నేను మీనాక్షి మాత్రం స్విమ్మింగ్ నెపంతో దూరంగా ఈదుకుంటూ వెళ్ళిపోయి, దూరంగా నిర్చనమైన ఒడ్డున అలా కూర్చుని గంటలు గంటలు గడిపే వారం.
ఆ రెండు రోజుల్లో మీనాక్షి నాకు మరింత దాన్నిహిటంగా వచ్చినట్లనిపించింది.... అలా ఆమెని చూస్తూ , ఏదో పిచ్చిచ్చిగా మాట్లాడుతుంటే ఇన్నేళ్ళ నావైవాహిక జీవితంలో లభ్యమవని తృప్తి అనందం ఇన్నాళ్ళకి ఆ రెండు రోజుల్లోనే లభ్యమయినట్టు అనిపించింది! మా మాటలకి అర్ధం వుండేది కాదు! మీనాక్షీ ఏదో చెప్పేది , నేను పరధానంగా వింటూ ఉకోడుతూ ..... ఆమెను కళ్ళతో త్రాగేసేవాడిని అంతే.... అంతకంటే చొరవ చేసే సాహసం చెయ్యలేకపోయాను! నా ఊహలెంత సేపూ .... మీనాక్షిని పెళ్ళాడివుంటే ? ........ అన్నో చోటే కేంద్రీకృతమయ్యేవి ఎంతసేపూ !! ........ అలా ఆలోచించడం, అలా పరస్త్రీని చూడడం వగైరాలు తప్పని, నా భార్యకి ద్రోహం చేస్తున్నానన్న ఆలోచనలు గాని ఆ క్షణాలలో నాకెప్పుడూ రాలేదు .... మరి .... మీనాక్షి మనసులో ఏ భావాలుండెవో నాకు తెలియదు! నామీదిష్టం వున్నట్టు పబ్లిగ్గానే ప్రకటించింది .... నన్ను పెళ్ళాడుదామన్న ఊహ వున్నట్టు స్పురించింది మాటల్లో. సరే అప్పటి ఊహల్లో! ఇప్పటి మాట యిప్పుడో ఇంకా నన్ను పెళ్ళాడనందుకు పశ్చాత్తపడడుతుందా? ఆమె భర్తతో ఆమె సంతృప్తిపడలేకపోతుందా ... నాలాగే ఆమె ఆలోచిస్తుందా? మీనాక్షి మాటలు, చేతలు, చూపులు, నన్ను కవ్విస్తుండేవి. అది కవ్వింపా? మీనాక్షి స్వభావసిద్దమైన చేతతో తేల్చుకోలేక పోయేవాడిని. మీనక్షితో వున్నంతసేపూ ఇసుకలో నా దగ్గిరగా అంటీ అంటనట్టు తాకుతూ కూర్చునేది, ఏదో చెపుతూ చెపుతూ నా కాలి మీద చేయి వేసేది, ఇంకా సరసం పాలెక్కవ అయితే నా బుగ్గలు గిల్లేది. ముక్కు పట్టుకు లాగేది, కితకితలు పెట్టేది, నా చేతిలో చేయి దూర్చి యిటూ అటూ వూగిస్తూ మాట్లాడేది..... వీటన్నింటి దృష్ట్యా మీనాక్షీ మనసులో ఏం వుందో, ఏం కోరుతుందో తెలుసుకోవాలని, అనేక విధాల ప్రయత్నించేవాడిని , ఇది కేవలం మీనాక్షి అలవాటేమో, మొగవాళ్ళతో యింత చెరువుగావడం ఇలా మాట్లాడటం వగైరాలు పాశ్చాత్యదేశం అలవాట్లు అవడం వల్ల అలా చేస్తుందేమో అనిపించింది! మీనాక్షి మనసులో ఇంకో ఆలోచన లేకపోతే నేను ఏదన్నా కాస్త చొరవ చేస్తే ఫీలవుతుందేమో! ఎంతయినా వివాహిత స్త్రీ.... భారత స్త్రీ సంస్కృతీ ఎంతయినా కొంత కాక పొతే కొంతయినా మీనాక్షిలోనూ మిగిలి వుండాలి. ఇద్దరు పిల్లల తల్లి, పదేళ్ళ వైవాహిక జీవితం గడిపిన ఆడది. మరీ పరాయి మొగాడి పొందు కోరుతుందా..... మీనాక్షితో వున్నంతసేపూ ఈ ప్రశ్నలు పుట్టేవి! వీటిని జవాబు చెప్పుకోడంతోనే ఆ కాస్త టైము హరించుకు పోయేది!
అసలు చెప్పాలంటే అన్నిటి కంటే ముఖ్యకారణం పిరికితనం! మీనాక్షికి ఆ ఉద్దేశం లేకపోతే ఏమిటంటుందోనన్న ఆలోచన ఓ ప్రక్క, ఇంకోవైపు రామావతారానికి, శాంతికి తెలిస్తే మా బ్రతుకులు ఏమవుతాయి అన్న పిరికితనం , భయమే, ఉరకలు వేసే నా మనసుని వెనక్కి లాగెది! మొత్తం మీద ఏ కారణమవు గాక .... మీనాక్షి హద్దులు మీరకుండా కాలక్షేపం చేశాం!
తరువాత హీరాకుడ్ డ్యాం చూడ్డానికి వెళ్ళినపుడు గాని, రూర్కెలా వెళ్ళి నపుడు గాని.... మీనాక్షి తను ఏకాంతంగా గడిపే సమయం లభ్యమవలేదు .... హీరాకుడ్ డామ్ చూడ్డానికి వెళ్ళి జవహర్ మీనార్ దగ్గర అశోక నివాస్ గెస్టు హౌస్ లో బస చేశాం. గెస్టు హౌస్ చాలా అందంగా ఎత్తయిన కొండ మీద కట్టారు. నెహ్రూ గారి డామ్ పూర్తయ్యాక "ఇనాగ్రేట్" చెయ్యడానికి అయన వచ్చేటప్పటికి ఆవిడిది తయారుచేశారు చాలా ఖర్చు పెట్టి! కొండమీద అక్కడ నుంచి చూస్తె డామ్ బుర్గా, హీరాకుడ్ కనిపిస్తాయి. డామ్ కి ఒక పక్క వుండేవారు హీరాకుడ్ అని, ఇంకో చివర వుండేవూరు 'బుర్గా' అని అంటారు. డామ్ కట్టేటప్పుడు ఆ కాలనీ అంతా చాలా బాగుండేది. తమిళులు, పంజాబీలు, తెలుగువారు కాస్మాపాలిటన్ గా వుండేది. డామ్ పూర్తయ్యాక రాష్ట్ర ప్రభుత్వం కిందికి వచ్చాక యిప్పుడు పూర్తిగా ఒరియా వారు మాత్రం వుంటున్నారు. బిల్డింగులు, చాలా ఖాళీగా వున్నాయని బుర్గా ఇంజనీరింగు కాలేజీ, మెడికల్ కాలేజీ కట్టారు. హీరాకుడ్ లో అల్యూమినియం ఫ్యాక్టరీ, కేబుల్స్ ప్యాక్టరీ మొదలైనవి పెట్టారు.
డామ్ చూడ్డడానికి పర్మిషన్ తీసుకొని కారులో డాం అంతా చూపించాను. హీరాకుడ్ ప్రపంచంలో చాలా పొడవయిన డాం . డామ్ పైన రేలింగ్ పట్టుకుని క్రింద 'సిల్వేక్స్' చూస్తుంటే ఎత్తు నుంచి క్రిందికి దుమికే ఆ నీటి వేగానికి కళ్ళు తిరుగుతాయి. రాత్రి అయితే డాం పొడుగునా లైట్లు బారుగా అందంగా కనిపిస్తాయి. క్రిందికి వెళ్ళి పవర్ హౌస్ అంతా కూడా చూపించాను.
అలా పైనుంచి రోద చేస్తూ దుమికే ఆ నీటి వేగాన్ని మరికాస్త దూరంలో అంత వేగం ఏమయిపోయిందో .... ఏం తెలీనట్టు నెమ్మదిగా నిర్మలంగా కాలవ ద్వారా వెళ్ళిపోతున్న ఆ మహానదిని! చూస్తుంటే ..... శాంతి పోలికలు కనిపించాయి. అదృశ్యంలో ! ఉరకలు , పరుగులతో రొదతో దుమికే జలపాతం మీనాక్షి! నిండుగా , నిర్మలంగా పారేనది శాంతి! రెంటిలో వుండేది నీరే , ... కాని స్వరూపాలకి ఎంత భేదం? మీనాక్షి స్త్రీ, శాంతి స్త్రీ .. కాని .... ఇద్దరికీ ఇంత తేడా నాకెందుకో ఎగురుతో దుమికే జలపాతమే నచ్చింది, ..... అవును అలా కాలవ వెంట నెమ్మదిగా పారే నీటిలో ఏం ప్రత్యేకత వుందని ఎవరన్నా అటు చూస్తారు . డా,మ్ చూడ్డానికి వచ్చే ఎవరినన్నా ఆకర్షించేది ఆ ఎత్తు నించి ప్రచండ వేగంతో ఉరకలు వేసే నీరే.... కాని కాలువ కాదు! .... బుర్గలో వున్న ఒక్క రోజూ డాం చూడ్డానికి , తెలిసిన మిత్రులనీ చూడానికి సాయంత్రం 'చిప్లిమా' అనే చోట కట్టిన పవర్ హౌస్ చూడ్డంతో సరిపోయింది. మీనాక్షికి నాకు ఏకాంతంగా గడిపే అవకాశమే లేదు అక్కడ....
తరువాత రూర్కెలాలో అసలు వీలు కుదరలేదు.... రూర్కెలాలో "స్టీల్ ప్లేంట్ చూడాలన్న కోర్కెకంటే కూడా ...... మా పిన్ని కూతురుని (మీనాక్షి కి అత్త కూతురు అన్న మాట !) ... చూడాలన్న కోర్కె ఎక్కివయింది .... చాలా రోజులుకి కలుసుకున్న మా అందరిని చూసి విశాల సంబరపడిపోయింది! స్టీల్ ప్లేంట్ లో దాని మొగుడు ఇంజనీరు... మంచి జీతం . క్వార్టర్స్, ఇద్దరు పిల్లలు అన్నీ బాగానే వున్నాయి. పాపం అతను ఓ రెండు రోజులు సెలవు పెట్టి అన్ని త్రిప్పి తీసుకొచ్చాడు మమ్మల్ని. మా కోసం మహా ఆర్భాటంగా ఏర్పాటులు చేసింది విశాల! అక్కడున్న రెండు రోజులు తినడం, తిరగడం . రాత్రి ఒంటి గంట వరకు కబుర్లు చెప్పుకోడంతో సమయం చాలక అనుకున్నదానికంటే ,మరో రోజు వుండిపోయాం.
రూర్కెలా ఒరిస్సాలో పెద్దదయిన వూళ్ళలో ఒకటి! ఒకటేమిటి ముఖ్యమైంది అని చెప్పాలి. ఎంచేత అంటే అవడానిక కటక్, సంబల్ పూర్, బరంపురం రైళ్ళు పెద్దవయినా నీట్ గా, అందంగా, చక్కని రోడ్లు అవి ఉన్న ఒరిస్సాలో ఊళ్ళూ రెండే రెండున్నాయి, ఒకటి రూర్కెలా, రెండు భువనేశ్వర్ రోడ్డు బంగళాలు తప్ప లైఫే లేదు. రూర్కెలా అలా కాదు, కాస్మాపాలిట్' ప్లేసు కాబట్టి చాలా సందడిగా వుంటుంది. మంచి సినిమాలు, ప్రత్యేకం "ఆంధ్రా అసోషియేషన్" వగైరాలున్నాయి.... కాలక్షేపానికి లోటుండదు . ఎన్నాళ్ళ నుంచో నేనూ శాంతి వెడదాం అనుకుంటూనే అశ్రద్ద చేశాం ఆ కోరికే ఇన్నాళ్ళక తీరింది. మీనాక్షి ధర్మమా అని.
రూర్కెలా నుంచి వచ్చాక ఇంచుమించు అందరం డీలాపడిపోయాం. పదిహేను రోజులయి తిరిగిన వాళ్ళం తిరుగుతూనే వున్నాం టూరిస్టుల్లాగా. వేళకి తిండి, నిద్రలేక తిరుగడంతో అందరం మొహాలు వెళ్ళాడేశాం.
"యింక నేనెక్కడికి రాను బాబోయ్" అనేశాడు రామావతారం.
"అన్నట్టు బావా , ఖండగిరి, ఉదయగిరి చూపించలేదు అంది మీనాక్షి."
"నీ ఓపికకి మెచ్చుకోవాలి . యింకా తిరగ్గలమనే ఉద్దేశం" రామావతారం అన్నాడు.
