తోటలూ, దొడ్లూ కాదు, చిన్న చిన్న యిళ్ళ దగ్గిర్నించీ. పెద్ద భవనాలవరకూ ఎన్నిటినో పటాలం పర్చుకుంది. అంచేత యెన్నో కుటుంబాలవాళ్ళు స్వస్థలం విడిచి దూర ప్రదేశానికి వెళ్ళి పోయేరు. యుద్ధ సమయంలో యుద్ధ రంగ ప్రదేశంలో సామాన్య సంసారు లుండడం కష్టం.
లాల్ మోయ్ గుటల అందం శరత్కాలపు వెన్నెలలో చూడాలి. చంద్రుడు అక్కడ ప్రకోపించినట్టు, మరెక్కడా ప్రకాశించడనిపిస్తుంది, వెన్నెల పాలసముద్రంలా నిండుగా, మంచి గంధంలా చల్లగా, తేనెలా తియ్యగా వుంటుంది. వెన్నెల రాత్రిళ్ళు ఆ గుట్టల మీద నే నొంటరిగా తిరిగేవాణ్ణి. నిండు చంద్రుడు చేతి కంది నట్టుంటాడు. ఆ ఎత్తు మీంచి పరిసరాలు చూస్తూంటే కనుచూపు మేరంతా వెన్నెల ఏరు పొంగినట్టుంటుంది. ప్రకృతి మద్యపానం చేసి వూగిస లాడు తూన్నట్టుంటుంది.
మార్గశిర మాసంలో ఆ వెన్నెల అందం వేరు. ఆ చలి అనుభవించాలిగాని. చెప్పలేం. ప్రపంచం అంతా ఒక "ఫ్రిజి డేర్". దాంట్లో ఆకాశం. వెన్నెల, చందమామ గడ్డకట్టిపోయేరు. గది తలుపు కాస్త తెరిస్తే, వెంటనే జలుబు చేసి పోయె ఆ హేమంత రాత్రిళ్ళు, నేను నా భాషా, బైట కొచ్చి, ఎదురుగా వున్న రాతి బండమీద కూచుని, సిగరెట్లు కాలుస్తూ ప్రకృతి మజా చూసేవాన్ని. తెల్లవారుఝామున మూడు గంటల ప్పుడు కూడా అదేపని.
అప్పుడు మరొక ప్రత్యేకతుంది. చలిసంగతి సరేసరి వెర్రికుక్కలా కరుస్తూంటుంది. ఆ గడ్డ కట్టిన వెన్నెల్లో, ప్రకృతి మైమరచి నిద్రపోయిన నిశ్శబ్దంలో ఒక పక్షి అరిచేది. దాన్ని తెలుగు దేశంలో 'తూతూరక్క" పక్షి అంటారు. ఉండీ వుండీ జాలిగా అరుస్తుంది. ఆ అరుపు గుండెల్లో దట్టమైన మరుపు పొరల అడుగున అణిగి మణిగిన ఏవో జ్ఞాపకాల్ని కెలుకుతుంది. అని సరిగా జ్ఞప్తికి రావు. అలా అని నిద్రపోవు. ఆ పక్షి తిరిగి తిరిగి అరుస్తుంది. గుండెలో ఏదొ గాభరా వేస్తుంది. ఒక్కొక్కప్పుడు కళ్ళంట నీళ్ళొచ్చేవి.
ఆ పక్షి "కట్టల్ ఫాగో" అని అరుస్తుందిట, కట్టల్ అంటే పనస ఫాగో అంటే పండవే" - పానసా పండవే"-
తూతురక్క కథలాగే దీనికి ఒక జాలికరమైన కథ వుంది.
మేం కొమిల్లాలో వుండగా చెప్పుకోదగిన విశేషాలేవీ జరగలేదు కాని ఒక్కటి మాత్రం చెప్పాలి. ఇది మిత్రుడు మేలాసింగు చెప్పిన కథ.

ఆర్. హెచ్ క్యూకి యెదురుగా తె కిళ్ళ వతల ఒక టిన్ రేకు ఇల్లుంది. అది ఒక కాఫీ, టీ కాంటీను యజమాని సజిబుల్లా స్వగ్రామం విడిచి అక్కడికొచ్చి మమారేజుధైంది, పల్లెటూరిలో బతుకుసాగలేదు. పట్నం పత్ని యేదైనా వృత్తి చేసుకుని సంసారం సాగిద్దామనుకున్నాడు. మొదట ఒంటరిగా వచ్చేడు. ఉన్న పిసరూ పిప్పీ అమ్ముకుని కొంచెం దబ్బు తెచ్చుకున్నాడు ఆ కొంప అద్దెకి తీసుకుని చిన్న కాంటీను పెట్టేడు మొదట్లో టీ, బిస్కట్లూ అమ్మేవాడు మా ఆర్ హెచ్, క్యూతో కలిసి ఆ చుట్టు పట్ల దగ్గిరగా నాలుగైదు మిలిట్రీ యూనిట్లున్నాయి, సిపాయిల బేరం వల్ల అతని వ్యాపారం కొంచెం మెరుగైంది. క్రమేణా వుడికించిన గుడ్లు, ఆమ్లెటు అమ్మకం ప్రారంభించేడు, నెలకో సారి స్వగ్రామంవెళ్ళి సంసారం యోగక్షేమాలు చూసు కునేవాడు.
అతనికిప్పుడు మనిషి సాయం అవసరమైంది. ఊళ్ళో మనషులు నమ్మకస్తులు దొరకలేదు దొంగచాటుగా వస్తువులు, తన్ను యెత్తుకు పోతున్నారు.
నజిబుల్లా భార్య చనిపోయింది. ఇద్దరు కూతుళ్ళున్నారు. పెద్దది తగమా పద్దెనిమిదేళ్ళది, రెండోది మెహర్. పదహారేళ్ళది. వాళ్ళిద్దర్నీ కొమిల్లా తీసుకొచ్చేడు. కాంటీను గది వెనక భాగంలో మరొ చిన్న, టివ్ రేకు గది కట్టేడు. దాంట్లో ముగ్గురూ వుంటున్నారు.
నగమా ఓ మాదిరిగా వుంటుంది. మెహర్ చాలా అందకత్తె. పట్నం వచ్చి కాస్త రెండు పూటలా తిండిపడేసరికి ఆ పిల్లకి బలంవచ్చింది. గత్యంతరం లేక వాళ్ళని తీసుకొచ్చాకేగాని, నజీబుల్లాకి వాళ్ళను గురించి బెంగగానే వుంది. ఆ కాంజీను కొచ్చే వాళ్ళతో మూడొంతులు సిపాయిలే అమ్మాయి అన్నారనగానే సిబ్బందిరాక ఎక్కువైంది. వ్యాపారమయితే పెరిగింది. కాని పిల్లల గురించి ఆందోళన కూడా పెరిగింది, పల్లెటూర్లో తన ఒక యేమీ మిగల్లేదు. మిగల్లేదు. పట్నవేగతి, కాంటీన్ ఆధారం. అప్పుడప్పుడు సిపాయిలల్లరి చేసే వాళ్ళు రాత్రి పదైనా కదిలేవాళ్ళు కాదు. కూతుర్లుంకో గదిలోకి జొరబడేవాళ్ళు. గల్లంతు జరుగుతూండేది. అల్లరి చేసినవాళ్ళు ఆర్. హెచ్ క్యూకి పంపిన వాళ్ళయితే మర్నాడు ఉదయం వచ్చి నజీబుల్లా భయం భయంగా సుబేదార్ సాబ్ లో చెప్పుకునేవాడు. అందున సిపాయిల్ని మందలించేవాడు.
ఓ రాత్రి కొందరు సిపాయిలు నగమాని కాంటీను గదిలోకి జాకీ చుట్టబెట్టి అల్లరి చేసేరు. నజిబుల్లా వాళ్ళని అచలించబోయేడు. సిపాయిలు రెచ్చిపోయి, అతన్ని కొట్టి కమతీన్ సామాను ద్వందం చేశాడు. మర్నాడుదయం నజిబులా సుబేదార్ లో అంతాజెప్పుకుని ఏడ్చేడు. సుబేదార్ ఆ కేసు దర్యాప్తు చేయడానికి కాంటీనుకి వెళ్ళేడు. అక్కడ విరిగిపోయిన కుర్చీలు, బెంచీలు, కప్పులు చూసేరు, లోపలి కెళ్ళి నగమాని, మొహర్ నీ చూసేడు.

"చూడు మియా! నాకు చాలా విచారంగా వుంది. నీ నష్టానికి పరిహారం యిప్పిస్తా....... ఎంత ఓ వందరూపాయలు నష్టపోయుంటావా.
"సాబ్ మీ దయ... వినయంగా అన్నాడు
"సరే! పూర్తిగా నష్టపరిహారం ఇప్పిస్తా నీ కాంటీనింకా అభివృద్ది అవుతుంది."
నజిబుల్లా సంతోషించాడు.
ఆరాత్రి పదిదాటేకా సుబేదార్ సాబ్ నజిబుల్లా యింటి తలుపు తట్టేడు - నజిబుల్లా తలుపు తీసేడు. లోపల చీకటిగా వుంది. సుబేదార్ లోపలికెళ్ళి టీ కావాలన్నాడు.
"సాబ్. మీరు పెద్దలు. అడిగితే కాదనగల్నా. కాని కాంటీను వేళైపోయింది..." నసిగేడు.
మిలిట్రీ మనిషి వీథి తలుపు మూసి లోపల గడియపెట్టేడు. నజిబుల్లాకి అనుమానం వేసింది.
"పోనీ సాబ్. ఐదునిముషాల్లో టీ పెడతా..."
చూడు మిష్టర్. నాకు టీ అక్కర్లేదు. నగమా, మెహర్ కావాలి. నజిబుల్లా అదిరిపడ్డాడు.
"సాబ్! మీరు పెద్దలు. మేం బీదవాళ్ళం. అలా అనొచ్చా? క్షమించండి. మమ్మల్ని లా బతకనివ్వండి..." ప్రాధేయంగా అన్నాడు.
మిలిటరీ మనిషికి కోపం వచ్చింది. అసలే భీముడిలా వుంటాడు. తూస్తే రెండువందల యాభైపౌన్ల విగ్రహం. కళ్ళెర్రజేసేడు. మాట మీద ఆమాట పెరిగింది, ఎంత చెప్పినా నజిబుల్లా వినలేదు. "సరే, నీ పన్జెప్తా నామాట ఖాతర్లేదు కదూ, చూడు నా తఢాకా నువ్వూ నీ కూతుళ్ళూ కూలైనా చేసుకోవాలి. మాడైనా చావాలి.' చరచర వెళ్ళిపోయేడు.
మర్నాడుదయం పదిగంటలనుంచి నజిబులా కాంటీను పటాలం సిబ్బంది "ప్రవేశ నిషేధం' అయిపోయింది తిండి, త్రాగుడు స్త్రీ విషయములొ మంచి చెడ్డ లాలోచించని సుబేదార్ గతి రాత్రి జరిగింది అవమానంగా భావించాడు దానికి ప్రతీకారం అదె అనుకున్నాడు.
ప్రవేశ నిషేధం వుత్తరువుతో పాపం నజిబుల్లా కాంటీను వెలవెలబోయింది. అతనిపని సుమారు ఆట కట్టింది. రెండ్రోజులు తరవాత నజిబుల్లా ఆర్. హెచ్. క్యూ కొచ్చి అడ్జంటంటుతో చెప్పుకోడానికి ప్రయత్నించేడు. కాని భీముసేను డతన్ని గేటు దగ్గర్నించే గెంటిపారేసేడు.
పదిరోజులు దాటిపోయేయి. నజిబుల్లా పొయ్యిలో పిల్లిదూరి పడుకుంది. అతన్నీ అతని కూతుళ్ళనీ కడుపులో ఎలకలు గల్లంతు చేస్తున్నాయి.
పాపం అతను స్వగ్రామంతో తెగతెంపులు చేసుకొచ్చేడు. ఇక్కడ సంవత్సరం పైగా స్థిర పడ్డాడు. ఇక్కన్నించి కదిలి పట్నంలో మరెక్కడా వ్యాపారం పెట్టడం సుళువుకాదు అయితే ఈ పరిస్థితి ఎలా ఎదుర్కోవాలో అతనికి తోచలేదు.
ఓ నాడు రాత్రి వూళ్ళో తిరిగితిరిగి నజిబుల్లా పదికొండు గంటలకిల్లు చేరుకున్నాడు. వీధి తలుపు మెహర్ తీసింది.
"అబ్బా! లోపలి గదిలో కెళ్ళకు..."
"ఏం?"
"లోపల సుబేదార్ సాబున్నాడు ..."
అతను నీరై పోయేడు. నులక మంచంమీద నిలబడిపోయి తల పట్టుక్కూచున్నాడు.
కొంచెంసేపు పోయేక సుబేదారు సాబ్ బైట కొచ్చేడు. అతని వెనకాలే నగమా వచ్చింది. ఆమెకి పదిరూపాయల నోటందించేడు.
"నాకొద్దు, అబ్బాకివ్వండి"
సుబేదార్ సాబ్ నోటు నజిబుల్లాకివ్వబోయేడు అతను కన్నీళ్ళతో వద్దని సూచిస్తూ చేతులు తిప్పేడు.
'పుచ్చుకో అబ్బా, ఇది మనకు రావలసిన డబ్బు. సుబేదార్ సాబ్ ఎంతో మంచివారు..." మెహర్ నిర్భయంగా అంది.
తండ్రి పట్టరాని కోపంతో గది నాలుగుమూలలా వెర్రిగా చూసేడు. గొడ్డలో, గుససమో దొరికితే యిద్దరు కూతుళ్ళనీ చంపేద్దామనిపించింది. సుబేదార్ సాబ్ నోటు నులకమంచం మీద పెట్టి వెళ్ళిపోయేడు. దాన్ని మెహర్ తీసింది.
"అబ్బా విచారించకు మాకు రెండ్రోజు లైనా తిండిలేదు. నీకు వారంరోజులైనా లేదు. ఆకలితోనైనా చావాలి. ఆకలికి తట్టుకోలేకపోతే యెందులోనో పడైనా చావాలి. ఈ రెండుసమాచెయ్యలేం. ఎంతకాలం యిలా? ఎప్పటికి దీనికి అంతం?" నగమా తలవంచి అంది.
అతనలా ఆలోచిస్తోకూచున్నాడు. పట్నంలో ప్రతిరోజూ ఆకలిచావులు. చచ్చినవాళ్ళ శవాలవుపిస్తున్నాయి. రోడ్డుపక్క, రైల్వే స్టేషను దగ్గర యెక్కడ బడితే అక్కడ తమకీ, ఆ శవాలకీ అట్టే తేడాలేదు, నడపీనుగులు పీనుగులు.
ఆకలి మనిషిని వెర్రె త్తిస్తుంది. దొంగతనం చేయిస్తుంది. జారత్వానికిది వుతుంది హత్యలు చేయిస్తుంది. ఋషుల చేత తిట్లు తిట్టిస్తుంది. కుక్క మాంసం తినిపిస్తుంది.
మర్నాటినించీ ఆ కాంటీన్ మీద ప్రవేశ నిషేధం లేదు. నజిబుల్లా వ్యాపారం ఎత్తిరింది నగమా, మెహర్ పులులమందలో చేరిపోయేరు.
11
కొమిల్లా లాల్ మోయ్ గుట్టల దగ్గిర మేం సుమారు సంవత్సరం వున్నాం మాకు మళ్ళీ చలనం వచ్చింది ఇదివరకులాగే మొదట ఆర్ హెచ్. క్యూ ముందు చిట్టగాంగు వెళ్ళి పోయింది. మళ్ళీ నాకూ నా మిత్రులు మేలా. ప్రభూకీ ఎడబాటు కలిగింది తిరిగి వీడ్కోలు విందులు, 'ఆ రి వైర్"లు.
