Previous Page Next Page 
వసుంధర కధలు-4 పేజి 12

 

    రాజారావు నీరసంగా నవ్వి -- "నాకో మేడ ఉందనుకో. బ్యాంకులో నా పేరున ఓ లక్ష రూపాయలున్నాయనుకో, నేను నిన్ను పెళ్ళాడాలనుకున్నాననుకో అప్పుడు మీ అమ్మా నాన్నా నా తలిదండ్రులెవరో తెలియదని పెళ్ళి మానేసేవారా?" వాళ్ళు వద్దన్నా నువ్వు మానేసేదానివా?' అన్నాడు. ఆమె మాట్లాడలేదు. అప్పుడతను మళ్ళీ -- 'అందుకే డబ్బు లేదన్న కారణంగా నువ్వు నన్ను తిరస్కరించావని అంటున్నాను--" అన్నాడు.
    "నేను సమన్యురాలిని. నువ్వింతలా వాదిస్తే నేనేమీ మాట్లాడలేను. నాకు పెళ్లయింది. వారు ఇప్పుడు నా దైవం. ఈ విషయంలో నేను వాదించదాల్చుకోలేదు " అందామె.
    "నువ్విలా అంటావని నాకు తెలుసు" అన్నాడు రాజారావు...." అయినా సరే నేను నిన్ను కోరడానికి వచ్చాను. నా మాట విను. నాతొ వచ్చేసేయ్. నువ్వు రాకపోతే ఈ రాత్రితో  నా జీవితం అంతమైపోతుంది."
    'అంటే?"
    "నేను నిన్ను మనసారా ప్రేమించాను. నీ తిరస్కారం నాకు జీవితం పై మోజు లేకుండా చేసింది. ఈరోజు నా జీవితం గురించి ఒక నిర్ణయం తీసుకోదల్చాను. ఆ నిర్ణయానికీ నీనిర్ణయానికీ ముడి పడి వుంది. నువ్వు అవునంటే లక్షాధికారిగా అద్భుతమైన జీవితం గడుపుతాను. నువ్వు కాదంటే హంతకుడిగా మారి పోలీసులకు దొరికిపోయి - ఉరిశిక్ష కు గురౌతాను " అన్నాడు రాజారావు.
    "హంతకుడిగా మారతావా?"
    "అవును, నాకు కొన్ని పాత పగలున్నాయి. నువ్వు నన్ను కాదనగానే వాటి అంతు తేల్చాలను కుంటున్నాను. అందుకే ముందు నీ దగ్గరకు వచ్చాను"అన్నాడు రాజారావు.
    "నీ జీవితంతో నాకింకా సంబంధం లేదు. నా జీవితం వేరే వ్యక్తితో ముడిపడి పోయింది."
    రాజారావు డబ్బు జేబులో కుక్కుకున్నాడు. ఆమె వంక అదోలా చూసి జేబులో మళ్ళీ చేయి పెట్టాడు. అతని జేబులోంచి బయటకు వచ్చిన తళతళ మెరిసే కత్తిని చూసి ఆమె కంగారు పడింది.
    "ఏమిటి....నువ్వు నన్ను చంపుతావా?' అంది తడబడుతూ.
    "అవును ....." అన్నాడు  రాజారావు...."అరిచావా ఈ కత్తి నీ గుండెల్లో దిగబడుతుంది. మాట్లాడకుండా నేను చెప్పినట్లు విను."
    "ఏం చేయాలి నేను?' అందామె ఏడుపు కంఠంతో.
    "ఒక అందమైన ఆడపిల్ల నుంచి వయసులో ఉన్న మగాడు ఏం కోరతాడు ?... ఈరోజు నా తీరని కోరికల్ని తీర్చుకోబోతున్నాను. చెప్పినట్లు విన్నాసరే....చచ్చినా సరే...." అన్నాడతను.
    అతను చేతిలో కత్తితో ఆమెను సమీపించాడు. నడుం మీద చేయి వేసి దగ్గరగా లాక్కున్నాడు. తన గుండెల్లోని కోర్కెనంతా పెదవుల మీదకు రప్పించి ముద్దు పెట్టుకున్నాడు.
    ఆమె ప్రతిఘటించలేదు.
    అతనికి ఉత్సాహం పెరిగింది.

                                      5
    ఆమె సన్నగా ఏడుస్తోంది.
    "నా మంచితనం, ప్రేమ నిన్ను సాధించలేక పోయాయి. నువ్వు నా చేయి దాటిపోయావు. ఆతర్వాత డబ్బుక్కూడా లొంగలేదు నువ్వు. కానీ ఈ కత్తి లొంగదీసుకుంది అంటూ రాజారావు కత్తిని పెదాలతో స్పృశించి  ముద్దు పెట్టుకున్నాడు.
    "వారికి నా ముఖమేలా చూపించను?" అందామె ఇంకా ఏడుస్తూనే.
    "నాలో ఆశలు రేపి నాదాని నౌతానని నమ్మించి ఆఖరకు మీ వాళ్ళు కాదన్నారని మానేసి నపుడు నాకు ముఖమేలా చూపగలనని నువ్వనుకోలేదు" అన్నాడు రాజారావు...."పోనీలే ....ఒకప్పుడు నన్ను ప్రేమించినట్లు నటించావు. ఇప్పటికీ నిన్ను ప్రేమిస్తున్నాను నేను. మీవారికి ముఖమేలా చూపాలా అన్న నీ బాధ చూడలేను..." అంటూ అతను చటుక్కున ఆమె నోరు మూసి కత్తి ని బలంగా గుండెల్లో దింపాడు.
    ఆమె రెండు క్షణాలు గిలగిలా తన్నుకుని మంచం మీద వాలిపోయింది.
    "విచారించకు.....రేపుటేల్లుండిలో నేనూ నీ దగ్గరకు వస్తున్నాను" అన్నాడు రాజారావు. తర్వాత అతనక్కడ ఎంతోసేపు ఉండలేదు. అక్కణ్ణించి బయల్దేరి ఓ షాపుకి వెళ్ళి కత్తి ఒకటి కొన్నాడు. అది జేబులో వేసుకుని మరో ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు. ఒకామె తలుపు తీసింది.
    "ఆహోబలరావు గారున్నారా?" అన్నాడతను.
    "ఉన్నారు?" అందామె.
    "నేను వారితో మాట్లాడాలి."
    "లోపలకు రండి !"
    ఆ ఇంట్లో ఆహోబలరావు కు పర్సనల్ రూం వుంది. రాజారావు ఆ గదిలోకే వెళ్ళాడు.
    "ఎవరు మీరు?' అన్నాడు ఆహోబలరావు.
    "గుర్తున్నానా?' అన్నాడు రాజారావు అతడి ప్రశ్న వినకుండా.
    ఆహోబలరావు అతన్ని పరీక్షగా చూసి -- "నీపేరు రాజారావు అనుకుంటాను ..." అన్నాడు.
    "అక్షరాలా అదే!" అన్నాడు రాజారావు -- "అయిదు వేలు అడిగితె ఇవ్వలేదని నాకు రావలసిన ఉద్యోగం రాకుండా చేశావ్ ....గుర్తుందా?"
    ఆహోబలరావు మాట్లాడకుండా రాజారావు వంకే పరీక్షగా చూస్తున్నాడు. అతనేందుకొచ్చాడో అతడి కళ్ళలోకి చూసి తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నాడు.
    "నాలాంటి వాళ్ళను చాలామందిని చూసి ఉంటావ్ -- అందువల్ల ఎంతమందిని గుర్తుంచుకోగలవు. కానీ నువ్వు నాకు బాగా గుర్తిండి పోయావు. నీ ఒక్క నిర్ణయం నా జీవినపధాన్ని మార్చేసింది. ఇంకా చెప్పాలంటే నాకు జీవితమనేదే లేకుండా చేసింది."
    "మిస్టర్.....నువ్వు చెప్పదల్చుకున్న దేమిటి?" అన్నాడు ఆహోబలరావు విసుగ్గా.
    "నేనొక అమ్మాయిని ప్రేమించాను. ఏ ఆధారమూ లేని నన్నామే వివాహం చేసుకోడానికి సుముఖంగా లేదు. ఆ సమయంలో ఓ కంపెనీలో నాకుద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగం నాకు నీద్వారా వచ్చింది. అయితే నువ్వు నన్ను అయిదు వేలు అడిగావు. అప్పటికి నా దగ్గర లేవని కావాలంటే నోట్ రాసిస్తానని అన్నాను. నువ్వు నిర్ధాక్షిణ్యంగా నిరాకరించావ్. ఆ ఉద్యోగం నాకు రాకుండా పోయింది . దాంతో నాక్కావాల్సిన ఆ అమ్మాయి కూడా నాక్కూకుండా పోయింది. జీవితంలో నాకున్న ఒకే ఒక్క ఆలంబన ఆ విధంగా పోయింది...."
    "ఇలాంటి కధలు చాలా విన్నాను...."
    "నాకు తెలుసు అందుకే ఇకముందు అటువంటి కధలు వినే అవకాశం నీకివ్వ దల్చుకోలేదు" అంటూ జేబులోంచి కత్తి తీసి మెరుపు వేగంతో ఆహోబలరావు గుండెల్లో దింపాడు.
    ఆహోబలరావు ఈ పరిణామాన్నూహించినట్లు లేదు. అతను ఒక్క గావు కేక పెట్టి నేల కూలిపోయాడు. నేల కూలేక అరిచే శక్తి కూడా అతనిలో ఉన్నట్లు లేదు. కత్తి చాలా బలంగా అతడి గుండెల్లోకి దిగినట్లుంది.
    ఆహోబలరావు కేక గది అవతలకు వినబదినట్లుంది. అతడి భార్య గుమ్మం దగ్గరకు వచ్చి కర్టెన్ ఒత్తిగించి తొంగి చూసింది.
    అప్పటికి రాజారావు గుమ్మం వద్దకు వచ్చాడు. ఆమెను చూసి .....లోపలకు రమ్మనమని సంజ్ఞా చేశాడు. ఆమె నెమ్మదిగా గదిలోకి అడుగుపెట్టి అక్కడి దృశ్యం చూసి కెవ్వుమని అరవబోయింది. కానీ అతడామే నోరు చటుక్కున మూసి -- "అరవకు -- నీ ప్రాణం కూడా తీయగలను " అన్నాడు.
    ఆమె శరీరం అతడికి వేడిగా తగిలింది. భయంతో ఆమె శరీరం వేడెక్కిందని అతను గ్రహించాడు.
    "నీకు నేను  గుర్తిండి ఉండను. నీకు బహుశా ముప్పై ఏళ్ళు వుంటాయనుకుంటాను. శరీరాన్ని చక్కగా పోషిస్తున్నావు. వంటి నిండా నగలు దిగేశావు. అన్ని కాస్మెటిక్స్ వాడుతున్నావు. నీకు పిల్లలు లేరు. తల్లిని కావాలన్న బెంగ కూడా నీకున్నట్లు లేదు. ఓవేళ ఉన్నా నీ బుద్దుల కు జడిసి భగవంతుడే నీకా అవకాశం లేకుండా చేసి ఉంటాడు. ఆరోజు నేనుద్యోగం కోసం నీ భర్త కాళ్ళా వెళ్ళా పడుతుంటే  మధ్యలో నువ్వొచ్చి -- "కొత్త నెక్లెస్ అర్దరిచ్చిన మాట మరిచారా -- అవతల ఓ అబ్బాయి  అయిదు వేలతో సిద్దంగా ఉన్నాడు" అని నీ భర్తను విసుక్కున్నావు. అప్పుడు నువ్వసలు నావంక కన్నెత్తైనా చూడలేదు. నా మాటలు విని నన్నో ముష్టి వాడి కింద జమ వేశావ్. తప్పు నీ భార్తదే అయినా అందులో నీ పాత్ర ఏమీ తక్కువది కాదు" అంటూ ఆమె నోటి మీద తన చేతిని తొలగించాడతను.
    భయంతో ఆమె వణికిపోతోంది. మాట్లాడే శక్తి కూడా అమెకున్నట్లు లేదు.
    'ఆరోజు నన్ను ఎందుకూ పనికి రాని వాడ్ని గా లెక్క వేశావ్. నా పొట్ట కొట్టావ్. నా జీవితం పై దేబ్బతీశావ్. ఈరోజు నేను నీ నుదిటి కుంకుమ చెరిపేశాను. నువ్వు నన్నేమీ చెయ్యలేవు. నా గురించి పోలీసులకు చెప్పావంటే నేను జైల్నించి పారిపోయైనా వచ్చి నిన్ను చంపేస్తాను. అసలీ రోజే నిన్ను చంపవలసి ఉంది కానీ నిన్ను కాస్త అవమానించాలనే ఉద్దేశ్యంలో నీ ప్రాణాల జోలికి రావడం లేదు" అంటూ అతనామే చేయి వదిలి పెట్టి గదిలో ఓ మూలకు వెళ్ళమన్నాడు.
    మాట్లాడకుండా ఆమె అలాగే చేసింది.
    ఆ గదిలో టేబుల్ ఉంది. దాని మీద ఓ ప్లాస్టిక్ క్లాత్ ఉంది. సోఫాలున్నాయి. టీపాయ్ ఉంది. ప్రేవేశ ద్వారానికి తెర వుంది. రాజారావు టేబుల్ మీద ప్లాస్టిక్ గుడ్డనూ, గుమ్మం దగ్గర తెరనూ తీసి అవతల విసిరేసి ఆమెను సమీపించి -- "నీ వంటి మీద బట్టలన్నీ మర్యాదగా నాకిచ్చేసేయ్. ఒక్క ముక్కకూడా మాట్లాడకుండదు"అన్నాడు.
    ఆమె అతను చెప్పినట్లే చేసింది.
    రాజారావామే వంక హేళనగా చూసి -- "ఇదీ నీ నగ్న స్వరూపం. దీన్ని కప్పడానికి , అలంకరించడానికీ, ఆకర్షణీయంగా తయారు చేయడానికీ, సుఖ పెట్టడానికీ- నా వంటి వాళ్ళ నిండు జీవితాల నపహరించవలసిందిగా నీ భర్తను ప్రోత్సహిస్తున్నావ్. అ నీ భర్త శవం ఇక్కడే వుంది. కిక్కురుమనకుండా ఆ శవం పక్కన ఈ రూపంతో గడుపు. ఎవడో పుణ్యాత్ముడు వచ్చి తలుపు తీసేవరకూ ఇక్కడే ఇలాగే వుండు" అంటూ రాజారావు ఆమె బట్టలతో సహా గది బయటకు వెళ్ళి- తలుపు దగ్గరగా వేసి బయట గడియ వేశాడు.
    తన చేతిలోని బట్టల్నీ హల్లో ఇందాకా పారవేసిన బట్టల్ని తీసుకువెళ్ళి -- ఇంట్లో వెతికి పాత గుద్దల పెట్టెలో పారేశాడు.

                                       6
    "రా రాజా!" అంది సౌగంధి.
    రాజారావు జేబులోంచి పది వేలు తీసి ఆమెకు అందించి "ఈరోజు రాత్రి పన్నెండు గంటల వరకూ నువ్వు పూర్తిగా నాదానివి కావాలి" అన్నాడు.
    సౌగంధి ఆ డబ్బు అందుకుని-- నువ్వాడగాలి కానీ -- డబ్బిచ్చినా ఇవ్వకపోయినా నేనెప్పుడూ నీదాన్నే!" అంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS