మానవుడు
నిర్ఘరిణి ప్రాతఃకాలమందే నా వ్రాతపుస్తకం నా ముందు వుంచి, "ఇందులో యేమి రాశాను? ఈ విషయం నేను చెప్పినట్లు ఎలా రాశాను? నే నెప్పుడూ చెప్పలేదే?" అన్నది.
"ఇందులో నష్టమేముంది?" అని నేను అడిగాను.
దానిమీద నిర్ఘరిణి, "నేను అలా యెన్నటికీ చెప్పలేను. కాని మీరు మా పేరుతో ఈ విషయం రాశారు. నేను చెప్పనీ, చెప్పకపోతనీ? నా నోటితో చెప్పడం కష్టం. అయినా నేను సిగ్గుపడడంలేదు. మీరు ఒక పుస్తకం రాసి నేను రాసినట్లు చెలామణి చేయాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది" అని అన్నది.
అపుడు నేను, "నువ్వు మాతో ఎన్నో విషయాలు మాట్లాడావు. వాటిని నువ్వు ఎలా తెలుసుకో గలుగుతావు?" నీ మాటలు కోకొల్లలు. నీ జీవితమంతటిలో నువ్వు మాట్లాడిన విషయాల సంఖ్య అపరిమితం. నీ అవ్యక్త భాషణలను నేను విడిచిపెట్టలేదు,' అని అన్నాను.
నిర్ఘరిణి నా మాటను విని మరి మాట్లాడలేదు. నా మాటలు ఆమెను అర్దమయాయో లేదో నేనుచెప్పలేను. బహుశా నా మాటలను అర్దం చేసుకునే వుంటుంది. అయినా నేను తిరిగి అన్నాను, "నువ్వు ప్రపంచ విజేతవు. ప్రతిగడియా కొత్త కొత్త భావాలతో నీకు నువ్వే సంసిద్ద మవుతున్నావు. వాస్తవికత సౌందర్యం, అస్తిత్వం మీద విశ్వాసం జనింపజేయడానికి నువ్వేమీ చేయలేదు. కాని రాయడంలో సత్యాన్ని రుజువు చేయడానికి అనేక మార్గాలను ఆశ్రయిస్తున్నావు. లేకపోతే ప్రత్యక్ష నిరోధంలో ప్రత్యక్ష ఉపేక్ష సాధ్యం కాదు. నేను నీ వర్ణనను బాగా సంక్షిప్తం చేశాను. నీ మాటల సారమును సంగ్రహం చేశాను. అలా జరగకపోతే నువు నాతో మాట్లాడిన విషయాలు యితరుల చెవినిపడేవి కావు. నేనలా చేయకపోతే నిన్ను గురించి లోకులకు కొద్దిమాత్రమే తెలుస్తుంది."
నిర్ఘరిణి ముఖం తిప్పుకుని పుస్తకం పుటలు తిప్పుతూ, "మీకు నా మీద చాలా ప్రేమ. అందుకనే మీరు మా కంటె యెక్కువ తెలివి గలవారు. అదంతా ఇక్కడ చెప్పడం భావ్యంకాదు, " అని అంది.
"నీ మీద నాకింత స్నేహభావమెందుకు? స్నేహ పాత్రురాలివి కాబట్టి. అందుకని నిన్ను మంచి దృష్టితో చూస్తున్నాను," అని అన్నాను.
"మనిషి గుణాలలన్నింటిని యెవరాదరిస్తారు? భగవానుని ముందు ఎవరివద్ద అటువంటి వుదారస్నేహభాంఢారం వుంది?"
పృధ్వీరాజ్ హఠాత్తుగా వ్యాకులపడి, "నువ్వు ఏ విషయం ఎత్తుకున్నావు? నిర్ఘరిణి యింకొక విషయం నర్మగర్బంగా ప్రశ్నించింది. ఇక నువు యింకోలా నర్మగర్బంగా జవాబిచ్చావు." అని అన్నాడు.
ఆ విషయం నాకు బాగా తెలుసు.కాని అప్రాంసిక ప్రశ్నోత్తరాలు వచ్చాయని చెప్పాను. మనస్సు రహస్య వస్తువుతో సమానం. అందులోని ఏ స్థానంలో ప్రశ్న రూప అగ్నిక్షణం వచ్చిపడ్డా నష్టంలేదు. కొంచెం దూరస్థానంలో సరాసరి జలం పొటమరిస్తోంది. సలహా సంఘం లోనికి బయట వారు రావటం అనుచితం. కొని పెద్ద వుత్సవ సమయంలో వచ్చినవారిని ఆదరసత్కారాలతో ఆహ్వానించి కూర్చోబెడతారు. అలాగే నా సంభాషణ వుత్సవంతో సమానం. అక్కడ అప్రాంసిక భాషణ వెలువడితే వెంటనే స్వీకరిస్తారు. కాని దానిని మనం నవ్వులాటగా తీసుకుంటే వుత్సవంలోని ఆనందం భంగమవుతుంది" అని అన్నాను నేను.
"నా వల్ల పొరపాటే జరిగింది. నీవు చెప్పదలచింది చెప్పు'రా' అని వుచ్చరించేసరికి రాముడు జ్ఞాపకము వచ్చి ప్రహ్లాదుడు విలపించే వాడట. అతని నోటినుంచి యింకే అక్షరము వెలువడేదికాదట. ఒక ప్రశ్నను వింటూ వింటూ నీ మెదడులో ఇంకో ప్రశ్నకు జవాబు పొటమరిస్తే ఆ దశలో ముందుకు సాగడంకూడా కష్టమే. కాని ప్రహ్లాదుని స్వభావము లాంటి మానవులకు వారి హృదయానుసారం సంచలించడం సరైనదే. మీకు మంచిదని తోచినదే చెప్పండి." అని అన్నాడు పృద్వీరాజ్.
దానిమీద నేను, దేనిని ప్రేమిస్తానో అందులో సకల ప్రపంచాన్ని చూస్తాను. అనంత పరిచయం కలుగుతుంది. అందుకే నే నీ విషయం మాట్లాడుతున్నాను. జీవులలో అనంత అనుభవము పొందడానికి వేరే ప్రేమ. ప్రకృతిలోపల అనంత అనుభవము పొందడానికి పేరే సౌందర్య సంభోగము. సకల వైష్ణవ ధర్మాలలో ఇదే గంభీర తత్వసిద్ది అనే మ మాట యిపుడు నాకు జ్ఞాపకం వస్తోంది, అని అన్నాను నేను.
ఇది విని పృద్వీరాజ్ తనలో తాను "ఎటువంటి ఆపద తలమీదకు వచ్చిపడింది? తత్వ విషయం ఎక్కడ నుంచి వచ్చిపడింది? నిర్ఘరిణి, ప్రకాశవతి కూడా తత్వవిషయం వినడానికి యెక్కువగా యిష్టపడడంలేదని పొగడుతోంది. కాని మనోంధకారం నుంచి హఠాత్తుగా జనించిన విషయం భావం వేటగానిలాగా అభ్యాసానుసారం తాహతును బట్టి వెంబడిస్తుంది. దానిని వశంలో పెట్టుకోవడానికి భావుక వ్యర్ద ప్రలాపం జనిస్తుంది. ఇది ఇతరుల తత్వాన్ని ఉపదేశిస్తుంది. కాబట్టి జనులు దీనిని అర్దం చేసుకుంటారు, " అని ఆలోచించుకోసాగాడు.
నే నన్నాను, "వైష్ణవధర్మం, ఈ భూమిమీద సకల ప్రేమికుల లోపల పరమాత్మానుభవం పొందించడానికి యత్నిస్తుంది. తన సంతానమును చూసుకుని తల్లి ఆనందం పట్టలేకపోయింది. ఈ మానవరూప పుష్పాలను తన ప్రేమ లతతో చుట్టివేసి తన హృదయరూపముకుళితాలను వికసింపజేస్తుంది. తన సంతానంలో భగవంతుని ప్రతిష్టించుకొని ఆరాధించ నారంభిస్తుంది. ఈ విషయము గంభీర పూర్వకంగా ఆలోచించినపుడు, నౌకరు తన యజమాని కోసం ప్రాణాలర్పిస్తాడు; స్నేహితుడు తన స్నేహితుని కోసం తన సర్వమూ అర్పించడానికి సిద్దమవుతాడు. సంపూర్ణ ఆదర్శ ప్రేమలో అలౌకిక ఐశ్వర్యానుభవం వుందని తోస్తుంది."
అపుడు పృద్వీరాజ్, "సీమలోపల అసీమ ప్రేమలలో అనంత నివాసము వుందని చెప్పగా విన్నాను, ఈ మాటలు నా వూహకు మించిపోయినాయి. కాని యిపుడు అనంత, శబ్దాలిపుడు నా భావనాశక్తికి మించిపోయినాయని నాకు గోచరిస్తుంది" అని అన్నాడు.
"భాషతో తులతూగేది ఈ భూమిమీద ఏది వుంది. ఒకే రకం ధాన్యము విత్తులు మాటి మాటికీ చెల్లితే భూసారం నష్టమవుతుంది. 'అసీమ' , అనంత శబ్దాలు రెండింటినీ ఎక్కువ వాడుకవల్ల పాతబడి పోతాయి. అందువల్ల యెల్లప్పుడు, ప్రతీచోటా వీటిని ప్రయోగించడము ఉచితము కాదు. మాతృభాష మీగ కొంచం దయ జూపడం అవసరం," అని నేను అన్నాను.
పృద్వీరాజ్ ,"భాష విషయములో మీ ఆదరణ ఉదారముగా దృష్టికి ఆనడంలేదు," అని అన్నాడు.
పవన్ దేవ్ యింతవరకు నా వ్రాత పుస్తకము మీద దృష్టిపెట్టి వున్నాడు. కొద్ది క్షణాల తరువాత, "ఇందులో ఏమిటి రాశావు? నీ డైరీ లోని ఈ పాత్రలు మనుష్యులా లేక భూతాలా? ఈ పాత్రలు మంచి మంచి మాటలు పలుకుతున్నారు. కాని వీటి ఆకృతి యెక్కడుందీ అని చూస్తున్నాను," అని అన్నాడు.
నేను ఉదాసీనభావంతో, "ఎందుకో చెప్పడం మంచిది," అని అన్నాను.
"మామిడి పండు కంటే మామిడి తాండ్రే మంచిది. టెంక, చెక్కుకోసితే దాని వాసన, అందము, ఆకారము ఎక్కడుంటుంది? నువు జనులకు తాండ్రను మాత్రమే రుచి చూపించావు. మామిడి పండు ఆకారము గాలికి యెగిరిపోతుంది."
"నువు నా అర్దరహితమైన మాటలను వర్ణ సంబంధమయినదని తోసివేసి అటువంటిదే ఒక నిర్జీవమూర్తి రూపములో నిలబెట్టావు; నిర్జీవ మూర్తి తయారయింది గాని నోటమాట రాలేదు. నేను కేవలము చదువున్న వారిని పొగడ్తలతో సంతోష పెట్టాలని తలపోయడంలేదు. అంతే కాదు, సర్వసాధారణంగా వుండే ఆనందింపజేయాలని తలపోస్తున్నాను," అని అన్నాడు పవన్ దేవ్.
"ఇందుకేం చేయమంటావు?" అని నేను అడిగాను.
"నాకేం తెలుసు? నేను కేవలం అభ్యంతరము చెప్పాను. నాలో మంచితనం యెంతవుందో అనుభూతి కూడా అంతవుంది. సకల మానవుల అవసరాలు తీరిన తరువాత అనుభూతి మంచిగా తోస్తుంది జనులు నన్ను చూచి పరస్పరం వాదించుకుంటారు. అందుచేత నేనీ పక్షములో వుండను. జనులు నన్నుయెరిగివుంటే చాలుననే కోరుకుంటాను. నేను మావజీవితాన్ని వదిలివేసి యే మాసపత్రికలో లేఖారూపము ధరించి జంజాటంలో చిక్కు కోవాలని నాకు తలంపులేదు. నేను ధార్మీనికతత్వాన్ని కాను, అచ్చుపుస్తకాన్నీ కాను. నా బంధువులు నన్ను యే దృష్టితో చూస్తారో, యే పేరుతో పిలుస్తారో, నేను అతడిని" అని అన్నాడు పవన్ దేవ్.
