'పిన్నిని నాన్న సరస్వతి లాగే చూశారట. ఆవిడ నా దగ్గర ఏడుస్తుంటే యించుమించు పిచ్చివాడిని అయిపోయాను' అని 'అదిసరే గానీ నువ్వు ఏమంటావు ?' అన్నాడు.
ప్రభాకరం తాపీగా అన్నాడు . 'అనేందుకు ఏముంది? నీకూ ఆవిడకూ యిష్టం అయితే నాది యేముంది రా ?'
అమాంతం కౌగలించుకుని మాట్లాడ లేకపోయాడు శ్రీనివాస్. అతనికి గొంతు పెగల్లేదు.
'ఉన్నమాట చెప్పేయడం నాకు చాలా యిష్టం. ఒక్క సంగతి నేను తిరగని చోటు ఏదీ లేదు. అలా అని నాకు సంక్రమించిన వ్యాధి కూడా యేవీ లేదు. మా అమ్మని బాబాయి దేవత లా చూసుకున్నాడు. కానీ మమ్మల్ని అయన చిత్ర హింస పెట్టాడు. ఒకవేళ మీ పిన్నికి సంతానం వున్నా 'ఐహేవ్ నో అబ్జక్షన్.'
శ్రీనివాస్ నెమ్మదిగా అడిగాడు . 'యిటు వంటివి ఎక్కడో గాని జరగవు. ప్రతి స్త్రీ , ప్రతి పురుషుడు కోరుకునేది ఒకటే. పవిత్రంగా అర్పితం అయ్యే మనిషి కావాలని కాని.........
'యెవరి టెస్ట్ వాళ్ళది. నాకు స్త్రీ అంటే జాలి వుంది. నా జీవితం వొక స్త్రీ ఆత్మ తృప్తి కి ఉపయోగ పడింది అంటే నాకున్న సంతోషం నేను విప్పి చెప్పలేను.'
'ఏవిటో యిదంతా......'
'శుష్క వేదాంతం లా వుందంటావు. నిజం చెప్పాలంటే నాకు యీ తక్షణం యేదైనా సంస్కరణ చేయాలనీ, ఉద్యమం లెవదీయాలని వుంది.'
'ఇంక నిద్దర పోదాం. పిన్ని యేమంటుందో ప్రొద్దుటే ఆవిడకు వుత్తరం రాయాలి.'
'నాకూ ఆదుర్దాగానే వుంది. నీతో యింత సంబంధం మరి విడిపోకుండా పెట్టుకుంటున్నానేవిటా అని. అది సరే పెళ్లి అనగానే యింద్రి యాలన్నీ యింత చకచకా పనిచేస్తాయను కోలేదు నేను.
'మరే పాపం, ' శ్రీనివాస్ నవ్వాడు.
* * * *
రెండు రోజులు పూర్త కానేలేదు ప్రభాకరం మాట యిచ్చి. శ్రీనివాస్ చేతిలో వుత్తరం పట్టు జారిపోయి అతన్ని గజగజ లాడించేస్తోంది. గుండె అంతకు మించిన వేగం లో కొట్టుకు పోతోంది.
'నిజంగా' తను నమ్మలేక పోతున్నాడు. అతని కంటి నుంచి కారే కన్నీటి తో చొక్కా అభిషేకం అవుతోంది. ఒక టెలిగ్రాం , రెండోది ఎక్స్ ప్రెస్ డెలివరీ వుత్తరం. అతని వూహ చెదిరిపో యింది. వాస్తవానికి రాగానే గుండలు బ్రద్దలయ్యే లా యేడ్చాడు. 'శ్రీనివాస్ యేడవడం దేనికి? యిప్పుడు ఏం జరిగింది/ చెప్పు శ్రీనివాస్ నీకు నేను వున్నాను.' ప్రభాకరం శ్రీనివాస్ భుజం మీద చేతులు వేశాడు.
చేతిలో జాబు రెపరెప లాడుతూ ప్రత్యక్షంగా కనిపిస్తోంది. 'సరస్వతి యింక మనకి లేదు' ప్రభాకరం అర్ధం చేసుకున్నాడు. కర్తవ్యమ్ తెలీని వాడిలా బుర్ర వంచుకుని రెండు జతల బట్టలతో. శ్రీనివాస్ అడుగులోంచి కుడికాలు తీసి ఎడం కాలు వేస్తూ వెడుతుంటే ప్రభాకర్ కి జాలి వేసింది. 'కూ' అనే రైలు బావురుమనే ఫ్లాట్ ఫామ్ , శూన్యం లా వున్న గది గోడలూ అతని మస్తిష్కంలో కదిలాయి . రక్తంలో రక్తం అయిన సరస్వతి పొతే శ్రీనివాస్ వొంటరిగా యేకాకిలా వెడుతున్నాడు . అందుకే అతనికి గుండెలు మండే బాధ అనిపించింది.
రైలు కదులుతుంటే హటాత్తుగా అన్నాడు శ్రీనివాస్! 'చప్పున దిగిపో ప్రభాకరం రైలు వేగం పుంజు కుంటోంది ' ప్రభాకరం వినలేదు.
'నిన్నే ప్రభాకర్. దిగు రైలు. వేగం యింకా యెక్కువ కాకముందే దిగు. నిన్నే నోయ్'
'నేనూ వస్తున్నాను శ్రీనివాస్. నిన్ను వోక్కడి నీ పంపేందుకు మనసు వూప్పుకోవడం లేదు.'
శ్రీనివాస్ కళ్ళు అతన్ని చిత్రంగా పరికించాయి కాస్సేపు. 'పిన్నిని చూసేందుకు ? ఛ! వట్టి అనుమానం గానీ పిన్ని ని చూసేందుకే అయితే నాతొ చెప్పాడూ.' ఈ రెండు మనసులో పట్టాలై పోయాయి. రైలు వాటి మీద నడుస్తూ కదులుతోంది గమ్యాన్ని ముందుకు పడేస్తూ . పల్లెటూరి లాంటి వూళ్ళో అసుర సంధ్య మధ్య నూనె దీపం కాంతిలో వైధవ్యం వుట్టిపడే పిన్ని గుర్తుకు వచ్చింది. చిన్నప్పుడు గోరు ముద్దలు తినిపించిన అమ్మా, బ్రతుకు మీద అనవసరం అయిన రోత కలిగించుకున్న చెల్లెలూ, వార్ధక్యానికి లొంగి పోయిన తండ్రీ, ఆ వూరి మట్టిలో బూడిద అయితే యింక యే ఆశతో తను వస్తున్నట్లు.'
మనసులో మెదిలింది. అన్యాయానికి ఆహుతి అయిపోయిన ఆ యిల్లాలిని చూసుకోవడం యెంతైనా అవసరం.
'అవసరం కాదు బాధ్యత నీది. కదులు వూ,' తొందర చేసే మనస్సును నడిపించాడు ముందుకు.
చటుక్కున గుర్తుకు వచ్చిన వాడిలా అడిగాడు శ్రీనివాస్.
'నువ్వు దేనికిరా వస్తుంట?'
ఒకసారి దృష్టి మళ్ళించి అన్నాడు ప్రభాకరం. 'మనిషికి మనిషి సాయం తప్ప కుండా వుండాలి. నువ్వు యింటికి వెళ్లి ఒక్కడివీ అపరిస్థితుల్నీ తట్టుకోలేవు. అందుకే రావాలని పించింది.'
'నా దురదృష్టం నీ నెత్తిన దేనికి యెక్కించు కుంటావు?'
'అర్ధం లేదు.... ఎవరి ఖర్మలు వాళ్ళవి. మనం ముందు సంగతి చూడాలి. పద పద. త్వరగా మాట్లాడు రిక్షా! ప్రభాకరం తొందర పెట్టాడు.
* * * *
శ్రీనివాస్ కి,
బ్రతుకు మరీ యింత దారుణంగా, నిరాశా గా వుంటుందని తెలిస్తే బలవంతంగా చచ్చి పోయేదాన్ని. నాలాంటి దౌర్భాగ్యులకు చావు అంత తేలికగా రాదు. మనం దేనికో పుట్టాం. అది ఏదో నాకు కావాలి. కానీ నేను మిగిలిపోయాను కావాల్సింది చేజిక్కించు కోకుండానే.
చూడు శ్రీనివాస్! నాకు యీడైన పిల్లాడివి వుంచుకుని మీ నాన్న నన్ను చేసుకోవడం నా నొసటి రాత. ఆ పని చేశాక అయన పశ్చాత్తాపంతో నన్నూ, సరస్వతి ని ఒకటిగా చూడడం న్యాయం అనిపిస్తుందంటావా? అయన ఒక్కమాట అనేవారు 'నిన్ను పన్నెత్తి పలకరించేందుకు కూడా భయంగానే వుంటోంది సుభద్రా. నీకు తెలిసి నన్ను అర్ధం చేసుకుంటే మంచిదే కానీ నేను ఏం చేయను,' యిలా అంటుంటే ఆ మాటలు శూలాలై గుచ్చుకునేవి. నన్ను మిధ్యా వాదిని చేశారు, అయన...నాకు బ్రతుకు పూల పల్లకిలా వుండాలి. యింతే కోరుకున్నాను. నాకు దొరికిన మార్గం వెతుక్కుని వెడుతున్నాను. వెతికించకు నన్ను. ఆ రాత్రి.... తలుచుకుంటే సిగ్గుతో నా తల వొంగి పోతోంది. మన్నించు నన్ను. సరస్వతి కోసం నువ్వు వచ్చేసరికి నేను నీకు అందని దూరం లో వుండాలి. నీ దగ్గర దాచడం యిష్టం లేదు నాకు. రెండు మూడునెలల్లో నేను జగదీశ్ ని పెళ్లి చేసుకో బోతున్నాను నీకు కనిపించకుండా వెళ్ళడమే నాకు బాగుందని పిస్తోంది.
నాకూ యీ యింటికి తీరిపోయిన బంధంతో నీకు నేను యేమౌతాను? అందుకే
--సుభద్ర.
'పిన్ని,' దిక్కులు దద్దరిల్లేలా ఘొల్లు మన్నాడు శ్రీనివాస్. అతని ఆవేదన మంటలా పైపైకి యేగబ్రాకి వాసాలూ, దూలాలూ, నిండిపోయి గోడల్లోంచి పునాడుల్లోకి ప్రవేశించి గోడలన్నిటినీ కూల్చేస్తోంది. ఆశల గోడలు తునాతునకలై పోతున్నాయి నిర్దయగా.
'ఫరవాలేదు . ఆవిడ నీకు రాసిన వుత్తరం మొత్తం లోనే వుంది అంతరార్ధం. ఆవిడ కోసం నువ్వు యిప్పుడు బాధపడడం నాకు యేవీ బాగులేదు.'
'అది కాదు ప్రభాకరం. నీకు అసలు సంగతి తెలీదు.'
'ఏవిటది?'
'పిన్ని మోసపోయింది. వాడు పిన్నిని నలిపి అనామకురాల్ని చేసి; సర్వనాశనం చేసి వట్టి చేతుల్తో నడి సముద్రం లో పడేసి తను పారిపోయి వస్తాడు.'
'ఛ! వెంటనే అలా అనేయకూడదు. ఆవిడ నమ్మి వెడుతోంది. నువ్వు అనవసరంగా ఊహిస్తున్నావు.'
'లేదు ప్రభాకరం నీకు వాడి సంగతి తెలుస్తే అలా ఆనవు.'
'దానికి నువ్వేం చేస్తావు ? ఆవిడ చూస్తూ చూస్తూ తనే గోతిలో దిగబడి పొతే ఎవరేం చేయగలరు?'
'చూడు శ్రీనివాస్! మీ పిన్ని చాలా అమాయకురాలు. వాళ్ళు యిద్దరూ నీకు రెండు కళ్ళు అనుకో. అలా అని నాకు మాట యిస్తే గాని నా ప్రాణం పోదురా' తండ్రి గొంతు స్పష్టంగా వినిపిస్తోంది యిప్పుడు మరీ దగ్గరగా.
'ఏరా యేది మీ పిన్ని యెంత పని చేశావు? నాకు మాట యిచ్చి డాన్ని రెక్కలు తెగిన పక్షిలా వదిలేశావా? అతని మాటలు శ్రీనివాస్ మెదడు ని నమిలి పిల్చి పిప్పి చేస్తున్నాయి. అయోమయంగా వెర్రిగా ఏడుస్తున్న శ్రీనివాస్ కి చెల్లెలు పోయిందనే సంగతే గుర్తుకు రావడం లేదు. ప్రభాకరం వోదారుస్తున్నాడు: 'యిప్పుడిలా యేడు స్తుంటే నీకు వొరిగే లాభం ఏవీ లేదు. పద మనం పోదాం.'
'పిన్ని లేకుండా ఎలా రాను ప్రభాకరం? ఆవిడని వెతికే బాధ్యత నామీద వుంది . చచ్చిపోయిన నాన్న నన్ను అప్రయోజకుడి క్రింద జమ కట్టేసి ....అసలు పిన్ని సుఖ పడుతుందనే నమ్మకం లేదు. ఆవిడని ఎలాగైనా వెతకాలి.'
'నవ్వు వస్తోంది నాకు' ప్రభాకరం నవ్వాడు. ఎంత పిచ్చి వాడివి నువ్వు. వెళ్లి పోయిన పిన్నిని నువ్వు పట్టు కోగలననే అనుకుంటున్నావా?'
'అది నా కర్తవ్యం ప్రభాకరం.'
'ఏవిటో ? సరే నీకు అంత పట్టుదలగా వుంటే కాదనేందుకు ఎవరిని నేను. మరి కొన్నాళ్ళు ఆగి వేడుదువు గాని ముందు రాజమండ్రి పద. తరువాత వేదు'కుదువు గాని'
శ్రీనివాస్ కి యిప్పుడు జ్ఞాపకం వచ్చింది . ప్రతి అంగుళం మేరా సరస్వతి నవ్వుతూ, త్రుళ్ళుతూ తిరుగుతున్నట్లే వుంది. ఆపిల్లకి వయసు వచ్చినా తన బుద్దికీ, జ్ఞానం యెన్ని వున్నా పెళ్లి చేయలేక పోయాడు. అక్కడికీ ఆ పిల్ల మనసు విప్పి తనతో చెప్పింది కూడా.
'నువ్వెలా చేయగలవు శ్రీనివాస్,' అంతరాత్మ అడిగింది.
'ఏం. యెందుకు చేయలేవూ.'
సమర్ధించిన అంతరాత్మ అతని మీద విరుచుకు పడింది కర్తవ్యం.
'నాకు డబ్బు లేదు. పిల్లాడిని కొనగలిగే స్తోమత లేదు. నామీద నేను నిలబడలేక పోయాను. ఇలాంటి స్థితిలో నన్నేం చేయమంటావు?'
'డబ్బు, ఎక్కడ చూసినా యిదే గోల. నీకు ఆ సంగతి దృడంగా నాటుకోవాలే గానీ నువ్వు యేది చేయలేవు?'
'యేమో నీతో వారించలేను', శ్రీనివాస్ కళ్ళు మూసుకున్నాడు.
అన్నయ్యా!
శ్రీనివాస్ కి ఆ పిలుపు అందింది. సరస్వతి కాగితం మీద నవ్వుతూ కనిపించింది.
చూడన్నయ్యా నేను ఒక్కదాన్నే వెళ్లి పోతున్నాననే బాధ లేదు. పిన్ని ఏవిటో ఆ జగదీశ్ ని నమ్మి సర్వనాశనం అయిపొయింది. ఇంకా సుడిగుండం లో పడి గిరగిరా తిరుగుతూ అదః పాతాళానికి వెళ్ళిపోయింది.
ఈ మధ్య నేను గమనించక పోలేదు. పిన్నికి కాఫీ అంటే పంచ ప్రాణాలు. ఆ కాఫీ అంటేనే చీదరించు కుంటోంది. అడపా తడపా యెవరూ చూడకుండా వక్క పలుకు బుగ్గన వుంచుకునేది. అదీ మానేసింది. అదో పెద్ద కారణం కాదు. అయినా నేను మరీ తెలివి లేని డాన్ని కాదు.
మిట్ట మధ్యాహ్నం చింత తోపుకు వెళ్లి గుప్పిళ్ళ తో కాయలు తెచ్చుకోవడం గురించి యిరుగు పొరుగులు యెన్నేన్ని వ్యాఖ్యానాలు చేసేవారు. మింగేందుకు మెతుకు లేని ఈ బ్రతుకులో, ఈ నిరాశా, నిస్పృహల మధ్య రోగిష్టి బ్రతుకు ఎందుకీచ్చాడో ఆ భగవంతుడు. ఆరోజు శ్రీహరి నన్ను చేసుకోనన్న రోజునే యీ ఆశ క్షీణించి పోయింది. బ్రతికి యెవరిని వుద్దరించాలి? చావలేక యింకా వున్నాను యిన్నాళ్ళూ. నేనిక బ్రతకను. నాకు గట్టి నమ్మకం. ఇలా రాస్తుంటే నా వొళ్ళు గగుర్పోడుస్తోంది . హాయిగా చావు కూడా వొక్కోసారి చక్కటి వరంలా కనిపిస్తోంది. పిన్ని పాపం. ఎవరి ఖర్మలు వాళ్ళవి. నిన్ను చివరిసారి చూస్తావో లేదోరా అన్నయ్యా. డబ్బు లేకపోయినా ఆరోగ్యం వుంటే అన్నయ్యా నీ దగ్గర వుండి యెంత సంతోషంగా బ్రతికే డాన్ని.... పోన్లే బ్రతుకు అనగానే ఏదో ఆశ పుట్టి దుఃఖం వస్తోంది. నేను దేనికి యేడవడం? సుఖంగా పోతుంటే. నా కడసారి నమస్కారాలు యివేనేమో బహుశా.
-- సరస్వతి.
ఆఖరి మాటలు చదువుతుంటే కళ్ళ ల్లోంచి ధారగా పడ్డాయి కాగితం మీద కన్నీటి చుక్కలు.
'పిన్ని అటువంటి స్థితిలో వెళ్లి పోయిందా? చూశావా ప్రభాకరం! పిన్ని ఎటువంటి పరిస్థితిలో వెళ్లి పోయిందో? ఆవిడకు కావలసినవి యిచ్చి ఆదరంగా చూస్తాడంటావా' ప్రభాకరానికి చెప్పేయడం లో ముందు వెనుకలు ఆలోచించలేదు శ్రీనివాస్.
'అంత నమ్మకం లేకపోతె వెళ్ళదు ఆవిడ. ఎందుకలా శంకిస్తావు.'
'నిజమే అనవసరంగా అనుమానిస్తున్నట్లున్నాను. వాళ్ళు బాగుండే వుంటావు నువ్వు అన్నట్లు.' నన్ను క్షమించు ప్రభాకరం.
