ప్రతిపక్ష నేతగా పోరాటాలు
తెలుగుదేశం అధికారంలో లేని 1999-94 మధ్య అ తర్వాత 2004-14 మధ్య కాలంలో పార్టీని ద్విగుణీకృత ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు ముందుండి నడిపించారు. అసెంబ్లీలో ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వ విధానాలను ఎండగట్టడంలో , అవినీతి కుంభకోణాలను వెలికి తీయడంలో పార్టీ క్రియాశీలకంగా వ్యవహరించింది. ప్రజానాడిని తెలుసుకోడానికి 2008 లో 'మీకోసం' పేరుతొ చంద్రబాబు వంద రోజుల చైతన్య యాత్రను నిర్వహించారు. 2009 ఎన్నికల్లో ఊహించని ఓటమి తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నిరుత్సాహపడలేదు. పెరిగిన బలంతో ప్రతిపక్ష పాత్రను మరింత ధీటుగా నిర్వహించింది. 2010 లో రైతు సమస్యలపై ఆమరణ దీక్ష 2012 లో చంద్రబాబు చేపట్టిన పాదయాత్ర చారిత్రాత్మకం. అనంత పురంలో ప్రారంభమై విశాఖపట్నంలో ముగిసిన 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో చంద్రబాబు రాష్ట్రవ్యాప్తంగా 2800 కిలోమీటర్ల నడిచారు. ఆరునెలల పాటు సాగిన ఈ పాదయాత్రలో అప్పటి ప్రభుత్వ దుష్పరిపాలనను దును,మాడటమే కాకుండా, ప్రజాసమస్యలపై మరింత అవగాహన పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజలతో మమేకం కావడానికి ఈ పాదయాత్ర తోడ్పడింది.
తెలుగుదేశం పార్టీ గడిచిన నాలుగు దశాబ్దాల్లో అనేక సవాళ్ళను ఎదుర్కొంది . పార్టీ మీద జరిగిన విష ప్రచారాన్ని నాయకుడిగా చంద్రబాబు మీద సాగించిన వ్యక్తిత్వ హననాన్ని తట్టుకొని నిలబడింది. ప్రత్యర్ధులు తాము చేసిన అవినీతి ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కటి కూడా ఇన్నేళ్ళలో తెలుగుదేశం ప్రభుత్వం మీద గాని, ఎన్టీఆర్ చంద్రబాబుల మీద గాని నిరూపించ లేకపోయారు. కాంగ్రెస్ నాయకులూ, వైఎస్ కుటుంబం చంద్రబాబు మీద కోర్టుల్లో ఆనేక కేసులు చేసినా, న్యాయస్థానాలు అన్ని సార్లూ క్లీన్ చిట్ ఇచ్చాయి. అందుకే తెలుగుదేశం పార్టీ పై ఎన్ని కుట్రలు పన్నినా ఎవరూ ఏమీ చేయలేకపోయారు.
ప్రత్యేక తెలంగాణ అంశంలో తెలుగుదేశం పార్టీని దోషిగా నిలబెట్టడానికి అన్ని వైపుల నుంచి ప్రయత్నం జరిగింది. అయితే తెలుగు ప్రజల మేలు కోసమే పుట్టిన తెలుగుదేశం పార్టీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వెంపర్లాడలేదు. రెండు ప్రాంతాలు రెండు కళ్ళలాంటివని పార్టీ నాయకత్వం చెప్పిన మాటలను రాజకీయ ప్రత్యర్ధులు వక్రీకరించినా హేళన చేసినా తన సిద్దాంతానికి కట్టుబడే పనిచేసింది. విభజనకు ఉభయతారకంగా చేయడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా రాజకీయ ప్రయోజనం కోసం తెలుగువారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడాన్ని తెలుగుదేశం నిరసించింది. పార్టీ రాజకీయ ప్రయోజనాల కంటే, తెలుగు ప్రజల భవిష్యత్తు కు ప్రాధాన్య మిచ్చినందువల్లే తెలుగుదేశం రాజకీయంగా కొన్నిసార్లు నష్టపోయింది. అయినా తన విధానాన్ని ఎప్పుడూ
(తెలుగుదేశం పార్టీ గడిచిన నాలుగు దశాబ్దాల్లో అనేక సవాళ్ళను
ఎదుర్కొంది. పార్టీ మీద జరిగిన విష ప్రచారాన్ని, చంద్రబాబు మీద
సాగించిన వ్యక్తిత్వ హననాన్ని తట్టుకొని నిలబడింది )

మార్చ్జుకోలేదు. అందువల్లే తెలంగాణాకు నష్టం జరగకుండా బాబ్లీ ప్రాజెక్టు ను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ పోరుసల్పింది. పోలీసు కేసులు ఎదురైనా కూడా చలించలేదు. అదే సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని రాజశేఖర రెడ్డి కుటుంబం పాల్పడిన అవినీతిని బట్టబయలు చేయడానికి రాజకీయంగా , న్యాయపరంగా పోరాడింది. జలయజ్ఞం లో అవకతవకలను ఎండగట్టింది. ఆ పోరాటాల ఫలితంగా సిబీఐ విచారణకు కోర్టు ఆదేశించడంతో వైఎస్ జగన్ మోహాన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం ఎంత విస్తరించిందో ప్రజలకు అవగాహన అయింది. సొంత మీడియా సంస్థలను అడ్డుపెట్టుకొని, వైఎస్ కుటుంబం బురద జల్లడమే పనిగా పెట్టుకున్నా, తెలుగుదేశం చలించలేదు. తన సొంత మీడియా అంటూ లేకునా ప్రజల విజ్ఞత మీదనే ఆధారపడి, వారిలో రాజకీయ చైతన్యాన్ని కలిగించడానికి అప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం కృషి చేస్తోంది. పది సంవత్సరాలు అధికారానికి దూరమైతే ఒక ప్రాంతీయ పార్టీ మనుగడ అసాధ్యమన్న ఊహాగానాలను పటాపంచలు చేస్తూ తెలుగుదేశం ప్రజాసేవలో అప్పుడు ఇప్పుడు ఉదృతంగా పనిచేస్తోంది.
