Previous Page Next Page 
ఆరాధన పేజి 10

 

    అనూరాధ ఎంతో సేపటి వరకు మాట్లాడలేక పోయింది . తాను విన్నది నిజమని నమ్మ బుద్ది కావడం లేదామేకు.  భగవంతుడు ఎందుకలా శిక్షించినా వారినే తిరిగి శిక్షించుతుంటాడో ఆమె కర్ధం గాకుండా పోయింది. ఆ ఘోరం తన మూలానే జరిగినట్లు విలవిల లాడిపోతోంది. తాను నీరజను చూడాలని అనకపోయినట్ల యితే అంత ప్రమాదం జరిగి వుండేది కాదని మనస్సు మధన పడుతోంది.
    శారద ఆ పైన మరో ప్రశ్న అడగనే లెదామే. మౌనంగా హరికృష్ణ వున్న రూమ్ కేసి నడిచింది. అనూరాధ ను చూడగానే నవ్వాడతడు.
    అతడిని చూడగానే ఆమె కనులలో అశ్రు బిందువులు నిండు కొచ్చాయి. నిట్టుర్చిందా అనురాగ పూర్ణ హృదయం బాధగా.
    'కూర్చో! డాక్టర్ గారికి మెదడు చెడి పోయిందట పాపం? లోపల పరీక్ష చేస్తున్నారు. నీక్కూడా అదే జబ్బ నుకుంటానే. మందులు వాడకు. పిచ్చి మరీ ఎక్కువవుతుంది.....' అతని మాటల్లో ఒకదాని కొకటి సంబంధమే లేకుండా పోయింది. అనూరాధ తన పేరు చెప్పింది కళ్ళు వత్తుకుని.
    'రాధ....అనూరాధ....క్రిష్ణుడు...వంశీ క్రిష్ణుడు....యస్....ఆ రాధవి నువ్వేనా! బావుంది! పేరు బావుంది. రాధా! వో చిన్న సహాయం చేసి పెడతావా?'
    'ఏమిటన్నట్లు చూసిందామె. శారద శ్రోతలా మిగిలిపోయింది. అనూరాధ మనస్సున అగ్ని జ్వాల జ్వలించు తోంది.
    'రాధ అంటే నాకెంతో యిష్టం! రాధవి నువ్వేగా! మరి నాతోనే వుండి పోతావా? నాకెవ్వరూ లేరు ...నిజం.... ఎవ్వరూ లేరు. అమ్మ లేదు-- నాన్న లేడు. ఆహాహహ్హహ్హ ...చూశావా! ఎవ్వరూ లేని యీ అభాగ్యుణ్ణి !' మధ్యలో నవ్వు. ఆ నవ్వులో ఎంతో దీనత అల్లుకుపోయి వుంది.
    అనూరాధ హృదయం తరుక్కు పోతోందా మాటలు వింటుంటే. అలాగేనని తలూపింది. ఆ సాయంత్రమే యింటికి తీసుకొని వెళ్ళారా శాపగ్రస్తుడ్నీ.
    శారద ' అమ్మకు వుత్తరం వ్రాయానా?' అన్నది.
    'రేపు రాజును పంపించుతానక్కా! అమ్మను వెంట బెట్టుకు వస్తాడు .' అన్నది అనూరాధ.
    'మరి బావ కోసం ప్రత్యేకంగా వో నర్సు ను వుంచవలసివస్తుందేమో!' అంటూ అనూరాధ కనులలోకి చూసింది శారద.
    'ఈ నీ చెల్లాయి అందుకు అర్హురాలు కాదంటావా? అక్కా! మమత విలువ తెలియని మనిషిని గాలేను.'-
    'మరి నీ చదువు?' ప్రశ్నించింది శారద కావాలనే.
    'మానవత్వం ముందు చదువు నిష్ప్రయోజనమన్పించుతొందక్కా!'
    'సరే! బావ జీవితం నిజంగా మలుపు తిరిగిందీ క్షణం తోనే. ఏం కావలసినా యీ అక్కకు కబురంపించు . మందులు జగ్రత్తగా వాడు.
    బావ రోగి కాదని గుర్తుంచుకో
! పసి పిల్లావాడికన్నా ఎక్కువ అర్ధ రహితంగా ప్రవర్తించవచ్చు, వోర్పు ముఖ్యం ప్రతి విషయానికి!' అన్నది శారద.
    'విసుగు చెందడం అన్నదేనాడు అమ్మకు నచ్చదక్కా!' శారద తృప్తిగా విశ్వసించింది. వెళ్తూ అన్నది--
    'అనూ! ఈ నీ అక్కయ్య ప్రార్ధించుతుందనే అనుకో? బావను మనిషిగా మార్చగల శక్తి నీకే వుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా దూరంగా జరిగిపోనని మాట యివ్వు! ఆ శాప గ్రస్తుడ్ని యింకా శిక్షించడమే అవుతుందది. నీ మనసున మమతల మల్లెలు పరిమళాల్ని వెదజల్లాలని ఆశీర్వదించు తున్నాను.'
    'అక్క మనసునేనాడూ నొప్పించదీ అనూరాధ!' అన్నదామె.
    'అని తెలుసు కానీ అంతరంగాన కదులుతున్న వ్యధ కొంచెంగా నైనా వూరట జెందుతుందని అలా అన్నాను అనూ! ఈ గొడవ లో నీ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకు.'
    శారద సెలవు తీసికొని వెళ్లిపోయింది. హరికృష్ణ నిదుర బోతున్నాడు. అనూరాధ పని మనిషికి కావలసిన వంట తయారు చేయమని చెప్పింది. ఆ పని మనిషి ద్వారా ఆ యింటికి అతిధులుగా ఎవరెవరు వచ్చేదీ తెలుసుకుంది. అందరి కన్నా నాగు బాము లాంటి మనిషి హరికృష్ణ మేనమామ అని గ్రహించింది.
    తానేన్నో అవమానాలకి ఎదురుగా నిలబడి పోరాడవలసిన క్షణాలున్నాయని, అందుకు సిద్దంగా వుండడమే తన కర్తవ్యమని నిశ్చయించు కుంది.

                                        6
    హరికృష్ణ లేవగానే 'రాదా!' అన్నాడు పెద్దగా.
    'వస్తున్నాను!' అంటూ పాల గ్లాసు చేత బట్టుకుని వెళ్ళింది వెంటనే.
    'త్రాగండి! తియ్యగా వున్నాయి!' అంటూ అందించింది.
    అతడు గ్లాసు వంక చూస్తూ నవ్వాడు విరక్తి గా.
    'తీయగా వుండొచ్చు . కానీ తీయగా వున్నదేదీ నాకు అందకూడదు. రాదా! ఓ మాట చెప్పనా! దేవుడి క్కూడా పిచ్చి పట్టిందట. పాపం పిచ్చి మూలానే గాబోలు మంచి వాళ్ళందరినీ శిక్షించు తుంటాడు.'
    అతని మాటలు నిజమేననిపించిందామెకు. తాను పెదవి కదిపితే యింకా వుపన్యాసం కురుస్తుందని మౌనంగా వుండి పోయింది. ఆ రాత్రి పాలు తాగిన తరువాత అతడు ఎంతో సేపటికి గాని నిదుర పోలేదు.
    కిటికీ లోనుంచి కన్పించు తున్న దేవాలయ శిఖరాన్ని చూపించి అన్నాడు --
    'చూడు! రాధా! దేవుడు గుళ్లో బంధించబడి ఎలా నిట్టురుస్తున్నాడో ! ఒక్కసారి పెన్ను తీసుకు రావూ!మంచి పాట వ్రాస్తాను.' అనూరాధ పెన్ అందించింది. అతని పిచ్చి ధోరణి చూస్తోంటే ఆమె గుండెల్లో ఆవేదన సెగలు జిమ్ముతోంది.
    పెన్ తీసుకొన్నాడు. డైరీ తెమ్మన్నాడు. దానిలో వ్రాసి వున్నది చదవ నారంభించాడు పెద్దగా.
    'ఇదిగో వింటున్నావా! రాధా! డాక్టరు హరికృష్ణ! ఎవరో ఈ మహానుభావుడు --' అంటూ వో పేజీ తెరిచాడు.
    'అంబరాన మెరిసే తారకలా-- నవ్వుతోంది చీకటి తప్ప మరేదీ లేని ఈ జీవితం లో కూడా నవ్వులు రువ్వ గూడదా? అనూరాధ! పేరు కూడా అందంగా వుంది. నాట్యమయూరి ఆమె. ఒయారాలోలికించే సెలయేరు లా నడుస్తుంది. తోడుగా నడిచి రాగూడదా? నీడలా నన్ను అదుకోగలదామె! కానీ....'
    మరో పేజీ తిరిగింది-----
    'కృష్ణ విగ్రహం అందించాను. ఆ విశాల నయానాలలో వెన్నెల మల్లియలు కురిపించింది. ఎంత అందంగా నవ్విందని!! ఆ కంఠన కోయిలమ్మ కుహూ కుహూ మంటోంది. 'హరీ!' అని తియ్యగా ఆ బంగారు పెదవులతో పిలిస్తే ఎంత బావుటుందో ! అనూరాధ హృది నిండుగా విరిసిన మమతల లోని మాధుర్యం అందుకోవాలి.
    'భలే! చాలా బావుంది! అనూరాధను ప్రేమించాట్ట! ఈ హరికృష్ణ గారు. ప్రేమించడం కూడా వో వ్యాపారమై పోయింది.' అతడు చప్పట్లు కొడుతూ పెద్దగా నవ్వసాగాడు. ఆ డైరీ లోని వాక్యాలు వినగానే అనూరాధ హృదయాన వింతైన సందడి విద్యుత్తు ;ఆ పాకిపోయింది. కనులు దించుకుని వింటుండిపోయింది. మళ్ళీ వో పేజీ త్రిప్పబోతుంటే ఆపివేసింది కావాలనే. కానీ అతడు పసివాడిలా హాటం పట్టు క్కూర్చున్నాడు. చేదేదేమీ లేక మరో గదిలోకి  వెళ్లి పోయిందామే.
    కానీ అతనిస్వరం వీనులకు విందు చేస్తూనే వుంది. మధ్యలో నవ్వుకున్నాడు. వ్యాఖ్యానించుతున్నాడు. ప్రశంసల్ని రువ్వుతున్నాడు.
    'అనూరాధ -- నా హృదయాన వెలసిన అనూరగ వీణియ.' ఆ వాక్యం వినగానే ఆమె చెక్కిళ్ళు తెర్రబడ్డాయి. మనస్సున కోటి భావనలు గుబాళించాయి.
    అతని స్వరం మృదు మధురంగా విన్పించుతూనే వుంది. నవ్వులు హృదయాన పండుగ చేస్తూనే వున్నాయి. మధురోహలు అందమైన కలల నల్లుకుంటూనే వున్నాయి. అ తీయని తలపులలో తెలిపోతూనే నిరురలోకి రూలిపోయిందామె.

                                  *    *    *    *
    ఉదయాన లేవగానే రాత్రి జరిగిన దంతా గుర్తుకు వచ్చింది . సన్నని మందహాస రేఖ మెరిసిందామె పెదవుల పైన. హరికృష్ణ వున్న గదిలో అడుగు వేయగానే ఆమెకు నవ్వు వచ్చింది, బాధ కలిగింది.
    చేతిలో పెన్ అలాగే వుంది. డైరీ తెరిచే వుంది. కిటికీ లో తల వుంచుకుని పడుకుని వున్నాడు. అతని ముఖాన అలసట పారాడుతోంది. భావాల బరువుతో కనురెప్పలు అపుడపుడు కదులుతూనే వున్నాయి.
    చల్లని గాలి మృదువుగా పలుకరించి పోతోంది. అతడు మైమరిచి నిదుర బోతున్నాడింకా.
    చప్పుడు చేయకుండా 'డైరీ , పెన్ తీసిందామె . ఏం వ్రాశాడా అన్న కుతూహలంతో తెరిచిన పేజీ వంక చూసింది--
    'అందంగా -- మెరుస్తోంది -- అనురాగం అనూరాధలా----అపరంజి బొమ్మలా ------దెండాన- కురుస్తోంది---విరివాన---------అందంగా---ఆనందంగా------మందారం లా-------మధువులా----మత్తులా-----ఎర్రగా -------తీయగా --------కలలా------అలలా-----అల్లుకు పోతోంది------బ్రతుకంతా ------తానై -------అనురాగ బంధం!'
    మృదువైన ఆ భావాల నిండుగా మధురిమ హాయిగా వేయి కలలు గంటోంది ఆ వూహ జగత్తు లో అనూరాధ ఒదేవత . ఆమె అనురాగమే ఆ పూజారి కోరుకున్న వరం. అతనికి అనూరాధ అపుడే పరిచయమైన వ్యక్తీ గా కన్పించుతోంది. తానామేను అంత క్రితం చూసిన సంగతి గుర్తుకు రావడం లేదు. కానీ 'అనూరాధ' అన్న పేరు మాత్రం ఎక్కడో ఎప్పుడో విన్నట్టు అన్పించుతోంది అతనికి. ఆ మధుర భావాల్ని చదవగానే అనూరాధ హృది లో పులకింత చెలరేగింది. అతను తనను ప్రేమించు తున్నాడని గ్రహించింది. కాని యింతగా ఆరాధించుతున్నాడని వూహించనైనా వూహించలెదామే.

                                   
    డైరీ మూసి అలమారు లో వుంచింది. ప్రశాంతంగా, పసిబిడ్డలా నిదురబోతున్న అతని వంక చూడగానే ఆమె మనస్సున ఎన్నో వూహలు ఊయలలూగాయి. నిద్రా భంగం కాకుండా నిశ్శబ్దంగా ఆ గదిలోని వస్తువులన్నింటిని సర్ది వెళ్ళిపోయింది.
    రాజును తల్లి కోసం పంపించానని శారద కు తెలియ జేసిందా సాయంత్రం.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS