూ రాజమ్మ గారు కుర్చీలో కూర్చుంటే ఏం తోచక సుధ కోసరం కిందికి దిగి వెళ్లిపోయింది లీల.
సాయంత్రమయ్యాక చక్కగా టాయిలెట్ అయ్యి రాధ కిందికి వచ్చేసరికి రఘు టెన్నిస్ దుస్తుల్తోనే పువ్వులు కోసి ముందు పోస్తుంటే , సుదా, లీలా కూర్చుని మాలలు కడుతున్నారు.
    'ఆ ఇక వెళ్ళచ్చా నేను' అన్నాడు తన చేతులో వున్న పువ్వుల్ని కూడా సుధ ముందున్న పళ్లెం లో పోసేసి, రుమాల్తో తుడుచుకుంటూ రఘు.
    'అవిగో ఆపై కొమ్మని ఎంత మంచి గులాబీలున్నాయో, చూడు బావా?' అంది గునుస్తూ సుధ.
    'అబ్బే బొత్తిగా అన్నీ కోసేస్తే తోటందం పోదూ . ఏమండీ? ఔను కదూ' అన్నాడు లీల వేపు చూస్తూ రఘు చిన్నపిల్లల్నే మరిచే ధోరణి తో.
    'ఔను సుధా అంది లీల. అన్నదే   చాలనుకుంటూ, తోటలోంచి అలాగే వాకిలి వేపు వెళ్లి స్కూటర్నుందుకున్నందు వల్ల పాపం అంత చక్కగా తనని తీర్చిదిద్దుకు వచ్చిన రాధ అందాన్ని చూడనే లేదు రఘు.
    'అయినా ఇతడికా కుంటి పిల్ల మీద అంత మమకార మేమిటి? ఇంతకీ ఇది ఆ పిల్ల అవిటిది కదా నన్న జాలి మత్రమా, లేక యదార్ధమైన స్థిరంగా చూపదల్చుకునే అనురాగమేనా' అదే రాధ కర్ధం కావడం లేదు. ఒక్క రాధకి మాత్రమే మిటి జానకి తో సహా శర్మ గారి కుటుంబం లో వున్న అందరికీ ఈ ప్రశ్న అంతూ పంతూ లేని వో సమస్య గానే వుంటుంది. అయినా ఈ విషయాన్ని గురించి సూటిగా రఘు నడిగి తెల్సుకోవల్సిన అవసరం ఇంకా రానందున ఇతమిద్దంగా ఎవరి మట్టుకు వారు ఊర్కుంటూన్నారు.
    'ఎప్పుడో నెలల పిల్లగా వున్నప్పుడు చూశా నీ పిల్లని. అయినా ఇప్పుడెంతందంగా ఉందీ.' అంది. దత్తుగారి కుటుంబం వెళ్ళిపోయేక ఒక సారేదో మాటల సందర్భం లో జానకి.
    'రంగు కూడా తల్లిలా బొల్లి తెలుపు కాకుండా మంచి బంగారు చాయ. ఎవడో చేసుకుంటాడు సువర్ణ పూజ' జానకి మాట ననునయిస్తూ అన్నారు పార్వతమ్మ గారు.
    'అబ్బబ్బ ఈ ఆడవాళ్ళ కీ అందం మీద ఎంత మోజు బాబు.' అన్నాడు పేపరు చూస్తున్న రఘు నవ్వుతూ.
    'అక్కడికి మహా నీకు లేనట్టు, 'ఆ పిల్లలాగా , ఈ పిల్ల లాగా,' అంటూ ఎన్ని మార్లు నాతొ పొగుడుతూ చెప్పలేదు నువ్వూ,-- అభినయం చేస్తూ అడిగింది సుధ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS