ఐరోపాలో యిప్పుడు ఒక నవ్యసభ్యత అంకురించింది. దానిలో క్రమంగా నవ్యవిజ్ఞానం, జిజ్ఞాస, ఆవిష్కృత మవుతున్నాయి. యంత్ర కళలో, పనిముట్లలో ఆధిక్యం సంపాదించుకుంది. వాటిని నిలవ వుంచడానికి గిడ్డంగి దొరకదు. ప్రచండ గమనానికి కారణం సభ్యతలో ప్రాచీనత లేకపోవడమే, ఇంత వైభవంలోనూ మానవ హృదయం అనుక్షణం కన్నీరు కారుస్తూనే వుంది. ఐరోపా సాహిత్యంలో శాంతిగీతాలు, బహు సమాజసరళ ఆనందం ఒకేసారి మాయమయాయి. కేవలం నిరాశా విలాపం, విప్లవాట్టహాసం గోచరిస్తున్నాయి.
ఈ నిరాశా విలాపానికీ, ప్రమోదమాంద్యానికీ కారణం, మానవ హృదయం. ఈ విశాల సభ్యతా స్థూపంలో సౌందర్య ఐక్యతను స్థాపించలేక సంతోషంతో గృహస్థాశ్రమమును నిర్వహించలేకపోవడమే. సకల విషయాలు జడరూపంగా పరిణమించాయి. సౌందర్యం యిపుడు కూడా స్థిరంగానే వున్నది. ఇపుడు కూడా సభ్యసభ్యతకు రాజరికం ప్రాప్తించి నిలిచిపోయింది. పని, జ్ఞానం విశ్వాసం ఒకదాని నొకటి పీడించుకుంటున్నాయి. ఐక్యతను సాధించుకోవడానికి బదులు విజయం సాధించడానికి అవి భయంకర పోరాటం ప్రారంభించాయి.
పురాతన సంస్కృతిలోనేగాక నవ్యస్మృతిలో కూడా సౌందర్యం వుంది అని చెప్పడం నిజం కాదు. ఐరోపాలోని నవ్యసభ్యతలో నేను కూడా ఆశ మృగ్యం కావడం దురదృష్టం.
ప్రాచీన ఐరోపాలో అనేక విషయాలలో ఆశ వుండేది. వారు నమ్మిన విధానం వల్ల ఫలితం కలగలేదు. చాలామంది ఫ్రెంచి విప్లవాన్ని ఒక మహా వ్యర్దచేశ్టా పరిణామంగా భావించారు. సామాన్య మానవునికి ఓటువేసే అధికారం లభిస్తే అనర్దకాలు తొలగుతాయని అందరికీ విశ్వాసం గలిగింది. అందరూ వోట్లు యిచ్చారు. కానీ పెరిగిపోయిన వ్యాకులతను పోగొట్టడానికి ఎవరూ బహిరంగంగా వుత్సుకతను ప్రకటించలేదు. ప్రభుత్వానికి సంబంధించిన మనుష్యులందరి సంకటాలు దూరమయినాయి. కాబట్టి జనులందరికి విశ్వాసం కలిగింది. ఈ సమయంలో పండితులు, ప్రబుత్వానికి సంభంధించిన సంకటాలను దూరం చేయటానికి యత్నించినా లాభానికి బదులు హాని కలగడానికి అవకాశం వుందని శంకించారు. బట్టలమిల్లు, బొగ్గుగని విజ్ఞాన శాస్త్రం కంటె గొప్పవని కొందరి విశ్వాసం. కాని దానిమీద కూడా సందేహం తీరిపోలేదు. కళలద్వారా ప్రపూర్ణత సిద్దించదని కొందరు మహాజనులు అంటూంటారు. నేటి ఐరోపాఖండం, "దానిమీద విశ్వాసం వుంచవద్దు: ఆధారపడవద్దు, ఒక్కసారి పరీక్షచేసి చూడు" అని అంటోంది.
నవ్యసభ్యత ఇలా వృద్దుని వివాహం చేసుకుంది. ఆ వృద్దభర్త దగ్గర డబ్బూ, దస్కం వుందిగాని యవ్వనం లేదు. వేల పరిచయాలతో పాతబడిపోయాడు. వారిద్దరూ ప్రేమ పాశంలో బంధితులు కాలేదు. ఇంటిలో యెల్లప్పుడూ కలహాలు, అశాంతి ఛాయలే!
ఈ విషయాలను వ్యాఖ్యానిస్తూ ఈ క్షుద్రగ్రామ సౌందర్యం ద్విగుణీకృతంగా లూటీ చేస్తున్నారు. ఐరోపా మర్యాదలు నాకు తెలియవు. అయినా నేను అంధుడను గాలేదు. ఐక్యతాపూర్ణ ఆదర్శం రెండు వేరు వేరు వస్తువులను కలిపి పాకం చేయడం, రెండు భావాలను ఒకే స్థాయిలో వుంచి సుశోభితం చేయడం. అందుచేత ఆశ్చర్యంలో కూడా ఐక్య సౌందర్యం వుంటుంది. ఇందువల్ల ఐక్యతా సౌందర్యం ప్రపూర్ణత పెంపొందుతాయి. నేను ఐరోపాలో కాలం మారి పోయింది. నలువైపులా విచ్చేద వైషమ్యం ప్రబలడమే దీనికి కారణం. ఐక్యతకు సమయం వచ్చినపుడు ఈ ప్రాచీన రాశిలో చాలా భాగం రాలిపడిపోతుంది. మిగిలినది పరి పక్వమయి సుందర సభ్యత తయారవుతుంది. ఒక సామాన్య పరిణామంలోనే అనుష్టానం సమాప్తమయిన తరువాత ఒక అమిత శాంతి, సుందరత, నిర్భయత నెలకొంటాయి. మానవ ప్రకృతి యొక్క అల్ప యేకతను విసర్జించి ఆధిక్యం వేపు వెళ్లితే అనేక విఘ్నాలు, బాధలు, అశాంతి, విప్లవాలు హెచ్చుతగ్గులు రణక్షేత్రంలో తారసిల్లి పెంపొందుతాయి. కాని వారినే ఈ ప్రపంచంలో కర్మవీరులంటారు. వారు ఈ మైదానంలో యుద్దం చేస్తారు. వారి కీర్తిశాశ్వతంగా వుంటుంది. ఈ ప్రపంచంలో వారి పేరు సదా ప్రకాశిస్తుంది. ఈ పరాక్రమం సౌందర్యంతో మేళవిస్తే మీ పరిపూర్ణత సిద్దిస్తుంది. వారినుంచి వేరుగా వున్న మనం ఈ విషయం ఐరోపా సభ్యత సగం సగమే కాబట్టి. నిశ్చయంగా చెప్పలేం. అలా చెప్పినా పరిహాసం కిందకు రాదు. ఐరోపా సభ్యతప్రగతిలో వెనుకబడివుందని మనకు తోస్తుంది. అందుకనే మనం అపహాస్యం చేస్తాం.
నేను ఐరోపాకు చాలా దూరంలోని ఒక పల్లెలోని నిర్మానుష్య భాగంలో కూర్చుని తిన్నగా తంబురా నాలుగు తీగలతో రమణీయ స్వరం మేళవించి ఐరోపా సభ్యతను గురించి, "నీ తీగల స్వరం యిపుడు సరిగా మేళవించలేదు. నువు కూడా నాలుగు తీగలనుంచి ఝుంకారం అవతరింపజేసి సంపూర్ణ సంగీత జ్ఞాన సంతృప్తిని పొంది కూర్చోవడం లేదు." అని తంబురాతో కూడా చెప్పుకున్నాను. లీనమైతే మహా యోగ్యత కలుగుతుంది. ముందు ముందు మధుర మహా సంగీతంలో పరిణితి చెందుతుంది.
ఒక్కొక్క తీగతో మూర్తివంతమయిన సంగీతం బయలుదేరుతుంది. దానిని బహిర్గతం చేయడానికి ప్రతిభ కావాలి.
