Previous Page Next Page 
మెయిడ్ ఇన్ ఇండియా పేజి 13

 

    అదిరిపడుతూ టక్కున కేకలను ఆపేసింది భారతి.
    ఎవరినయితే చూడాలని వచ్చిందో.....ఎవరిని పర్సనల్ గా కలుసుకోవాలని అంత రాద్దంతాన్ని సృష్టించిందో ఆ వ్యక్తీ ఇప్పుడు తనకు ఎదురుగా...
    క్షణం పాటు ఆమె పెదవులు మూగబోయాయి.
    "ఏమిటిదంతా .....నీకేం కావాలి?"
    భారతి అప్పటికి తెరుకున్నది.
    "మీరే........." మిస్సయిల్ దూసుకువచ్చినట్టుగా భారతి పెదవులనుండి రెండే రెండు అక్షరాలు వెలువడ్డాయి.
    "నేనా?"
    విష్ణులో క్షణం తత్తరపాటు.....
    'అవును, నాకు మీరే కావాలి" అదోలా చూస్తూ అన్నది.
    "నాతొ నీకేం పని"
    "వుంది స్వామీజీ......మీ గురించి కధలు విన్నాను. మిమ్మల్ని కలుసుకోవాలనుకున్నాను, వచ్చాను.'
    ఆమె మాటలు ఇంకా పూర్తీ కానేలేదు.
    విష్ణు ముఖంలో గాంభీర్యం చోటుచేసుకున్నది.
    "లుక్ మిస్.....వేషభాషలు నేర్చుకున్నంతమాత్రాన భారతీయత ప్రతిభింబించదు. ఎన్ని సంవత్సరాలు తపస్సు చేసినా నీలోని పాశ్చాత్య పోకడలు ఇంకిపోవు, నన్ను కలవాలన్నా నాతొ మాట్లాడాలన్న రేపు ఏకాదశి పర్వదినాన ప్రజలందరి సమక్షంలో కలవొచ్చు. మాట్లాడవచ్చు. అంతవరకు వీరికి మన అతిధి మందిరంలో విడిది ఏర్పాటు చేయండి" అని శిష్యులతో చెప్పాడు విష్ణు.
    ఎంత హుందాగా చెప్పాడో అంతే గంభీరంగా తిరిగి వెళ్ళిపోయాడు విష్ణు.
    అతను వెళ్ళిన వైపే స్థాణువులా చూస్తూ నిలిచిపోయింది భారతి.

                                                        *    *    *    *

    ఆ రోజు ఏకాదశి.......
    ప్రతి ఏకాదశి పర్వదినాన పండిత పామర జనులను ఉద్దేశించి తన అమూల్యమైన వాణిని వినిపిస్తాడు విష్ణు. ఆ రోజున 'ఆత్మ- పరమాత్మ' గురించి తనదైన బాణిలో అనర్గళంగా ఉపన్యసిస్తున్నాడు విష్ణు.
    ముందువరస సీట్లలో కూర్చున్న వి.ఐ.పి లలో కలెక్టర్ ధీరజ కూడా వున్నది.
    ప్రేక్షకుల గ్యాలరీ దాదాపుగా నిండిపోయింది.
    "నేటి సమాజంలో మతం నిర్వహిస్తున్న పాత్ర మానవుని జీవన విధానాన్ని క్రుంగదీస్తున్నది.' అంటూ మొదలిడి మతాల ప్రాముక్యతను మతాల మధ్య ఐక్యతను తెలుపుతూ మానవులలో స్వార్ధసరత సంకుచిత హృదయాలు లేకుండా విశాల భావాలు ఎలా కలిగి వుండాలో తద్వారా దేశాన్ని ఎలా శాంతియుతంగా చేయవచ్చునో అనే భావాలతో విష్ణు భక్త జనులకు ఉద్భోదిస్తున్నాడు.
    ఆ అవతార పురుషుని వాణి క్షమ, సమత, మమతల త్రివేణిగా జగతికి జాగరణంగా కనిపిస్తున్నది.
    సత్యాన్ని ధర్మాన్ని సిద్డంతలుగా చేసుకుని శాంతి స్థాపనతో నూతన సమాజ నిర్మాణానికి తన అద్వార్యాన జరుగుతున్న అద్భుతాలు పరి పరి విధాలుగా సమాజ శ్రేయస్సుకై మహోన్నత పాత్రను నిర్వహించాలన్నదే తన అభిమతం అన్నాడు.
    భక్తుల గ్యాలరీలో భారతి పద్మాసనం వేసుకుని ఎంతో భక్తీ శ్రద్దలతో విష్ణు చెప్పే ప్రసంగాన్ని వింటున్నది. ఆ దృశ్యం చూస్తున్న ధీరజ ముఖంలో ఏదో చెప్పలేని అనిర్వచనీయానుభూతి!
    విష్ణు సందేశాలకు ఆకర్షితురాలయిన విదీశీ యువతి, భారతదేశ సందర్శనార్ధం వచ్చి అయన భోదనల పట్ల సమ్మోహితురాలయిందా! వాస్తవానికి ఎందరో శిష్యురాండ్రు విష్ణు మందిరంలో వుంటున్నప్పటికి ధీరజ చూపులు భారతి మీదే నిలిచాయి.
    భారతి మాత్రం తదేక దీక్షతో విష్ణు ముఖార విందాన్నే గమనిస్తున్నది.
    విష్ణు వాగ్ధాటి ప్రవహిస్తూనే వున్నది.
    "ఈ ప్రపంచం పంచ రంగుల కల. సగటు మానవునికి ఈ జీవితం సమస్యల నిలయం. పేదరికం, నిరుద్యోగం, ఒంటరితనంతో బిక్కుబిక్కిమంటూ సంసార సాగరం నుంచి దరిచేరే దారి తెలియక అయోమయ పరిస్థితులలో అల్లాడుతూ , పసిపాప తన తల్లి ఆడికోసం తపిస్తూన్నట్టు నా సమక్షంలో ఎందరో అభాగ్యులు అనునిత్యం సేద తీర్చుకుంటున్నారు. ఇది నా గొప్పతనం కాదు. అంతా ఆ పరమేశ్వరుని కృపా కటాక్షణాల వాళ్ళనే మీరంతా అనుకున్నది సాధించగలుగుతున్నారు.
    "ఇక ఆపండి మీ ప్రసంగం" ఖంగుమన్నది భారతి  కంఠం.
    అంతే భక్తులు రిత్తవోయారు. శిష్యులు, వాలంటీర్లు కంగారుగా ఆమె వేపుకు దూసుకు వచ్చారు. వాళ్ళు ఆమెను పెడరెక్కలు పుచ్చుకుని బయటకు ఈడ్చే ప్రయత్నంలో వుండగానే కనులతోనే సంజ్ఞ చేశాడు విష్ణు.
    "స్వామీజీ .......మీ ప్రసంగానికి అడ్డు వచ్చినందుకు క్షమించాలి. కానీ మీరు నా సందేహాల్ని తీర్చకుండా ప్రసంగం కొనసాగించడానికి వీలులేదు......"
    ఆమె మాటలతో పశ్చాత్తాపానీకన్నా పట్టుదలే మిక్కుటంగా గోచిరిస్తుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS