Previous Page Next Page 
విరామం పేజి 12


    కొత్తవూరు. ఎటు వెళ్ళడమా తెలీదు, కనుక్కుందామన్నా ఆక్కడయెవ్వరూ లేరు. బ్లాకౌటు మూలంగా చీకటి. నిజానికక్కడికి మా యూనిటు ఫర్లాంగుదూరంలో వుంది. కాని కొత్త వల్లా, చీకటి వల్లా దారి తప్పిపోయేనని అనుమానం వేసింది. ఇంతలో యిద్దరేదురుగా వస్తున్నారు. దగ్గిరకి రాగానే వాళ్ళు మిలిట్రీ ఆఫీసర్లని పోల్చా. సెల్యూట్ చేశా, "క్షమించండి. తోవతప్పి పోయా. సిక్స్తిండియన్ హెవీ యాకాక్ వర్కుషాపుకి మార్గం చెప్పగలరా?"
    "ఎవరు నువ్వు? ఒకరడిగేరు. చెప్పేను.
    "నీ గుర్తుబిళ్ళ యేదీ?"
    "లేదు తేలేదు..." గొణిగా.
    వాళ్ళు నాకు రెండుపక్కలా చేరేరు. తీవ్రంగా వున్నారని తెలుస్తూంది.
    "A. B64 M?" రెండో కెప్టెను అడిగేడు.
    "క్షమించండి. అదికూడా తేలేదు..." మళ్ళా గొణిగా.
    "ఇవాళ "వాచ్ వర్డ్" యేమిటి?" అతనే తీవ్రంగా ప్రశ్నించేడు. "నాకు తెలీదు. నేను నిన్ననే వచ్చా..."
    "అదేం లాభంలేదు. ఇదంతా మిలిటరీ స్థలం. నిన్ను పోలీసు స్టేషనుకి అప్పజెప్పవలసుంటుంది. రా"    
    ఇద్దరూ నా జేబులు తడిమేరు. వీపుమీద, పొట్టమీద తట్టిచూసేరు, తిరిగి "రా" అన్నారు.
    మాట్లాడుతూనే నడుస్తున్నాం. కాని నాకు మతిపోయింది. అరెస్టయితే క్రమశిక్షణ దృష్ట్యా నామీద చాలా నేరాలు ఆరోపించొచ్చు. దురదృష్టం అనుకున్నా. వాళ్ళకి యేంజెప్పినా లాభంలేదు. అల మాట్లాడుతూనే మా యూనిటు గేటు వరకూ వచ్చా. మతి పోయి అదీ పోల్చుకోలేదు.
    "సారూ! ఇదిదా నమ్మ యూనిట్టు. వాంగో సారూ..."
    నేను వెనక్కి తిరిగి చూసా. డ్యూటీ గార్డు, డ్రైవర్ కుంజన్. నా బెంగ తీరింది.
    "క్షమించండి నర్స్! ఇదే నా యూనిట్..." కెప్టెన్లు నవ్వేరు.
    "చూడు హవల్దార్. నువ్వు చాలా పొరపాటు చేశావు ఇలా మరెప్పుడూ చెయ్యకు, ఈ చుట్టుపట్ల కొన్ని పరిరక్షిత స్థావరాలున్నాయి. పొరపాటున అలావెళ్తే నిన్ను షూట్ చెయ్యొచ్చు. జాగ్రత్త!"    
    "గుడ్ నైట్ నర్స్...."
    ".....నైట్" వెళ్ళిపోయేరు. నవ్వుకుంటూ, బహుశా తిట్టుకుంటూ.
    మేం అక్కడ మూడ్రోజులే వున్నాం. తరువాత మా అసలు స్థలం, "లాల్ మోయ్" గుట్టల మీదికి వెళ్ళిపోయేం. అని కొమిల్లా పట్నానికి ఆరేడు మైళ్ళ దూరంలో వున్నాయి. తోవ క డాకూ ఎగుడు దిగుడు యెర్రమట్టి గుట్టలు, యెర్రమట్టి ఆ గుట్టలు చాలా మేరవున్నాయి. వాటిచుట్టూ తోటలున్నాయి.
    అక్కడ మొదట మా వర్కు షాపులకి గాని. నివాసాలకి గాని ఎలాంటి ముందు ఏర్పాటూ లేదు. ముమ్మరంగా యుద్ధం జరుగుతూన్నప్పుడు "ఫీల్డు ఏరియా"లొ పురోగమిస్తూన్న పటాలాలకి వసతులు మొదలైన సౌకర్యాలు ముందుగా జరగవు.
    అప్పటికి మా వర్కు షాపుకి సంబంధించిన పరికరాలు. ట్రాన్సు పోర్టు మూడొంతులు సమకూరేయి. అంగబలం కూడా క్రమేపీ ఎక్కువౌ తూంది. డ్రైవర్లు, ఫిట్టర్లు, టర్నర్లు, ఇన్స్త్రుమెంటు మెకానిక్కులు, టెలికమ్యూనికేషను సాంకేతిక నిపుణులు ముఖ్యంగా శతఘ్నులకి సంబంధించిన నిపుణులు, మొదలైన వాళ్ళు. తెల్లవాళ్ళు. భారతీయులు వచ్చేరు. కాని అసలు పని యింకా జోరుగా ప్రారంభం కాలేదు. అత్యవసరమైన పనులు మాత్రం జరిగిపోతున్నాయి.
    గుట్టకి పడమటి తట్టు లోయలో రెండు డేరా లెత్తి, వాట్లో ఆఫీసు పెట్టేం. గుట్టమీద మునివాసాలకు కావలసినన్ని డేరాలైతేం. మా అసలు స్థావరం గుట్టకి తూర్పున పెద్ద మైదానం.
    రోజూ ఒకసారి "కొరియరు' వచ్చి, టపా లిచ్చి, మా పోస్టు తీసుకు పోయేవాడు. అర్జంటు టపాలేమైనా వుంటే, మేమే ట్రక్కుమీద వెళ్ళి "ఎయిర్ స్ట్రిప్పు"లో అందజేసేవాళ్ళం.
    మాకు స్నానాల గదుల్లేవు. అడుగులోతు. అడుగున్నర వెడల్పు. ఆరడుగుల పొడుగు ట్రెంచిలు తవ్వేం, వాటిలో "గ్రౌండు షీటులు" (రబ్బరు గుడ్డ) వేస్తే. ఓ మాదిరి బాతు టబ్బుల్లా తయారయేయి. వాట్లో నీళ్ళుపోసి స్నానాలు చేసేం. కాని ఈ పని సిపాయిలకి నచ్చలేదు, అవిచూసి వాళ్ళు నవ్వి చచ్చేరు. ఆ టబ్బులు వాడకుండా, గుడ్డలిప్పుకోని నీళ్ళు పోసుకుంటూ గుట్టలన్నీ తిరిగేరు. నేను మాత్రం నా ట్రెంచి చుట్టూ గ్రౌండు షీట్లతో మరుగు యేర్పరచుకున్నా.
    పదిహేను రోజులు తరవాత మా నివాసానికి వర్కు షాపులకి కావలసిన బాషాలు నిర్మించడం ఆరంభమైంది. ఈ పని ఒక సివిలియను కంట్రాక్టరుకిచ్చేం. అది సుమారు లక్షరూపాయల కంట్రాక్టు. మా నివాసాలు గుట్టమీద. వర్కు షాపు కట్టడాలు మైదానం మీద తయారవుతున్నాయి.
    నిర్మాణానికి ముందు గుట్టమీద మట్టి దిబ్బలు తవ్వి సమతల ప్రదేశం తయారు చెయ్యాలి. కూలీలు అక్కు పక్షుల్లా వున్నారు. నడ్డికి ఒక చింకి పాతగుడ్డ చుట్టుకుని చస్తున్నాం అన్నట్టు న్నారు.
    వాళ్ళలో చాలామంది నడివయసు దాటిన వాళ్ళు. నిటారుగా నిలబళ్ళేరు. వాళ్ళకి తిండి లేదు. శరీరంలో శక్తి లేదు. మనసులో శాంతి లేదు. భవిష్యత్తు మీద ఆశ లేదు. పని చెయ్యలేరు. "పికాక్సు" (Pick axe) యెత్తి బలంగా మట్టికొట్టలేరు. గడ్డపారతో మన్ను తియ్యలేరు, నిముషం సేపు తవ్వి చమటలు కక్కుకుంటూ, తలమీద గుడ్డ పాతతో మొహం ఒత్తు కునేవాడు. అలిసిపోయి, కూలబడి, రెండు బీడీ దమ్ముల్లాగేవారు. కంట్రాక్టరు. మనుషులు వాళ్ళని యెడ్లకి మలే తండ బొడిచేవారు. మట్టి తట్టలు మోసేవాళ్ళలో పదేళ్ళ పసివాళ్ళు కూడా వున్నారు. వాళ్ళందర్ని చూస్తే నాకు జాలేసేది. కాని యేం చెయ్యగల్ను? సిపాయిలకి టీ యిచ్చే ప్పుడు. అప్పుడప్పుడీ కూలీలక్కూడా యిప్పించే వాన్ని.
    క్రమంగా మూన్నెల్లలో మా నివాసాలు, యూనిటు వర్కుషాపు గదులు తయారయేయి. వర్కుషాపు "ప్రవేశం" దగ్గిర గార్డు రూము. దానిపక్క మా ఆఫీస్, ఆఫీసు కెదురుగా స్టోర్సు, దానికి కొంచెం ఎగూని శతఘ్నికర్మాగారం. గార్డు రూము కెదురుగా యెలట్రికల్ వర్కు షాపు. బ్యాటరీ చార్జింగుగది. ఇంకా రేడియో షాపు. మెకానికల్ ట్రాన్స్ పోర్టు షాపు, గారేజీ కొంచెం దూరంగా వున్నాయి. అతి సున్నితమైన పనిముట్టు. యంత్రభాగలువుండే ఇన్ స్ట్రుమెంట్ షాపు రోడ్డుకి చాలా దూరంలో వుంది. అక్కడ ధూళి దుమ్ము వుండకూడదు.
    మా నివాసపు భాషలు గుట్టమీదున్నాయి. ఆఫీసర్లకి. "బ్రిటిష్ అదర్ ర్యాంక్సు"కి, "ఇండియన్ నాన్ కమిషన్డు ఆఫీసర్ల"కి, సిపాయిలకి వేరు వేరు మెస్సులున్నాయి.
    అంటే మా యూనిటు తయారైందన్న మాట. పని చక చక సాగుతూంది. జపానీ బాంబరు విమానాలు ప్రతిరోజూవచ్చి కొంత అలజడి కలగజేసి పోతూండేవి.
    ఒక సాయంత్రం పిక్క ఢిల్లీ దగ్గిర క్లబ్బు హాలులో పటాలాల కోసం ప్రత్యేకంగా "సెలి బ్రేటెడ్ మణఐర్ధన్" బృందం నాట్య ప్రదర్శన వుంది. మేమంతా టికెట్లు కొనుక్కుని సాయంత్రం నాల్గు గంటలకే వూళ్ళో కెళ్ళేం.
    పిక్క ఢిల్లీ దగ్గర "సంగుఢిల్లీ" హోటలులో టీ త్రాగుతూ పద్మని గురించి ఆలోచించా. వాళ్ళ యిల్లూ అక్కడే వుంది. ఎందుకు వెతక్కూడదూ? పద్మ యేంచేస్తుంది. కమల్ తనకోసం ఒక హత్య చేసేడన్న సంగతి ఆమెకి తెలుసా? ఒక వేళ తెలియకపోతే నేను చెప్పాలా కూడదా? అతను మిలిట్రీలో చేరి అగర్తలాలో వున్నాడని కూడా చెప్పాలా? ఎవ్వరికి ఆ రహస్యం చెప్పనని చేతిలో చెయ్యేసి అతనికి మాటిచ్చేనే.
    టీ త్రాగి బైట కొచ్చా. ఇంకా యెండ బాగా కాస్తూంది. పిక్క ఢిల్లీ నడుస్తూన్న పచ్చని వనం లావుంది. పరధ్యానంగా నడుస్తూన్నా. ఎదురు గుండా రోడ్డు కవతల పక్క ఒక కొబ్బరి చెట్టవుపించింది. ఎండలో తలతల మెరుస్తూ దాని ఆకులు గాలికి కదుల్తున్నాయి. అటూ యిటూ చూశా; మరో కొబ్బరి చెట్టవుపించించలేదు. గబగబ నడిచి ఆ కొబ్బరి చెట్టున్న యింటి ముందు నిలబడి లోపలికి చూశా. పాడుపడిన పాత గోడలున్నాయి. ఆ యిల్లు ఖాళీగా వున్న ట్టుంది. లోపలికి వెళ్ళా. ముందున్న విశాలమైన ఖాళీ భాగంలో కొబ్బరి చెట్టూగుతుంది. అది మాట్లాడ దలిస్తే యెంత బాగుండు ననిపించింది. కొంచెం లోపలికెళ్ళా. అక్కడ గుమ్మం మీద ఒక బోర్డుంది. "ఆర్మీ రక్రియేషన్ అండ్ స్పోర్దిగ్ స్టోర్స్" లోపలి కెళ్ళా.
    ఇల్లు లోపల కొంచెం బాగానే వుంది. పాత యిల్లే. కాని బాగుచేశారు. అక్కడ ఒక సార్జంటున్నాడు. ఆ స్టోర్సు లో యేంవున్నాయో అతన్నడిగి తెలుసుకొన్నా. కాని అది ముఖ్యం కాదు. ఆ యిల్లె వరిది. అందులో ఎవరుండేవారు. అదీ నాక్కావల్సింది.
    ఆ యింటి యజమాని నాలుగైదు నెలల క్రితం చచ్చిపోయేడు. మిగిలిన వాళ్ళిల్లు ఖాళీచేసి వెళ్ళిపోయారు. ఇంటిని ఆర్మీ వాళ్ళు అద్దెకి తీసుకుని లోపలి భాగం బాగు చేయించారు. అంతే ఆ సార్జంటుకి తెలిసింది.
    కొంపతీసి యిదే పద్మా వాళ్ళిల్లా! పాపం పద్మ తండ్రి చనిపోయేడా. అయ్యో! వాళ్ళెక్కడి కెళ్ళిపోయారో. ఇంతకీ యిది వాళ్ళిల్లుచసి ఔనో కాదో, అయోమయంలొ పడి బైటకొచ్చా.
    మణబర్ధన్ బృందంలో మెరుపు తీగెల్లాంటి, గాలికంటే వడికలిగిన కళాకారులున్నారు. అంతా కాకలు తీరినవాళ్ళు. ఆవాళ వాళ్ళ నాట్య ప్రదర్శనం అత్యద్భుతంగా వుంది. నృత్య ప్రదర్శనం చూసి ఆనందిస్తున్నానే గాని. మన సంతా పద్మ మీదుంది.
    లాల్ మౌయ్ గుట్టలు యెర్రమట్టి గుట్టలు,
    వాటిలో కొన్ని మరీ యెత్తుగా వున్నాయి. గుట్టల మీద చెట్లు లేవు. చిన్న చిన్న డొంక లున్నాయి.
    ఆ గుట్టల్లొక్క దగ్గిర నిటారుగా రెండు వందల అడుగులెత్తు కూడా వున్నాయి. వాటి పరిధి వంకర టింకర్లుగా వుంది, అక్కడక్కడ వాలుగా వున్న రెండు గుట్టల మధ్య సన్నని గోర్జిలు తయారయేయి. వర్షపు నీరు వాటిలో గెడ్డలా ప్రవహిస్తూంది. ఆ గుట్టలకి చుట్టూరా అతి సమీపం నించి. అతి దూరంవరకూ డొంకలూ తుప్పలూ వున్నాయి. పనసచెట్లకి లెక్కా జమలేదు. అదంతా మొత్తానికి అడివి. ఆ అడివిలో అక్కడక్కడ పల్లెలున్నాయి. అక్కడ ముస్లిములు చాలామంది వున్నారు.
    మా క్యాంపు ఆవరణలో రెండుమూడు పనస తోటలున్నాయి. పనస కాయలు. పళ్ళు కుప్పలు తిప్పలు, అప్పుడప్పుడు గజమెత్తు పనసపళ్ళు మా సిపాయిలు మోసుకొచ్చేవారు. ఆ తోట ఒక సాయిలుగారిది. ఆయన ఒకసారి మా దగ్గిరికి జంకుతూ వచ్చి, మా అనుమతి పొంది, ఆరేడు పనసకాయలు దింపించుకుని, సలాం చేసి వెళ్ళేవాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS