Previous Page Next Page 
శంఖారావం పేజి 12

 

    గంగలో మునిగితే సమస్త పాపాలు పోతాయంటారు.
    ఉదయతో పెళ్ళయ్యేవరకూ తనకు నీతి లేదు కాని ఆమెకు భర్త అయ్యేక తానేమెకు తగిన వరుడని పించుకోవద్దా?"
    కానీ -----ఎంతకాలం అలా సాధ్యపడుతుంది ?
    పాపం -- ఉదయ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది ?
    తన భర్త ఉదాత్తుడన్న భావంతో మరణిస్తే ఆమె ఆత్మకు శాంతి ఉంటుంది. స్వల్ప కాలం ఆమె కోసం తన్ను తాను నిగ్రహించుకోలేడా?
    ఒక పక్క జలజ ....
    మరో పక్క ఉదయ....
    కులభూషణ్ మనసులో పోరాటం ప్రారంభమయింది.
    తానిప్పుడు వెళ్ళకపోతే జలజ తనకు తానే వచ్చేస్తుంది. ఈసారి అమెనాపే శక్తి తనకుండదు. అమ్మ సీతమ్మ ఇల్లు అపవిత్రమవుతుంది.
    వెడితే జలజ తన్ను లోబర్చుకుంటుంది. ఉదయ కన్యాయం జరిగిపోతుంది.
    కసేపాలోచించి కులభూషణ్ ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు.
    తను జలజ ఇంటికి వెళ్ళడు. ఆమె వస్తే తలుపు తీయడు . కాలింగ్ బెల్ మ్రోగించి మ్రోగించి విసిగి వెళ్ళిపోతుందామె.
    కులభూషణ్ పడుకున్నాడు. నిద్రపట్టడం లేదు.
    అతడి కనుల ముందు ఉదయ కంటే జలజే ఎక్కువగా మెదుల్తోంది.
    జలజ స్థానంలో ఉదయ నూహించుకోవాలని విఫలయత్నాలు చేస్తున్నాడతడు.
    ఆ సమయంలో కాలింగ్ బెల్ మ్రోగింది.
    కులభూషణ్ టైము చూసుకున్నాడు.
    అప్పటి జలజ వెళ్ళి అరగంటయిందంతే.
    అతడికి తెలుసు--- జలజకు అసహనమొక్కువని!
    కులభూషణ్ మంచం మీంచి లేవలేదు.
    కాలింగ్ బెల్ ఆగకుండా మ్రోగుతుంది.
    అయిదు నిమిషాలు గడిచాయి.
    కాలింగ్ బెల్ ఆగడం లేదు.
    ఏమిటి చేయడం?
    పది నిమిషాలు గడిచాయి.
    'జలజ కాలింగ్ బెల్ నించి చేయి కూడా తీయడం లేదు " అనుకున్నాడు కులభూషణ్.
    ఇప్పుడతడి లో అసహనం పెరిగింది.
    "స్వామీ అలౌకికానంద --- ఈ ఇంట్లో తప్పు జరగనివ్వకు ' అనుకుంటూ అతడు లేచి వెళ్ళి తలుపు తీశాడు.
    అయితే ఎదురుగా కనపడిన వ్యక్తీని చూసి నివ్వెరపోయాడు.
    అక్కడ జలజ లేదు. వేదాంతం!
    "నువ్వా?" అన్నాడు కులభూషణ్.
    వేదాంతం తొందరగా లోపల ప్రవేశించాడు.
    కులభూషణ్ అక్కడే నిలబడి విశ్వనాద్ కోసం చూశాడు.
    బయట ఇంకెవరూ లేరు.
    "విశ్వనాద్ ఏడీ?" అన్నాడతడు.
    "లేడు--"
    "లేడంటే ...." అన్నాడు కులభూషణ్"
    "లేడు-"
    ఏదో అనబోయి ఆగిపోయాడు కులభూషణ్.
    "ఏం జరిగింది ?" అన్నాడు కులభూషణ్.
    వేదాంతం బదులివ్వలేదు. అతడు తన భుజానికి వున్న ఎయిర్ బ్యాగ్ తీసి కింద పెట్టి మళ్ళీ ఏడవసాగాడు.
    కులభూషణ్ అతణ్ణి సమీపించి -- "{ఏం జరిగిందిరా!' అన్నాడు.
    "విశ్వనాద్ చచ్చిపోయాడు " -- అంటూ వేదాంతం కూలబడిపోయాడు.
    కులభూషణ్ మ్రాన్పడిపోయాడు.
    ఇద్దరూ మాములుగా మాట్లాడుకునెందుకు కాసేపు పట్టింది.
    వేదాంతం, విశ్వనాద్ --ఇద్దరూ ఫ్లైట్ లో మద్రాసు చేరుకున్నారు. అక్కడ వారొక --- సైంటిస్టు ను కలుసుకోవలసి ఉంది.
    ఎయిర్ పోర్టు నించి టాక్సీలో బయల్దేరి వస్తుండగా యాక్సిడెంటయింది. ట్రక్కు ఒకటి బలంగా టాక్సీని గుద్దింది. ఆ సమయంలో వేదాంతం వైపు డోర్ సరిగా లేక ---వెంటనే తెరచుకుంది. వేదాంతం టాక్సీ లోంచి ఎగిరి బైట పడ్డాడు.
    ఆ పక్కనే దూది పరుపులున్నాయి.
    అతడు వాడి మీద పడ్డాడు.
    విశ్వనాధ నుగ్గునుగ్గుయి పోయాడు.
    "నన్ను దేవుడు రక్షించాడు. వాణ్ణి దేవుడు తీసుకుని పోయాడు ....' మళ్ళీ ఏడ్చాడు వేదాంతం.
    "ఇలా జరుగుతుందని నేననుకోలేదు. దేవుడు వాణ్ణి రక్షించినట్లే రక్షించి మళ్ళీ తీసుకుని పోయాడు ....' అన్నాడు కులభూషణ్.
    'అమ్మను కలుసుకోవాలని, ఉదయను లాలించాలనీ వాడేన్నో కలలు కన్నాడు. వాడి కలలు వింటూ వాడి పక్కనే ఉన్న నాకిప్పుడదంతా ఒక కలగా మారిపోయింది ---' అన్నాడు వేదాంతం.
    విశ్వనాద్ మరి లేడన్న భయంకర సత్యాన్ని జీర్ణించు కునేందుకు కులభూషణ్ కి మరికాసేపు పట్టింది.
    అప్పుడతడు -- ",మనమిప్పుడు అమ్మను కూడా దక్కిచు కోలేము! విశ్వనాద్ పోయాడని తెలిసి అమ్మకు హార్ట్ ఎటాక్ వచ్చింది. దాన్నించెలాగో బైట పడేసరికి అదృష్టం కొద్ది మంచి కబురు వింది. ఇప్పుడు వాణ్ణి చూడాలని ఎదురు చూస్తోంది. ఈ దెబ్బకు అమ్మ తట్టుకోలేదు. ఇప్పుడెం చేయాలో నాకు పాలుపోవడం లేదు " అన్నాడు బాధగా భారంగా.
    ఇద్దరూ కాసేపు దిగులు పంచుకున్నారు.
    "కేసు యాక్సిడెంటుగా నమోదయింది. ముక్కముక్కలైన విశ్వనాద్ శవాన్ని పోలీసులకే వదిలిపెట్టి నేనిలా వచ్చాను. కానీ ఈ వార్తను అమ్మకేలా చెప్పేది?' అని మరింత దిగులు పడ్డాడు వేదాంతం.
    'అమ్మ అన్నింటికీ అలౌకికానంద స్వామిని నమ్ముకుంది. మీ ప్రాణాల్ని కూడా తొలుత ఆయనే రక్షించాడని నమ్ముతోంది. ఇప్పడు ఉదయను కూడా తాను బ్రతికించగలననుకుంటోంది. ఈ పరిస్థితుల్లో అమ్మకీ వార్త చెప్పడం మంచిదికాదు. అసలు నువ్వామే కళ్ళ బడడమే మంచిది కాదు . ఏం చేయాలో నాకు పాలుపోవడం లేదు."
    వేదాంతం లేచి నిలబడి "ఏం చేయాలో నాకు తెలుసు. నేనిప్పుడు అలౌకికానంద స్వామిని దర్శించుకుందుకు వెడతాను " అన్నాడు.
    "ఇప్పుడా ?' అన్నాడు కులభూషణ్ ఆశ్చర్యంగా.
    'అవును --- ఇప్పుడే !"
    "స్వామి దర్శనానికి వేళలున్నాయి. ఉదయం పది నించి సాయంత్రం నాలుగు వరకే అయన భక్తులకు దర్శన మిస్తాడు. రాత్రి వేళల్లో ఆ దారి ప్రమాదకరమైనదని చెప్పుకుంటారు. సాయంత్రం ఆరు దాటేక ఆ దారిలో ప్రయాణాన్ని స్వామి నిషేదించారు కూడా --" అన్నాడు కులభూషణ్.
    "భగవంతుడి కీ భక్తుడి కీ మధ్య సమయాసమయాలుండవు . నేనిప్పుడే వెడతాను " వేదాంతం దృడ నిశ్చయంతో అన్నాడు.
    "కానీ నువ్వు భక్తుడివి కావు కదా!"
    'అలౌకికానంద స్వామి భగవంతుడే అయితే నేనూ భక్తుడి నే అవుతాను "
    'అయన దైవత్వానికి ఎన్నో నిరూపణలున్నాయి. ఏ భక్తికీ లేవు....'
    "మరోసారి ఆయన్ను దైవత్వం నిరూపించుకొనీ. నేనూ అయన భక్తుడీ నౌతాను....'
    "ఎలా నిరూపించుకుంటాడాయన తన దైవత్వాన్ని ?"
    'విశ్వనాద్ ను బ్రతికించాలి . ఉదయకు  ఆయువు పోయాలి"...
    'అలా చేయకపోతే ?"
    "ముందు దైవానికి వ్యతిరేకంగా ధనుష్టంకారం చేస్తాను ...."
    కులభూషణ్ అర్ధం కానట్టు చూసి --"నేనూ నీతో వస్తాను "అన్నాడు.
    "వద్దు. నువ్వు అమ్మకు తోడుగా వుండాలి" అన్నాడు వేదాంతం.
    కులభూషణ్ మాట్లాడలేదు.
    "మరి సెలవు!" అన్నాడు వేదాంతం.
    "మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం మనం ?"
    వేదాంతం వేదాంతి లా నవ్వి -- "నా పక్కన విశ్వనాద్ ఉంటాడు. నా చేతిలో ఉదయను బ్రతికించే అమృతముంటుంది. అప్పుడే మనం కలుసుకుంటాం.' అన్నాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS