Previous Page Next Page 
ఆంతస్తులూ అంతఃకరణలూ పేజి 10

 

    అయిష్టంగానే మీనాక్షి చదువుకునేందుకు ఒప్పుకుంది.
    మీనాక్షి అంత సులభంగా ఒప్పుకుంటుందని భానుమూర్తి అనుకోలేదు.
    లోకం మీద పగ తీర్చుకోవాలని తన్ను తానే సర్వనాశనం చేసుకుంటుందేమో నన్న భయం కూడా భానుమూర్తి కి లేకపోలేదు. అందుకనే ఆరోజు భానుమూర్తి కోక పర్వదినం.

                                   5
    పేదరికం దోషమైతే, ఐశ్వర్యం మహాపాపం. ఒకరోజు గోపాలరావు బీదవాడి  క్రిందే లెక్క. అదృష్ట చక్రం తిరగడం చేత ఈరోజు ధనవంతుడయ్యాడు. 'ధనమోచ్చిన మద మెచ్చును' అన్న మాట అందరి పట్లా కొద్దిగానో, గొప్పగానో వర్తించిన, ధనంతో పాటు కొన్ని వ్యసనాలు మటుకు అందరికీ తప్పకుండా పట్టు పడి తీరతాయి.
    దారిద్ర్యాన్ని మహాత్ములే వరించారు. బంగారానికి పుటం వేస్తేనే సదారు వన్నెల మేలిమి బంగారమవుతుంది. మనిషిలోని సద్గుణ సంపద రాణించేది దారిద్ర్యం వల్లనే.
    అయితే దారిద్ర్యం అగ్ని లాంటిది కూడా. మనలోని బలహీనతలనూ, అవలక్షణలనూ కాల్చి వేయవచ్చు. లేదా మానవత్వాన్ని, మంచితనాన్ని ఆహుతిగా తీసుకోనూ వచ్చు. అది ఆ మనిషి అచంచల మనొ ధైర్యం మీదే ఎక్కువగా ఆధార పడి ఉంటుంది, దారిద్ర్యావలంలో మానవత్వమూ, మంచితనమూ ఆహుతై పోయిన రోజు, పాపభీతి నశించి, మంచీ చెడూ విచక్షణ లేక ఏ పనీ చేసేందుకైనా సంసిడ్డులు కావచ్చు. ఆరోజు ఆకలి బాధకు తట్టుకోలేక దొంగతనం చేయవచ్చు. వ్యభిచారం చేయవచ్చు. జూదమాడవచ్చు. కానీ ఆ పనులన్నింటికీ ఓ ప్రయోజనమూ, పరిమితీ ఉంటాయనిపిస్తుంది.
    బీదరికంలో గోపాలరావు మంచివాడనే అంటారు. కానీ ఈ రోజు సప్త వ్యసనాలూ అతన్ని పట్టుకొని పీడిస్తున్నాయి. అన్యాయ మంటేనే అసహ్యించుకొనేవాడు ఎన్నో అన్యాయాలు చేశాడు. అవన్నీ ' డబ్బు' అనే ముసుగు క్రింద దాక్కోన్నాయి. అతని క్రీడా విలాసాలకు క్రేంద్ర స్థానం బెంగుళూరు. ఒకసారి బెంగుళూరు పోయి వచ్చాడంటే వెయ్యి రూపాయలు తప్పకుండా ఖర్చయి తీరుతుంది.
    అతనికి ప్రత్యేకంగా రోల్స్ రాయిన్ కారు ఉంది. కనీసం వారానికోకసారయినా దానిలో బెంగుళూరు వెళ్ళి వస్తుంటాడు.
    మన ఆర్ధిక పరిస్థితే మన జీవన దృక్పధాన్ని నిర్ణయిస్తుంది చాలా వరకు. ఇరవై సంవత్సరాల క్రితం గోపాలరావును నిలబెట్టి జీవితానికి నిర్వచన మివ్వమని అడిగి ఉంటె - ఏమాత్రం సందేహపడక 'మానవసేవ' అని టక్కున చెప్పి ఉండేవాడు.
    ఆరోజు గోపాలరావు జీవితానికిచ్చే నిర్వచనం - 'మదిరా, మదపతీ', అంతే! అంతకన్నా ఇంకా ఎక్కువగా ఆలోచించడం , జీవితానికి గొప్ప గొప్ప ఆశయాలు అంటగట్టడం అవివేక మంటాడు.
    నాలుగు రోజుల క్రితం బెంగుళూరు వెళ్లిన గోపాలరావు ఆరోజు సాయంత్రం తిరుగు ప్రయాణం కట్టాడు. అంధ్ర సరిహద్దు లలో పడేసరికి ఉన్న రెండు సీసాలు కడుపులో దాచి కారు వేగం హెచ్చించాడు. మైకం కమ్ముకొస్తుంది. కళ్ళు తిరుగుతున్నాయి. తనేం చేస్తున్నాడో, దాని ఫలితం ఏమిటో ఆలోచించే స్థితిలో లేడు. కారు శరవేగంతో పరుగులు తీస్తుంది.
    ఎదురుగా ఉన్న చిన్న కాలువకు అడ్డంగా కట్టి ఉన్న వంతెన, దాని కిరువైపులా ఉన్న గోడ కనిపించనే లేదు.
    కన్ను మూసి తెరిచే లోపల సర్వనాశనం జరిగిపోయింది.

                                    6
    ఆరోజుకు గోపాలరావు చనిపోయి పదకొండు రోజులయింది. పదకొండవ రోజు జరగవలసిన కర్మకాండ యధావిధిగా జరిగిపోయింది. బంధువులూ, స్నేహితులూ వచ్చి సానుభూతి ప్రకటించి వెళ్ళిపోతున్నారు.
    లక్ష్మీదేవిలా కలకలలాడే లలితమ్మ తెల్లని బట్టల్లో, నిరదబరంగా ఉండి మూర్తిభవించిన శోకదేవతలా ఉంది.
    సోమసుందరం, విజయా, ఆ తెల్లవారు జామున ప్రయాణానికి సిద్దపడుతున్నారు. సుధీర సోఫాలో చేరపడి ఉంది. ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రబడ్డాయి.
    భానుమూర్తి మెల్లగా వచ్చి సుధీర కెదురుగా కుర్చీలో కూర్చున్నాడు.
    "విజయా, సుందరం రేపే వెళ్తున్నారా?"
    సుధీర ఔనన్నట్లుగా తల ఊపింది.
    "అత్తయ్య ఏం చేస్తుంది?"
    "చేసేదేముంది? ఏడవడం తప్ప?"
    "ఎంత ఏడ్చినా ప్రయోజన మేముంది? నువ్వన్నా అత్తయ్యను ఒడార్చక యిలా ఏడుస్తూ కూర్చుంటే ఏలగా చెప్పు?" అన్నాడు అనునయంగా భానుమూర్తి.
    సుధీర కళ్ళల్లో నుండి బొటబొటకన్నీళ్ళు కారాయి.
    "ఎంత ఆస్తి ఉంటె ఏం ప్రయోజనం? నాన్న ఉన్నట్లుంటుందా, బావా? ఈ వెలితి ఎలా తీరుతుంది? అమ్మ నెలా ఒదార్చాను?" జీర గొంతుతో అంది.
    "పోయిన వాళ్లతో మనమూ పోతామా? నీ కంతా తెలుసు. నేనేం చెప్పను?"
    సుధీర కళ్ళు తుడుచుకుని మౌనంగా కూర్చుంది.
    "అత్తయ్యేందుకో రమ్మని కబురు పెట్టింది. అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను. నువ్వూ ముఖం కడుక్కునిరా!" అంటూ అక్కణ్నుంచి లేచి వెళ్ళిపోయాడు భానుమూర్తి.
    లలితమ్మ నిర్లిప్తంగా, నిర్జీవంగా కూర్చోనుంది. కళ్ళు ఎర్రబడి వాచీ ఉన్నాయి. ముఖం జేవురించి ఉంది. ఈ పది రోజుల్లోనే ఎంతో తగ్గిపోయినట్లు కనిపించింది. శోకానికి మారు రూపంగా ఉన్న ఆమెను చూసేసరికి భానుమూర్తి కన్నుల్లో చివ్వున నీళ్ళు చిప్పిల్లాయి.
    నౌకరు ట్రేలో కాఫీ తెచ్చాడు. వెనకే విజయా, సుధీరా వచ్చారు. విజయ రెండు కప్పుల్లో కాఫీ కలిపి చాప మీద పెట్టింది.
    "తీసుకో అమ్మా! ఉదయం నుండి ఎంగిలి కూడా పడలేదు."
    "నాకేం వద్దు . నన్ను బాధించకు , విజయా!" రుద్ద కంఠంతో అంది లలితమ్మ.
    "చూడు , భానూ! ఇదీ వరుస! కనీసం మంచి నీళ్ళన్నా నోట్లో వేసుకోకుండా ఇలా ఉగ్గబట్టడంలో అర్ధమేమిటి? మేమంతా ఏం కావాలనో, నువ్వన్నా కాస్త కనుక్కో." గది గడపలో కూర్చుని మోకాళ్ళ మీద గడ్డం ఆన్చి అంది విజయ.
    'అత్తయ్యా , నువ్వే యిలా అధైర్య పడిపోతే ఇక వాళ్ళెం కావాలి? ముందు కాఫీ తీసుకో." కాఫీ కప్పు లలితమ్మ కందిస్తూ అన్నాడు భానుమూర్తి.
    "నా ముఖాన ఇలాంటి రాతరాసి  వుందని నేనేరోజూ అనుకోలేదు. "బావురుమంది లాలితమ్మ.
    "ఊరుకో , అత్తయ్యా! ఈ విషయంలో మనందరం దురదృష్ట వంతులమే. కాని ఎంత విచారించినా ఏమిటి లాభం?"
    "సుందరాన్ని ఉద్యోగానికి రాజీనామా యిచ్చి వుండి పొమ్మన్నాను. వీలు కాదంటూన్నాడు. ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే.... ఈ ఇల్లెవరిది?" కన్నీళ్లు తుడుచుకుంటూ అంది.
    "మిలటరీ ఆఫీసరుగా ఉంటున్నవాణ్ణి ఇక్కడ ఇల్లు చూసుకొంటూ ఉండి పొమ్మంటే ఉంటాడా, అత్తయ్యా? అందులోనూ సుందరం మోజుపడి చేరాడాయే."
    "ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోతే ...యిక ...."
    "అందరూ వెళ్తేనేం? నేను లేనా, అత్తయ్యా? నీ కెందుకు దిగులు?" విచారంగా నవ్వి అన్నాడు భానుమూర్తి.
    "విన్నీ ఇంటికి పెద్దల్లుడుగా చేసుకోవాలన్న నా కోరిక ఫలించనే లేదు...."
    "అదేమిటత్తయ్యా! సంబంధాలు కలుపుకో వలసిన అవసరమేముంది? ఇప్పుడు బంధుత్వం లేకుండా ఉందా? నేను నీముద్దుల మేనల్లుడ్నే గా?" నవ్వుతూ అన్నాడు భానుమూర్తి.
    "మేనల్లుడివే! అల్లుడైతే యింకా బాగుంటుందని!' విజయ, భానుమూర్తి కళ్ళల్లోకి చూస్తూ అంది.
    "ఉహు.... విజయ కంత అన్యాయం చెయ్యకత్తయ్య. విజయ విషయంలో మావయ్య కన్న కలలు నిజమయ్యేఅందుకు మనమంతా ప్రయత్నిస్తాం. అప్పుడన్నా మావయ్య ఆత్మకు కాస్త శాంతి కలుగుతుంది."
    "అవును" అని కాసేపటికి తలెత్తి విజయ వేపు చూస్తూ "నువ్వెళ్ళి సుందరాన్ని పీల్చుకురా!' అంది లలితమ్మ.
    ఓ నిమిషంలో ఇద్దరూ వచ్చారు. సుందరం ముఖం చాలా గంబీరంగా ఉంది. నల్లని ముఖం ఎర్రబడి, వింత రంగులో మెరుస్తుంది.
    "అందరూ కూర్చోండి! మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను." కన్నీళ్లు తుడిచేసుకొని అంది లలితమ్మ.
    అందరూ లలితమ్మ ఏం చెప్తుందోనని ఆత్రంగా చూశారు.
    "సుందరం, నువ్వూ విజయా వెళ్ళిపోతే ఇక ఈ యింట్లో ఉండవలసింది నేనూ, మరీరేగా?" అంది కొడుకు ముఖంలోకి చూస్తూ.
    "వెళ్తున్న మాట నిజమే. కానీ నువ్వెక్షణంలో రమ్మంటే ఆ క్షణాన రెక్కలు కట్టుకుని వాలతాము. ఈ విషయంలో నువ్వింతగా ఎందుకు బాధపడాలో నా కర్ధం కావడం లేదు." కొంచెం కరుగ్గానే అన్నాడు సుందరం.
    లలితమ్మ ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది.
    "అవును . రెక్కలు కట్టుకునే వాలతావు! మీ నాన్న చనిపోయాక ఎన్ని రోజుల కొచ్చావో కాస్త చెప్పు? మీకు ఎక్కువగా నేనేం చెప్పదలచుకోలేదు. మీ మీ ఇష్టప్రకారం మీరు నడుచుకోండి! కానీ నేనిప్పుడు చెప్పాలనుకుంది సుధీర విషయమే!" మలినమైన ముఖాన్నేత్తి అందరి వైపూ పరిశీలనగా చూస్తూ అంది.
    "చెప్పు" అన్నాడు సుందరం , గోడకానుకుని నిల్చుని.
    "మీరిద్దరూ పెళ్ళిళ్ళు చేసుకుంటారో లేదో గూడా నాకు తెలీదు...."
    "అంత నిష్టూరంగా మాట్లాడకమ్మా!' మధ్యలోనే అడ్డు వచ్చింది విజయ.
    "సుధీర నన్నా ఓ ఇంటిదాన్ని చెయ్యాలని నా కోరిక. ముక్కూ ముఖం తెలీని ఎవర్నో తెచ్చి చేసేందుకన్నా భాను కే సుదీరనిస్తే బాగుటుందనుకుంటూన్నాను."
    నలుగురూ ఉలిక్కిపడి లలితమ్మ ముఖంలోకి పరిశీలనగా చూశారు.
    "ఏవిటి?" సుందరం తన చెవులను తాను నమ్మలేక తిరిగి ప్రశ్నించాడు కాసేపటికి.
    "అవును , నా కున్న ఒకే ఒక కోరిక యిది. సుధీ, నువ్వేమంటావు తల్లీ?"
    "అత్తయ్యా! నా మాట కాస్త విను. నేనిప్పటికే మీ కెంతో ఋణపడి ఉన్నాను. నన్నింకా ఋణగ్రస్తుడ్ని చెయ్య కత్తయ్యా! ఇంత త్వరలో యిలాంటి నిశ్చయాని కెందుకొచ్చావు? దీని వల్ల నువ్వు సుధీర కన్యాయమే చేస్తున్నావు. ఆ విషయం మటుకు నేను ఖచ్చితంగా చెప్పగలను." తల వంచుకుని విచలిత కంఠం తో అన్నాడు భానుమూర్తి.
    "నువ్వొక్క విషయం తెలుసుకుంటే మంచిది,భానూ! వేలకు వేలు కుమ్మరించి నీకన్నా ఎక్కువ చదువుకున్న వాడిని అల్లుడుగా తేగలను. కానీ నీవంటి ప్రేమస్పదుడ్నీ, గుణవంతుణ్ణి తేగలనా చెప్పు? దారీ తెన్నూ లేని యీ యింటి పరిస్థితి నీ వల్లనే ఒక దారికి రావాలి. ఆస్తులను చూసుకునేందుకు నమ్మకస్తులు లేనట్లయితే ఎంత కష్టమోస్తుందో నీకు ప్రత్యేకంగా నేను చెప్పనక్కర్లేదు."
    "నేను సుధీని ఆ దృష్టితో ఏరోజూ చూడలేదు." అస్పష్టంగా గొణిగాడు భానుమూర్తి.
    "నీలాంటి ఉత్తముడు ప్రతి స్త్రీని సోదర భావంతోనే చూస్తాడు. భానూ! నువ్వు కాదనకు. నేనే రోజూ నిన్నే కోరికా కోరలేదు. ఈ ఒకే కోరికా తీర్చమని నిన్ను ప్రార్దిస్తున్నాను." లలితమ్మ కంఠంలో ఆవేదన ప్రతిధ్వనించింది.
    "అంత మాటన కట్టయ్యా! నీ మాట నేనేరోజన్నా కాదన్నానా? అయినా సుధీర అభిప్రాయం కూడా కనుక్కోవడం మంచిది."
    "సుధీ!' లలితమ్మ తలెత్తి కూతురి ముఖం లోకి చూస్తూ అంది.
    సుధీర ఎటూ తేల్చుకోలేక పోయింది. చివరకు "నీ యిష్టం' అంటూ వెళ్ళిపోయింది.
    "నేను ఆలోచించా అత్తయ్యా!' అన్నాడు భానుమూర్తి సుధీర వెళ్ళిపోగానే.
    'ఆలోచించే చెప్పు. ఈరోజే పెళ్ళి చేయ్యబోవడం లేదు. సుందరం, నీ ఉద్దేశం చెప్పావు కాదు?" అంది లలితమ్మ.
    "నా ఉద్దేశమా! నా ఉద్దేశ్యంతో మీకు పనేమిటి?" అక్కణ్ణించి విసురుగా వెళ్తూ అన్నాడు సుందరం.
    "విజయా?"
    "సుందరం అభిప్రాయమే నా అభిప్రాయం. నాకీ పెళ్ళి ఏ మాత్రం యిష్టం లేదు." అంటూ ఎర్రబడిన ముఖంతో వెళ్ళిపోయింది విజయ.
    'చూశావా, అత్తయ్యా? నాలాంటి అనామకుడికి చెల్లెల్నిచ్చి చేసేందుకు వాళ్ళిద్దరికీ ఇష్టం లేదు." వ్యధిత కంఠం'తో అన్నాడు భానుమూర్తి.
    "వాళ్ళతో నీకేం పని? నువ్వు బాగా ఆలోచించుకో. నాకేమన్నా మనశ్శాంతి కలిగేటట్లయితే అది నీ అంగీకారం వల్లనే."
    భానుమూర్తి మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. వరండాలో కుర్చీలో కూర్చొనున్న విజయ "నేను రేపు వెళ్తున్నాను, భానూ!" అంది.
    "మంచిది." తలైనా తిప్పకుండా వచ్చేశాడు భాను.
    వరండా ప్రక్కగా మందార చెట్టు దగ్గర నిల్చోనున్న సుధీర విజయ వేపు విచిత్రంగా చూసింది.
    "ఇలారా! సుధీ!"
    సుదీర వచ్చి విజయ ప్రక్కగా కూర్చుంది.
    "ఈ పెళ్ళికి నువ్వు మనస్పూర్తిగా ఒప్పుకుంటూన్నావా?"
    "ఊ..."
    "అంటే భానును ప్రేమిస్తున్నా వన్న మాట?"
    "అందరూ ప్రేమించే పెళ్ళిళ్ళు చేసుకొంటున్నారా?"
    విజయ జవాబు కోసం తడుము కోవలసివచ్చింది. "కాదనుకో. కానీ అంతకన్నా గోప్పవాడ్ని నువ్వు పెళ్ళి చేసుకొనే స్థితిలో ఉన్నావు."
    "పెళ్ళి చేసుకునేది మనిషిని కానీ, గొప్పతనాన్ని కాదుగా?' సన్నగా నవ్వుతూ అంది సుధీర.
    "ఎందుకయినా మంచిది. మరొకసారి ఆలోచించుకో."
    "అలాగే!" కుర్చీలోంచి లేస్తూ అంది సుధీర'.
    విజయ ముఖం చాలా అప్రసన్నంగా ఉంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS