Previous Page Next Page 
రామ్ శాస్త్రి పేజి 11


                                                    12
    "ఆగండి ! దాదా సాహెబ్ గారూ, బాజీరావ్ నానా సాహెబ్ ల వంటి మహనీయులు అలంకరించిన ఈ పవిత్ర పీష్వా సింహాసనాన్ని అధిష్టించే ముందు మరొక్కసారి అలోచించి చూడండి!"
    కొత్త పీష్వా సింహాసనాదిష్టానాన్ని చూడటానికి వచ్చిన సభాసదులందరూ ఈ మాటల్ని విని అదిరి పడ్డారు. సింహాసనం మెట్లు ఎక్కపోతున్న రఘోబా కూడా ఆశ్చర్య చాకితుడయి వెనక్కి తిరిగి చూశాడు, ఎవరు తనని ఈ విధంగా సంబోధించిన దన్నట్లు. అందరి కళ్ళు ప్రధాన న్యాయమూర్తిపై ఉన్నాయి. బహిరంగ సభలో కాబోయే పీష్వా ని "అంత నిర్బయంగా సంబోధించగలిగినది రామ్ శాస్త్రి తప్ప మరెవరు?' అన్న ఆలోచన ఎందరికో కలిగింది.
    రఘోబా కోలుకోనటానికి ఎక్కువ సేపు పట్టలేదు.
    "మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకెవరు ఇచ్చారు?' అని అరిచాడు కోపంతో వణికిపోతూ. "మీరెవరు? మంత్రాలు వర్ణించుకునే బ్రాహ్మణులూ కదూ! మహా యోదుడుగా పేరు పొందిన మమ్మల్నే అవమానిస్తున్నానా! రఘో బా అంటే అఖిల భారతదేశమూ దద్దరిల్లి పోతుంది తెలుసా?!"
    రామ్ శాస్త్రి చలించలేదు. "ఇది న్యాయదేవత వాక్కు!" అన్నాడు ప్రశాంతంగా. "ఇది మానవాతీతమయిన శక్తి గల న్యాయదేవత ఇచ్చిన అధికారం దాదా సాహెబ్ గారూ! ఈ పవిత్ర సింహాసనాన్ని సంకిలం చెయ్యవద్దని శసిస్తున్నది!--
    "దాదా సాహెబ్ ! మీరు హంతకులు! ఈ సింహాసనం అధిష్టించే అర్హత మీకు లేదు."
    రామ్ శాస్త్రి ఈ ఆరోపణ కి సభలోని వారంతా మరింత అడిరిపోయారు. రఘో బా ఒక క్షణం నిరుత్తరుదయినా వెంటనే తేరుకొని కత్తి పిడి మీద చెయ్యి వేశాడు.
    "శాస్త్రీ! జాగ్రత్త'!! ఈ ఖడ్గం తోనే నీ నాలుకని తెగ కోసేయ్యగలము! దేనిని ఆధారం చేసుకుని ఈ ఘోరమయిన ఆరోపణ చేస్తున్నావు? చెప్పు! అని గర్జించాడు.
    "నా కర్తవ్యం నెరవేర్చి నట్లయితే ప్రాణ హనీ కలుగ వచ్చునని నాకు తెలుసు. మరాఠా సామ్రాజ్యం ప్రధాన న్యాయమూర్తి గా నా విధిని నేరవేరుస్తున్నాను..........
    "అమాయకుడయిన నారాయణ రావ్ ని హత్య చేయించిన ఘాతకుడు నన్ను చంపటానికి వెనుదియ్యడని నాకు తెలుసు. కాని కర్తవ్య నిర్వహణం కన్నా నా ప్రాణం ముఖ్యం కాదు!--
    "ఇదిగో రుజువు! అని రామ్ శాస్త్రి జోహార్ సింగ్ ముఠా వద్ద పట్టుకున్న రహస్య పత్రాన్ని బయటికి తీసి సభాసదులందరికీ కనిపించేట్లు పైకి ఎత్తి పట్టుకున్నాడు.
    "ఇదిగో మీరు నారాయణరావ్ ని చంపమని ఘర్దీల కి ఇచ్చిన అజ్ఞా పత్రం! మా ప్రభువు నారాయణరావ్ పీష్వా వారిని హత్య చేయించింది మీరేనని స్పష్టంగా తెలిపే రుజువు ఇదే!"
    సభ "హాహా' కారాలతో నిండిపోయింది.
    రామ్ శాస్త్రి అంతటితో ఆగలేదు. అక్కడ సమావేశమయిన పెద్దలని ఉద్దేశించి ఇంకా ఇలా చెప్పుకుంటూ పోయాడు --
    "పీష్వా నారాయణరావ్ గారి ప్రాణానికి ప్రమాదం కలుగ వచ్చుననే అనుమానం కొంతకాలంగా వారి అంతరంగి కులలో చాలామందికి కలుగుతూ వచ్చింది. కాని ఈ అనుమానాన్ని వెలిబుచ్చే అవకాశం వారికి రాలేదు. గాడ విశ్వాసం కలవారు కొందరు మాత్రం తమకి వీలయినంత లో కట్టుదిట్టాలు చేశారు.
    "వారిలో చంఫాజీ ఒకడు. చంఫాజీ శౌర్యం, స్వామి భక్తీ మీకు తెలియనివి కావు! అన్ని వేళలా అప్రమత్తుడయి తన ప్రభువుకి ఏ అపాయమూ రాకుండా కాపాడాలని చూసేవాడు.
    "ఘర్దీలు రాజభవనం మీద పడిన రోజు అతను వారిని అరికట్టాలని ఎంతో ప్రయత్నించాడు. తన భార్య శ్యామాతో చెప్పి నారాయణరావ్ వారి సతీమణి ఘర్దీల చేజిక్కకుండా ఉండేందుకు కట్టుదిట్టాలు చేశాడు! తన ప్రాణాన్ని లెక్క చెయ్యకుండా ఘర్దీలని ఎదిరించాడు. అధికసంఖ్యాకు లయిన వారి ధాటికి చంఫాజీ, అతని  అనుచరులు తట్టుకోలేక పోయారు.......
    "గాయపడి కోన ఊపిరితో ఉన్న చంఫాజీ మరణించాడనుకుని ఘర్దీలు కొందరు ఆజాగ్రత్తగా తమ రహస్యాలు బయటికి చెప్పుకున్నారు. దాదా సాహెబ్ వారి స్వభావం బాగా తెలుసుకున్న ఘర్దీ నాయకుడు ఒకడు, పీష్వా వారిని చంపమని ఇచ్చిన రహస్య అజ్ఞాపత్రం పదిల పరిస్తే కాని తమకీ ప్రమాదం రావచ్చునని ఊహించి తన అనుచరుడయిన జోహార్ సింగ్ ని దానిని దాచమని చెప్పాడు.
    "జోహార్ సింగ్ అలాగే ఆ పత్రాన్ని ఒకచోట దాచాడు. ఆ రహస్య స్థలమేదో తెలుసుకునే బాధ్యత చంఫాజీ తన భార్య శ్యామాకి అప్పగించాడు. ఒక పక్క భర్త మరణిస్తున్నా అతని అజ్ఞ ని శిరసావహించి అతి సాహసంగా జోహార్ సింగ్ ని అనుసరించి అతని రహస్య స్థలం ఏదో తెలుసుకుంది. వీర వనిత శ్యామా!
    "అయితే దురదృష్టవ శాత్తు తిరిగి రాజభవనం లోకి భర్తని చూడాలని వెళ్ళినప్పుడు ఘర్దీల చేజిక్కింది. వారామేని కారా గృహం లో బంధించారు. ఆమె కేమి రహస్యాలు తెలుసునో అని అనుమానించి వాటిని రాబట్టాలని ప్రయత్నించారు! వారి ప్రయత్నాలు ఫలించలేదు.....
    "తిలాంజలి జరిగిన నాడు నేను స్మశానం నుంచి తిరిగి వస్తూ ఉండగా ఒక స్త్రీ వచ్చి నా కాళ్ళ మీద పడి ఒక అర్జీ పెట్టుకుంది. ఆ స్త్రీ శ్యామా! ఎంత స్వామి భక్తీ లేకపోతె ఆమె తన కారా గృహం లో నుంచి రాజభవనం చుట్టూ వున్న కందకం లోకి దూకి, దానిని ఈది ఇలా వచ్చి అర్జీ పెట్టుకుంటుంది?
    "జరిగినదంతా నాతొ చెప్పింది. అదే సమయంలో కొట్వాల్ అటు వచ్చాడు. మేమంతా శ్యామా తీసుకు వెళ్ళిన ప్రదేశానికి వెళ్లి జోహార్ సింగ్ జుట్టుని వోడించి ఈ రహస్య అజ్ఞా పత్రాన్ని చేజిక్కించుకున్నాము.
    "నేను సాక్ష్యాన్ని నిస్పక్షపాతంగా పరిశీలించాను! పీష్వా నారాయణ రావ్ ని దారుణంగా హత్య చేయించిన వ్యక్తీ రఘో బా అని నిస్సందేహంగా చెప్ప కలుగు తున్నాను!......
    "ఇక చెప్పండి దాదా సాహెబ్ గారూ! మీకు ఈ పవిత్ర సింహాసనాన్ని అధిష్టించే అర్హత ఉందొ లేదో!"
    రఘో బా తన ధీమాని కొంత కోల్పోయాడు రామ్ శాస్త్రి వైపు రెండడుగులు వేసి అనునయంగా ఇలా అన్నాడు. "ప్రధాన న్యాయమూర్తి గారూ! రాజనీతి  లో ఎన్నో రకాల ఉపాయాలని ప్రయోగించవలసి వస్తుంది--- పరిస్థితులని బట్టి నడుచుకుంటూ వుంటాము! మీరు ప్రధాన న్యాయమూర్తులు మాకు తగిన ప్రాయశ్చిత్తాన్ని మీరే నిర్ణయించండి! ఎంత వ్యయమయినా సరే లెక్క చెయ్యము!"
    --"అవును ఇటువంటి సంప్రదాయం మనకి కొత్త కాదు! సాధారణ మానవులు చేస్తే మరణ శిక్ష పడే నేరాలు రాజులు చేసినప్పుడు వారిని తీర్ధ యాత్రలకి పంపి, యజ్ఞాలు చేయించి వదిలి వెయ్యలేదా?' అనుకున్నారు కొందరు.
    --"ఇది మంచి సంప్రదాయం కాదు! దీనిని నిర్మూలించడమే మంచిది! ధర్మదేవత ముందు అందరూ సమానులే కదా!" అనుకున్నారు మరి కొందరు.
    --"రఘోబా మంచి ప్రశ్ననే వేశాడు. రామ్ శాస్త్రి గారు పాత అలవాటులని కాదనగలరా?" ఇంకా కొందరు ఇలా అనుకున్నారు.'    
    రామ్ శాస్త్రి తన మామూలు ప్రశాంత ధోరణి లోనే జవాబు చెప్పాడు : "మీరే ప్రాయశ్చిత్తం ఏమిటో చెప్పమన్నారు. అయితే వినండి!------     ప్రాయశ్చిత్తమె మీకు తగినది! ధర్మ శాస్త్రాలు మీకు విధించే ప్రాయశ్చిత్తం ఇదే "-------

                                  
    నిశ్శబ్దంగా ఉన్న ఆ సభలో రామ్ శాస్త్రి మాటలు పిడుగు పడినట్లు పడ్డాయి.
    రఘో బా ఈ ప్రాయశ్చిత్తం విని క్రుంగి పోయాడు. తనని కరుణించవలసిందని కొంతసేపు వేడుకున్నాడు. రామ్ శాస్త్రి దృడవైఖరి ని కనిపెట్టి శ్రుతి మార్చాడు. "మీరు నామీద దారుణ మయిన అపనింద మోపినా మేము ఆ సంగతిని మరిచి పోవటానికి సిద్దంగా ఉన్నాము! జరిగిందేదో జరిగిపోయింది, మీరు ప్రధాన న్యాయమూర్తి గారు మేము పీష్వా గాను స్నేహ భావంతో మేలగవచ్చు!" అన్నాడు.
    "నిజమే రామ్ శాస్త్రి గారూ! రఘో బా చెప్పేవి సమంజసం గానే ఉంది!" అని సమర్ధించపోయారు సభలోని ఒక ప్రభువు. మరికొందరు కూడా అదే మాట అన్నారు.
    "దాదా సాహెబ్ ! మీరు నన్ను ప్రధాన న్యాయమూర్తి పదవి నుంచి తొలగించనని అంటున్నారు . ఈ విధంగా నన్ను మభ్య పెట్టాలని చూస్తున్నారు. కాని , నేనే ఈ ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అంతేకాదు హంతకుడు పరిపాలించే ఈ మరాఠా రాజ్యంలో నేనిక నివసించను!"
    రామ్ శాస్త్రి ఈ మాటలని నెమ్మదిగానే అన్నాడు కాని అవి ఆ సభలో పెద్ద కోలాహలాన్నే కలిగించాయి. ఎవరికి తోచినట్లు వారు ఏవేవో అనుకుంటూ ఉండగా రామ్ శాస్త్రి ఆ సభని వదిలి వెళ్ళిపోయాడు.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS