Previous Page Next Page 
విరామం పేజి 11


    వీళ్ళెవరు? మనుషులేనా? మనుషులైతే ఇలా వున్నారేం. శరీరాలు యెండిన కట్టెపుల్లల్లా వున్నాయి. స్త్రీలుకూడా వున్నారు. వాళ్ళ నగ్నత్వం యిలా బట్టబైలైందేం? అసలు బ్రతికే వున్నారా? బ్రతికుంటే శవాల్లా కదలలేదా? కొంధరి ముక్కుల్లోకి- నోళ్ళల్లోకి ఈగలు జొరబడి స్వేచ్చగా తిరుగుతున్నా. అలా పడేవున్నారేం?
    తేరి చూసేను. ఓక స్త్రీ పూర్తిగా నగ్నంగా వుంది. ఆమె బొందెలో ప్రాణం లేదు. బల్లి లాటి ఒక చంటిపిల్ల యెలక పిల్లలా కీచు కీచుమంటూ ఆ శవం మీదపడి యెండిపోయిన స్తనం చీకడానికి ప్రయత్నిస్తూంది! చచ్చిపోయిన ఆ స్త్రీ నోట్లోంచి బైటకొచ్చిన ఈగలు ఆ పిల్ల పునుల కళ్ళమీద వ్రాలి. తిరిగి శవం నోట్లోకి వెళ్ళిపోతున్నాయి. అలాంటి శవాలింకా పది పన్నెండు న్నాయి.
    మళ్ళీ తేరి చూశా. ఇతని గుండెలో యింకా చిన్న వూపిరి వుంది. నిలకడైపోయినా, ఆ కనుగుడ్లలో యింకా దీపం పూర్తిగా ఆరిపోలేదు. మెదడు పని చేస్తూందా! జీవితపు పొలిమేరల్లో తచ్చాడుతూన్న అతని మనసులో యింకా ఆలోచనలేమైనా మెదుల్తున్నాయా?
    మరొక స్త్రీ మొహంలోకి చూశా ఆమె బతికే వుంది. కాని రెండు వారాల్నించీ తిండి మొహం చూసినట్టులేదు. నిమ్మళంగా కళ్ళు కదుపుతూంది. నిమ్మళంగా నోరుతెరచి మూస్తూ గుటకేస్తూంది. ఆమెకి యే మాత్రం శక్తి వున్నా "ఆకలి- దాహం" అని వుండును.
    ఆమె పక్కనే వున్నవాడు పద్దెనిమిదేళ్ళ వాళ్ళావున్నాడు. కాని శవాకారంగానే వున్నాడు. కొంచెం చేతులు కదుపుతున్నాడు. ఏదో చెప్పాలని వుంటాడు పడుతున్నాడు. కాని చెప్పలేడు. ఆకలి అతన్ని ఆర్పిపారేసింది. కబళం యిస్తే అందుకుందుకి చెయ్యెత్తలేడు. నోట్లో పెడితే మింగలేడు.
    చచ్చిపోయిన వాళ్ళతోబాటు. చచ్చిపోతూన్న వాళ్ళూ గంటకో గడియకో చచ్చిపోయేవాళ్ళు కలిసి ఒక దగ్గిర పడి చివరవూపిరి నించి విముక్తిపొందే క్షణం కోసం యెదురుచూస్తున్నారు.
    వీళ్ళంతా అందరిలా మనుషులే. వీళ్ళకీ కోర్కెలూ మమకారాలూ వున్నాయి. కాని నిలవ నీడలేక, పదిపూటల కోక్కపూటైనా గుక్కెడు గంజిలేక మానం కప్పుకుందికి అంగుళం గుడ్డ పాతలేక అల్లల్లాడిపోయేరు. వీళ్ళంతా యిలా ఒక్కరోజులో తాయారవలేదు.
    పల్లెల్లో, చిన్న చిన్న బస్తీల్లో లేమికి దిగులు పడకుండా, కలిగినంతే పదివేలని, యేది తట్టుకుంటే ఆహే పట్టు బట్టని. యేది తింటే అదే పరమాన్నమనుకున్నాడు. ప్రకృతి వడిలో పసి బిడ్డల్లా తృప్తిగా కాలక్షేపం చేసేరు. ఈ యుద్ధం వచ్చింది. నిత్యావసరమైన వస్తువులా వెయ్య పడగల పాముల్లాంటి కాంట్రాక్టర్ల ద్వారా పటాలాలకి తరలించబడ్డాయి. కూడు గుడ్డలేక ప్రజలల్లాడి పోయేరు. తండ్రికి కొడుకులు, కూతుళ్ళు బరువై పోయేరు. భర్తకి భార్యా భారమైపోయింది. సామాన్య మానవుడి బతుకొక పిశాచపు పిడికిలి బిగింపులో గిజగిజలాడిపోయింది. ప్రాణం కోసం మానం బజారెక్కింది.
    ఎక్కడ చూసినా మందులు మందలు ముష్టివాళ్ళు. ఎటువెళ్ళినా "సా య బ్ ఁ బొస్కి స్" (అంటే బక్షిస్). నడుస్తూన్న శవాలు, నవ్వుతూ పిలుస్తూన్న నులు రోగాలు. ఇదంతా ఒక రోజులో తయారైన రంగంకాదు. ఏళ్ళ తరబడి, కరువు వాళ్ళని మొండి జలగలా పట్టి చుక్కచుక్కా నెత్తురు పీల్చింది, శకునికంటే చాక చక్యంగా వాళ్ళని నీతిమార్గం నించి తప్పించింది. దుశ్శాసనుడి కంటే క్రూరంగా వాళ్ళ అభిమాన వస్త్రాపహరణం చేసింది. ఆకలి దెబ్బకి తట్టుకోలేక, భర్త భార్య చేత, తండ్రి కూతురు చేత, కూడనిపని చేయించేడు.
    అయితే ఒక విశేషం. ఈ యుద్ధం సాకుతో మహమ్మారిలా జరువుకి ఊళ్ళకి వూళ్ళు చుట్టబెట్టి, లక్షలాది అమాయిక ప్రజల్ని గొంతు పిసికి చంపుతూంటే, కుళ్ళి పోయిన వాళ్ళ శవాల్లోంచి కార్లు పుదుతున్నై. మేడలేస్తున్నాయి. సిల్కు చీరలు, అత్తరు సీసాలు, చిరుసపూలు, చిద్విలాసాలు ఆ శవాల్ని మట్టుకుని వెళ్ళిపోతున్నాయి. శవాల్ని యెవ్వరూ పట్టించుకోడంలేదు. ఎ అట్రీ తీగకంటుకుని వేలాడుతున్న గబ్బిలం, మునిసిపలు చెత్తబండీ చక్రం కిందపడి చచ్చిన కుక్క పిల్ల, షావుకారు కొట్టిచంపి పడేసిన ఎలక, ఆకలి చావు చచ్చిపడిన మనిషికళేబరం అన్నీ సమానంగానే వున్నాయి.
    "హవల్దార్!" ఓ సీ అరిచేడు.
    నే నీలోకంలో తిరిగిపడ్డా, అతనివేపుచూశా,
    "ఈ వెధవల్ని లేపి వెంటతడువు. నేనీరోత చూళ్ళేను..."
    నా తల్లో పదిలక్షల సముద్ర తరంగాల మోత వినపడింది. అతని దవడఫెడీ మనిపిద్దామని పించింది. కాని ఏం ప్రయోజనమనిపించింది.
    "ఆపని నువ్వే చెయ్యి..." అని నేను రైలు పెట్టె ఎక్కి. అవతలి కిటికీలోంచి చూస్తూ సిగరెట్టు ముట్టించా. నా వెనక ఓసీ వచ్చేడు.
    "ఐయామ్ సారీ..." అన్నాడు.
    ఇద్దరం బీరుతాగేం దాహం భరించలేక.
    ఇంజను అరిచి బండి కదిలింది. చాలాదూరం వెళ్ళిపోయినా యింకా నా మనసులో ఆ శవాలు. శవాల్లాంటి మనుషులు మెదుల్తూనే వున్నారు. చచ్చిపోయిన తల్లిస్తనం చీకుతూన్న బిడ్డ దృశ్యం నన్నిప్పటికీ, యిరవైనాలుగేళ్ళైనా. విడవలేదు.
    
                                                          10

    రైలు కొమిల్లాచేరింది. స్టేషను చిన్నది. కాని పరిశుభ్రంగా వుంది. సైనికులున్న ప్రతిస్థలం పరిశుభ్రంగానే వుంటుంది. పటాలంతో పరిశుభ్రత ముఖ్యం. ఫ్లాట్ ఫారం మీద సార్జంటు ఫోర్ స్టైల్ మా కోసం వేచి వున్నాడు. సామాన్లు లారీలో సర్దేం. లారీ బైల్దేరింది.
    కొమిల్లా చేరాక సాధ్యమైనంత త్వరలో పద్మని కలియాలనుకున్నా, కాని అనని జరగ లేదు. మాలారీ పిక్కఢిల్లీ మీదుగానే వెళ్ళింది.
    పిక్క ఢిల్లీ చాలా హడావుడిగా వుంటుంది. సాయంత్రం ఐదు గంటల దగ్గర్నించీ హడావుడి జోరెక్కుతుంది. అక్కడ సత్యని ఒక అందమైన చెరువుంది, దానికి నాలుగు పక్కలా రోడ్లున్నాయి. ఇవతల ప్రక్క మెయిన్ రోడ్డు, అవతల పక్క క్లబ్బు? అది యుద్ధం ముందు సిటీక్లబ్బయి వుంటుంది, అది యిప్పుడు పటాలపు తెల్లవాళ్ళ క్లబ్బు.
    పిక్క ఢిల్లీకి తూర్పుగా మూడుమైళ్ళ దూరములో వై. ఎమ్, సి. ఎ. వుంది. ఈ మూడు మైళ్ళ దూరం చక్కనైన మెటలు రోడ్డు వై.మ్, సి. ఎ కి యెదురుగానే మా తాత్కాలిక విడిది. అక్కడ నలుగు పక్కా గదులున్నాయి. మిగిలినవన్నీ భాషాలె. పక్కా గదుల్లో ఆఫీసు పెట్టేం. భాషాల్లో నివాసం.
    కొముల్లా ప్రాంతంలో యెంతమంది సైనికులున్నారో సరిగ్గా చెప్పడం కష్టం, పట్నం, పరిసరాలు, చుట్టూవున్న గుట్టలు, లోయల్లో ఐదారు లక్షల సైనికులుండొచ్చు. అన్ని విభాగలకీ చెందిన యూనిట్లూ వున్నాయి. అన్ని జాతులవాళ్ళూ వున్నారు, అది 'ఫీల్డు ఏరియా". ఎక్కడ చూసినా సైనిక శకటాలే. ఎటుచూసినా నీటుగా, బలంగా, హుషారుగా వున్న సైనికులే. ఈ ఆలివు ఆకుపచ్చ సముద్రంలో సివిలియన్ల గుపించడం లేదు. ఉన్న కొద్దిపాటి సివిలు విభాగాలవాళ్ళకి, మిలిటరీ మీద ఎలాంటి అధికారం లేదు.

 

     
    మా ఆర్. హెచ్. క్యూ పిక్కఢిల్లీ దగ్గిరగా ఒక పెద్ద మేడలో వుంది. మర్నాడు సాయంత్రం అక్కడ ప్రభూని, మెలానీ కలిశాను, సాయంత్రం అక్కడే భోంచేసా.
    మా యూనిట్ కి తిరిగి రావడానికి సిద్ధంగా ట్రక్కులేదు. తొమ్మిధైంది. రాత్రి అక్కడ పడుకున్నామా ఓ సీ యేమీ అనుకోడు. నాకంత స్వతంత్రంవుంది. కాని ఆ పని క్రమ శిక్షణకి వ్యతిరేకం. అంచేత యేదైనా ట్రక్కు దొర కదా అని పిక్కఢిల్లీ దగ్గిరకొచ్చా.
    అనుకున్నట్టే అక్కడొక ట్రక్కువుంది. అది వై. ఎమ్. సి.ఎ. దగ్గిర కెళుతుందా అని డ్రైవర్నడిగా. వై. ఎమ్. సి.ఎ. క్రాసింగు మీదుగా వెళ్ళిపోతుందన్నాడు. నేను ట్రక్కులో కెక్కా. అనుకున్న దగ్గిర నన్నుదించి ట్రక్కు వెళ్ళిపోయింది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS