Previous Page Next Page 
ఒక గుండె సవ్వడి పేజి 14


    విరజకి కూడా అలానే వుంది.
    ఇద్దరిలోనూ ఒకే భావం.
    'పెళ్ళి' అనే అడ్డు కూడా తొలగిపోతే....
    "విరూ! ఇక మనం సాధ్యమైనంత తొందరగా పెళ్ళి చేసుకోవాలి. ఎంతసేపు బిజినెస్ డెవలప్ మెంట్ గురించే కానీ, మన సంగతి నెగ్లెక్ట్ చేస్తూ వచ్చాం! ఇరువైపులా నుండీ పెద్దవాళ్ళు లేరు మనకు మనమే పెళ్ళి చేసుకోవాలి. మెంటల్ గానే కాని ఫిజికల్ గా కూడా ఐ నీడ్ యూ... ఐ వాంట్ యూ..." అన్నాడు అభినయ్ మెల్లగా విరజకి మాత్రమే వినపడేలా.
    విరజ అర్ధం చేసుకుంది అతని మనసుని.
    తను బిజినెస్ అతని చేతిలో పెట్టేసి తనయితే నిశ్చింతగా వుందేమోగా అతను మాత్రం కేవలం బిజినెస్ కే అంకితమయిపోయి చేస్తున్నాడు. కొంచెంకూడా రిలాక్స్ అనేదే లేకుండా పోయింది.
    అందుకే ఇలా అప్పుడప్పుడు బలవంతంగానయినా సరే ప్రయాణాలు పెడుతూ వుంటుంది.
    ఇలాంటప్పుడేగా మనసు కాస్త ప్రశాంతంగా వుండేది. ఆ టైమ్ లో మనసులో భావాలు వాటంతటవే బయటపడతాయి. అది సహజం కూడా.
    ఎనీవే.... 'పెళ్ళి' అని కుదురుగా ఆలోచిస్తున్నాడన్న మాట. ఆఁ అబ్బాయిగారి మనసు డైవర్ట్ అయినట్టే ఇంకేం ఆటంకాలూ లేవు తమకి....
    "అభీ! ఈసారి మనం ఆలుమగలుగా రావాలి.....కదూ!"
    "అవును....ఆపైసారి పాపతో, ఆ తర్వాత బాబు.... ఇద్దరితో రావాలి" అన్నాడు కలలోలా.
    "అవును కరెక్ట్. అప్పుడు నువ్వు యమా బిజీ.... ఇద్దరి పిల్లలతో నాతో ఎలా వేగుతావో ఏమో?" అంది తను కూడా ఊహించుకుంటూ.
    "మా విరజ మంచిది కదా! నాకేంటి ప్రాబ్లెం" అన్నాడు నవ్వుతూ.
    విరజ కళ్ళు మూసుకుని తన్మయత్వంగా ఆ సీన్ ని విజువలైజ్ చేసుకుంటోంది.
    అది తెల్సిన అభినయ్ ఆమెను డిస్ట్రబ్ చెయ్యలేదు. నడుం చుట్టూ చెయ్యేసి, దగ్గరికి తీసుకున్నాడు ఆప్యాయంగా.
    అందమైన అనుభూతుల్ని మనసుగదిలో పదిలపరుచుకుంటూ భవిష్యత్తుపై రంగురంగుల కలలు కంటున్నారా యువజంట.
    
                                 * * *
    
    గ్రీన్ పార్క్ హోటల్.
    రూమ్ నెంబర్ 327.
    ముందే ఫోన్ లో చెప్పి రిజర్వ్ చేయించుకున్నారు గనుక ఏ ప్రాబ్లెమ్ అయిపోయింది.
    "అబ్బ..... ఎ.సి. ఎక్కువైంది కదూ...." అన్నాడు రెండు చేతులూ ప్యాంటు చేతిలోకి పోనిచ్చి అభినయ్.
    "నిజంగా అంత చలిగా వుందా అభీ!" అడిగింది విరజ.
    "నిజం..... సెంట్రలయిజ్ డ్ ఎ.సి. కదా... అంతే..." అన్నాడు మరింత వణికిపోతూ అభినయ్.
    విరాజ అభినయ్ ని దగ్గరకు లాక్కుంది. ఎంత దగ్గరగా అంటే.... ఇద్దరి మధ్యా గాలి దూరనంత దగ్గరగా అతని తలను తన గుండెలకు ఆన్చుకుంది.
    కొంగును అతని తలమీదుగా కప్పింది.
    అతని ఉచ్చ్వాస నిశ్వాసాలు ఆమె ఎదభాగాన్ని తాకి ఉక్కిరి బిక్కిరి గావున్నాయి. ఆమె పలుచని పొట్ట అతని నడుంని హత్తుకున్నట్టు వుంది.
    ప్రయత్నంగానో.... అప్రయత్నంగానో అతని చేతులు ఏ ఆచ్చాదనా లేని ఆమె నడుంని చుట్టి పొట్టని తాకేయి.
    అతని చేతివేళ్ళ నుంచి విద్యుత్ శరీరమంతా పాకినట్టు అనిపించింది.
    "విరూ..." గుండెలోని ప్రేమను, గొంతులోకి తెచ్చుకుని పెదవుల చివరల నుంచీ ఆమె గుండెలోతుల అంచులు తాకేలా పిలిచాడు.
    "చెప్పు అభీ!"
    "పెళ్ళి కాకుండా యిలా ఒకే గదిలో మనిద్దరం వుండొచ్చా?" అతనిలో వచ్చిన సందిగ్ధం.
    నవ్వింది విరజ.
    మంచంమీద కూచొని, అతని తలను తన ఒళ్ళోకి లాక్కొని అంది.
    "పెళ్ళయితే తప్పు లేదా? మనసులు కలవకుండా, పెళ్ళయి ఒకే గదిలో వుండొచ్చా? మనసులు కలిసి ఒకే గదిలో వుండకూడదా? నా దృష్టిలో మనపెళ్ళి ఎప్పుడో అయిపోయింది. అన్నట్టు మొన్ననే ఎక్కడో చదివా. పెళ్ళి కాకున్నా స్త్రీ పురుషులు కలిసి వుండొచ్చట. సారిక, కమల్ హాసన్ కొన్నాళ్ళు అలానే వున్నారుగా...
    "అది కాదు విరూ.... నీకు నామీద ఎందుకంత నమ్మకం?"
    "నమ్మకం మనసుకు సంబంధించినది. మనసు ప్రేమకు సంబంధించింది ఆ ప్రేమ నాకు సంబంధించింది. నేను నీకు సంబంధించిన మనిషిని".
    విరాజ మాట్లాడిన దాంట్లో ఒక్క ముక్క కూడా అర్ధం కాలేదు అభినయ్ కి కానీ ఆమె మాట్లాడకుండానే, ఆమె మనసు మాత్రం మొత్తంగా అర్ధమైంది.
    "నా దృష్టిలో మన పెళ్ళి అయిపోయిందన్నావుగా. మరి ఆ తర్వాతది... అదే శోభనం చేసేసుకుందామా!" అభినయ్ మాటల్లో టీజింగ్.        "నేన్రెడీ.... ఫస్ట్ నైట్ అయినా, యిలానే... యిప్పుడే.... ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ అయినా సరే" అంది వెలికిల్లా అలానే అడ్డంగా మంచంమీద పడుకుని విరజ.
    అతని పెదిమలు ఆమె పలుచని పొట్టమీద వున్నాయి.
    గట్టిగా శబ్దం వచ్చేలా ముద్దు పెట్టుకున్నాడు. విరాజ కళ్ళు అరమోడ్పులే అయ్యాయి. తన పెదవులతో తమకంగా అటూ, ఇటూ రాపాడించాడు పలుచటి పొట్టమీద అభినయ్.
    "ఏయ్..." అంది విరజ.
    అభినయ్ ఆమె నడుం మడతమీద చేయివేసి, పెదవులను నడుం మడతకు దగ్గరగా జరిపి ముద్దు పెట్టుకున్నాడు.
    విరజ ఏ మాత్రం అడ్డు చెప్పలేదు. సరిగ్గా అప్పుడే రూమ్ బెల్ వినిపించింది.
    ఇద్దరూ ఉలిక్కిపడి, సర్దుకుని కూర్చున్నారు. రూమ్ బోయ్ వచ్చి టవల్స్ పెట్టి వెళ్ళాడు.
    వాళ్ళు కంపెనీకి సంబంధించిన గెస్ట్ హౌస్ వున్నా, హోటల్ నే ఫ్రిఫర్ చేశారు విరజా, అభినయ్.
    
                                  * * *
    
    "ఇప్పుడేం చేద్దాం?" అడిగాడు అభినయ్ రూమ్ బోయ్ వెళ్ళిపోయాక.
    "నాకూ అంతా కొత్తే... సమరం గారికి ఫోన్ చేసి కనుక్కోనా?" అడిగింది కామ్ గా విరజ.
    ఉలిక్కిపడి అన్నాడు అభినయ్ "అదేంటి.....ఆయనకెందుకు ఫోన్..? నేను అడిగింది ఆ ఉద్దేశంతో కాదు..." అన్నాడు ఎర్రబడ్డ మొహంతో.
    "కామన్ గా ఆడపిల్లల మొహం ఎర్రబడుతూ వుంటుంది. అయిన పెద్ద ఏదో చించేసే లెవల్లో బిల్డప్ యిచ్చావు. అయినా నిన్ను కాదు... ఆ రూమ్ బాయ్ ని పట్టుకుని తన్నాలి. దరిద్రుడని దరిద్రుడు. ఇప్పుడే రావాలా? వచ్చే జన్మలో వాడి ఫ్యామిలీకి నా మొగుడు సర్వపిండొత్తి పెట్టు" అంది.
    "సర్వపిండి ఒత్తి పెట్టడమంటే?" లబోదిబోమని మొత్తుకున్నాడు అభినయ్.
    "అబ్బ.... ఏం పిలిచావయ్యా స్వయం కృషిలొ విజయశాంతి పిలిచినట్టుగా నిన్ను చూస్తుంటే మగ విజయశాంతిలా అనిపిస్తున్నావు".
    "ఛ....ఛ.....మన విజయశాంతి ఏంటి? అయినా నీకేమైంది.... ఆ వాగుడేంటే?" అభినయ్ మొత్తుకున్నాడు.
    "అబ్బా.... ఆ.... ఇప్పుడు నమ్మగా వుంది. నువ్వు నన్ను విరూ.... అని పిలిచినా పిలుపు కన్నా... 'ఏమిటే' 'అది కాదే', 'ఇలా రాకే' అంటూ పిలిస్తేనే బావుంది" అంది విరజ.
    "ఏంటో నీ టేస్ట్ అయినా నిజం చెప్పాలంటే నాకూ అలానే పిలవడం ఇష్టం తెల్సా?" అన్నాడు అభినయ్.
    "అవునురా..." అంది విరజ.
    బ్లాంక్ గా విరజవైపు చూసేడు అభినయ్.
    "సరదాగా అన్నాను గానీ, నన్ను 'వే' అనే పిలువు,  నిన్ను 'రా' అని అనన్లే" అంది.
    తల విదిల్చాడు అభినయ్. అతని బుర్ర వేడెక్కింది.
    "ముందు స్నానం చేద్దాం. తర్వాత కాంప్లిమెంటరీ బఫే బ్రేక్ ఫాస్ట్ చేద్దాం. టిఫిన్స్ అన్నీ బావుంటాయి కదూ... ఓ పట్టు పట్టాలి." అన్నాడు ఒళ్ళు విరుచుకుంటూ.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS