అమరావతి ప్రతిష్టాపన
సవ్యాంధ్రప్రదేశ్ కు పాలనాకేంద్రం గానే గాక, ఆర్ధికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు ఊతం కల్పించగల రాజధాని నగరాన్ని నిర్మించడానికి చంద్రబాబు నాయుడు చేసిన భాగీరధ యత్నం చరిత్రలో నిలిచిపోతుంది. అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకుండానే , రాష్ట్రానికి మధ్యలో ఉన్న కృష్ణానది తీరం మీద అమరావతి పేరుతొ రాజధానిని నిర్మించాలని తలపెట్టడం , అందుకు అవసరమైన ప్రణాళికలను సింగపూర్, ప్రభుత్వ సంస్థల సహకారంతో సిద్దం చేయడం, భూసమీకరణ అనే కొత్త ఆలోచనతో రైతుల భాగస్వామ్యంతో 34 వేల ఎకరాలను సేకరించడం వంటి బృహత్కార్యాలు టిడిపి ప్రభుత్వం పూర్తీ చేసింది. అంగరంగ వైభవంగా 2015 దసరా నాడు ఆంధ్రప్రదేశ్ ప్రజారాజధానికి దేశ ప్రధాని హస్తాలతో శంకుస్థాపన చేయించారు చంద్రబాబు.
ఆంధ్రప్రదేశ్ ను 2029 కల్లా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో అమరావతిని ప్రపంచ నగరంగా నిర్మించడానికి చంద్రబాబు రంగం సిద్దం చేశారు. ప్రత్యర్ధులు సృష్టించిన అనేక అడ్డంకులను అధిగమిస్తూ, అమరావతిలో ప్రభుత్వ సముదాయానికి డిజైన్లు రూపిందించి, నిర్మాణాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలను అప్పజెప్పారు. ప్రభుత్వ నేతలకు, ఎమ్మెల్యే లకు , ఉన్నతాధికారులకు , సచివాలయ ఉద్యోగులకు అత్యాధునిక గృహవసతిని అమరావతిలో కల్పించేందుకు నిర్మాణాలను పెద్ద ఎత్తున చేపట్టారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఆర్ధిక వ్యవస్థకు ఉత్తేజం కల్పించడానికి అనువుగా అమరావతిలో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. జాతీయ స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా వైద్య తదితర సంస్థలను అమరావతికి వచ్చేందుకు ఒప్పించారు. ఆదాయం పెంపు కోసం స్టార్టప్ ఏరియా పేరుతొ అమరావతిలో కొంతభాగాన్ని అభివృద్ధి చేసి, ప్రపంచస్థాయి కంపెనీలను ఆకర్షించేందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
(ఆంధ్రప్రదేశ్ సత్వర అభివృద్దికి ఇరుసుగా అమరావతి రాజధాని నిర్మాణానికి
చంద్రబాబు పూనుకుంటే, ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మట్టి పాలు చేసి ,
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పరువును బజారులో పెట్టింది.)
అమరావతిలో రాజధాని నిర్మాణానికి ప్రభుత్వ ఖజానా మీద భారం పడకుండా సేల్స్ ఫైనాన్స్ మోడల్ ను తయారుచేశారు. వ్యవస్థల నిర్మాణంలో చంద్రబాబుకు ఉన్న విశ్వాసనీయత దృష్ట్యా రాజధాని నిర్మాణానికి రుణాలు సమకూర్చేందుకు ప్రపంచ బ్యాంకు, తదితర ఆర్ధిక సంస్థలు ముందుకు వచ్చాయి. భూసమీకరణ ద్వారా ప్రభుత్వానికి దఖలు పడిన భూముల్లో మూడో వంతు భాగాన్ని అభివృద్ధి చేసి, దశల వారీగా అమ్మడం ద్వారా, అలాగే నగరంలో పెరిగే వ్యాపార కర్యకాలాపాల ద్వారా వచ్చే అదనపు ఆదాయం ద్వారా ఈ అప్పులను తీర్చే విధంగా రాజధాని సవ్యాంధ్రప్రదేశ్ దక్కించుకునే విధంగా చంద్రబాబు ప్రణాళిక రచించారు. 2019 నాటికి రాజధాని నిర్మాణాలన్నీ వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని ఇలాగే కొనసాగించి, రాజధాని మొదటి దశని పూర్తీ చేసి ఉంటె, ఈ పాటికి రాష్ట్రానికి గొప్ప రాజధాని అవతరించడమే కాకుండా, రాష్ట్రంలో ఆర్ధిక
(చంద్రబాబు నాయుడు ఎంతో ముందు చూపుతో , ఎన్నో వ్యయప్రయాసలతో
తలపెట్టిన రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోవడానికి వైసిపి ప్రభుత్వం పన్నిన
కుయుక్తులన్నీ న్యాయస్థానం ఎదుట వీగిపోయాయి.)

కార్యకలాపాలు పుంజుకోవడానికి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉండేది.
2019లో ప్రజానిర్ణయం రాష్ట్ర రాజధానికి, తద్వారా రాష్ట్ర భవిష్యత్తు కు శరాఘాతమైంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల నిర్ణయాల మూలంగా రాష్ట్రం ఏర్పడిన ఎనిమిదేళ్ళకు కూడా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నవ్వులపాలయింది. అమరావతి నిర్మాణానికి నడుం కట్టి, ముఖ్యమంత్రి గా చంద్రబాబు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మట్టిపాలు చేసి, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్ర పరువును బజారులో పెట్టింది. రాజధాని నిర్మాణంలో తెలుగుదేశం అవినీతికి, అక్రమాలకు పాల్పడిందని చేసిన విష ప్రచారంలో ఇసుమంత కూడా వాస్తవం లేదని దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు కొట్టివేశాయి. అమరావతి లో రైతులతో ఒప్పందాలు సక్రమంగా జరిగాయని, వీటిని పాటిస్తూ ఇక్కడే రాజధానిని కాలవ్యవధిలో నిర్మించాలని మార్చి 3, 2022 న ఏపి హైకోర్టు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాప్రయోజనాలను పెద్ద పీట వేసిందనే విషయం స్పష్టమైంది.
