Previous Page Next Page 
వెన్నెల వాకిళ్ళు పేజి 13

 

    "అది నాకెలా తెలుస్తుందే? పంతులుగారు ముహూర్తం ఎప్పుడు పెడితే అప్పుడే" అంది జయంతి సీరియస్ గా.

    ముగ్గురూ మంచినీళ్ళ బిందెలు మోసుకుంటూ చెరువుగట్టునే నడుస్తున్నారు.

    "పెళ్ళేక్కడ చేస్తారే! ఇంట్లోనా? రరామాలయంలోనా?' అడిగింది కుతూహలంగా కృష్ణవేణి.

    "ఇంట్లోనే చేయొచ్చు, అవన్నీ ఇంకా నిశ్చయించుకోలేదు" చెప్పింది జయంతి.

    "ఇంతకీ నీ కాపురం ఎలా వుందే? ఏమంటున్నాడు మీ అయన?" అడిగింది జయంతి సుమని.

    "ఆ ఏం కాపురంలే తల్లీ! ఓ ముద్దు ముచ్చట ఏముండదు. అదో బండరాయి, పొద్దస్తమానం ఆ పొలం పనులే. ఇంటికొచ్చి స్నానం చేసి, ప్లేటునిండా అన్నం మెక్కడం గుర్రుపెట్టి నిద్రపోవటం" అంది సుమ నిరుత్సాహంగా.

    జయంతి ఆమాటలకు పగలబడి నవ్వింది.

    "అంతేనా! మధ్యలో ఏ కార్యక్రమం వుండదా?" అంది కుతూహలంగా.

    "లేదనేగా! తల్లీ! చెప్పేది....ఎప్పుడో వారానికొకసారి కాస్త దగ్గరకు తీసుకుంటాడు" అంది మళ్ళి నీరసంగా.

    "అయితే దీనికో ఉపాయం వుందే. నీ కొంగు పట్టుకుని ఇరవై నాలుగు గంటలు తిరిగే ఏర్పాటు నేను చేస్తాను" అంది జయంతి.

    "నిజమా! ఆ ఎర్పాటేదో త్వరగా చేయనే. పెళ్ళయి రెండేళ్ళవుతుంది. ఇంతవరకూ ఒక్క నలుసు కూడా లేదని మా అత్త ఒకటే సాధిస్తుంది తప్పంతా నాదే అన్నట్లు" అంది దిగులుగా సుమ.

    "నువ్వేం కంగారుపడకు. నేను మందిస్తాను. అది పాలల్లో కలిపి నువ్వు మీ ఆయనకు, పొలానిక్కుడా వెళ్ళకుండా నీ దగ్గరే వుంటాడు. నెలలోపే నెల పట్టుతుంది" అంది జయంతి నవ్వుతూ.

    "మందా! నీకు ఈ మందులు కూడా తెలుసా?" అంది ఆశ్చర్యంగా కృష్ణవేణి.

    "బానే ఉన్నాం అంటే" రెట్టించింది జయంతి కొంటెగా.

    "ఏయ్ రౌడిదానా! అయినా నీకెందుకే పెళ్ళికానిదానికి ఈ ముచ్చట్లన్ని అంది కృష్ణవేణి.

    "పెళ్ళి కాని వాళ్ళకే కావాలి తల్లీ! ఇవన్నీనేర్చుకుని, అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటే మంచిదికదా!" అంది జయంతి.

    "నాకా మందు ఎప్పుడిస్తావే?" కుతూహలంగా అడిగింది సుమ.

    "ఇస్తా...ఇస్తా.....తొందరపడకు. వచ్చే పున్నమి రాత్రికి తయారు చేసి ఇస్తా. ఇక ఆ రాత్రినుంచి నీకు శివరాత్రి జాగారమే" అంది పెద్దగా నవ్వుతూ.

    "చీ! నీకు మరీ సిగ్గులేకుండా పోతుందే...." అంది కృష్ణవేణి.

    "సిగ్గెందుకే..... దాని సమస్య పరిష్కరిస్తుంటే" అంది జయంతి.

    "ఆదలానే అంటుందిలేవే. దానికే సమస్య లేదుకదా? అలాగే మాట్లాడుతుంది" దిగులుగా అంది సుమ.

    జయంతి పెద్దగా నవ్వింది.

    "నీకు నవ్వులాటగా వుందికదూ!" అంది సుమ.

    "ఛ! అదేం లేడులేవే, ఇస్తానన్నాగా. నువ్వు నిశ్చింతగా వుండు అంది జయంతి.

    "సరే! రేపు చెరువుకోస్తావుగా, అప్పుడు మాట్లాడుకుందాం" అంది. ఇద్దరూ జయంతికి చెప్పి వెళ్ళిపోయారు.

    జయంతి నవ్వుకుంటూ వీధిగుమ్మం తీసి లోపలికి వెళ్ళింది.

                                    *    *    *    *

    ఏం బావా! అమ్మాయి పెళ్ళి ఖాయం చేశారట" అన్నాడు బసవయ్య.

    "ఆ! చేశాం బావా! అంతా ఆపై వాడిదయ...." అన్నాడు రామశేషు.

    "ఏది! ఈ సందర్భంగా ఓ చుట్టముక్క ఇవ్వు" నవ్వుతూ అడిగాడు బసవయ్య.

    "ఇందా! తీసుకో" అంటూ జేబులో మంచి పొగాకు కాడ తీసి యిచ్చాడు రామశేషు.

    "మరి ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుంటున్నారు బావ" అన్నాడు పొగాకు కాడతో చుట్ట చుట్టుకుంటూ బసవయ్య.

    "వచ్చే నెల ఆరో తారీఖు రాత్రి పదకొండు గంటలకు మంచి ముహూర్తం వుందట. అది దాటితే మళ్ళి రెండునెలల వరకూ ముహుర్తాలు లేవట. దానిగూర్చి తర్జన భర్జన పడుతున్నాం.....' అన్నాడు రామశేషు.

    "ఎందుకు ఆరో తారీఖున దివ్యంగా చేసేయక" అన్నాడు బసవయ్య.

    "టైం సరిపొవొద్దూ....! ఇంకెంత పట్టుమని నెలరోజులు కూడా లేదాయే. పెళ్ళంటే మాటలా?" అన్నాడు రామశేషు.

    "నీది మరి చోద్యం బావా! ఏది అగ్గిపెట్టి ఇటివ్వు." అని అడిగి తీసుకుని చుట్ట వెలిగించుకుని అగ్గిపెట్టి తిరిగి ఇస్తూ, "నువ్వు దేనికీ వెతుక్కోవలసిన అవసరం లేదాయే....బంగారంలాంటి తమ్ముళ్ళున్నారు. మరదళ్ళున్నారు. అన్నీ పనులు వాళ్ళే చకచకా చేసుకుపోతారు. ఆరో తారిఖు ఖాయం చేసేయండి. ఆలస్యం అమృతం విషం అన్నారు" అన్నాడు బసవయ్య.

    "అవుననుకో....మా కుటుంబంలో జరిగే మొదటి శుభకార్యం ఇదేనాయే. బంధుమిత్రులందరికి కబుర్లు అందోద్దా...నగలు నట్రా చేయించోద్డా" అన్నాడు రామశేషు పొగ వదుల్తూ.

    "అన్ని పనులకు దివ్యంగా సరిపోతుంది సమయం. మీ కంగారు గానీ, అగు నేను మాట్లాడతాను మీ తమ్ముడితో. అంత పెద్దకంట్రాక్టరు. వారం రోజుల్లో రోడ్లన్నీ చేసేస్తాడు. నెల రోజుల్లో పెళ్ళి చేయలేడా?:" అన్నాడు ఆశ్చర్యంగా.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS