Previous Page Next Page 
అతని లక్ష్యం పేజి 11

 

    'చాలుర్కో అమ్మా, అతని వెంట వీధుల్లో పరుగెత్తామంటావా?' కిటికీ లోంచి బయటికి చూస్తున్నట్టుగా నిలబడి ఏదో ఆలోచించుకుంటున్న రాధ ఒక్కసారి తల్లి వేపు తిరిగి ఖస్సుమని మళ్ళీ అటు తిరిగి పోయింది.
    'పోనీ, ఇంతకీ నిన్నతడు చూశాడా లేదా?......
    'నన్నడుగుతావేవిటే, అ మాటా.'
    'పోనీ, అతన్ని నువ్వు చూశావా . అదన్నా చెప్పు.'
    'ఆ చూశా , వాళ్ళ తమ్ముడు పరిచయం చేశాడు కూడా. అబ్బ, ఏవిటమ్మా. నీ పిచ్చి ధోరణి. ' ఫక్కున నవ్వేసింది రాధ    'అయితే నిన్ను చూసి కూడా వెళ్లి పోయాడూ.' దీర్ఘం తీస్తూ నిరశాగా అన్నారు. కూతురి అందం మ్మీదే గట్టి నమ్మకం పెట్టుకునున్న రాజమ్మ గారు.
    'అబ్బబ్బ, ఏవిటమ్మా ఈ రీజన్లూ  అతనికి వెలైపోయిందీ. తొందరగా వెళ్లి పోయుంటాడు, ఇందులో ఇన్ని విధాల అరాల్తీసెందు కేంవుందనీ,' అంది నిరాడంబరంగా ముస్తాబై కింది కెళ్లి పోతూ లీల.
    అదివరకే తనపని చూసుకుందుకు దత్తు గారు శర్మ గారి వద్దకి, వెళ్ళిపోయి నందున ఏమీ తోచక పార్వతమ్మ గారితో కలిసి రాజమ్మ గారు లలిత గుడి కెళ్ళారు. మురళీ బలవంతం మ్మీద రాధా, లీలా, వేణూ అతనితో కలిసి బీచికి వెళ్ళారు. రఘుని కూడా ఎంతో బలవంతం చేశాడు గాని తను రావడానికి వీల్లెదని చెప్పి తప్పించుకున్నాడు రఘు.
    వాళ్ళంతా తిరిగి ఏడింటికి ఇల్లు చేరుకునేసరికి , లోపలి హల్లో సుధ వీణ వాయిస్తుంటే, వాలు కుర్చీ లో పడుక్కుని టెన్నిస్ డ్రస్సన్నా విప్పకుండా ఆ పాట వింటూ కూర్చున్నాడు రఘు.
    'ఎవరా వాయించేదీ?' అన్నాడు మొదట రేడియో లోనేమో అనుకుంటూ ఒచ్చిన మురళి. ముందరి హాల్లోని రేడియో మూసేవుండడం చూసి ఆశ్చర్యపోతూ.
    'మా సుధ' సగర్వంగా చెప్పాడు వేణు.
    'అబ్బ? ఎంత హాయిగా వుందీ నిశ్శబ్దంగా అక్కడ కుర్చీలో చతికిల బడుతూ అన్నాడు మురళి.
    'దానికి సాయం మా రఘు మృదంగం వేశాడంటే అప్పుడు వినాలి ఆ అమర గానం. అందర్నీ కూర్చోమని సౌజ్ఞ చేసి తనూ అక్కడే కూర్చుంటూ అన్నాడు వేణు.
    'ఎవరు ఈయనే?' ఆశ్చర్యంగా అంది లీల.
    'ఆ ప్రత్యేకతా మా సుధని ఉత్సాహ పరుచే నిమిత్తమే! ఎలాగో తీరుబడి చేసుకుని నేర్చుకున్నాడన్నమాట----! ఈలోగా సుధ శృతి చెయ్యడం అయి, ఆలాపన ప్రారంభించడంతో అంతా నిశ్శబ్దంగా కూర్చున్నారు.
    'ఆహాహా , ఈ మోహనరాగం అంటే నాకు ప్రాణం. మీరెవరన్నా సందడి చేసి పాట గనక అపెసిందంటే నా గుండెలు కూడా ఆ వీణ తో పాటు ఆగి పోయూర్కుంటాయి తెలిసిందా?' అన్నాడు మురళి.
    'అమ్మామ్మా, మా చెల్లెలు సరళాదేవిక్కాబోయే భర్త యిన మీకు, అంతటి అపాయం రానిస్తావా?' అంటూ భుజాలు పట్టి స్తిమితంగా మురళి ని కూర్చో పెట్టేడు వేణు. రాధ ఏదో పరాగ్గా వుండి పోయినా. ఈ విషయాన్ని శ్రద్దగా విన్న లీల మాత్రం 'ఆ ఉండు నీ పని చెప్తా.' అన్నట్టుగా వేలుపుతూ కొంటెగా చూసింది మురళి వైపు. ఆ తరవాత మురళి లేచి పెద్ద లైట్ ఆఫ్ చేసి డిమ్ లైట్ వెయ్యడం తో అంతా ఆ ఆలాపన లో లీనమై పోయారు.  
    వరసగా నాలుగైదు కీర్తనలు వాయిస్తూ పాడింది సుధ. మైమరిచి వింటున్న రఘుని తను కూర్చున్న చోట్నుంచే చూస్తుంది రాధ. చూసీ చూడనట్టిది కనిపెడుతూనే వున్నాడు వేణు. ఇంతలో గుడి నించోచ్చిన పార్వతమ్మ గారు 'శుక్రవారం పూటా వాకిట్లో ఈ చిన్న బల్బు వేశారేవిట్రా ' అంటూ, పవర్ లైట్ అన్ చేసి 'ఇదేవిటర్రా ఈ చీకట్లో కూర్చున్నారూ ' అన్నారు. అక్కడ కూర్చునున్న వాళ్లందర్నీ చూసి ఆశ్చర్యపోతూ.
    'ఉస్. అంటూ సంజ్ఞ చేశాడు వేణు.
    'మరేం ఫరవాలేదు . రఘు వింటూన్నంత వరకూ పాట ఆపమన్నా అపదులే సుధ'....నవ్వుకుంటూ అందర్నీ వెంట పెట్టుకు లోపలి కెళ్ళారావిడ.
    'మెల్లగా ఒక్కొక్కర్నీ రఘుతో పరిచయం చేశాడు వేణు. ఎంతో గౌరవ మర్యాదల్తో అందరితోనూ తలా కొంచెం సేపు మాట్లాడి వాళ్ళందరి మధ్యనే తనూ కూర్చున్నాడు రఘు.
    'మనవాడు బీచీకి రాను గాక రానూ అంటే. 'ఏవా?' అనుకున్నాను. ఈ గాన సుధారసాన్ని రుచి మరిగిన ఈ తుమ్మెద మన వెంట రమ్మంటే ఎందుకోస్తాడూ.' అన్నాడు సుధ పాట ముగించడం తోనే రఘు వీప్పీద బలంగా కొడుతూ మురళి. అది విన్న రాజమ్మ గారు ఓసారి అయిష్టంగా మూతి విరిచారు.
    'ఇవాళెంతో సుదినమమ్మా. ఇంత తియ్యని సంగీతం విన్నందుకూ. మరినీ ఇవాల్టి కాకల్లేదు. కడుపు నిండి పోయింది.' అన్నారు . పక్కవేపునున్న గుమ్మం లోంచి లోపలి కోస్తూ దత్తు గారు. ఎవ్వరికీ కనిపించకుండా అంతసేపూ తోటలో కూర్చుని పాట వింటున్నారాయన.
    'నిజం . ఏదో పూర్వజన్మ సుకృతం వుంటే తప్ప ఇంత ఇంపైన కంఠం , జ్ఞానం లభించవు' అన్నాడు లేచి ఒళ్ళు విరుచుకుంటూ మురళి.
    'అమ్మా, ఈ ఒక్క విద్య చాల్నమ్మా మిగతా ఎన్ని విద్యలు ఎన్ని అందచందాలు దీనికి సాటి రావు.' అన్నారు. 'ఆ పిల్లకాలవిటితనం వుందని మీరేవీ విచారించనవసరం లేదు సుమండీ.' అన్న అభిప్రాయాన్ని చెప్పకుండానే తెల్పుతూ. అంతసేపూ , ముభావంగా వూర్కున్న రఘు సుధ ని ప్రశంసించడం వినడం తోనే ఉత్సాహం కనపరచడం రాధా , రాజమ్మ గార్లు గ్రహించారు.
    'మీ అమ్మాయిల్చేతా రెండు పాటలు పాడించండి వింటాం .' అన్నారు రాజమ్మ గార్నుద్దెశించి పార్వతమ్మ గారు.
    'ఎవరూ, మా పిల్లలా, హు, మా వాళ్ళ కొచ్చిందల్లా సాపాటోక్కటే నండి.' నవ్వుతూ దత్తుగారన్నారు.
    'మీరు మరీనీ. చదువుతో సతమత వైపోతుంటే వాళ్లింక పాటెం నేర్చుకుంటారని.' మర్యాదగా మందలించారావిడ.'
    'ఏదో . రాధ సంగతి నాకు తెలియదు గాని నేను మాత్రం పాట పాడగల్గాలని విశ్వ ప్రయత్నం చేశానండీ. ఊ, హు లాభం లేక పోయింది.' అంది నిర్మొహమాటంగా లీల.
    'మీర్నాకు చాలా నచ్చారండీ' అన్నాడు దబ్బున వేణు.
    'ఎందుకండోయి?' ఫడీమని వెంటనే అడిగేసింది లీల.
    'మనసులో మాట దాపరికం లేకుండా పైకి చెప్పెస్తున్నందుకు.'
    'అంతే గద. ఏమో అని భయపడ్డా.'
    'ఎవనుకున్నా భయందేనికే' మురళి అడిగాడు.
    'అంటే ఏ కట్టుబాటూ లేకుండా యదార్ధవాదిగా వుండే ఆయన్ని చూస్తె నాకు నచ్చడం లేదులే. అందుకూ.'
    'నీ తత్వవేగా అదీనీ.'
    'అవుననుకో. మరి నేను కడుపులో మాట దాచలేని దాన్నయినందుకు నన్ను చేసుకునే వాళ్ళన్నా దాచేవాళ్ళు కాకపొతే, ఇక నా పరువేం గానూ! అందుకని--' లీల మాటలకి అంతా ఘొల్లున నవ్వారు.
    'అమ్మ బాబోయ్ మీ అభిప్రాయం తెలిశాక మిమ్మల్ని చూస్తేనే నాకు భయం వేస్తుంది.' అంటూ గబగబా తన గది లోకి పరుగెత్తాడు వేణు. ఈలోగా అన్నీ ఏర్పాట్లూ చేసి భోజనాలకి పిలిపించింది జానకి. అంతా ఏకంగా కూర్చుని సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు.
    'రోహిణి మీకు బాగా పరిచయమే అనుకుంటా' అంది హల్లో కొచ్చి కూర్చున్నాక రఘుతో మాటలు కలపాలన్న ఉద్దేశ్యంతో రాధ.
    'తెలుసు. అన్నట్టు ఆవిడా గుంటూరులో నే చదువుతుందనుకుంటా ఇప్పుడు'
    'అవును మేం ఇద్దరం రూమ్ మేట్సు ము కూడా.'
    'అలాగా. రోహిణి కూడా చాలా అద్భుతంగా పాడుతుంది. మా సుధ క్కూడా కొన్ని మళయాల కీర్తనలు నేర్పిందావిడ.'
    'చెప్పింది. మిమ్మల్ని గురించి తరచూ చెపుతూ వుంటుంది.' రఘు ముఖ భావాల్ని జాగ్రత్తగా కనిపెడుతూ అంది.
    'ఊ' 'పూర్ గర్ల్ ' ఏ భావాల్నీ వ్యక్త పరచలేదు రఘు.
    'చాలా చురుకైన పిల్ల.'
    'అలా అనడం కన్నా, హడావిడైన దంటే సమంజసంగా వుంటుందేమో.'
    'అమ్మో ఇతడు సామాన్యుడు కాడనుకుంది రాధ. అ తరవాత అంతా కలిసి ఏదేదో బాతాఖానీ కానిచ్చి పదవుతుండగా లేచారు.
    'రండీ పైకి పోయి పడుకుందాం ' రఘు చేయి పట్టి లేవనెత్తుతూ అన్నాడు మురళి.
    'ఈ మర్యాద లేప్పట్నుంచీ గానీ మీ వాళ్లు ఫలానా అని ఇదివరకూ నువ్వెప్పుడూ నాతొ చెప్పనే లేదేం?' మురళీ చేయి పట్టుకుని చనువుగా ఊగిస్తూ అడిగాడు రఘు.
    'సరి, మేం బయల్దేరేందుకు నాలుగు రోజుల ముందు మీ వద్ద నుంచీ ఉత్తరం వచ్చేదాకా ఈ పరిచయం నాకు తెలుస్తేగా అసలూ, అందుకే తరవాత కూడా మా అమ్మకి మన పరిచయం తెలియనివ్వ కూడదనుకున్నా. అయినా ఎలాగో కనిపెట్టేసిందావిడ.'
    'అలాగా సరి నువ్వూ వెళ్ళి పడుకో నేను మా నాన్నగారోచ్చేదాకా ఇక్కడే చదువుకుంటా.'
    మురళి పైకి వెళ్ళిపోతే, రఘు టేబిల్ లైట్ అన్ చేసుకుని పుస్తకం తీశాడు.
    'బావా, ఈ మాట కర్ధం ఏవిటీ' ఇంగ్లీషు లో వున్న వో వైద్య గ్రంధం లో వేలు పెట్టి చూపుతూ అడిగింది సుధ.
    'నీ 'ఇంటర్ మీడియట్ ' పాఠాలేవో నువ్వు చూసుకోకుండా ఇవన్నీ నీకెందుకు సుధా.
    'అబ్బ, చెప్పు బావా? దీని తరవాత చదవబోయెదదేగా' చనువుగా గునిగింది సుధ.
    'అదా అది ఆక్సిజన్ కి సంబంధించిన ఒక ఆవిరి పదార్ధం పేరు! సరా? అవన్నీ నీకిప్పుడు చెప్పినా అర్ధం కావు' అన్నాడు.
    'ఆ? అదే? సరిగ్గా నేనూ అదే అనుకున్నా' సంబరపడుతూ వెళ్ళిపోయింది సుధ పాపం ఏదో అక్కడి కన్నీ తనూ తెలిసుకోవాలన్న ఏదో వెర్రి ఆదుర్దా. అయినా ఈసుధ కి తన భవిష్యత్తు ని గురించి ఆలోచనే లేదా? లేక విచారాన్ని పైకి కనపరుచు కోవడం లేదా?' అదే అర్ధం కావడం లేదు రఘుకి.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS