అవును" అన్నాడు కులభూషణ్.
"నో" అంటూ అతడి మీదకు వాలిపోయింది జలజ.
'జలజ ప్లీజ్ అంటూ అతడామేనో కుర్చీలో కూర్చోబెట్టి ఎదురుగా మరో కుర్చీలో కూర్చున్నాడు.
"ఏమిటిది భూషణ్?" అందామె గునుస్తూ.
"ఇది మా సీతమ్మ ఇల్లు ...." అన్నాడతను.
'అయితే "
'ఇక్కడ నాకు నీకు ఈమాత్రం దూరమైనా ఉండాలి. అందుకే నీ పక్కన కూడా కూర్చోలేదు.
'ఎందుకు?"
"ఇది నాకు పవిత్ర దేవాలయం. ఇక్కడ నేను సిగరెట్ వెలిగించను. విస్కీ ముట్టను. అర్ధమయిందా?"
"పెళ్ళయితే ఏం చేస్తావ్"
"కులభూషణ్ ఉలిక్కిపడి "అన్నట్లు నాకు పెళ్ళి' కూడా అయింది అన్నాడు.
జలజ ఉలిక్కిపడి "ఏమన్నావ్" అంది.
"ఏమంటే నేం? ఈ ఇంట్లో నేను వివాహితుడితో సమానమని గుర్తుంచుకో "
"ఏ ఇంట్లో వున్నా నేను వివాహితనే కదా ?" అంది జలజ.
"కానీ ఈ ఇంట్లో నేను తప్పు చేయను ."
"అంటే "
"నువ్వు నేను దగ్గిరైతే అది తప్పు , ఆ తప్పును మరెక్కడైనా చేయగలను. ఈ ఇంట్లో మాత్రం చేయలేను.
"నీ సంగతి నాకు తెలియదా?" అని నవ్విందామే.
అప్పుడామె పైట జారిపోయింది.
ఆ ప్రయత్నంగా అతడి చూపులు ఆమె గుండెలపై ప్రసరించి అక్కడ ఇరుక్కు పోయాయి.
ఆమె సౌందర్యం అతడిని సవాలు చేస్తోంది.
జలజ అతడికి కొత్త కాదు.
రెండు సంవత్సరాల క్రితం అమెఅతడికి పేషెంటుగా పరిచయ మైంది. కులభూషణ్ ఆమెకు పరీక్షించి జబ్బేమిటో తెలుసుకోలేకపోయాడు.
"నీ జబ్బేమిటో నేనే చెబుతాను" అంటూ ఆమె అతడ్ని కౌగలించుకుంది.
కులభూషణ్ కి అర్ధమైనా తడబడ్డాడు. ఆమె ప్రోత్సాహం అతడి తడబాటును పోగొట్టింది.
"నీ కోసమే నా జబ్బు' అందామె.
"నీ భర్తకు తెలుస్తే ....'
"తెలియదనుకుంటున్నావా ,చూసి చూడనట్లూరుకుంటాడు...."
"కానీ నాకిలాంటివి నచ్చవు...." అన్నాడు కులభూషణ్.
"అయినా నాకు లోంగిపోయావుగా "
"మొదటిసారి పోరాపాటయింది"
"ఇదే పొరపాటు మళ్ళీ మళ్ళీ చేస్తావు...."
"సవాలు చేస్తున్నావా "
"ఊ"
సవాల్లో కులభూషణ్ ఓడిపోయాడు. అయినా అతడు విచారించలేదు. సరికదా "ఓటమి ఎంత మధురంగా వుంది" అనుకున్నాడు.
పైకి మాత్రం ఆమెతో నీ ముందు నేనిలా ఓడిపోతాననుకోలేదు." అన్నాడు లేచి బాధను నటిస్తూ.
"మా వారికి యాభై ఏళ్ళు. ఇద్దరు పిల్లలు . పెళ్ళిళ్ళయి రూర ప్రాంతాలలో వుంటున్నారు. ఆయనకు చెప్పుకో దగ్గ కోరికలు లేవు. అలవాటై వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఆయనలో కోరికలు పుట్టించి అయన సంపదకు వారసురాలినయ్యాను. నాకు నువ్వొక లెక్క కాదు" అంది జలజ.
ఆమె అతడిని నిర్లక్ష్యం చేస్తూనే కంక్షిస్తుంది.
నిర్లక్ష్యం తో కూడిన ఆమె కాంక్ష అతడి కెంతో యిష్టం.
నిర్లక్ష్యం నటిస్తూ ఆమె తనను రెచ్చగొట్టేందుకు ప్రోత్సహించడం అతడికానందం.
ఇప్పుడు జలజకు పైట జారింది. ఆమె సవరించుకోలేదు.
అతడామెను చూస్తున్నాడు.
ఆమెకు తెలుసు అతడి నింకా ఎలా రెచ్చగొట్టాలో.
ఆమె తన ప్రయత్నాలు ప్రారంభించింది .
అసలు సిసలు వయసామెది. తిరుగు లేని సొగసు ఆమెది.
కోర్కెలతో మండుతున్న తనువామేది.
అమ్మ సీతమ్మ ఇంట్లో కులభూషణ్ జలజ!
అతడు విశ్వామిత్రుడు, ఆమె మేనక.
మేనక ఆ రోజుల్లో విశ్వామిత్రుడంతటి వాణ్ణి ' ఎలా వశ పర్చుకుందా అని అనుమానించే వారు ఇప్పుడు జలజను చూసి తెలుసుకోగలరు.
ఒక సంసారి స్త్రీ అవివాహిత యువకుడిని ఆకట్టుకునేందుకు ఏయే అవధులు దాటుతుందో ఊహించ గలిగిన వారి ఊహలను దాటుకుని వెడుతుంది జలజ.
కులభూషణ్ ఆవేశపడ్డాడు.
జలజ నవ్వుతోంది. ఆ నవ్వులో కసి వుంది.
అతడామెను సమీపించి కౌగలించుకున్నాడు.
ఆ కౌగిలింతని బట్టి అతడు ఆవేశాన్ని జలజ అంచనా వేసింది.
ఇది అమ్మ సీతమ్మ ఇల్లేమో అందామె అతడ్ని రెచ్చ గొట్టాలని.
అయితే ఆమె అనుకున్నదొకటి జరిగిన దొకటి ....
కులభూషణ్ ఆవేశమంతా ఒక్కసారిగా చప్పగా చల్లారిపోయింది.
'అవును, ఇది సీతమ్మ ఇల్లు. నువ్వీక్కడ నుంచి వెళ్ళు " అన్నాడతను.
"వెళ్ళను" అంది జలజ.
అతడామెను విడిచి దూరంగా వెళ్ళి కుర్చీలో కూర్చున్నాడు.
"నిన్ను నేను మళ్ళీ దగ్గరకు రప్పించుకోగలను...."
"ఎక్కడైనా ఏమో గానీ ఇక్కడ మాత్రం అది సాధ్యం కాదు ."
"చూద్దాం...."
"చూసేది నువ్వే, నేను కాదు ...."
ఆ తర్వాత కులభూషణ్ ఓ పుస్తకం తెచ్చుకుని కూర్చున్నాడు. మొదటిసారిగా జలజ అతడి ముందు ఓడిపోయింది.
"నేను నీకు పాతబడి పోయాను " అంది బాధగా.
'అదీ ఇంటి గొప్పతనం. ఇది నాకు పవిత్ర దేవాలయం. ఇక్కడ తప్పులన్నవి జరుగవు....' అన్నాడు కులభూషణ్.
"పోనీ నువ్వు నా ఇంటి కొస్తావా ?"
"నువ్వడక్కపోయినా నేనా ఉద్దేశ్యం లోనే వున్నాను. అయితే ఇద్దరం కలిసి వెళ్ళొద్దు. నువ్వు ముందు వెళ్ళిపో. అరగంటలో నేను వస్తాను" అన్నాడు కులభూషణ్.
'అలా ఎందుకు "
"ఎందుకో అందుకు వెళ్ళు " అన్నాడు కులభూషణ్.
అయితే జలజకు తెలుసు కులభూషణ్ కు చాలామంది యువతులతో పరిచయ ముంది. కానీ అతడు బయట విడిగా ఎవరితోనూ కనబడడు. డాక్టర్ గా తన ఇమేజ్ గురించి అలోచిస్తాడేమో మరి!
జలజ వెళ్ళిపోయింది. వెళ్ళేముందామే "అరగంట కాదు , గంట సేపు ఎదురు చూస్తాను. అప్పటికీ రాకపోతే నేను బయల్దేరి ఇక్కడికే వచ్చేస్తాను. అప్పుడు నన్ను వెనక్కి పంపలేవు" అని హెచ్చరించింది.
తనలో తను నవ్వుకుంటూనే అతడామెను వీడ్కోలు చెప్పి తలుపులు వేసుకున్నాడు.
వ్యామోహంలో తనలో తక్కువ లేదు. అందులోనూ ఆమె తనను బాగా రెచ్చ గొట్టింది. తనిప్పుడు వెళ్ళకుండా ఎలా వుండగలడు ?
అవధులు దాటిన స్త్రీ వ్యామోహం అసహనాన్ని పెంచుతుంది. అందుకే ఆమె తన గురించి అసహనంగా ఎదురు చూస్తోంది.
కులభూషణ్ దుస్తులు మార్చుకున్నాడు. అతడి ఆలోచనల్లో జలజ మెదుల్తోంది. అప్పుడతడికి కోణార్క్ , ఖజరహో శిల్పాలు గుర్తుకు వచ్చాయి.
నడిచి వచ్చిన ఖజరహో శిల్పాన్ని మరో చోటకు పంపాడు...
ఇక్కడ తప్పు జరగరాదని !
అసలది తప్పెందుకవుతుంది.
ఆమె వివాహిత కాబట్టి....
మరి తను....
తనకూ వివాహమయింది. ఉదయ తన భార్య.
"విశ్వనాద్ , వేదాంతం ఎకపత్ని వ్రతులు. నన్ను పెళ్ళి చేసుకుంటే వారి జీవితం అడవి కాచిన వెన్నేలవుతుంది . నిన్ను పెళ్ళి చేసుకుంటే ఫర్వాలేదు. నీకేలాగూ నీతి లేదు" అన్నట్లు మాట్లాడేది ఉదయ.
ఆమె నిజం చెప్పింది కాబట్టి తను బాధపడలేదు.
కానీ ఆ నిజాన్నబద్దం చేసి తనూ ఉదాత్తుడనిపించుకోలేడా?
"ఎందుకనిపించుకోవాలి?"
"నా కోసం" అంటోంది ఉదయ.
గాలికి అల్లాడుతున్న చిగురుటాకులా ఉంది ఉదయ. బలహీనంగా ఉన్నా ఆమె ముఖంలో తేజస్సుంది.
